SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 25

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

Active
25

EPISODE 25

26

FINAL EPISODE

File // 24

EPISODE 24

(గత ఎపిసోడ్ కొనసాగింపు... ఫ్లాష్‌బ్యాక్‌లో...)

"...దీనికి పర్మనెంట్ క్యూర్ (Permanent cure) కనిపెట్టడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను తల్లీ," అని భరోసా ఇచ్చాడు ఆ సైంటిస్ట్.

కన్నీళ్లతోనే ఆద్య, "నేను ముకుంద్‌ని చూడొచ్చా అంకుల్... ప్లీజ్..." అని దీనంగా అడిగింది.
ఆ సైంటిస్ట్ ముకుంద్ ఉన్న రూమ్ వైపు చూపించాడు.

ఆద్య ఆ గదిలోకి వెళ్లడానికి ఎంతో భయంతో డోర్ హ్యాండిల్ పట్టుకుంది. కానీ లోపల ముకుంద్ పరిస్థితి ఎలా ఉందో చూడలేనన్న భయంతో ధైర్యం చాలక వెనక్కి తగ్గింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని, మళ్లీ ఆ డోర్ ఓపెన్ చేయబోయింది. కానీ తన దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడే ఆ డోర్ దగ్గరే కుప్పకూలిపోయి ఏడవడం మొదలుపెట్టింది.

వెంటనే ఆదికేశవ వచ్చి, "అమ్మా... అలా కృంగిపోకు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది... నువ్వు ఇంటికి వెళ్లు. ప్రణీత్... ఆద్యను వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టి, ముకుంద్ వాళ్ల అమ్మగారిని తీసుకుని రా," అని చెప్పాడు.

అప్పుడు ఆద్య పైకి లేచి కళ్లు తుడుచుకుంటూ... "వద్దు! వాళ్ల నాన్న ఈరోజే తాగడం మానేసి, ఇకనుంచి మంచిగా ఉందాం అని, కుటుంబాన్ని చూసుకుంటానని మాటిచ్చారు ప్రణీత్. ఉదయం నేను, నిత్య వెతకడానికి వెళ్లినప్పుడు ఆయన మాకు గుడి దగ్గర కనిపించారు. ఇప్పుడు వాళ్లకి ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. కొన్ని నెలలుగా ప్రేమించిన నాకే ఇంత బాధగా ఉందంటే... ఇన్ని సంవత్సరాలుగా ముకుంద్ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ల కుటుంబం ఏమైపోతుంది? అసలే 'నేనే ముకుంద్‌ను కొట్టాను, అందుకే వెళ్లిపోయాడు' అన్న గిల్ట్‌తో ఆంటీగారు ఇప్పటికే కృంగిపోతున్నారు," అంది బాధగా.

అప్పుడు ప్రణీత్ నిట్టూరుస్తూ, "నువ్వు చెప్పింది కూడా నిజమే ఆద్యా. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్లు, వాడికి ఏమీ కాదులే. అలాగే నువ్వన్నట్టు... వాళ్ల ఫ్యామిలీకి ఇప్పుడే ఈ నిజం తెలియకూడదు. అయినా, నేను నిన్ను ఇక్కడికి పిలవకుండా ఉండాల్సింది. ఐయామ్ సారీ ఆద్యా," అని బాధపడ్డాడు.
"లేదు ప్రణీత్, నువ్వు నన్ను పిలవడమే మంచిదైంది. నా ప్లేస్‌లో ముకుంద్ వాళ్ల అమ్మగారైతే ఈ పరిస్థితిని అస్సలు తట్టుకోలేకపోయేవారు. నిత్య పరిస్థితి కూడా అలాగే ఉండేది... వాళ్ల నాన్న అప్పుడప్పుడే మారుతున్నారు..." అంటూ కన్నీళ్లతో అక్కడినుంచి వెనుదిరిగింది ఆద్య.

నెక్స్ట్ డే (మరుసటి రోజు)...

ప్రణీత్ ముకుంద్ బెడ్ పక్కన నిలబడి, వాడి యూరిన్ బ్యాగ్ ఎంటీ చేస్తున్నాడు. అప్పుడే ముకుంద్ నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు.
అది చూసిన ప్రణీత్ పైకి లేచి... "ఎలా తట్టుకుంటున్నావు రా ఈ నరకాన్ని?" అన్నాడు గుండె బరువెక్కగా.
కానీ ముకుంద్ నోటెంబట వచ్చిన మొదటి మాట... "ఆద్య ఎక్కడ?"

"ఒక్క నిమిషం ఉండు రా," అని ప్రణీత్ అంటుండగానే, వెనక నుంచి ఆద్య వచ్చింది.
ముకుంద్‌ను అలా ఆ దయనీయమైన స్థితిలో చూసి లోపల ప్రాణం పోతున్నా సరే... పైకి మాత్రం కొద్దిగా మామూలుగానే ఉన్నట్టు నటించింది.

