SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 19

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

18

Episode 18

Active
19

Episode 19

20

Episode 20

21

Episode 21

22

Episode 22

23

Episode 23

24

Episode 24

25

Episode 25

File // 18

Episode 18

మరోవైపు రుక్మిణీ తన గదిలో దిగులుగా ఉంది. అప్పుడే వాళ్ళ ఇంటికి వాళ్ళ అక్క "పద్దు" వచ్చింది. వాళ్ళ అక్కని ఎన్నో రోజులకి చూసిన రుక్మిణీకి పట్టరాని సంతోషం వచ్చింది. ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకున్న తర్వాత పద్దు :-
"ఏంటి రూక్కు... అప్పుడే పెళ్లి కల వచ్చేసింది నీకు...? త్వరగా చేసుకోను అని అనేదానివి, ఇప్పుడు ఏం అయ్యింది?" అని అడిగింది వాళ్ళ అక్క.

ఆ మాటలు విన్న రుక్మిణీకి ఏం అర్థం కాలేదు. తనకి పెళ్లి ఏంటి అని.

పద్దు :-
"ఏంటి నీకు ఈ విషయం తెలీదా? ఈ రోజు సాయంత్రం నిన్ను చూడడానికి పెళ్లి వాళ్లు వస్తున్నారు. నాన్న చెప్పలేదా నీకు?" అని అంది.

ఆ మాట విన్న రుక్మిణీకి అసలేం అర్థం కాలేదు. ఇంత హఠాత్తుగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయాల్సిన పని ఏం ఉంది అని అనుకుంది. మరోవైపు శ్యామ్ ఏం అయ్యాడో అనే ఆందోళన. ఎంత మామూలుగా ఉందాం అన్నా రుక్మిణీ మనసు నిలకడగా ఉండడం లేదు. అది రుక్మిణీ మొహంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చింత గమనించిన వాళ్ళ అక్క పద్దు :-

"ఏంటే మొహం అలా పెట్టావ్? నీకు ఇష్టం లేదా ఏంటి? లేక చెప్పకుండా చేస్తున్నారు అని కోపమా?" అని బుజ్జగిస్తూ అడిగింది.

అప్పుడు రుక్మిణీకి ఏం చెప్పాలో తెలియక వాళ్లు ఉంటున్న గదికి తలుపు వేసింది.

అప్పుడు వాళ్ళ అక్క పద్దు :-
"ఏంటి... ఎవరినైనా ప్రేమించావా?" అని అడిగింది.

రుక్మిణీకి పద్దు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి తనని అర్థం చేసుకోవడం ఆమెకి సులువే. ఆ మాట విన్న రుక్మిణీ తల దించి "అవును" అని తల ఊపింది.

అది విన్న పద్మిని భయపడింది.
"ఏంటి? నాన్న గురించి తెలిసే ఇలా చేశావా? గారాబం చేసినంత మాత్రాన నీ ప్రేమని అంగీకరిస్తాడు అని మాత్రం అనుకోకు! వాళ్ళ కులం, గోత్రం, అసలు ముందు వెనుక ఏంటి... ఇలాంటివన్నీ లెక్కలోకి వస్తాయి. నా మాట విని నాన్నగారు చూసిన సంబంధం చేసేసుకో, నీకే మంచిది" అని కోపంగా చెప్పింది.

అప్పుడు రుక్మిణీ కాసేపు ఆలోచించి :-
"నువ్వు చెప్పింది నిజమే అక్కా! కానీ శ్యామ్‌ని నేను దగ్గర నుండి చూసాను. అతని గుణగణాలు ఏంటో నాకు తెలుసు. కానీ ఎవరో, ఎలాంటి వాడో తెలియని వాడిని చేసుకోవడం మంచిదా? లేక నా మనసుకి నచ్చిన వాడిని చేసుకోవడం మంచిదా?" అని అంది రుక్మిణీ.

అప్పుడు వాళ్ళ అక్క :-
"సరే... ఇది కేవలం పెళ్లి చూపులే కాబట్టి ఏదో ఒకటి చెప్పి నచ్చలేదు అని చెప్పు. అంతే గానీ గొడవ చేయకు" అని నచ్చచెప్పింది పద్మిని.

ఆ మాటకి రుక్మిణీ కూడా సరే అంది.

