SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 19

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

Active
19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

File // 18

EPISODE 18

ఎపిసోడ్ - 19

జరిగినదంతా విన్న రామ్, "నాకు తెలుసురా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని. కానీ ప్రజ్ఞ విషయంలో ఇంకోసారి ఆలోచించు," అని అంటాడు.
దానికి సుశాంత్, "లేదు రా... నాపై ఆమెకు నిజమైన ప్రేమ ఉంటే, సెటిల్డ్ లైఫ్, జాబ్ లేవని వాళ్ల అన్నయ్యతో నన్ను అలా కొట్టించదు కదా," అంటాడు.

ఈలోగా రామ్ చెల్లెలు మేడ పైకి వచ్చి, "సుశాంత్ అన్నా... మీ నాన్నగారు వచ్చారు," అని చెబుతుంది.
అది విన్న వెంటనే సుశాంత్ గబగబా కిందకు పరుగెత్తుతాడు. నాన్నను చూడగానే తీవ్ర ఉద్వేగానికి లోనవుతాడు.
జైరామ్ కళ్లు తుడుచుకుంటూ, "నన్ను క్షమించు రా... నీతో అంత కఠినంగా ప్రవర్తించకూడదు," అని అంటాడు.
"నువ్వు కాకపోతే నాకెవరున్నారు నాన్న," అంటూ తండ్రిని హత్తుకుంటాడు సుశాంత్.
అప్పుడే పక్కనుండి పల్లవి వచ్చి, "మరి నేను...?" అని ఎమోషనల్‌గా అడుగుతుంది.
"నువ్వు నా బంగారం అక్కా," అంటాడు సుశాంత్ నవ్వుతూ.
"రేయ్... జాగ్రత్తగా వెళ్లండి, వీధి చివర కుక్కలు (చింటూ బ్రోస్) ఉంటాయి," అని వాతావరణాన్ని తేలిక పరుస్తూ సరదాగా అంటాడు రామ్.

తిరిగి వచ్చిన తండ్రిని, అక్కను చూసి ఎంతో సంతోషంతో ఇంటికి బయలుదేరుతాడు సుశాంత్. నాన్నను తన బైక్ మీద కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తుంటాడు. పల్లవి స్కూటీ మీద వారిని అనుసరిస్తూ ఆనందంగా చూస్తుంటుంది.
"రేయ్ నాన్న... నువ్వు సింగర్ అవుదామనుకున్నావు కదా, నాకు తెలిసిన వాళ్లు ఒకరున్నారు, రేపు నీకు వాళ్ల దగ్గరికి తీసుకువెళ్తాను సరేనా?" అని జైరామ్ అంటాడు.
అది విన్న సుశాంత్, డ్రైవ్ చేస్తూనే కన్నీళ్లు తుడుచుకుంటూ... "సరే నాన్న," అని ఆనందంగా అంటాడు. అలా మొదటిసారి వాళ్ల నాన్నను తన బైక్ మీద తీసుకెళ్తాడు సుశాంత్.

మరుసటి రోజు ఉదయం:
సుశాంత్ నీట్‌గా రెడీ అయ్యి, నాన్న చెప్పిన వ్యక్తిని కలుస్తాడు.
"నా పేరు ప్రవీణ్ కుమార్," అని ఆయన పరిచయం చేసుకోగా, "నేను సుశాంత్," అని బదులిస్తాడు.
"కూర్చోండి... మీ గురించి మీ నాన్నగారు చెప్పారు. నేను జస్ట్ మిమ్మల్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి పరిచయం చేయగలను, అంతకంటే ఎక్కువ నేనేం చేయలేను. అలాగని హెల్ప్ చేయలేనని కాదు... నా వంతు ప్రయత్నం నేను కచ్చితంగా చేస్తాను," అంటాడు ప్రవీణ్.
"మీరు ఏం చెప్పినా నేను చేయడానికి రెడీ సార్," అని ఉత్సాహంగా అంటాడు సుశాంత్.
"దట్స్ ద స్పిరిట్... వచ్చే వారం ఒక వార్షికోత్సవ వేడుక (యాన్యువల్ డే సెలబ్రేషన్) ఉంది. అక్కడ మీరు బాగా పెర్ఫార్మ్ చేశారంటే, ఆ ఫుటేజ్ మా డైరెక్టర్‌కి చూపించడానికి ఉపయోగపడుతుంది," అని ప్రవీణ్ వివరిస్తాడు.
"ఓకే సార్... మీ నెంబర్ ఇస్తే..." అని సుశాంత్ అడగగా, ప్రవీణ్ తన నెంబర్ ఇస్తాడు. ఇద్దరూ కరచాలనం చేసుకున్న తర్వాత, సుశాంత్ తన బైక్ మీద నేరుగా రామ్ ఇంటికి వెళ్తాడు.
"ఏంట్రా... ఇలా వచ్చావు?" అని అడిగిన రామ్‌కి, తనకు వచ్చిన ఈ అవకాశాన్ని గురించి వివరిస్తాడు సుశాంత్.
"సరే రా, మనవాళ్లం అంతా వస్తాం... ఇది మనకి బెస్ట్ ఆపర్చునిటీ," అని రామ్ ఉత్సాహపరుస్తాడు.

