SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 4

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

Active
04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

FINAL EPISODE

File // 03

EPISODE 3

"...అక్కడ డెడ్ ఎండ్ ఉంది నాన్నా. ఏవో కొన్ని పందులు బురదలో పడుకుని ఉన్నాయి అంతే."

"వీడికి ఫోన్ ఇచ్చి తప్పు చేశావ్ నాన్న! అసలు వీడికి ఏబీసీడీలు కూడా రావు... అలాంటిది వీడికి మ్యాప్స్ ఎందుకు?" అంటూ తమ్ముడి మీద విరుచుకుపడింది ఆధ్య.

"డోంట్ యాక్ట్ స్మార్ట్... డాంకీ!" వెనక్కి తిప్పికొట్టాడు తమ్ముడు ధనుష్.

"నువ్వే అడవి పందివి! గాడిదవి!" కోపంగా అంది ఆధ్య.

"లేదు, నువ్వే సేమ్ టు సేమ్ పందివి!"

వాళ్ళ గొడవ భరించలేక శారద గట్టిగా అరిచింది. "ఏంటి ఆధ్య? ఇంకా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నావ్! తమ్ముడు నీకన్నా చిన్నవాడు, వాడికి ఏం తెలీదు. వాడిని అలా అనొచ్చా?"

"ఏంటమ్మా ఏంటి? ముందు నీ కొడుక్కి చెప్పు, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో నేర్పించు. నాకు కాదు! నాకంటే వయసులో చిన్నవాడు, వాడే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి," అని ఆధ్య కోపంగా బుసలు కొట్టింది.

అలా వాళ్ళు కారులో ఒకరినొకరు తిట్టుకుంటుండగా... కారు సైడ్ మిర్రర్ లోంచి సైకిల్ మీద చికెన్ కవర్ తగిలించుకుని వస్తున్న ఓ అబ్బాయి కనిపించాడు సత్యమూర్తికి. కారు ఆపి అతన్ని పిలిచాడు.

చూడటానికి అతను ఓ కాలేజీ స్టూడెంట్ లా ఉన్నాడు. ఆదివారం రోజు కూడా కాలేజీ యూనిఫామ్ షర్ట్ వేసుకుని, కింద మాత్రం క్యాజువల్ షార్ట్ వేసుకుని ఉన్నాడు. అతన్ని చూసిన ఆధ్య, "ఏంటమ్మా వాడు... షర్ట్ మీదకి షార్ట్ వేసుకున్నాడు," అని గుసగుసలాడుతూ నవ్వింది.

"రండి అంకుల్, మీ అడ్రస్ మా ఇంటి ముందే," అని చెప్పి తన సైకిల్ వెనకాలే కారుని రమ్మన్నాడు ఆ కుర్రాడు.

"ఓ సైకిల్ కారుకి దారి చూపిస్తోంది!" వెటకారంగా అన్నాడు ధనుష్.

అలా వాళ్ళ అడ్రస్ దగ్గరికి తీసుకెళ్లి, "ఇదిగోండి అంకుల్... మీరు అడిగిన ఇల్లు," అని చెప్పాడు.

"థ్యాంక్స్ బాబు," అన్నాడు సత్యమూర్తి.

ఆధ్య మాత్రం ఆ అబ్బాయిని గమనిస్తూనే ఉంది. అతను వాళ్ళ ఇంటికి సరిగ్గా ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్లడం చూసింది. 'ఓహో... మా ఎదురింటి అబ్బాయా!' అని మనసులో అనుకుంది.

సరిగ్గా అదే సమయంలో... ఎదురింట్లో ఉన్న ఆ అబ్బాయి 'ముకుంద్' చాలా హడావిడిగా కాలేజీకి రెడీ అవుతున్నాడు.

లోపల గదిలో నేల మీద పడి దొర్లుతూ, "రేయ్ ముకుంద్... షాప్‌కెళ్ళి ఒక హాఫ్ తీసుకురారా," అని అరిచాడు వాళ్ళ నాన్న. అతను అప్పటికే పీకల దాకా తాగి ఉన్నాడు.