అప్పుడు పద్దు :-
"అది సరే... ఇంతకీ ఆ శ్యామ్ ఎలా ఉంటాడు? ఎలాంటి గుణగణాలు కలవాడు?" అని ఆసక్తిగా అడిగింది పద్దు ఆటపట్టిస్తూ.

రుక్మిణీ సిగ్గుతో ఆ గది నుండి బయటకి పరుగులు తీసింది. పద్దు కూడా వెనకే పరుగులు తీసింది. వాళ్ళిద్దరినీ అలా చూసి ఎంతో సంతోషించింది సుమతీ.
"ఎప్పుడో చిన్నప్పుడు చూసా వీళ్లని ఇలా ఆనందంగా ఆడుకుంటుంటే..." అని అనుకుంది మనసులో.

రుక్మిణీ అలా దేవుడి గదిలోకి వెళ్లి కృష్ణుడి పటం దగ్గర కూర్చుని కృష్ణుడి స్తోత్రం పాడింది.

శ్రీకృష్ణుడి రూపం, గుణాలు, లీలలు అన్నీ మధురమైనవని వర్ణించే ఈ స్తోత్రం.

స్తోత్రం :-
"అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౧ ||"

అని పాడి మురిసిపోయింది రుక్మిణీ సిగ్గుతో. ఎందుకంటే శ్యామ్‌ని ఊహించి పాడింది కాబట్టి.

అది మొత్తం విన్న పద్దు ఇలా అంది :-
"ఆ శ్యామ్ కోసం ఈ శ్యామ్ ముందు కూర్చుని పాడుతున్నావా?" అని ఆటపట్టించింది పద్దు మన రుక్మిణీని.

అలా వాళ్లు ఆనందంగా ఉన్న ఆ క్షణం ఎంతోసేపు కొనసాగలేదు. పెళ్లి వారు వచ్చేశారు. రుక్మిణీ దేవుడి గదిలో ఆ పాట పాడటం కూడా దగ్గరుండి మరీ వీక్షించారు. ఆ పెళ్లికొడుకు తరపు వాళ్లకి రుక్మిణీ ఎంతో నచ్చేసింది. కానీ రుక్మిణీకి మాత్రం అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇలా అయ్యింది ఏంటి అని కంగారు పడింది.

కానీ హరిచంద్ర రుక్మిణీకి పెళ్లికొడుకు అయిన శ్రీకాంత్‌ని పరిచయం చేశాడు. రుక్మిణీ మాత్రం శ్రీకాంత్‌ని చూడలేదు. అందరూ ఎవరి నిర్ణయం వాళ్లు తీసేసుకున్నారు. రుక్మిణీకి ఒక్క మాట కూడా అడగలేదు. పద్దు ముందు అంతా మాట్లాడిన రుక్మిణీ ఇక్కడ వాళ్ళ నాన్నగారి ముందు అసలు ఏం మాట్లాడలేకపోయింది.

వాళ్లు వచ్చే పన్నెండు రోజుల్లో నిశ్చితార్థం కూడా ఖాయం చేసేసుకున్నారు. కానీ రుక్మిణీ మాత్రం తల దించుకునే ఉంది. అది అంతా చూసిన పద్దుకి మాత్రం మన రుక్మిణీ అలా ఏం మాట్లాడకుండా ఉండడం నచ్చలేదు. ధైర్యం చేసుకుని పద్దు ఏదోలా నిజం చెప్పేద్దాం అని రుక్మిణీకి సైగ చేసింది. కానీ రుక్మిణీ వద్దు అని భయంతో ఆపేసింది.

శ్రీకాంత్ వెళ్తూ వెళ్తూ వాళ్ళ అమ్మతో :-
"అమ్మ... నాకు రుక్మిణీ బాగా నచ్చింది. నేను నిజంగా చాలా లక్కీ" అని అన్నాడు.

ఆ మాట విన్న రుక్మిణీకి అసలు ఏం జరగబోతుందో అర్థం కాలేదు. రుక్మిణీ నిశ్శబ్దం ఒక పెద్ద తప్పిదంగా మారింది.

మరోవైపు శ్యామ్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. అసలు వస్తాడో లేదో కూడా తెలీదు...
Prev Next

Ready to play...