SCREEN ON

Loading File

Chapter 2

Chapter 1
Chapter 2
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 1

ఆమె

Chapter 2
Chapter 1
Chapter 2

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 2

Jump Now

Directory

01

Nenu na bujji prapancham

Active
Chapter // 01

Nenu na bujji prapancham

భాగం 1: చిట్టి అడుగు

మొదటి అధ్యాయం: నా బుజ్జి ప్రపంచం

"అమ్మా..."

నేను పలికిన మొదటి మాట ఇదే. అప్పుడు నాకు తెలీదు, ఆ ఒక్క మాటలో ఎంత ప్రేమ, ఎంత ధైర్యం ఉంటుందో! నా చిన్న ప్రపంచం అంతా అమ్మ ఒడిలోనే మొదలైంది. కిటికీలోంచి వచ్చే ఎండను పట్టుకోవాలని చూసే నా బుజ్జి చేతులు, నాన్న వేలు పట్టుకుని వేసిన తడబడే అడుగులు.. ఇవే నా జ్ఞాపకాలు.

ప్రపంచం చాలా పెద్దది అంటారు, కానీ నాకు మాత్రం నా బొమ్మలు, నా రంగు రంగుల గాజు గోళీలు, నేను గోడల మీద గీసే పిచ్చి గీతలే నా ప్రపంచం. అమ్మ తల నిమురుతూ పాడే లాలిపాట వింటుంటే, తెలియని ఒక ప్రశాంతత నిద్రలోకి తీసుకెళ్లేది.

కానీ, ఒకరోజు వీధిలో పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఎవరో అన్నారు—"అమ్మాయివి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి" అని. అప్పుడు నా చిన్న మనసుకి అర్థం కాలేదు... 'అమ్మాయి' అవ్వడం అంటే ఏంటో, 'జాగ్రత్తగా' ఉండటం అంటే ఏంటో! నేను అందరిలాగే ఆడుకుంటున్నాను కదా, మరి నాకెందుకు ఈ మాటలు? అనిపించింది.

రెండో అధ్యాయం: అందరం ఒకటే కదా?

నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు అనుకుంటా.. ఇంట్లో ఒక వింతని గమనించాను. మా అన్నయ్య సాయంత్రం దాకా బయట ఆడుకుని చీకటి పడ్డాక వచ్చినా ఎవరూ ఏమీ అనేవారు కాదు. కానీ నేను కాస్త ఆలస్యంగా వస్తే మాత్రం, "అమ్మాయివి.. చీకటి పడకముందే ఇంటికి రావాలి" అని అమ్మ గట్టిగా చెప్పేది.

అన్నయ్యకి కొత్త సైకిల్ కొన్నప్పుడు నేను కూడా తొక్కుతాను అంటే, "నీకెందుకు అమ్మాయివి కదా.. పడిపోతావు, దెబ్బలు తగులుతాయి" అన్నారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. అన్నయ్యకి తగిలితే దెబ్బలు, నాకు తగిలితే ఇంకేదోనా? నాకు కూడా గాలిపటాలు ఎగరేయాలని ఉండేది, వానలో తడవాలని ఉండేది.

కానీ మెల్లగా నా చుట్టూ ఒక గీత గీయడం మొదలైంది. "అమ్మాయిలు నెమ్మదిగా నడవాలి, గట్టిగా నవ్వకూడదు, వంటింట్లో అమ్మకి సాయం చేయాలి.." ఇలాంటి మాటలన్నీ వింటుంటే, నా మనసులో ఒకటే ప్రశ్న వచ్చేది. "అందరం పిల్లలమే కదా.. మరి నా ఒక్కదానికే ఇన్ని నియమాలు ఎందుకు?”

మూడో అధ్యాయం: కలల ప్రపంచం

అమ్మాయిలకు పరిమితులు ఉంటాయని అర్థమైనా, నా కలలకు మాత్రం ఎవరూ సంకెళ్లు వేయలేకపోయారు. పుస్తకాల్లో బొమ్మలు చూసినప్పుడు, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నప్పుడు.. నేను కూడా ఏదో ఒక రోజు అలా ఎగరాలని అనుకునేదాన్ని. స్కూల్లో టీచర్ అడిగినప్పుడు "నేను పెద్దయ్యాక కలెక్టర్ అవుతాను" అనో, "డాక్టర్ అవుతాను" అనో గట్టిగా చెప్పేదాన్ని. ఆ చిన్న వయసులో నాకున్న ఏకైక ఆయుధం నా "నమ్మకం". ఈ ప్రపంచం నన్ను ఎలా చూసినా, నేను మాత్రం నన్ను నేను ఒక విజేతలాగే చూసుకునేదాన్ని.

