Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
రాత్రి 11:47.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కు దూరంగా ఉన్న వర్ధన్ డిజిటల్ సిస్టమ్స్ ప్రధాన డేటా సెంటర్ బయట భారీ వర్షం కురుస్తోంది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుకుంటూ పడుతున్నాయి. కానీ ఆ భవనం లోపల మాత్రం వందల కోట్ల రూపాయల విలువైన సర్వర్లు ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేస్తున్నాయి.
ఆ సర్వర్ల గుండె చప్పుడు వినిపించేలా ఉండే కంట్రోల్ రూమ్‌లో ఒక యువకుడు వేగంగా కంప్యూటర్ స్క్రీన్ల మధ్య తిరుగుతున్నాడు.
అతడే దేవ్.
వయసు ఇరవై తొమ్మిది.
మన దేవ్ "వర్ధన్ డిజిటల్ సిస్టమ్స్"లో హెడ్ ఆఫ్ సర్వర్ మెయింటెనెన్స్.
సిస్టమ్ డౌన్ అయితే దేశవ్యాప్తంగా బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు, ఈ-కామర్స్ కంపెనీలు ప్రభావితం అవుతాయి. అలాంటి బాధ్యత అతని భుజాల మీద ఉంది.
"సర్వర్ క్లస్టర్ 4లో లోడ్ పెరుగుతోంది సర్," అని ఒక జూనియర్ ఇంజనీర్ ఆందోళనగా అన్నాడు.
దేవ్ ఒక్కసారి స్క్రీన్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
"లోడ్ కాదు. ఎవరో బాట్ ట్రాఫిక్ పంపుతున్నారు. రూట్ మార్చండి. ఫైర్‌వాల్ రూల్స్ అప్డేట్ చేయండి."
రెండు నిమిషాల్లో సమస్య మాయం అయింది.
కంట్రోల్ రూమ్‌లో ఉన్నవాళ్లు ఆశ్చర్యంగా దేవ్ వైపు చూశారు.
"సర్, మీరు లేకపోతే ఈ కంపెనీ సగం రోజూ నడవదు," అని ఒకరు అన్నారు.
దేవ్ మాత్రం నవ్వుతూ తల ఊపాడు.
"నేను కాదు. ఈ కంపెనీని నిర్మించిన వ్యక్తి అసలు జీనియస్."
ఆ మాట చెబుతూ అతని చూపు గోడ మీద వేలాడుతున్న ఒక ఫోటో మీద పడింది.
ఆ ఫోటోలో ఒక వ్యక్తి చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు.
"వికాస్ వర్ధన్"
వర్ధన్ డిజిటల్ సిస్టమ్స్ యజమాని.
దేశంలో అత్యంత విజయవంతమైన టెక్నాలజీ వ్యాపారవేత్తల్లో ఒకరు.
దేవ్‌కు ఆయన కేవలం బాస్ కాదు.
ఆదర్శం.
స్ఫూర్తి.
హీరో.
వర్ధన్ అంటే దేవ్ కి ఎంత ఇష్టమైన వ్యక్తి , అలాగే అతని లానే బట్టలు వేసుకుంటాడు అతని లానే సింగిల్ గా ఉండాలి అని అనుకుంటాడు , వర్ధన్ కి పెళ్లి కాలేదు !
అంతా పెద్ద ఆస్తి కి ఒక్కడే రరాజు!!!
---
మరుసటి రోజు.
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఆఫీస్.
అక్కడ ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ కేరక్టర్ నీ పరిచయం చేయాలి !
ఆమె పేరే చిత్ర !!
అయితే చిత్ర నీ వాళ్ళ ఎడిటర్ పిలిచారు ! ఏదో ముఖ్యమైన విష్యం అయ్యుంటుంది !
ఎడిటర్:- " చిత్ర గత రెండు నెలలుగా నీ దగ్గర నుండి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు , నీకు ఉన్న టాలెంట్ వల్లే ఇంకా నువ్వు ఇక్కడ survive అవుతున్నావ్, లేదంటే ఎప్పుడో నిన్ను తీమినేట్ చేసేవాళ్ళం ! సీనియర్ బోర్డు మెంబెర్స్ తో మాట్లాడి నిన్ను ఇంకా ఉంచుతున ఈ ఫీల్డ్ లో !!!" అని అతను చాలా సీరియస్ గా చిత్ర కి చెప్పాడు
అయితే చిత్ర మాత్రం నవ్వుతూ తన వెనుకనుండి ఒక ఫైల్ తీసి అతని చేతిలో పెట్టింది !
అతను "ఏంటి ఏదో?" అని కుంచం చిరాకు గా ఆ ఫైల్ తీసుకున్నాడు , ఆ ఫైల్ లో ప్రస్తుతం జరుగుతున్న online morphed photos కుట్ర కి సంబంధించిన డియిల్స్ ఉన్నాయి , అది ఇంత వరకు ఎవరికి సాధ్యం కాలేదు !
