SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 6

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

Active
06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

File // 05

EPISODE 5

సుశాంత్, రామ్ ఇద్దరూ బైక్ మీద సరదాగా చక్కర్లు కొడుతున్నారు. వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి మేఘాలు చూస్తుంటే, ఏ క్షణమైనా కుండపోత వర్షం విరుచుకుపడేలా ఉంది.

కొంత దూరంలో ఓ పెద్ద చెట్టు. దానికి కొద్ది దూరంలోనే ఓ చిన్న పాప, చేతిలో కొన్ని పుస్తకాలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తోంది. హఠాత్తుగా చినుకులు మొదలయ్యాయి. వర్షం వేగం పుంజుకోవడంతో రామ్ బైక్ స్పీడ్ పెంచాడు. ఎక్కడ తన పుస్తకాలు తడిచిపోతాయో అన్న భయంతో, ఆ చిన్న పాప పరుగులు తీస్తూ వెళ్లి ఆ చెట్టు కింద నిలబడింది.

సరిగ్గా అదే సమయానికి... చెవులు చిల్లులు పడేంత శబ్దంతో ఆ చెట్టు మీద ఓ పెద్ద పిడుగు పడింది!

షాక్‌తో రామ్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ చిన్న పాపకు ఏమైందోనన్న దిగులుతో సుశాంత్ గుండె ఆగినంత పనైంది. క్షణం పాటు భయంతో కళ్ళు మూసుకున్నాడు.

"ఓరి నాయనో!" అన్నాడు రామ్ ఆ పిడుగుని చూసి. మరోవైపు ఆ చెట్టు పూర్తిగా మంటల్లో కాలిపోతోంది.

"ఒరేయ్! దగ్గరికి పదా, వెళ్లి చూద్దాం ఏమైందో," అన్నాడు సుశాంత్ భయం భయంగా.

ఇద్దరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఆ మంటల్లో... కమ్ముకున్న పొగ మధ్య... ఆ చెట్టు కింద వైట్ ఏంజెల్ డ్రెస్ లో ఉన్న ఓ అమ్మాయి కనిపించింది. ఆమె వాళ్ళ వైపుకు వీపు తిప్పి ఉంది. కొంచెం కిందకు వంగి, తన చేతులతో దేన్నో ప్రాణప్రదంగా కాపాడుతున్నట్లుగా దాచిపెట్టుకుని ఉంది.

"రేయ్... ఇందాక ఇక్కడ ఓ చిన్న పాపను కదా చూశాం?" అన్నాడు రామ్ అయోమయంగా.

అతను అలా అంటుండగానే, ముడుచుకుని ఉన్న ఆ అమ్మాయి చేతుల మధ్య దాక్కున్న ఆ చిన్న పాప భయంతో వణుకుతూ బయటకు వచ్చింది. ఆపద వస్తే తల్లికోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకున్నట్లుగా... ఆ అమ్మాయి ఆ పాపను తన రెండు చేతుల మధ్య భద్రంగా దాచుకుంది.

"థాంక్స్ అక్కా..." అంటూ ఆ పాప భయంతో, కృతజ్ఞతతో కంటతడి పెట్టింది.

మరోవైపు, ఆ దృశ్యాన్ని చూసిన సుశాంత్ ఆ అమ్మాయిని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఆ పాప కన్నీళ్లు తుడిచి, "ఏం కాలేదులేమ్మా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు," అని ధైర్యం చెప్పింది. ఆ పాప ప్రాణాలతో ఉండటం చూసి రామ్, సుశాంత్ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.

రామ్ నెమ్మదిగా బైక్ దిగి ఆమె దగ్గరకు వెళ్లి, "ఆ పాపను కాపాడారు సరే, కానీ మీకు భయం అనిపించలేదా అండీ?" అని అడిగాడు.

"లేదండీ... పిడుగు పడుతుండటం చూడగానే పాప గుర్తుకొచ్చింది. నా గురించి ఆలోచించే సమయం లేదు. దేవుడి దయ వల్ల మాకేం కాలేదు," అంది ఆమె. ఈలోగా వెనుక నుంచి తననే తీక్షణంగా చూస్తున్న సుశాంత్‌ను ఆమె గమనించింది.

"అయినా, పిడుగు పడబోతోందని మీకెలా తెలిసింది అండీ?" అని రామ్ మళ్ళీ అడిగాడు.

"సారీ, నేను స్కూల్ కి వెళ్ళాలి..." అంటూ సమాధానం దాటవేసి అక్కడి నుంచి గబగబా వెళ్లిపోయిందామె.

ఆ మాట విన్న రామ్ కి షాక్ తగిలింది. "ఏంట్రా? చూస్తుంటే స్కూల్ పిల్లలా లేదు... కానీ స్కూల్ కి వెళ్తున్నానంటుంది? ఏంటో, పాపం టెన్త్ క్లాస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యుంటుందో!" అని హాస్యంగా అన్నాడు.

"ఒరేయ్ పిచ్చోడా! తను స్కూల్ పిల్ల కాదురా, స్కూల్ టీచర్... పదా, ఫాలో అవుదాం," అన్నాడు సుశాంత్.

"రేయ్! స్కూల్ టీచర్ అంటున్నావ్, చూస్కో... పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది," అని రామ్ ఆటపట్టించాడు.

"మూసుకుని ఫాలో కరో!" అని సుశాంత్ కసురుకున్నాడు.

"అబ్బా... మళ్ళీ ఈ హిందీ ఒకటీ!" అని సణుక్కుంటూనే రామ్ బైక్ స్టార్ట్ చేశాడు.

అలా ఆమెను ఫాలో అయి, ఆమె పనిచేస్తున్న స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. స్కూల్ గేటు బయట బైక్ ఆపి...

"రేయ్! తను నాకు భలే నచ్చింది రా... ఇప్పుడెలా? నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు," అని రామ్ వైపు ఆశగా చూశాడు సుశాంత్.

రామ్ ఎలాంటి ఐడియా ఇచ్చి ఉంటాడు?
Prev Next

Ready to play...