SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 20

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

Active
20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

FINAL EPISODE

File // 19

EPISODE 19

"మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు" అని ఆవేశంగా అనేసి ముకుంద్ అక్కడినుండి విసురుగా వెళ్లిపోతాడు.
ముకుంద్ వెళ్లిన వెంటనే, కిందపడి ఉన్న అతడి తండ్రి మత్తులోనే... "రేయ్... నాన్నా... నేను కావాలని చేయలేదు రా... చెయ్యి తగిలింది..." అని మూలుగుతాడు. కానీ ఆ మాటలు వినడానికి ముకుంద్ అక్కడ లేడు.

తీవ్రమైన కోపం, దానికి తోడు ఎక్కడలేని చిరాకుతో మేడ మీదకు వెళ్లిన ముకుంద్‌కి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. నెంబర్ చూస్తే అన్‌నోన్ నెంబర్ (Unknown number).
'ఎవరు చెప్మా ఈ నెంబర్ నుంచి...' అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు.

అవతలి వైపు నుంచి ఒక ముసలాయన గొంతు... దగ్గుతూ, "బాబూ... నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఎలాగూ నీకు చాలా తక్కువ టైమ్ ఉంది..." అంటాడు.
ముకుంద్ చిరాగ్గా, "సారీ అండీ, రాంగ్ నెంబర్," అని కాల్ కట్ చేయబోతుండగా...
"బాబూ... బాబూ ఒక్కసారి నా మాట విను. 'రాకిస్-ఫేజ్' (Rachis-Phage) అనేది చాలా రేర్ డిసీజ్ బాబూ. మహా అయితే ఇంకో కొద్ది నెలలు... అంతే బతుకుతారు మీరు," అని అంటాడు ఆ ముసలాయన.

ఆ మాటలు విన్న ముకుంద్‌కు చిర్రెత్తుకొస్తుంది. "ఏంటి సార్? గొంతు వింటే పెద్దవారిలా ఉన్నారు, మీరు ఎవరనుకుని కాల్ చేశారో ఏమో... ముందు నెంబర్ చూసుకుని చేయండి," అని కోపంగా ఫోన్ కట్ చేస్తాడు.

వెంటనే మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది.
'ఎవడ్రా బాబూ వీడు...' అని విసుక్కుంటూనే ఫోన్ ఆన్సర్ చేసి, "అసలు ఎవరండీ మీరు? ఎందుకిలా విసిగిస్తున్నారు?" అంటాడు.
అప్పుడు ఆ ముసలాయన నిదానంగా... "చూడు ముకుంద్... నీకు ఇంకా డాక్టర్లు ఈ విషయం చెప్పి ఉండరు. నేను పన్నెండేళ్లుగా ఈ డిసీజ్ మీదే వర్క్ చేస్తున్నాను. నువ్వు ఎలాగూ చనిపోతావు... అదే నీ బాడీని నా రీసెర్చ్ కోసం ఇచ్చావంటే, నీలాంటి వాళ్లు ఇంకెవరూ చనిపోకుండా కాపాడొచ్చు," అని అంటాడు.

అలాంటి భయంకరమైన మాటలు సడన్‌గా వినేసరికి ముకుంద్ గుండె జారిపోయినంత పనవుతుంది, వెంటనే తేరుకుని "ఎవడ్రా నువ్వు? మాఫియానా? లేక మనుషుల్ని స్మగ్లింగ్ చేస్తావా? నాకే తగులుకున్నావేంట్రా బాబూ," అని అరుస్తాడు.
"బాబూ... నా మనవడు ఇలానే చనిపోయాడు. అప్పుడు నేనేం చేయలేకపోయాను. ఇప్పుడు నీ విషయంలో కూడా ఏం చేయలేను... కానీ భవిష్యత్తులో..." అని ఆ రీసెర్చర్ చెప్పేలోపే ముకుంద్ కాల్ కట్ చేస్తాడు.

'అర్జెంట్‌గా ఈ నెంబర్ బ్లాక్ చేయాలి... అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒకసారి హాస్పిటల్‌కి వెళ్లాలి,' అని మనసులో అనుకుంటాడు. ఈలోపు ఆలోచనలన్నీ ఆ అన్‌నోన్ కాల్ చుట్టూ, తన జబ్బు చుట్టూ తిరుగుతుంటాయి.

సరిగ్గా అప్పుడే ప్రణీత్ నుంచి కాల్ వస్తుంది.
"రేయ్ మావా... రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది, వస్తావా?" అని అడుగుతాడు.
ముకుంద్ తన టెన్షన్‌ను అణుచుకుంటూ, "సరే రా... మార్నింగే కదా?" అని మాట్లాడుతుంటాడు.

అదే సమయానికి ఆద్య, ముకుంద్ ఇంటి మేడ పైకి వస్తుంది. ఫోన్ మాట్లాడుతున్న ముకుంద్‌ని వెనక నుంచి సరదాగా ఆటపట్టిద్దామని భయపెడుతుంది.
అప్పటికే ఎక్కడలేని చిరాకు, టెన్షన్, భయంలో ఉన్న ముకుంద్... ఉలిక్కిపడి, ఆద్య మీద గట్టిగా అరుస్తాడు.

ఆద్య కంగారుపడిపోయి, "ఐయామ్ సారీ ముకుంద్," అంటుంది.
"ఏ టైమ్‌లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా నీకు?" అని మళ్లీ గట్టిగా చిరాకుపడతాడు ముకుంద్.
ఫోన్లో ఉన్న ప్రణీత్ ఇదంతా విని, "రేయ్... ఏంట్రా, ఏం జరుగుతుంది అక్కడ?" అని అడుగుతాడు.
ముకుంద్ వాడి మీద కూడా విరుచుకుపడుతూ, "మ్యాచ్‌కి వస్తానని చెప్పాగా... ముందు ఫోన్ కట్ చెయ్!" అని అరిచేస్తాడు.

ఆద్య ఆ అరుపులకు భయపడిపోయి, కళ్లలో నీళ్లు నిండుకోగా... "మా నాన్నకి మన లవ్ మేటర్ తెలిసిపోయింది ముకుంద్... ఆయన ఓకే అన్నారు," అని ఎంతో అమాయకంగా, చిన్నబుచ్చుకున్న ముఖంతో చెబుతుంది.
ప్రాణంగా ప్రేమించే వాళ్లు పల్లెత్తు మాటంటేనే తట్టుకోలేం, అలాంటిది అంతలా అరిచేసరికి ఆద్య కళ్లలోంచి కన్నీళ్లు రాలుతాయి.

ఆ అమాయకమైన ఆద్య ముఖం చూడగానే ముకుంద్‌కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. 'నాలో ఉన్న కోపాన్ని, ఫ్రస్ట్రేషన్‌ను ఇష్టమైన వాళ్ల మీద చూపిస్తూ... నేను కూడా మా నాన్నలాగే తయారవుతున్నానా?' అని రియలైజ్ అవుతాడు.
తన తప్పు తెలుసుకున్న ముకుంద్, ఆద్య కన్నీళ్లు చూసి తట్టుకోలేక వెంటనే ఆమెను గట్టిగా హత్తుకుంటాడు.

"ఐయామ్ సో సారీ ఆద్యా... నన్ను క్షమించు. నాకేదో టెన్షన్ ఉండి కావాలని అలా అరవలేదు... సారీ," అంటూ ఆమెను సముదాయిస్తూ తన గుండెలకు హత్తుకుంటాడు.
Prev Next

Ready to play...