"ఏంటి... అప్పుడే నన్ను వదిలేసి వెళ్లిపోదామనుకుంటున్నావా? నాతో కలిసి 'హ్యాలీస్ కామెట్' (Halley's comet) చూద్దామన్నావుగా... మన రిటైర్‌మెంట్ ప్లాన్స్... అవన్నీ ఏమైపోతాయి?" అని నవ్వుతూనే ముకుంద్ పడుకున్న బెడ్ మీద కూర్చుంది.
ముకుంద్ ఆద్యను ఎంతో ప్రేమగా చూస్తూ, "మనం రాంగ్ టైమ్‌లైన్‌లో (Wrong timeline) పుట్టాం ఆద్యా... మనం 1970స్‌లో పుట్టాల్సింది," అని నీరసంగా చిరునవ్వు నవ్వాడు.

దానికి ఆద్య, "నీకు ఏమీ కాదు ముకుంద్... మనం ఆ హ్యాలీస్ కామెట్‌ను కలిసే చూస్తాం. అలాగే నీకు ఇష్టమైన నార్తర్న్ హెమిస్పియర్‌ (Northern hemisphere)కి వెళ్లి సెటిల్ అవుదాం. అప్పుడు డైలీ రాత్రిపూట ఇద్దరం కలిసి ఆ చుక్కలు చూడొచ్చు... ఇంకా ఎన్నెన్నో చేద్దాం ముకుంద్..." అని తన బాధనంతా దాచుకుని ముకుంద్ వంక ఎంతో ప్రేమగా చూస్తూ అంది.

దానికి ముకుంద్ భారంగా ఊపిరి పీల్చుకుని, "డోంట్ గివ్ మీ హోప్ ఆద్యా (Don't give me hope)... నేను లేకపోయినా సరే నువ్వు హ్యాపీగా ఉండగలగాలి. నీ కోసం నువ్వు బతకాలి," అన్నాడు.
అది విన్న ఆద్య తట్టుకోలేక ముకుంద్ నుదుటి మీద ప్రేమగా ముద్దుపెట్టింది. ముకుంద్ పడుకున్న ఆ ఇరుకు బెడ్ మీదే... వాడి పక్కన పడుకుని, వాడిని గట్టిగా కౌగిలించుకుని కుమిలికుమిలి ఏడ్చేసింది.

సడన్‌గా ఆ మంచం మొత్తం మంటలు అంటుకున్నాయి.
ఆ మంటల మధ్యలో ముకుంద్ భరించలేని నొప్పితో గట్టిగా ఆర్తనాదాలు చేస్తున్నాడు.
ఆ కేకలకు, ఆ మంటల వేడికి ఆద్య చాలా భయపడిపోయింది. ముకుంద్ తనతో పాటే మంటల్లో కాలిపోవడాన్ని చూసి, కంగారుగా అతన్ని పక్కకు లాగడానికి ప్రయత్నించింది. కానీ ఆద్య వల్ల కావట్లేదు.

"ఆద్యా... నాకు నొప్పి వస్తే ఇలానే ఉండేది. ఇంకా ఈ శరీరంతో నా రుణం తీరిపోయింది ఆద్యా," అని అగ్నిలో మండుతున్న ముకుంద్ నోటినుంచి మాటలు వినిపించాయి.
ఆద్య ఒక్కసారి ఆగి తనని తాను చూసుకుంది... ఆ మంచం, ముకుంద్ శరీరం మాత్రమే మంటల్లో దహించుకుపోతున్నాయి, కానీ ఆద్యకు మాత్రం ఆ మంటల వల్ల ఏమీ కాలేదు. ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.

"ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు కాస్మోస్ (I am going back to cosmos)... లవ్‌డ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ (Loved you till my last breath)," అని ముకుంద్ అనగానే ఒక్కసారిగా ఆ మంటలన్నీ మాయమైపోయాయి.
(బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోన్ రింగవుతున్న సౌండ్)

ఆద్య పడుకున్న మంచం మీద ముకుంద్ స్థానంలో కేవలం వాడి బూడిద (Ashes) మాత్రమే మిగిలి ఉంది.

వెంటనే ఆద్య ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి కూర్చుంది. చూస్తే తను హాస్పిటల్‌లో లేదు... తన సొంత రూమ్‌లో, తన బెడ్ మీద ఉంది. పక్కనే తన ఫోన్ రింగవుతోంది. ఇదంతా కలేనని అప్పుడు ఆమెకు అర్థమైంది.
తన కళ్ల కింద డార్క్ సర్కిల్స్ (Dark circles) స్పష్టంగా కనిపిస్తున్నాయి. భయంతో పట్టిన చెమటలు తుడుచుకుని...
Prev Next

Ready to play...