ఆటపాటల నుంచి పాఠాల వైపు, చిన్న అడుగుల నుంచి గట్టి అడుగుల వైపు నా ప్రయాణం సాగింది. మెల్లగా నా బాల్యం ముగిసి.. కొత్త ప్రపంచం వైపు అడుగులు పడ్డాయి.

భాగం 2: తొలి స్వప్నం

అధ్యాయం 1: రెక్కలొచ్చిన కలలు (చదువు - లక్ష్యం)

స్కూలు దాటి కాలేజీ గడప తొక్కినప్పుడు నాలో తెలియని ఒక ఉత్సాహం. ఇప్పుడు నేను కేవలం ఒక ఇంటి అమ్మాయిని మాత్రమే కాదు, నాకంటూ ఒక గుర్తింపు కావాలని తపించే ఒక విద్యార్థిని. పుస్తకాల వాసన, కొత్త స్నేహాలు, భవిష్యత్తు గురించి వందల కలలు.

"బాగా చదువుకుంటేనే నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు" అని మా నాన్న చెప్పిన మాటలు నా చెవిలో ఎప్పుడూ మారుమోగుతూనే ఉండేవి. క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు బోర్డు మీద పాఠాల కంటే ఎక్కువగా.. రేపు నేను సాధించబోయే విజయం నాకు కనిపిస్తూ ఉండేది. రాత్రిళ్లు మేలుకుని చదువుతున్నప్పుడు కళ్లు అలసిపోయినా, నా కలలు మాత్రం నన్ను నిద్రపోనిచ్చేవి కావు. ఒక డిగ్రీ పట్టా అంటే అది కేవలం కాగితం కాదు, అది నా స్వేచ్ఛకు దొరికిన పాస్ పోర్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది.

అధ్యాయం 2: మౌన రాగం (ప్రేమ - పాఠం)

అదే వయసులో మనసులో మెల్లగా ఒక కొత్త భావం మొదలైంది. ఎవరో తెలియని వ్యక్తి కోసం ఎదురుచూడటం, ఒక చిన్న చూపుకి మురిసిపోవడం.. ప్రేమ అంటే ప్రపంచమే మారిపోతుందేమో అనుకున్నాను. కానీ, కాలం నాకు ఇంకో పాఠం నేర్పింది.

కొన్ని పరిచయాలు సంతోషాన్ని ఇస్తే, మరికొన్ని పరిచయాలు అనుభవాన్ని మిగిల్చాయి. ప్రేమ అంటే కేవలం ఒక వ్యక్తితో ఉండటం మాత్రమే కాదు, ఆ ప్రయాణంలో మనల్ని మనం కోల్పోకూడదు అని తెలుసుకున్నప్పుడు నేను మానసికంగా ఎదిగాను. విఫలమైనా, గెలిచినా.. ప్రతి మలుపులోనూ ఒక పాఠం ఉంది. కన్నీళ్లు కూడా కళ్లు తుడుచుకుని మళ్ళీ నిలబడటం నేర్పించాయి. నా ఆశలు కేవలం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండకూడదని, నా సంతోషానికి నేనే మూలం కావాలని అర్థం చేసుకున్న క్షణం.. నేను నిజమైన "స్త్రీ"గా మారాను.

కొన్ని ఏళ్లు కేవలం నా లక్ష్యం కోసం పరుగెత్తాను, మరికొన్ని ఏళ్లు మనసులోని అలజడితో గడిపాను. ఎనిమిది ఏళ్ల కిందట ఉన్న నేను వేరు, ఇప్పుడున్న నేను వేరు. అప్పట్లో ఒక చిన్న మాటకి కుంగిపోయేదాన్ని, కానీ ఇప్పుడు ఎదురుదెబ్బలే నాకు మెట్లు అయ్యాయి.

ప్రేమలో ఓడిపోవడం అంటే జీవితం ముగిసిపోవడం కాదు, మనల్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవడం. ఆ ఎనిమిది ఏళ్ల ప్రయాణం నాకు నేర్పిన అతిపెద్ద పాఠం ఏంటంటే—"ఎవరి కోసమో మనల్ని మనం మార్చుకోవడం కాదు, మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదుటివారిని ప్రేమించడమే నిజమైన బలం." నా కలలకి, నా ఆశలకి నేనే బాధ్యురాలిని అని తెలిశాక, నాలో ఒక కొత్త ధైర్యం మొదలైంది.