అది చూసిన ముకుంద్ వాళ్ళ అమ్మ, భర్తని లేపుతూ... "ఏంటండీ? ఇంకా ఎన్ని రోజులు ఇలా తాగుతూ ఉంటారు? ఎదిగిన కూతురు ఉంది, కొడుక్కి ఓ భవిష్యత్తు చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఇలా ఉంటే ఇల్లు ఎలా ముందుకెళ్తుంది?" అంటూ కన్నీళ్లతో అడిగింది.

అది విన్న ముకుంద్ కి విపరీతమైన కోపం వచ్చింది. తింటున్న టిఫిన్ ప్లేట్ ని నేలకేసి కొట్టి, తన పాతబడిన మురికి కాలేజీ బ్యాగ్ భుజాన వేసుకుని విసురుగా బయటకి వెళ్లిపోయాడు. ముకుంద్ చెల్లి నిత్య ఇదంతా భయంగా చూస్తోంది.

"ఏవండీ... వాడికి కాలేజీ ఫీజు కట్టాలి. నా జీతం ఇల్లు గడవడానికే సరిపోతోంది. మీరు ఈ డిప్రెషన్ లో ఉంటూ మన పిల్లల భవిష్యత్తు పాడుచేయడం ఎంతవరకు కరెక్ట్?" అని ఆ తల్లి అడుగుతుండగానే... లాగి పెట్టి ఆమె చెంప మీద కొట్టాడు ఆ తాగుబోతు భర్త.

అది చూసి తట్టుకోలేకపోయిన నిత్య, వెంటనే వాళ్ల అమ్మ చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కెళ్లింది. "ఏంటమ్మా వాడిని బతిమాలుతున్నావ్? కొంచెం కూడా బాధ్యత, మనమంటే ప్రేమ లేవు ఆయనకి. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నలతో చాలా హ్యాపీగా ఉంటారు. కానీ నాకు మాత్రం ఇలా రాసిపెట్టింది..." కోపంతో పాటు దుఃఖం తన్నుకొస్తుండగా అంది నిత్య.

"తప్పమ్మా... అలా అనకూడదు. ఎంతైనా మీ నాన్న కదా," అంటూ కూతురి కన్నీళ్లు తుడిచింది ఆ తల్లి.

ఇంట్లో జరిగిన గొడవతో ముకుంద్ చాలా సీరియస్ గా బస్సు లాస్ట్ సీట్లో కూర్చున్నాడు. పక్కనే వాడి ప్రాణస్నేహితుడు ప్రణీత్ ఉన్నాడు.

"ఏంట్రా అలా డల్ గా ఉన్నావ్? ఏమైంది?" అడిగాడు ప్రణీత్.

"ఎప్పుడూ ఉండేదే కదరా మా ఇంట్లో," విరక్తిగా అన్నాడు ముకుంద్.

అలా మాట్లాడుకుంటుండగా... సడెన్ గా బస్సులోకి ఓ అమ్మాయి ఎక్కింది. తను మరెవరో కాదు, ఆధ్య! లావెండర్ కలర్ చుడీదార్ లో చాలా అందంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. కారులో వెనక సీట్లో కూర్చున్న ఆధ్యను ముకుంద్ సరిగ్గా చూడకపోవడం వల్ల, ఆ అమ్మాయి తన ఎదురింటి అమ్మాయే అన్న విషయం అతనికి తెలియదు.

కానీ ఇప్పుడు... తనని చూడగానే ముకుంద్ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. బస్సులోని డబ్బా శబ్దాలన్నీ సైలెంట్ అయిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి, ఆధ్య మాత్రమే ముకుంద్ కళ్ళకు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. ఆ మాయలో పడిపోయిన ముకుంద్, తాను కూర్చున్న సీట్లోంచి నెమ్మదిగా పైకి లేచి మరీ కన్నార్పకుండా ఆమెవైపే చూస్తూ ఉండిపోయాడు. పాపం వాడికి తెలియదు కదా... తను ఎవరో!
Prev Next

Ready to play...