సోషల్ మీడియా లో అశ్లీల ఫొటోస్ మరియు లింక్స్ ప్రొవైడ్ చేసి జనాల యొక్క కోరికను డబ్బు గా మలచే ఒక బ్రహ్మాస్త్రం ఆ రొమాన్స్ స్కామ్స్ !! అవి చూసిన ఎడిటర్ కి ఒక ఆడ పిల్ల ఏ న ఇది అంతా చేయగలిగింది ! అని ఆశ్చర్యం వేసింది ! అలాంటి విషయాలు బయటకి చెప్పలేక పరువూ పోతుంది ఏమో అని ఎందరో మోసపోయిన వాళ్ళు చీకట్లోనే బ్రతుకుతున్నారు , అటువంటి వాంఛలు ఉన్న వాళ్ళని ముందు ఇలాంటి ఫొటోస్ మరియు లింక్స్ పెట్టీ వాళ్ళని మొహానికి గురి చేసి , వాళ్ళు వీళ్ళని పూర్తి గా నమ్మిన తర్వాత వాళ్ళ చట్స్ అండ్ screen recordings అన్నిటినీ వాడుకుని డబ్బులు సంపాదిస్తారు !!!
ఇది మన సమాజం యొక్క ఒక చీకటి కోణం ! అందరికీ తెలిసిన వారు మాట్లాడారు ! మాట్లాడే అంతా ఉత్తములు లేరు !
అయితే అది చూసిన వాళ్ళ ఎడిటర్ :-
"చిత్రా, నీ దగ్గర ఉన్న సమాచారం నిజమైతే ఇది చాలా పెద్ద స్టోరీ అవుతుంది."
ఎడిటర్ మాటలు విన్నా ఆమె ముఖంలో భయం కనిపించలేదు.
చిత్రా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్.
ఆమెకు నిజం బయట పెట్టడం అంటే ప్రాణం.
ఆమె ల్యాప్‌టాప్‌లో కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ఫోటోలు కనిపిస్తున్నాయి.
అందమైన అమ్మాయిల ఫోటోలు.
లగ్జరీ కార్లు.
విదేశీ ట్రిప్స్.
ఆన్లైన్లో ప్రేమ పేరుతో వల వేసే అకౌంట్లు.
"ఇవి నిజమైన అమ్మాయిల అకౌంట్లు కావు సర్," అంది చిత్రా.
ఎడిటర్ :- "మరి?"
చిత్ర :- "డబ్బులు తీసుకుని ఫోటోలు పోస్ట్ చేసే మోడల్స్. వాళ్ల ఫోటోలను ఉపయోగించి వందల మంది పురుషులను మోసం చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి, పెట్టుబడులు... ఏది చెప్పినా నమ్మిస్తున్నారు."
ఎడిటర్ ఆశ్చర్యపోయాడు.
ఎడిటర్ :- "సాక్ష్యాలు?"
చిత్రా చిరునవ్వు నవ్వింది.
"అన్నీ ఉన్నాయి."
అని అంది
అప్పుడు ఆ ఎడిటర్ , సరే నువ్వు వెళ్ళు ఇవి నేను రిలీజ్ చేయిస్తా! అని అన్నాడు
---
అదే సాయంత్రం.
దేవ్ తన ఆఫీస్ నుంచి బయటికి వచ్చాడు.
అతని ఫోన్ మోగింది.
"హలో?"
"మిస్టర్ దేవ్?"
ఒక అమ్మాయి స్వరం.
"అవును." అని అన్నాడు దేవ్
"నేను చిత్రా."
దేవ్ కాసేపు ఆలోచించాడు.
"ఆ జర్నలిస్టా?" అని అడిగాడు విసుగ్గా
"అవును. మీ కంపెనీ సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి."
దేవ్ నవ్వాడు.
"న్యూస్ వాళ్లు ప్రశ్నలు అడిగితే సాధారణంగా ఎవరికైనా భయమే." అని అంది చిత్ర
" చూడండి చిత్ర గారు ఊరకనే మీ టైం waste చేసుకోకండి!
అలాగే నా టైం waste చేయకండి! "
అని కోపం గా అన్నాడు దేవ్
" సరే లే ! కనీసం ఒక్క కాఫీ అయినా తాగొచ్చు గా నాతో !?" అని అడిగింది చిత్ర
దేవ్ అప్పటికే కాల్ కట్ చేసేసాడు
చిత్ర విసుగ్గా
:- " ఏంటో ఈ అబ్బాయి కనీసం నా ధ్యాసలో ఉండడు!
ఇంత వయసు వచ్చిన పెళ్లి చేసుకోకపోతే ఎలా ! చూస్తా ఇంకా ఎంత కాలం ఉంటాడో అలా !" అని అనుకుంది చిత్ర
...
దేవ్ కి మాత్రం చిత్ర అంటే అసలు ఇష్టం లేదు !
అసలు వీళ్ళు ఒకరికి ఒకరు ఎల్ పరిచయం ?
మూడు రోజుల తర్వాత.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ప్రసారం అయింది.
"ప్రేమ పేరుతో వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఆన్లైన్ గ్యాంగ్ అరెస్ట్!"
ఆ వార్తను బయటపెట్టింది చిత్రానే.
పోలీసులు ఒకేసారి పది ప్రాంతాల్లో దాడులు చేశారు.
డజన్ల కొద్దీ అరెస్టులు.
వందల బ్యాంక్ ఖాతాలు సీజ్.
దేశమంతా ఆ వార్త గురించి మాట్లాడటం మొదలుపెట్టింది.
చిత్రా పేరు ఒక్కసారిగా ప్రసిద్ధి చెందింది.
THE SHADOW PROTOCOL
Published: June 18, 2026 at 10:46 AM
Your input calibrates the database for others.
Ready to play...