SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 4

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

Active
04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

File // 03

EPISODE 3

నాని (జనార్దన్) తన పిన్ని వాళ్ల ఇంటికి వెళ్లాడు.

అతన్ని చూడగానే వాళ్ల పిన్ని ఆప్యాయంగా, “ఏంట్రా, ఇలా వచ్చావ్? అమ్మమ్మ దగ్గరకు వెళ్లలేదా?” అని అడిగింది.

నాని తల దించుకుని, కాస్త నెమ్మదిగా... “అదేం లేదు పిన్ని… లైఫ్‌లో ఏదో మిస్ అయినట్టు ఉంది. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. నాన్న ప్రేమ గురించి ఎలాగూ చెప్పక్కర్లేదు... కనీసం ఆయనతో ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు. అసలు నేనెందుకు బ్రతుకుతున్నానో, ఎవరి కోసం బ్రతుకుతున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు,” అని నిరాశగా అన్నాడు.

వాళ్ల పిన్ని చిన్నగా నవ్వుతూ, “పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రా! నేనున్నాను, నీ బాబాయి ఉన్నాడు కదా... నీకేం తక్కువ చేశాం? ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే ఇక్కడికి వచ్చెయ్. అయినా నీ ఫేస్‌కి ఈ ఎమోషన్స్ సెట్ అవ్వవురా నాయనా!” అని ఆటపట్టించింది.

అప్పుడు నాని, “నేను మీ అందరికీ నాని గానే తెలుసు… కానీ—” అని ఏదో చెప్పబోతుంటే వాళ్ల పిన్ని మధ్యలోనే అడ్డుకుంది.

“నువ్వు నానివి కాదు, జనార్దన్ అని కూడా తెలుసులే గానీ… ముందు ఆ పరోటా తిను, చల్లారిపోతుంది,” అంటూ నాని ప్లేట్‌లో పరోటా పెట్టింది.

సరిగ్గా అప్పుడే లోపలి నుంచి నాని వాళ్ల చెల్లి (పిన్ని వాళ్ల అమ్మాయి) రెడీ అయ్యి బయటకు వచ్చింది.

“అన్నయ్యా, రేపు నన్ను గుడికి తీసుకెళ్తావా? నువ్వు పెద్దగా కష్టపడక్కర్లేదు... జస్ట్ ఒక రెండు ఫోటోలు తీయి చాలు, ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకుంటాను,” అని అడిగింది.

నాని తన పాత గొడవను పక్కనపెట్టి, ఎప్పటిలాగే చిరాకు పడుతున్నట్లు నటిస్తూ... “నీకెందుకే ఫోటోలు? అసలే పంది పిల్లలా ఉన్నావ్!” అన్నాడు.

అది విన్న వెంటనే వాళ్ల చెల్లికి కోపం కట్టలు తెంచుకుంది. “అమ్మా చూడే అమ్మా! అన్నయ్య నిన్ను పంది, నన్ను పిల్ల అంటున్నాడు!” అని అరిచింది.

నాని నవ్వుతూ, “పిన్నీ... పంది అంటే నువ్వు కాదు, నేను ఈ పిల్లనే అన్నాను,” అన్నాడు కవ్విస్తూ.

అంతే… కోపంతో వాళ్ల చెల్లి నాని వెంబడి పరుగెత్తింది. నాని చేతిలో టిఫిన్ ప్లేట్ పట్టుకునే ఇల్లంతా పరుగెడుతున్నాడు. ఆమెకు దొరకకుండా ఏడిపిస్తున్నాడు. వాళ్ల అల్లరి చూసి వాళ్ల పిన్ని ముసిముసిగా నవ్వుకుంటోంది. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ల బాబాయి వాళ్లను చూసి, “ఎన్ని రోజులైందో వీళ్లని ఇలా సంతోషంగా చూసి,” అని మురిసిపోయాడు.

అదే సమయంలో నాని ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద 'శ్రీనివాస్' అని పేరు కనిపిస్తోంది.

ఒకసారి ఫోన్ చూసి, లిఫ్ట్ చేయాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు నాని. ‘సరేలే మాట్లాడుదాం’ అనుకుని కాల్ ఆన్సర్ చేశాడు.

అవతలి వైపు శ్రీనివాస్ గొంతు ఏదో తేడాగా, వణుకుతున్నట్లుగా వినిపించింది.
“ఏమైందిరా?” అని అడిగాడు నాని.

శ్రీనివాస్ చెప్పిన మాటకి నాని గుండె పగిలినంత పనైంది.
“రేయ్ నానీ… మన ప్రసాద్ గాడు… మన ప్రసాద్ గాడు చనిపోయాడు రా! నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాడు ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు రా…” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఆ మాటలు విన్న నాని చేతిలోని ఫోన్ కింద పడనంత పని అయింది. గొంతులోంచి మాట రాలేదు. అతనికి లాస్ట్ టైం ప్రసాద్ ఫోన్‌లో అన్న మాటలు ఒక్కసారిగా చెవుల్లో ప్రతిధ్వనించాయి.
“మొన్న న్యూ ఇయర్‌కి శ్రీనివాస్ గాడిని, వెంకట్ గాడిని కలిశావు అంట కదా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయావా ఇక్కడి దాకా వచ్చి!”
ఆ మాటలు గుర్తుకు రాగానే నాని శూన్యంలోకి చూస్తూ అచేతనుడైపోయాడు.

