కార్ ఎక్కారు, హరిచంద్ర ఆశీర్వాదం తీసుకుని. సుమతీ ఎదురు వచ్చింది. రుక్మిణీ పయనం మొదలైంది శ్యామ్ దరి చేరేందుకు. దారిమధ్యలో ప్రేమ్‌ని కార్ ఎక్కించుకున్నారు. అది గమనించిన వాళ్ల కార్ డ్రైవర్‌కి అర్థం అయ్యింది.
డ్రైవర్, "ఏంటి అమ్మ, శ్యామ్ బాబు దగ్గరకేనా?" అని అడిగాడు.
అప్పుడు రుక్మిణీ కాస్త భయంతో,
రుక్మిణీ :- "అవును బాబాయ్, మీకెలా తెలుసు!" అని అంది.
అప్పుడు రఘురాం :- "మీకు శ్యామ్ ఎలా తెలుసు అండి?" అని అడిగాడు.
అప్పుడు డ్రైవర్, ఆ రోజు హరిచంద్ర గారితో ఉన్నప్పుడు శ్యామ్ గాయాలతో కనిపడ్డాడు అని, శ్యామ్‌ని కులం పేరుతో హరిచంద్ర గారు అవమానించి, రుక్మిణీ అమ్మకి పెళ్లి సంబంధం ఖాయం అయ్యింది అని పెళ్లికొడుకు ఫోటో కూడా చూపించాడు అని చెప్పాడు.
ఆ మాటలు విన్న రుక్మిణీ మనసు ముక్కలైంది. శ్యామ్ రుక్మిణీకి దూరం అయ్యింది వాళ్ల నాన్నగారి వల్లనే అని అర్థం అయ్యింది. అందులోనూ శ్యామ్‌కి రుక్మిణీకి పెళ్లి అని తెలిసిన క్షణం ఎంత మనోవేదనతో పరిస్థితిని అంగీకరించాడో రుక్మిణీకి అర్థం అయ్యింది.
రుక్మిణీకి ఇంకో మాట కూడా రాలేదు. కార్ నుండి బయటకి చూస్తూ ఉండిపోయింది. బయట వెళ్తున్న బస్, గుడి, వాళ్లు నడిచిన చోటు, వాళ్ల కళాశాల అని చూస్తుంటే రుక్మిణీకి శ్యామ్‌తో గడిపిన ఆ మధురమైన క్షణాలు గుర్తుకొచ్చాయి. కానీ ఆఖరికి ఇలా అవుతుంది అని రుక్మిణీ ఏనాడూ కలగనలేదు.
శ్యామ్ కోసం జనం ఉదయం నుండి నిరసన చేస్తూనే ఉన్నారు. పోలీసులకి కూడా అర్థం కావట్లేదు. అసలు ఈ శ్యామ్ ఒక సర్పంచ్‌ని కొడితే ఊరి జనం ఎందుకు అంత చేస్తున్నారో అని వాళ్లలో వాళ్లు అనుకుంటున్నారు.
అయితే, శ్యామ్ జనం లో ఒక విప్లవం సృష్టించాడు అని, ఒకే ఊరి జనాన్ని రెండుగా విడగొట్టాడు. ఏం ఉంది, వచ్చే ఎలక్షన్స్‌లో ఏకగ్రీవంగా పోటీ చేసి గెలవడం కోసం ఏమో, ఎవడి స్వార్థం వాడిది అని పోలీసుల అతితెలివితేటలు వాళ్లవి.
అది వాళ్ల తప్పు కాదు. అలాంటి వాళ్లని వాళ్లు ఎంతో మందిని చూసి ఉంటారు కాబట్టి అందరూ వాళ్లకి అలానే కనిపిస్తారు. అయినా పోలీసులు అలానే ఉండాలి, అప్పుడే అందరికీ మంచిది.
ఇంకా బయట ఆపాటి ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుండి లేఖ వచ్చింది. ఆ లేఖ చదివిన టైపిస్టుకి గుండెల్లో గుబులు పుట్టింది. ఆ లేఖ పట్టుకున్న అతని చేతులు వణుకుతున్నాయి. మిగతా పోలీసులు అందరూ ఏం అయ్యింది అని అతని చేతులు ఎందుకు వణుకుతున్నాయి అని అర్థం కాలేదు.
ఆ లేఖ తీసుకుని చదివి చూస్తే, అది ఏకంగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుండి వచ్చింది అని అర్థం అయ్యింది. శ్యామ్ చేసిన పోరాటం ఒక వర్గానికోసమో, ఒక జాతి కోసమో కాదు; మన దేశ భవిష్యత్తులో మార్పు రావడం కోసం. అలాంటి వాళ్లని సత్కరించాలి గానీ అవమానపరచకూడదు అని ఉంది.
