SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 5

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

Active
05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

File // 04

EPISODE 4

ప్రసాద్ మరణవార్త విన్న నానికి రాత్రంతా కంటిమీద కునుకు లేదు. గదిలో తిరుగుతున్న ఫ్యాన్ వంకే శూన్యంగా చూస్తూ, తన బాల్య జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు. స్కూల్‌లో ప్రసాద్‌ను కావాలనే టీచర్ దగ్గర ఇరికించిన సరదా సంఘటనలు అతడి కళ్లముందు కదలాడాయి.

సమయం ఉదయం ఐదు గంటలవుతోంది. ఆలోచనల సుడిగుండంలో పడిపోయి, రాత్రంతా అలా మెలకువగానే ఉండిపోయాడు నాని. ఒక్కసారిగా ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చి, గబగబా బయలుదేరి బైక్ స్టార్ట్ చేశాడు. యాక్సిలరేటర్ పెంచాడు. గాలిని చీల్చుకుంటూ బైక్ వేగంగా ప్రసాద్ వాళ్ల ఊరి వైపు దూసుకెళ్తోంది.

ప్రయాణమంతా నాని మనసులో అదుపుచేయలేనన్ని భావోద్వేగాలు! వెంకట్ చేసిన హోమ్‌వర్క్ బుక్‌ను కావాలనే దాచిపెట్టి, ముగ్గురూ క్లాస్ నుంచి బయటకు గెంటించుకోవడం... అందులోకి శ్రీనివాస్‌ను కూడా లాగి ఇరికించడం... గేమ్స్ పీరియడ్‌లో అందరూ కలిసి క్రికెట్, కబడ్డీ ఆడటం... నాని కావాలనే ప్రసాద్‌కు ఈజీగా బౌలింగ్ వేసి వాళ్ల టీమ్ గెలిచేలా చేయడం... అందరూ కలిసి క్లాస్‌లో ఒకే అమ్మాయికి సైట్ కొట్టడం... నాని, వెంకట్, ప్రసాద్‌లు కలిసి ట్యూషన్‌కు వెళ్లడం... ఇవన్నీ సినిమా రీల్ లాగా నాని కళ్ల ముందు తిరుగుతున్నాయి.

నాని ప్రసాద్‌ను “ప్రసాదం” అని ఏడిపిస్తే, ప్రసాద్ మాత్రం నానిని “నో నైన్” (No Nine) అని ఏడిపించేవాడు. పెన్సిల్ కోసం కొట్టుకోవడం, మళ్లీ ఏమీ జరగనట్టు మధ్యాహ్నం ఒకరి లంచ్ బాక్స్ ఇంకొకరు షేర్ చేసుకోవడం... ఇలా స్కూల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలన్నీ నాని మనసును కలచివేస్తున్నాయి.

చివరగా, పోయిన న్యూ ఇయర్ రోజు జరిగిన సంఘటన అతడికి గుర్తొచ్చింది. ఆరోజు శ్రీనివాస్ నానితో, “నానీ, ఎలాగో నన్ను, వెంకట్‌ను కలిశావు కదా, పదా ప్రసాద్ గాడిని కూడా కలుద్దాం,” అని అడిగాడు.
అప్పుడు నాని మనసులో, ‘దేవుడా, నాకు అర్జెంట్‌గా షూట్ ఉంది... ఇప్పుడు వీళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలి?’ అనుకుని, బయటకి మాత్రం నవ్వుతూ, “సరేరా కలుద్దాం… కానీ ఇప్పుడు కాదు. వాడిని నేను స్పెషల్‌గా తర్వాత కలుస్తానని చెప్పండి. ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి,” అన్నాడు.
అది విన్న శ్రీనివాస్‌కు నాని కొత్తగా అనిపించాడు. ‘ఎప్పుడూ మనతోనే ఉండే నాని ఇలా అంటున్నాడేంటి?’ అని ఆశ్చర్యపోయాడు. అంతలోనే నానికి ఫోన్ కాల్ రావడంతో, “ఒక్క నిమిషంరా!” అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంకట్ మాత్రం నాని వెళ్లిపోవడాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు.

