SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 15

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

Active
15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

FINAL EPISODE

File // 14

EPISODE 14

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్:

అక్కడ ఆదికేశవకు కుట్లు వేస్తున్న సమయంలోనే, పక్కన ముకుంద్‌కు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న కాంపౌండర్ అతడి ఎడమ కాలును నిశితంగా గమనించాడు.
"ఏంటి బాబూ... కాలు ఇలా సన్నగా అయిపోయింది? రెండు కాళ్లూ ఇంతేనా?" అని ముకుంద్ కుడి కాలును కూడా చెక్ చేశాడు. కుడి కాలు ఫిట్‌గా ఉంది, కండ (కాల్ఫ్ మజిల్) కూడా బలంగానే ఉంది. కానీ ఎడమ కాలు మాత్రం అలా లేదు... చాలా బలహీనంగా, ప్రాణం లేనట్టుగా సన్నబడిపోయి ఉంది.

వెంటనే అతను, "దీనికి న్యూరో సర్జన్‌ను కలవాలి," అని చెప్పాడు. ఆదికేశవ తనకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌తో వెంటనే అదే హాస్పిటల్‌లో ఉన్న ప్రముఖ న్యూరో సర్జన్‌ను అక్కడికి రప్పించాడు.

అది చూసి ఆద్య కొంచెం కంగారు పడింది. ముకుంద్ చేయి పట్టుకుని, "ఏంటి ముకుంద్... నువ్వు హెల్తీగానే ఉన్నావు కదా! అదేం పెద్ద విషయం కాదులే, జస్ట్ ఫుడ్ బాగా తింటే సరిపోతుంది," అని తన భయాన్ని కవర్ చేసుకుంటూ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది.
ఆదికేశవ కూడా, "జస్ట్ చెక్ చేస్తారమ్మా... ఏమీ కాదులే," అని భరోసా ఇచ్చాడు.

ముకుంద్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్లగానే, "ప్రాబ్లమ్ ఏంటి?" అని అడిగాడు డాక్టర్. ముకుంద్ తన కాలు చూపించాడు.
డాక్టర్ ముకుంద్ కాలు పట్టుకుని 'నీ జెర్క్' (Knee Jerk) టెస్ట్ చేస్తూ... "చూస్తుంటే ఇదేమీ అంత నార్మల్ విషయంలా లేదు..." అన్నాడు సీరియస్‌గా.
"అదేంటి సార్... ఇది చాలా చిన్న విషయం కదా! సరైన ఫుడ్ తినకపోవడం వల్ల ఇలా అయ్యిందనుకుంటా... అంతే," అని కొంచెం భయంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు ముకుంద్.
"చూడు బాబూ... ముందు నువ్వు స్కానింగ్ తీయించుకోవాలి. రిపోర్ట్స్ ఎగ్జామిన్ చేయాలి. దీని వెనుక చాలా ప్రాసెస్ ఉంది... అప్పుడే భయపడితే ఎలా?" అన్నాడు డాక్టర్.
"అలా కాదు సార్... నా ప్రాబ్లమ్ ఏంటో కొంచెం చెప్తారా? అంటే... పైకి చూస్తే మీకు ఇది దేనివల్ల ఇలా అవుతోందని అనిపిస్తోంది?" అని ఆత్రంగా అడిగాడు ముకుంద్.

అప్పుడు ఆ డాక్టర్ ముకుంద్ వంక దీర్ఘంగా చూసి... "రాకిస్-ఫేజ్ (Rachis-Phage)!!!! ఒకవేళ అదే అయితే..." అని ఇంకేమీ చెప్పకుండా ఆగిపోయాడు.

ముకుంద్ భారమైన గుండెలతో బయటికి వచ్చాడు. వెంటనే ఆద్య కంగారుగా ముకుంద్ దగ్గరికి వచ్చి, "ఏంటి ముకుంద్... ఏమన్నారు డాక్టర్?" అని అడిగింది.
ముకుంద్ తన లోపలి దుఃఖాన్ని దిగమింగుకుని... పెదవులపై నవ్వు పులుముకుంటూ, "ఏం లేదు... కొంచెం గట్టిగా తినమన్నారు. అంతే..." అని అబద్ధం చెప్పాడు.

"హమ్మయ్య... ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. చెప్పా కదా... మంచి ఫుడ్ తినాలి, అంతే. నీకు ఏమీ కాదు," అంటూ ముకుంద్‌ను ఆనందంగా హత్తుకుంది ఆద్య.
ఆ ఆత్మీయమైన కౌగిలిలోనే... "ఐ లవ్ యూ ముకుంద్," అని ప్రపోజ్ చేసింది.
"గంట ముందే నాకు తెలిసింది... నువ్వంటే నాకెంత ఇష్టమో! నీకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయాను. నిజం చెప్పు... నేనంటే నీకు కూడా చాలా ఇష్టం కదా! నిజానికి ప్రణీత్ నాకు మొత్తం చెప్పేశాడులే," అంది ఆద్య సిగ్గుపడుతూ.

ఆ మాటలకు ముకుంద్ కళ్లు చెమర్చాయి. ఆ కన్నీళ్లను తుడుచుకుని, ఆద్యను ప్రేమగా చూస్తూ... "లవ్ యూ టూ," అని అన్నాడు. ఆ మాటల్లో ప్రాణానికి ప్రాణమైన ప్రేమతో పాటు, ఎక్కడ తన ప్రేమ దూరమవుతుందో అన్న భయం కూడా దాగుంది.

వాళ్లిద్దరినీ దూరం నుంచి గమనిస్తున్న ఆ డాక్టర్, చాలా కంగారుగా ఫోన్ మాట్లాడుతూ... "సార్... ఇండియాలో ఫస్ట్ టైమ్ 'రాకిస్-ఫేజ్' కేస్‌ను చూశాను. రిపోర్ట్స్ అండ్ స్కానింగ్ సజెస్ట్ చేశాను. నిజంగా అది రాకిస్-ఫేజ్ అయితే... దానికి క్యూర్ ఏముంటుంది ఇంకా?" అని చాలా భయంగా అన్నాడు.

మరోవైపు ఆద్య, ముకుంద్‌లు ఇద్దరూ తమ కొత్త ప్రపంచంలో ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.
అదే సమయంలో ఫోన్‌లో ఆ డాక్టర్ నోటినుండి అత్యంత కఠోరమైన నిజం బయటకు వచ్చింది...
"ఇట్స్ నాట్ క్యూరబుల్ (ITS NOT CURABLE)"

-- ఇంటర్వెల్ --
Prev Next

Ready to play...