మరోవైపు నరసింహం గారు ఒక లాయర్‌ని తీసుకుని వచ్చి శ్యామ్‌కి బైల్ పిటిషన్ పెట్టించాడు.
అప్పుడు ఆ S.I :- "అరెస్టు చేసిన రికార్డే తొలగించమన్న తర్వాత ఈ బైల్ ఎవరికోసం Sir!" అని అన్నాడు ఆ ఎస్.ఐ.
సెల్ తెరిచారు. శ్యామ్ బయటకి వచ్చాడు. శ్యామ్‌కి అక్కడ ఉన్న పోలీసులు అందరూ సెల్యూట్ చేశారు. శ్యామ్‌కి అంతా కొత్తగా అనిపించింది. కానీ శ్యామ్‌కి తెలుసు, అతను చేసింది ఏం చిన్న విషయం కాదు అని.
శ్యామ్ బయటకి వెళ్లి చూడగా, అందరూ శ్యామ్‌కి జైజైలు కొట్టారు. వాళ్లందర్నీ చూసిన శ్యామ్‌కి కన్నీళ్లు వచ్చేశాయి. ఒక్కప్పుడు ఎవరు లేని శ్యామ్ కోసం ఇప్పుడు ఒక్క ఊరే తోడుగా ఉంది. వాళ్లు శ్యామ్ కోసం ఏమైనా చేస్తాం అని అంటున్నారు.
ఒక్కసారిగా మన శ్యామ్ అందరివాడు అయ్యాడు. అంతా మందికి చేతులు ఎత్తి దణ్ణం పెట్టాడు. భావోద్వేగానికి గురయ్యాడు శ్యామ్.
వెనుకనుండి నరసింహం గారు వచ్చి,
"నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది కుర్రోడా! నిన్ను కన్న వాళ్లు ఉండి ఉంటే నా కొడుకు అని అందరికీ గర్వంగా చెప్పుకుంటారు!" అని శ్యామ్ భుజం తట్టాడు మన నరసింహం.
శ్యామ్ వెంటనే నరసింహంని హత్తుకుని,
"నా తండ్రితో సమానం sir మీరు" అని కన్నీరు పెట్టుకున్నాడు.
అప్పుడు నరసింహం :-
"తండ్రి లాంటి వాడిని ఏంటి నాన్న! నాన్న అని పిలువు!" అని అన్నాడు.
అప్పుడే అక్కడికి రుక్మిణీ వాళ్ల కార్ వచ్చింది. ప్రేమ్, కార్ ఆగకముందే కార్ దిగేశాడు. కార్ ఆపేశారు. దిగి చూస్తే అక్కడ అబ్బో ఎంతో మంది జనం... శ్యామ్ కోసమే...
అప్పుడే అక్కడికి రుక్మిణీ వచ్చింది. దూరం నుండి చూస్తుంటే శ్యామ్ జీవితం మొత్తం ఇప్పుడు ఒంటరిపోలేదు అని అర్థం అయ్యింది.
శ్యామ్‌ను చూడగానే వెళ్లి హత్తుకోవాలి అని అనిపించింది. కానీ ఆ జనం రుక్మిణీని ఏమాత్రం ముందుకి వెళ్లనివ్వలేదు.
జనం తో వెళ్తే శ్యామ్‌కి ఆ సర్పంచ్ గారి మనుషుల నుండి ఏదైనా అపాయం వచ్చే అవకాశం ఉంది అని పోలీసులు శ్యామ్‌ని వాళ్ల కార్‌లో నరసింహం మరియు విశ్వనాథ్‌లను ఒకే కార్‌లో కూర్చోబెట్టి అంతా మంది జనం మధ్యలో నుండి తీసుకువెళ్తారు.
రుక్మిణీ పక్కనుండే శ్యామ్ వాళ్ల కార్ వెళ్లింది. కానీ శ్యామ్ రుక్మిణీని చూడలేదు.
వెనుక నుండి రఘురాం ఆ కార్‌ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ పరిస్థితి గమనించిన రుక్మిణీ,
"బావ... జనం మనల్ని వేరేలా చూస్తున్నారు. ఇప్పుడు వెనుకపడడం మనకే మంచిది కాదు. వాళ్లు ఎక్కడ ఉంటున్నారో కనుక్కోండి" అని చెప్పింది.
రుక్మిణీ మాటలు విన్న రఘురాంకి, రుక్మిణీ చెప్పిందే సరైనదే అని అర్థం అయ్యింది. ఎందుకంటే అక్కడ ఉన్న అందరిలో వీళ్లు విభిన్నంగా ఉన్నారు. ఆ గొడవల్లో వీళ్లని ఏం చేసినా ఎవరు ఏం అనలేరు