SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 11

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

Active
11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

FINAL EPISODE

File // 10

EPISODE 10

(గత ఎపిసోడ్ కొనసాగింపు...)
అక్కడికి వచ్చిన ప్రణీత్‌ని చూసి కవర్ చేస్తూ... "పర్లేదులే బామ్మగారూ... వీళ్లకి రోజూ ఇలా బస్సులో నిలబడటం అలవాటేలే, బాబునే కూర్చోనివ్వండి," అంటూ ఆ చిన్న పిల్లాడిని తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఆద్య.

ఆ మాట విన్న ప్రణీత్‌కి పరువు పోయినట్లు అనిపించి, కోపంగా ముఖం పెట్టి మెల్లగా మళ్లీ వెళ్లి ముకుంద్ పక్కన నిలబడ్డాడు. ఆద్య తన ఫోన్‌లో ఏదో చూసుకుంటుండటం గమనించిన ముకుంద్, ఇదే మంచి సమయం అనుకుని కాస్త ధైర్యంగా ఆమె వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు.

కానీ ఆద్య వెనక ఎవడో ఒకడు అనుమానాస్పదంగా ఆమె వైపే చూస్తుండటం ముకుంద్ గమనించాడు.
"రేయ్ ప్రణీత్... అక్కడ వాడెవడో ఆద్యను అదోలా చూస్తున్నాడురా, వెళ్లి ఏంటో చూడు," అన్నాడు కంగారుగా.
దానికి ప్రణీత్ విసుక్కుంటూ, "నేనెందుకు వెళ్తాను? నువ్వే వెళ్లు... నాకు డైలీ ఇలా నిలబడటం అలవాటే కదా," అని మూతి తిప్పుకున్నాడు.
"ఏం మాట్లాడుతున్నావు రా ఇప్పుడు..." అని ముకుంద్ కోపంగా అంటుండగానే...

అప్పుడే ఆద్య వాళ్ల అమ్మ ఫోన్ చేయడంతో ఆద్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతోంది. సరిగ్గా అదే సమయానికి, ఆమె వెనక ఉన్న ఆ అనుమానాస్పద వ్యక్తి ఒక్కసారిగా ఆద్య చేతిలోని ఫోన్ లాక్కుని బస్సు ముందు డోర్ వైపు వేగంగా దూసుకువచ్చాడు.
"అమ్మో... నా ఫోన్!" అని ఆద్య గట్టిగా అరిచింది.

ఇదంతా గమనిస్తున్న ముకుంద్, ఆ దొంగ తన పక్కనుంచి పరిగెడుతుండగా సమయస్ఫూర్తిగా తన కాలు అడ్డుపెట్టాడు. అంతే... ఆ దొంగ బొక్కబోర్లా కిందపడ్డాడు. వాడి చేతిలోని ఫోన్ గాల్లోకి ఎగిరి నేరుగా ప్రణీత్ చేతిలో పడింది.

దొంగ కిందపడటం చూసిన బస్సులోని మిగతా జనం, వాడిని పట్టుకుని చావబాదడానికి మీదకు వచ్చారు. ఆద్య కూడా కంగారుగా ముందుకు వచ్చింది.
కానీ ముకుంద్ వాళ్లను ఆపి, "బాబాయ్... బాబాయ్... ఆగండి, కొట్టకండి. వాడు కావాలని ఎందుకు చేస్తాడు చెప్పండి," అంటూ దెబ్బలు పడకుండా అడ్డుకున్నాడు.

తన జేబులో ఉన్న ఓ యాభై రూపాయలు తీసి ఆ దొంగ చేతిలో పెడుతూ... "ఏమైనా కొనుక్కుని తిను బ్రో. కుదిరితే కష్టపడి బతుకు. ఇలాంటి పని చేశావంటే నీ జీవితంలో ఇప్పటికే ఎన్నో ఎదురుదెబ్బలు చూసి ఉంటావు. ఎలా బతకాలనే విషయం నాకన్నా నీకే బాగా తెలుసు," అని ఆ దొంగను పైకి లేపాడు.
ఆ దొంగ సిగ్గుతో తలదించుకుని ఏమీ మాట్లాడకుండా బస్సు దిగిపోయాడు.

కానీ బస్సులో ఉన్న ఒక పెద్దాయన, "ఏంటి బాబూ... నువ్వు చెప్పిన నీతులు విని వాడు మారిపోతాడనుకుంటున్నావా?" అని అడిగాడు.
దానికి ముకుంద్, "మనం కొట్టినా వాడు మారడు బాబాయ్... ఇంకా కొట్టి ఏం లాభం? ఏదో మీ శాటిస్ఫాక్షన్ తప్ప," అని బదులిచ్చాడు.

ఇంతలో ప్రణీత్ బిల్డప్ ఇస్తూ, "నేను వాడికి ఆల్ రెడీ రెండు దెబ్బలు వేశానులే... అందుకే వాడు తీసుకున్న ఫోన్ ఇచ్చేశాడు," అని అబద్ధం ఆడి, ఆద్యకి తన ఫోన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కానీ ఆద్య ప్రణీత్ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. కనీసం ఆ ఫోన్ కూడా తీసుకోకుండా... ఆశ్చర్యంగా, ఆరాధనగా ముకుంద్‌నే చూస్తూ ఉండిపోయింది.

సడన్‌గా ముకుంద్ ఆద్య వైపు చూశాడు. ఆద్య ఎంతో బ్రైట్‌గా నవ్వుతూ ముకుంద్‌కి "థ్యాంక్స్" చెప్పింది.
ముకుంద్ కూడా సిగ్గుపడుతూ, ఆమె వంక చూసీ చూడనట్లుగా ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు.

ఇదంతా పక్కనుంచి చూస్తున్న ప్రణీత్ చేతిలోని ఫోన్ ఆద్యకు ఇస్తూ... 'ఇదిగో అక్కా నీ ఫోన్ తీసుకో... చాలా బరువుగా ఉంది. ఎక్కడలేని స్టిక్కర్లు అన్నీ దీని ఫోన్ మీదే ఉన్నాయి ఏంట్రా బాబూ,' అని మనసులో గొణుక్కున్నాడు.
Prev Next

Ready to play...