SCREEN ON

Loading File

Chapter 4

Chapter 3
Chapter 4
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 3

Hostel memories

Chapter 4
Chapter 3
Chapter 4

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 4

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

Active
04

Episode 4

05

Episode 5

File // 03

Episode 3

విజయ్ ఇచ్చిన అడ్రస్‌ను జేబులో పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత, అజయ్ మనసులో మళ్లీ ఆశ చిగురించింది.

ఇండస్ట్రీలో ఇన్ని తిరస్కారాలు ఎదురైన తర్వాత కూడా అతను ఇంకా పూర్తిగా ఓడిపోలేదు.

"ఒక్క అవకాశం చాలు..."

అని తనలో తాను అనుకున్నాడు.

"ఒక్కసారి నా టాలెంట్ ఎవరికైనా కనిపిస్తే చాలు."

ఆ ఆలోచనతోనే విజయ్ చెప్పిన అడ్రస్ వైపు బయల్దేరాడు.

---

దాదాపు గంట ప్రయాణం తర్వాత అతను ఆ అడ్రస్ దగ్గరకు చేరుకున్నాడు.

అక్కడికి వెళ్లగానే...

అతని కళ్ళు పెద్దవయ్యాయి.

అతని ఎదురుగా కనిపించింది ఒక భారీ భవనం.

అది ఇల్లు కంటే చిన్నపాటి ప్యాలెస్‌లా కనిపిస్తోంది.

ఎత్తైన గేటు.

పెద్ద తోట.

వరుసగా నిలబెట్టిన ఖరీదైన కార్లు.

అందంగా చెక్కిన బాల్కనీలు.

ఆ ఇంటి వైభవం చూసి అజయ్ ఒక్కసారిగా ఆగిపోయాడు.

"అయ్యో..."

అని నెమ్మదిగా అనుకున్నాడు.

"వీళ్ల ఇంటి సైజ్ చూస్తుంటే... షార్ట్ ఫిల్మ్ కాదు, నేరుగా పాన్ ఇండియా సినిమా తీసేంత డబ్బు ఉన్నట్టున్నారు!"

అతని ముఖంపై తెలియకుండానే చిరునవ్వు వచ్చింది.

కొంచెం భయం కూడా వేసింది.

ఇంత పెద్ద ఇంటికి రావడం అతనికి ఇదే మొదటిసారి.

---

ధైర్యం తెచ్చుకుని గేటు దాటి లోపలికి నడిచాడు.

హాల్లోకి అడుగుపెట్టగానే...

అక్కడ ఒక పెద్దాయన కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నారు.

తెల్లని జుట్టు.

ముఖంలో గంభీరత.

కానీ కళ్ళలో మాత్రం ఒక ప్రశాంతత కనిపిస్తోంది.

అజయ్‌ను గమనించిన ఆయన పేపర్ పక్కన పెట్టి అడిగారు.

"ఎవరు బాబు?"

"ఎందుకు వచ్చావు?"

అజయ్ ఒక్కసారిగా కంగారుపడ్డాడు.

"అ... అదీ..."

అని తడబడుతుండగానే...

ఆ పెద్దాయన ఇంట్లో పని చేసే మహిళను పిలిచారు.

"అమ్మా!"

"ఈ కుర్రాడికి కాస్త మజ్జిగ తీసుకురా."

"పాపం... ఎండలో పడి వచ్చినట్టున్నాడు."

అన్నారు.

"సరే అయ్యగారు."

అని ఆమె లోపలికి వెళ్లిపోయింది.

---

ఆ మాటలు విన్న అజయ్‌కు కొంచెం మొహమాటం వేసింది.

తనను అసలు ఎవరో కూడా తెలియదు.

అయినా వచ్చిన అతిథిలా చూసుకుంటున్నారు.

అది అతనికి కొత్త అనుభూతి.

పెద్దాయన ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తూ అన్నారు.

"కూర్చో బాబు."

అజయ్ నెమ్మదిగా కూర్చున్నాడు.

కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది.

తర్వాత పెద్దాయన మళ్లీ అడిగారు.

"ఇంతకీ వచ్చిన పని ఏంటో చెప్పలేదు."

---

అజయ్ వెంటనే నిటారుగా కూర్చున్నాడు.

"అది సర్..."

"ఇక్కడ తరిష్ గారు ఉంటారట కదా..."

"ఆయనను కలవడానికి వచ్చాను."

అన్నాడు చాలా మర్యాదగా.

---

ఆ మాట విన్న వెంటనే...

ఆ పెద్దాయన ఒక్కసారిగా పెద్దగా నవ్వేశారు.

అంత పెద్ద ఇంట్లో ఆయన నవ్వు మార్మోగిపోయింది.

అజయ్ మాత్రం అయోమయంగా ఆయన ముఖం వైపు చూశాడు.

"ఏమైంది సర్?"

అని అడిగాడు.

పెద్దాయన నవ్వు ఆపుకుంటూ అన్నారు.

"అయ్యో బాబు..."

"మా యడవని పట్టుకుని అంత మర్యాదగా ‘తరిష్ గారు’ అంటున్నావంటే..."

మళ్లీ నవ్వేశారు.

"లేదంటే నువ్వు తప్పు అడ్రస్‌కి వచ్చి ఉండాలి."

"లేదంటే వాడి గురించి నీకు అసలు తెలియకపోవాలి."

అన్నారు.

---

అజయ్‌కు ఏమీ అర్థం కాలేదు.

"ఏమిటి?"

అనుకుంటూ కూర్చున్నాడు.

అంతలో పై అంతస్తు నుండి ఒక్కసారిగా పెద్ద కేక వినిపించింది.