ఫోన్‌లో శ్రీనివాస్ మళ్లీ పిలిచాడు, “రేయ్ నానీ! ఉన్నావా? లైన్‌లో ఉన్నావా? నువ్వు ఎక్కడో వైజాగ్‌లో ఉన్నావని తెలుసు. విషయం నీకు తెలియాలి కాబట్టి చెప్పాను. నువ్వు రాలేవు అని నాకు తెలుసులేరా.”

అప్పుడు నాని తేరుకుని, “నేను రావాలి రా… నేను కచ్చితంగా అక్కడికి వస్తాను,” అన్నాడు దృఢంగా.

శ్రీనివాస్ కంగారుగా, “రేయ్ నానీ, బాడీని రేపు ఉదయమే దహనం చేస్తారు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి అంత ఫాస్ట్ గా ఎలా వస్తావురా? అది అవ్వని పని,” అన్నాడు.

నాని గొంతులో ఎమోషన్ స్పష్టంగా తెలుస్తోంది. “వాడిని కలుస్తానని మాట ఇచ్చాను రా. ఇప్పుడు అక్కడికి రాకపోతే లైఫ్ లాంగ్ పశ్చాత్తాప పడతాను. నేను వస్తున్నా,” అన్నాడు.

“సరే, జాగ్రత్తగా రా,” అని శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు.

నాని ముఖం మారిపోవడం చూసి వాళ్ల పిన్ని, చెల్లి కంగారుగా “ఏమైంది నాని?” అని అడిగారు.

“ప్రసాద్ చనిపోయాడు అంట పిన్ని. మొన్ననే నేను వాడితో మాట్లాడాను… ఈరోజు ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. నేను రేపు అక్కడికి వెళ్తున్నా,” అని చెప్పి వెంటనే తేజకు కాల్ చేశాడు.

“రేయ్ తేజా, రేపు షూట్‌కి నేను రావడం లేదు. వాళ్లకి కాల్ చేసి చెప్పెయ్,” అన్నాడు.

తేజ ఆశ్చర్యంగా, “రేయ్! నీకేమైనా పిచ్చి పట్టిందారా? అది 20 వేల రూపాయల షూట్ రా! డబ్బులు బాగా ఇస్తారు. పైగా లాస్ట్ మినిట్‌లో ఇలా ఎలా కాన్సిల్ చేస్తాం?” అని అరిచాడు.

నాని నెమ్మదిగా, “లేదురా… లైఫ్‌లో రిగ్రెట్స్ ఉండకూడదంటే నేను వెళ్లాల్సిందే,” అని పూర్తి విషయం చెప్పకుండానే కాల్ కట్ చేశాడు.

పాపం తేజకు ఏమీ అర్థం కాలేదు.
“వీడేంటో అసలు అర్థం కాదు! ఇప్పుడు ఈ విషయం క్లైంట్‌కి ఎలా చెప్పాలో…” అని తల పట్టుకుని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత, “సరే ఏముంది… వేరే వాడిని అసిస్టెంట్‌గా తీసుకుని నేనే వెళ్తానులే,” అని తనకు తానే సర్దిచెప్పుకున్నాడు.

సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక కుర్రాడు వచ్చాడు.
తేజ అతన్ని చూసి, “ఎవరు తమ్ముడూ నువ్వు?” అని అడిగాడు.

“అన్నా, నాని అన్నయ్య పంపించాడు. రేపు మీకు అసిస్టెంట్‌గా ఉండమని చెప్పాడు. షూట్ కాన్సిల్ చేస్తే క్లైంట్స్ బాధపడతారు కదా, వాళ్ల పెళ్లికి ఇబ్బంది రాకూడదని నన్ను వెళ్లమన్నాడు,” అని చెప్పాడు ఆ కుర్రాడు.

అది విన్న తేజ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నాని వ్యక్తిత్వం ఏంటో అతనికి అప్పుడు పూర్తిగా అర్థమైంది.

నాని ఎంత ఎమోషనల్ అయినా సరే, రెండు వైపులా ఆలోచించే మనిషి. ఒకవైపు చనిపోయిన తన స్నేహితుడిని కడసారి చూడటం తనకెంత ముఖ్యమో, మరోవైపు ఆ క్లైంట్‌కి వాళ్ల పెళ్లి కూడా అంతే ముఖ్యమని నాని అర్థం చేసుకున్నాడు. తన బాధలో ఉండి కూడా ఇతరుల గురించి ఆలోచించడమే నానిలో ఉన్న గొప్పదనం!
Prev Next

Ready to play...