అలా సుశాంత్, తన స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెడతాడు. మొదటి మూడు రోజులు స్నేహితులతో కలిసి సాధన చేయడంలో పడిపోయి, సుశాంత్‌కి తనలోని బాధ ఏమాత్రం గుర్తుకురాలేదు. కానీ నాలుగవ రోజు సాయంత్రం, సూర్యాస్తమయ సమయంలో బైక్ మీద వెళుతుండగా... ఆ పాత శివాలయం కనిపిస్తుంది. ప్రజ్ఞతో అక్కడ గడిపిన క్షణాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతాడు. అక్కడ మొదటిసారి ప్రజ్ఞను చూసినప్పుడు పిడుగు పడి కాలిపోయిన చెట్టు కనిపిస్తుంది... దాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దాటుకుంటూ వెళ్లిపోతాడు.

కొంతదూరం వెళ్ళాక, ఒక చిన్న పాప తెల్లటి ఏంజెల్ డ్రెస్‌లో వాళ్ళ నాన్నతో బైక్ మీద వెళ్లడం చూస్తాడు. ఆ పాపను చూసిన సుశాంత్‌, తన బైక్‌ను గోదావరి నది ఒడ్డున ఆపి... అలా ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోతాడు.
ప్రాక్టీస్‌కి లేట్ అవుతోందని గ్రహించి, మళ్లీ బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది స్టార్ట్ అవ్వదు. ఈలోగా... ఊహించని విధంగా నేరుగా ప్రజ్ఞ వచ్చి సుశాంత్ ముందు నిలబడుతుంది. ఆమె వాళ్ళ అన్నయ్యతో కలిసి బైక్ మీద వచ్చింది. అన్నయ్య మాత్రం కొంచెం దూరంలో బైక్ మీద కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.

సుశాంత్ ప్రజ్ఞను చూస్తాడు. ఆమె చేతిలో ఏవో పెళ్లి కార్డులు ఉన్నాయి. పసుపు పచ్చని చొక్కాలో ఉన్న సుశాంత్ ముఖం మీద... గోదావరి నదిపై పడి పరావర్తనం చెందుతున్న సూర్యుడి బంగారు వర్ణపు కిరణాలు పడుతున్నాయి. ఆ మెరుపులో సుశాంత్‌ను అలా చూస్తూండిపోతుంది ప్రజ్ఞ. సుశాంత్‌ను మర్చిపోదామనుకున్న ప్రజ్ఞ, అతడితో మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. కానీ ధైర్యం చేసి ఏమో చెప్పాలని ప్రయత్నిస్తుంది. అయితే సుశాంత్ ఆమె మాటలు వినే మానసిక స్థితిలో లేడు. చేతులెత్తి దండం పెడుతూ, "పో..." అని చిన్నగా సైగ చేస్తాడు. పాపం ప్రజ్ఞ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది.

వాళ్ళ అన్నయ్య బైక్ స్టార్ట్ చేయడంతో, వాళ్ళు అక్కడినుండి వెళ్లిపోతారు. సుశాంత్ మాత్రం వెళుతున్న ప్రజ్ఞనే చూస్తూ ఉంటాడు. కానీ ప్రజ్ఞ మాత్రం వెనక్కి తిరిగి చూడదు. మెల్లగా సూర్యుడు గోదావరి నదిలో కలిసిపోతుంటాడు. చీకటి పడేదాకా సుశాంత్ అక్కడే గోదావరి ఒడ్డున అలా బైక్ మీద ఉండిపోతాడు.
Prev Next

Ready to play...