ప్రెజెంట్ (Present):

నాని బైక్ ఆగింది. ఆలోచనల నుంచి బయటపడి బైక్ దిగాడు. ఎదురుగా వెంకట్ కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ కనిపించాడు. ప్రసాద్ మృతదేహం చుట్టూ ఉన్న జనాలను చూశాడు నాని. ప్రసాద్‌ను చూడాలని అడుగు ముందుకు వేశాడు… కానీ అతనికి ధైర్యం సరిపోలేదు. దూరం నుంచే ప్రసాద్ కాళ్లు చూసి, మొహం చూసే ధైర్యం లేక వెనక్కి తిరిగి కళ్లు మూసుకున్నాడు.

అప్పుడు వెంకట్ వచ్చి, “వాడిని చూశావా రా… రా నాతో,” అంటూ నాని చెయ్యి పట్టుకుని ప్రసాద్ బాడీ దగ్గరకు తీసుకెళ్లాడు.

నాని గుండె రాయి చేసుకుని, గట్టిగా ఊపిరి పీల్చుకుని ప్రసాద్‌ను చూశాడు. ప్రసాద్ కళ్లు కొద్దిగా తెరుచుకునే ఉన్నాయి... అవి నానినే చూస్తున్నట్టుగా అనిపించాయి. ప్రాణం మీద ఇంకా ఎంతో ఆశ ఉన్నట్టుగా ప్రసాద్ ముఖంలో ఒక ఆవేదన స్పష్టంగా కనిపించింది. అది నానికి మాత్రమే అర్థమైంది.

చుట్టూ ఉన్న వాళ్ల ఏడుపుల మధ్యలో, హఠాత్తుగా శ్రీనివాస్ వచ్చి నానిని పట్టుకుని బోరున విలపించాడు. “రేయ్ ప్రసాద్ గాడిని పిలవరా నానీ… వాడికి నువ్వంటే చాలా ఇష్టం రా. నువ్వు పిలిచావంటే వాడు కచ్చితంగా లేస్తాడు రా… నానీ… వాడిని పిలవరా!” అంటూ గుండెలు బాదుకున్నాడు.

కానీ నాని మాత్రం ఆ ఆర్తనాదాల మధ్యలో కూడా ఎక్కడికో శూన్యంలోకి వెళ్లిపోయాడు. అతనికి ఎవరి మాటలూ వినిపించడం లేదు. ప్రసాద్ కళ్లు తననే చూస్తున్నట్టుగా భావిస్తున్నాడు.

కాసేపు అలా ప్రసాద్‌ను చూస్తూ ఉండిపోయిన నానిని, శ్రీనివాస్ గట్టిగా ఊపడంతో అప్పుడు స్పృహలోకి వచ్చాడు.

నార్మల్ అయ్యాక నాని నోట్లోంచి వచ్చిన మొదటి మాట... “రేయ్… వాడితో అంతగా గడపని నాకే ఇంత బాధగా ఉందంటే, పాపం వాడిని ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రా? ఎక్కడుంది తను? అసలు ఆమెకి ఈ విషయం తెలుసా?” అని అడిగాడు.

శ్రీనివాస్ ఆ అమ్మాయి గురించి ఏదో చెప్పబోతుండగా — “అనూష గురించి తెలీదు రా…” అనేలోపే, అక్కడున్న వాళ్లు బాడీని అంతిమయాత్ర వ్యాన్‌లోకి ఎక్కించారు.

అందులో ఉన్న ఒక పెద్దాయన నానిని చూసి, “బాబు, నువ్వు మా ప్రసాద్ ఫ్రెండ్‌వేనా? రా ఎక్కు,” అన్నాడు.
అది విన్న నాని పక్కనే ఉన్న వెంకట్ వైపు చూశాడు. ఎందుకంటే నాని కేవలం చిన్నప్పుడే ప్రసాద్‌తో ఎక్కువగా గడిపాడు. కానీ ప్రసాద్ జీవితంలో అన్ని వేళలా తోడుగా ఉన్నది మాత్రం వెంకటే.

ముగ్గురూ ఆ వ్యాన్ ఎక్కారు. వ్యాన్ కదిలిన తర్వాత నాని ఒకటే విషయం అడిగాడు:
“అసలు ఎలా చనిపోయాడు రా? ఇలా ఎందుకు జరిగింది?”

నాని మనసులో మాత్రం ఒకటే ఆలోచన తొలిచేస్తోంది... ‘ప్రసాద్ మరణవార్త తెలిసి ఆ అమ్మాయి ఎంత కుమిలిపోతోందో కదా!’ అని.
Prev Next

Ready to play...