అలా శ్యామ్ రాసిన బుక్‌ని పబ్లిష్ చేయించడానికి వాళ్ల మేనమామ అయిన వరహాలు గారి ఇంటికి బయల్దేరారు. అయితే వరహాలు గారు ఒక పెద్ద బుక్ పబ్లిషర్. ఆయనకు కథలు అంటే ప్రాణం. కానీ శ్యామ్ రాసే కథలు పెద్దగా నచ్చేవి కావు. చాలా సార్లు శ్యామ్‌తో ఇలా అన్నాడు:
> "చూడు సుందర్... నువ్వు కథ రాస్తున్నావ్, కానీ దాంట్లో ప్రాణం లేదు. నీ కథ వల్ల వేరే వాళ్లకి ఉపయోగం లేదు. ఫీల్‌తో కనెక్ట్ అవ్వాలి రీడర్స్. నీకు తెలుసు కదా, నేను పబ్లిష్ చేస్తే ఎంత మంది కొంటారో? నాకు ఈ సమాజంలో ఉన్న గుర్తింపు అలాంటిది. నీ బుక్ పబ్లిష్ చేసి నా రెప్యుటేషన్ నేను పోగొట్టుకోలేను."
అని అన్నాడు.
అప్పుడు శ్యామ్ మరియు ప్రేమ్ ఎంతో నిరాశతో వెనక్కి బయల్దేరారు. అప్పుడు వాళ్ల మేనమామ,
> "రే శ్యామ్‌సుందర్... నువ్వు బాగా రాస్తే నేనే నీ బుక్ పబ్లిష్ చేస్తా. నెక్స్ట్ టైమ్ బాగా రాయి."
అని అన్న మాటలు వినిపించాయి. కానీ శ్యామ్ మాత్రం వెనక్కి తిరగలేదు.
ఇది అండి గతంలో జరిగిన కథ. అలా జరిగినా సరే, మన శ్యామ్‌కి వాళ్ల మేనమామ మీద నమ్మకం పోలేదు. అందుకే మళ్లీ ఈసారి ఇంకో మంచి కథ రాసి ఇంకో ప్రయత్నం చేయబోతున్నాడు. అందుకే ప్రేమ్ మరియు శ్యామ్ వాళ్ల మేనమామ గారి ఊరికి బయల్దేరారు.
అలా వెళ్తూ ఉండగా మధ్యలో వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. బస్‌ని ఆపేశారు. ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అప్పుడు ప్రేమ్:
> "రే... ఎలాగో ఆపేశారు కదా, పద అలా వినాయక మండపానికి వెళ్లి వినాయకుడికి దణ్ణం పెట్టుకుని వద్దాం. మంచి జరుగుతుంది."
అని అంటాడు.
అప్పుడు శ్యామ్:
> "నువ్వు వెళ్లు... నేను రాను. నాకు అసలు దేవుడు అంటేనే నమ్మకం లేదు..."
అని అంటాడు.
అప్పుడు ప్రేమ్:
> "రే, వినాయకుడు అంటే ఎవరో తెలుసా? విఘ్ననాశకుడు. ఎలాంటి విఘ్నాలు ఉన్నా తొలగిస్తాడు."
అని అంటాడు.
అప్పుడు శ్యామ్:
> "అవునా! అయితే ఇప్పుడే ఈ ట్రాఫిక్‌ని క్లియర్ చేయమను మీ వినాయకుడిని!"
అని అంటాడు.
ఆ మాట విన్న ప్రేమ్‌కి కోపం వచ్చి కిందకి దిగి ఒక్కడే దర్శనం కోసం వెళ్తాడు.
కానీ శ్యామ్ మాత్రం ట్రాఫిక్ ఉందని చిరాకుగా అలా బస్ కిటికీ నుండి బయటకి చూస్తాడు...
అక్కడ ఎవరో అమ్మాయి, ఉంగరాల జుట్టుతో హడావిడిగా పరుగులు తీస్తుంది. శ్యామ్‌కి తను ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. తనని చూడాలి అనిపించింది శ్యామ్‌కి.
నిజానికి చుట్టూ ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు ఆ మండపం దగ్గర. అందరూ ఎంతో అందంగా తయారయ్యారు. కానీ శ్యామ్ దృష్టి మాత్రం ఆ ఒక్క అమ్మాయి దగ్గరకే వెళ్లింది.
శ్యామ్ తన చూపు తిప్పుకోలేకపోయాడు. అలా తనని గమనిస్తూ, తన ముఖం చూడాలి అనే ఆసక్తితో ఆ బస్ నుండి కిందకి దిగేశాడు.
దేవుడి మీద నమ్మకం లేని మన శ్యామ్... ఒక అమ్మాయి కోసం ఆ మండపంలోకి అడుగు పెట్టాడు.
తనని అన్వేషిస్తూ...
అదే టైమ్‌కి ట్రాఫిక్ కూడా క్లియర్ అయ్యింది. ప్రేమ్ కూడా వచ్చాడు.
> "రే పద... బస్ స్టార్ట్ చేసేశారు. మళ్లీ లేట్ అవుతుంది."
అని అన్నాడు.
కానీ శ్యామ్‌కి అవి ఏం వినిపించడం లేదు. అలా మండపం వైపు వెళ్తున్నాడు.
అప్పుడు ప్రేమ్:
> "రే బాబు, మర్చిపోయావా! ఈసారి మిస్ అయితే నువ్వు రైటర్ అయినట్టే ఇంకా. మీ మామ కాకపోతే ఇంకెవరు నిన్ను, నీ కథల్ని పబ్లిష్ చేయరు."