భాగం 3: బంధాల బంధం

అధ్యాయం 1: కొత్త గడప - కొత్త బాధ్యత

ఒక ఇంటి కూతురిగా ఉన్న నేను, మరో ఇంటి కోడలిగా మారిన క్షణం నా జీవితంలో పెద్ద మలుపు. అప్పటిదాకా నా ఇష్టాయిష్టాలకే ప్రాముఖ్యత ఉండేది, కానీ ఇప్పుడు నా నిర్ణయాల వెనుక ఒక కుటుంబం ఉంది. కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, కొత్త బాధ్యతలు. "సర్దుకుపోవడమే ఆడదాని లక్షణం" అని సమాజం చెప్పే మాటలు నా చుట్టూ వినబడుతూనే ఉన్నాయి.

కానీ, సర్దుకుపోవడం అంటే నన్ను నేను చంపుకోవడం కాదని నాకు తెలుసు. ఒక భార్యగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే, నా కళ్లలోని ఆ మెరుపును, నా మనసులోని ఆశలను ఆర్పేయకుండా జాగ్రత్త పడ్డాను. వంటింటి గడప దాటి నా కలల ప్రపంచంలోకి వెళ్లడానికి నేను చేసే ప్రతి ప్రయత్నం ఒక యుద్ధమే అయ్యింది.

అధ్యాయం 2: తోడుగా నిలిచిన బంధం

పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం కాదు, ఒకరి కలలకు మరొకరు రెక్కలు తొడగడం. నా భర్త నా ఎదుగుదలలో ఒక భాగస్వామిగా మారినప్పుడు, బంధం యొక్క నిజమైన విలువ తెలిసింది. సంసారం అనే బండిని లాగడంలో పడి నా వ్యక్తిత్వాన్ని మర్చిపోకుండా, నాకంటూ ఒక సమయం, నాకంటూ ఒక వ్యాపకం ఉండేలా చూసుకున్నాను.

అమ్మగా మారినప్పుడు కలిగిన ఆ అనుభూతి వర్ణన చేయలేను. నా బిడ్డ కోసం నేను చేసే త్యాగాల్లో ఒక రకమైన తృప్తి ఉంది. కానీ, ఆ బిడ్డకు నేను ఒక "అమ్మ"గానే కాదు, తన కలల కోసం పోరాడే ఒక "ఆదర్శ మహిళ"గా కనిపించాలని నిశ్చయించుకున్నాను. జీవితంలో ఎన్ని వసంతాలు గడిచినా, నాలో ఉన్న ఆ పట్టుదల మాత్రం వసంతం లాగే ఎప్పుడూ పచ్చగా ఉంది.

భాగం -4 నిరంతర వసంతం

చివరికి మిగిలేది ఏంటి?

పెంచుకున్న బంధాలా? సంపాదించిన ఆస్తా? లేక అనుభవించిన సుఖాలా?

వయసు పైబడ్డాక వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేను గెలిచిన యుద్ధాల కంటే, నేను ఓడిపోయి కూడా మళ్ళీ నిలబడ్డ క్షణాలే నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తున్నాయి. ఒక చిన్నారిగా అడుగులు వేసినప్పుడు నా ముఖంలో ఉన్న ఆ అమాయకత్వమే, ఇన్ని ఏళ్ల తర్వాత ఈరోజు నా ముఖంలో "ప్రశాంతత"గా మారింది.

లోకం నన్ను కూతురిగా చూసింది, కోడలిగా పరీక్షించింది, తల్లిగా పూజించింది. కానీ, ఈ ముసలి కళ్ళలో ప్రతిబింబించే అసలు రూపం—ఒక స్వతంత్రమైన మనిషి. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నాకంటూ ఒక గొంతు ఉంది. నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ నేనే రాసుకున్నాను. కొన్ని పేజీలు కన్నీళ్లతో తడిచాయి, మరికొన్ని నవ్వులతో విరిశాయి. కానీ ఏ పేజీ కూడా ఖాళీగా లేదు.

వచ్చే తరానికి నేను ఇచ్చే అతిపెద్ద ఆస్తి నా నగలు కావు.. నేను బతికిన విధానం. ఏ వసంతం నీ జీవితంలోకి వచ్చినా, వెళ్లినా.. నీ మనసులోని పట్టుదల అనే వసంతం మాత్రం ఎప్పుడూ వాడిపోకూడదు.

ఆశలు ఉన్నంత వరకు ఆయుష్షు ఉంటుంది, ఆత్మగౌరవం ఉన్నంత వరకు గుర్తింపు ఉంటుంది.

చివరి శ్వాసలో కూడా నేను గర్వంగా చెప్పుకునే మాట ఒక్కటే

: "నలుగురు నడిచిన దారిలో నేను నడవలేదు.. నా కోసం నేను ఒక దారిని నిర్మించుకున్నాను. అదే నా విజయం..!”

ఆమె

By మౌనంలో లోతైన మాటలు

Published: July 3, 2026 at 3:08 AM

© 2026 మౌనంలో లోతైన మాటలు. All rights reserved. Do not copy, distribute, or steal.

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...