"తాతయ్యా!!"

అజయ్ ఉలిక్కిపడ్డాడు.

పైకి చూసాడు.

బాల్కనీలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు.

అతడే తరిష్.

---

"తాతయ్యా!"

"ఆయన నా కోసమే వచ్చాడు."

అని అరిచాడు.

ఆ తర్వాత అజయ్ వైపు తిరిగి నవ్వుతూ అన్నాడు.

"బ్రదర్!"

"మా తాతయ్య ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతారు."

"మీరు పైకి రండి."

అన్నాడు.

తర్వాత తాతయ్య వైపు కోపంగా చూసాడు.

ఆ చూపు చూసి అజయ్‌కు ఒక విషయం అర్థమైంది.

తరిష్‌కు తన సొంత ఇంట్లోనే పెద్దగా విలువ ఉన్నట్టు కనిపించడం లేదు!

అది గుర్తొచ్చి అతనికి నవ్వు వచ్చింది.

---

కొద్దిసేపటికి...

అజయ్ మెట్లు ఎక్కి పైకి వెళ్లాడు.

తరిష్ గదిలోకి అడుగుపెట్టగానే...

అతను షాక్ అయ్యాడు.

గది మొత్తం సినిమాల పోస్టర్లు.

కెమెరాలు.

ల్యాప్‌టాప్‌లు.

ఫిల్మ్ మేకింగ్ పుస్తకాలు.

చిన్న చిన్న షూటింగ్ ప్రాప్స్.

చూస్తుంటే అది గది కాదు...

ఒక చిన్న ఫిల్మ్ స్కూల్‌లా ఉంది.

---

"రండి బ్రదర్."

అని తరిష్ కుర్చీ చూపించాడు.

ఇద్దరూ కూర్చున్నారు.

కొద్దిసేపు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత తరిష్ అసలు విషయానికి వచ్చాడు.

"సరే."

"మీ కథ గురించి విజయ్ చాలా చెప్పాడు."

"ఇప్పుడు నేను వినాలి."

"కథ చెప్పండి."

అన్నాడు.

---

ఇదే సమయంలో...

కింద అంతస్తులో...

పనిమనిషి ఒక పెద్ద గ్లాసు మజ్జిగ తీసుకుని వచ్చింది.

"అయ్యగారూ..."

"ఆ అబ్బాయికి మజ్జిగ."

అంది.

---

ఆమె చుట్టూ చూసింది.

కానీ అజయ్ అక్కడ లేడు.

"అయ్యో?"

"ఎవరో వచ్చారన్నారు కదా?"

అని అడిగింది.

పెద్దాయన ప్రశాంతంగా గ్లాసు తీసుకున్నారు.

"సరే."

"ఇప్పుడు పైకి ఎందుకు వెళ్తావ్?"

"ఇటు ఇవ్వు."

అన్నారు.

అని చెప్పి...

అజయ్ కోసం చేసిన మజ్జిగను ఆయనే తాగేశారు.

---

పై అంతస్తులో...

తరిష్ కథ వినడానికి రెడీగా కూర్చున్నాడు.

అజయ్ గొంతు సర్దుకున్నాడు.

"ఈ కథ..."

అని ప్రారంభించాడు.

"ఒక హాస్టల్ లైఫ్ మీద తీసే కథ బ్రదర్."

అన్నాడు.

---

తరిష్ కనుబొమ్మలు ఎత్తాడు.

"హాస్టల్ లైఫ్?"

అన్నాడు.

"హాస్టల్ లైఫ్ మీద ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి కదా?"

"చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి."

"అందులో ప్రత్యేకత ఏముంది?"

అని అడిగాడు.

---

ఆ ప్రశ్న విన్న అజయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

వెంటనే నవ్వుతూ అన్నాడు.

"అవును బ్రదర్."

"చాలానే ఉన్నాయి."

"కానీ..."

అని కాసేపు ఆగాడు.

తర్వాత తన కుర్చీలో ముందుకు వంగి అన్నాడు.

"వాటన్నిటికీ నేను డైరెక్టర్‌ని కాదు కదా?"

---

ఆ సమాధానం విన్న తరిష్ ముఖంలో చిరునవ్వు వచ్చింది.

అతను ఆ మాటను ఊహించలేదు.

అది అహంకారంగా అనిపించలేదు.

అది తన కథ మీద, తన సామర్థ్యం మీద ఉన్న నమ్మకంలా అనిపించింది.

అజయ్ కళ్లలో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్...

తరిష్‌కు చాలా నచ్చింది.

---

"ఇంట్రెస్టింగ్..."

అని మనసులో అనుకున్నాడు.

తర్వాత కుర్చీలో వెనక్కి ఆనుకుని అన్నాడు.

"సరే బ్రదర్."

"ఇప్పుడైతే నా ఇంట్రెస్ట్ పెరిగింది."

"కథ స్టార్ట్ చేయండి."

అన్నాడు.

---

అజయ్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు.

ఎన్నో నెలల తర్వాత...

ఎవరో ఒకరు నిజంగా తన కథ వినడానికి సిద్ధంగా కూర్చున్నారు.

అతని కళ్లలో మళ్లీ ఆ రచయితలోని అగ్ని కనిపించింది.

అతను నెమ్మదిగా కథ మొదలుపెట్టాడు.

"ఓపెన్ చేస్తే..."

Hostel memories

Published: June 14, 2026 at 9:25 AM

Do not copy, distribute, or steal. All rights reserved.
Prev Next

Evaluate File

Your input calibrates the database for others.

Ready to play...