శ్యామ్ అతని ఇంట్లో ఒక్కడే అలా పడుకుని రుక్మిణీ మాటలు గుర్తుచేసుకుంటున్నాడు.
> "రుక్మిణీ చెప్పింది కూడా నిజమే కదా! అసలు ఎందుకు రాస్తున్నానో నాకే తెలియదు..."
అని శ్యామ్ మనసులో అనుకున్నాడు. రుక్మిణీ మాటలు శ్యామ్‌ని ఏదో కొత్తగా ఆలోచించేలా ప్రేరేపించాయి.
తర్వాతి రోజు ఉదయం...
రుక్మిణీ చెప్పినట్టుగానే శ్యామ్ ఆ గుడికి వెళ్లాడు. రుక్మిణీ కూడా వచ్చింది. శ్యామ్‌కి ఆ పుస్తకం ఇచ్చి:
> "నేను కూడా ఒక పుస్తకం రాయాలి అని అనుకుంటున్నాను..."
అని చెప్పింది.
అప్పుడు శ్యామ్:
> "మంచి విషయమే."
అని అన్నాడు.
అప్పుడు రుక్మిణీ:
> "నీకు ఏమన్నా కొత్తగా అనిపిస్తుందా?"
అని అడిగింది.
అలా ఇద్దరూ గుడి లోపలికి నడుస్తున్నారు. శ్యామ్ రుక్మిణీని చూసి:
> "ఈరోజు బాగా రెడీ అయ్యావ్... బాగున్నావ్."
అని అన్నాడు.
శ్యామ్ మాటలు రుక్మిణీకి నచ్చలేదు.
> "పో... నీకేం అర్థం కాదు..."
అని అలక చూపించింది.
ఎందుకంటే రుక్మిణీ ఇంకేదో ఆశిస్తుంది మన శ్యామ్ నుండి.
అప్పుడే గుడిలో పూజారి మన రుక్మిణీని చూసి:
> "పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ రుక్మిణీ!"
అని ఆశీర్వదించాడు.
అప్పుడు అర్థమైంది శ్యామ్‌కి రుక్మిణీ ఎందుకు అలిగిందో. శ్యామ్ మనసులో ఇప్పుడు రుక్మిణీకి ఎలా శుభాకాంక్షలు చెప్పాలో అర్థం కావట్లేదు.
రుక్మిణీ శ్యామ్ వైపు చూసి:
> "రా... నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో."
అని పిలిచింది.
అప్పుడు శ్యామ్ కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇద్దరూ వేరువేరుగా తీసుకున్నారు.
పాపం శ్యామ్ ఏదోలా ధైర్యం చేసి శుభాకాంక్షలు చెప్పబోతుంటే మధ్యలో పంతులు వచ్చి:
> "ఎవరు అమ్మ ఈ ఇతను?"
అని అడిగారు.
అప్పుడు రుక్మిణీ:
> "ఇతను నా స్నేహితుడు పంతులు గారు... మంచి రైటర్. పేరు శ్యామ్."
అని పరిచయం చేసింది.
అప్పుడు ఆ పూజారి:
> "బాబు, చూస్తుంటే మంచి వాడిలా ఉన్నావ్... ఆ జుట్టు ఎందుకు అంత పెంచావ్?"
అని అడిగాడు.
అప్పుడు శ్యామ్ నవ్వుతూ:
> "దేవుడి మొక్కుబడి..."
అని అన్నాడు.
అప్పుడు ఆ పూజారి:
> "అవునా? తిరుపతి ఆ? అరుణాచలం ఆ నీ మొక్కు?"
అని అడిగారు.
అప్పుడు శ్యామ్:
> "కట్టింగ్ షాపు."
అని చెప్పి బయటకి వచ్చేశాడు.
రుక్మిణీ తన నవ్వు ఆపుకోలేకపోయింది. బయటకి గబగబా వచ్చేసి ఇద్దరూ తెగ నవ్వుకున్నారు.
> "ఏంటి అసలు అలా అనొచ్చా... అసలే నా తరఫున పరిచయం చేశా..."
అని నవ్వుతూ అంది.
శ్యామ్‌కి రుక్మిణీని అలా చూసి ఒక్కసారి తనని ముట్టుకోవాలి అనిపించింది. వెంటనే తనకి ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు కదా అని గుర్తొచ్చి, ఆ వంకతో తనని ముట్టుకోవచ్చు అని చేయి ఇచ్చాడు.
> "పుట్టినరోజు శుభాకాంక్షలు రుక్మిణీ గారు..."
అని అన్నాడు.
అప్పుడే పక్కన ఉన్న రేడియోలో ఒక పాట...
రుక్మిణీ కూడా మన శ్యామ్ చేయి పట్టుకుంది.
రేడియోలో వస్తున్న పాట:
> "గట్టివాడవని పట్టితి నీ చెయ్యి
పట్టివిడువరాదు కృష్ణా...
వట్టి మాయలలో నన్ను తగిలించితే
ఏటుల నే పోదు గోపాల..."
అని ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పాట వస్తుంటే...
అప్పుడే అర్థమైంది శ్యామ్‌కి మన రుక్మిణీ చేయి ఎంత మృదువుగా ఉందో.
> "ఏంటి ఇంత మృదువుగా ఉంది..."
అనే భావన మన శ్యామ్ మొఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.
తన చేతి స్పర్శ ఎంతో మధురానుభూతిని కలిగించింది.
రుక్మిణీ "థాంక్స్" అని చెప్పింది. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు వదలలేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు...
అదే సమయంలో పక్కనుండి రుక్మిణీ వాళ్ల స్నేహితులు అందరూ వచ్చి ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
రుక్మిణీ సైగ చేసి:
> "శ్యామ్... మనం రేపు కలుద్దాం."
అని అంది.
శ్యామ్ కొంచెం విచారంగా మొఖం పెట్టాడు. కానీ సరే అని బై చెప్పాడు.
రుక్మిణీని తీసుకుని వాళ్ల స్నేహితులు గుడిలోకి వెళ్తున్నారు. కాస్త ముందుకి వెళ్లిన రుక్మిణీ వెనక్కి తిరిగి సిగ్గుపడుతూ మన రైటర్ గారికి బై చెప్పింది.
అలా బై చెప్పేటప్పుడు రుక్మిణీ ఎంత ముద్దుగా ఉందో...
అని శ్యామ్ మనసులో అనుకున్నాడు.
కానీ శ్యామ్ మనసులో ఇంకేదో మెదులుతుంది...
అదే ఇప్పుడు వాళ్ల మేనమామ గారి ఇంటికి వెళ్లాలి...