SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 7

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

Active
07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

File // 06

EPISODE 6

ఉదయం, సాయంత్రం... ఇలా ప్రతిరోజూ ప్రజ్ఞను ఫాలో అవ్వడమే సుశాంత్‌కి దినచర్యగా మారిపోయింది. వాడి తీరు చూసి విసిగిపోయిన రామ్, "రేయ్! వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడరా బాబూ! ప్రేమిస్తున్నానని చెప్పెయ్. ఇంకెన్ని రోజులురా ఇలా దూరం నుంచి చూడటం? రోజూ కుక్కలా ఫాలో అవ్వడం, పెట్రోల్ దండగ..." అని విసుక్కున్నాడు.

"ప్రాబ్లమ్ పెట్రోల్ అయితే చెప్పు, అంతేగానీ కుక్కా గిక్కా అన్నావంటే కరిచేస్తా! ఇదిగో, ఈ పది రూపాయలు పట్టుకో... నేను వెళ్లి ప్రపోజ్ చేసి, శుభవార్తతో బయటకొస్తా," అని కాలర్ ఎగరేస్తూ స్కూల్ లోపలికి వెళ్లాడు సుశాంత్.

స్టాఫ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే, అక్కడ ప్రజ్ఞతో పాటు పక్కనే వేరే సబ్జెక్ట్ చెప్పే మరో ఆవిడ కూడా కూర్చుని ఉంది. ప్రజ్ఞను చూడగానే సుశాంత్ పెదవులపైకి చిరునవ్వు దూసుకొచ్చింది. కానీ ప్రజ్ఞ మాత్రం పక్కనున్న టీచర్‌తో, "మేడమ్, వీడెవడో వారం రోజుల నుంచి తెగ ఫాలో అవుతున్నాడు. మీరే ఏదో ఒకటి చేయండి," అని గుసగుసలాడింది.

ఆ మాటలు వినబడని సుశాంత్, ప్రజ్ఞ దగ్గరకు వెళ్లి, "మేడమ్... మా చెల్లిని ఈ స్కూల్లో జాయిన్ చేద్దామనుకుంటున్నాను. కొంచెం స్కూల్ చూపిస్తారా?" అని అమాయకంగా అడిగాడు.

వెంటనే పక్కనున్న ఆవిడ కల్పించుకుని, "బాబు, ఇదేం లాడ్జి కాదు కదా ఎవరికి వాళ్లు వెళ్లి చూసుకోవడానికి? కావాలంటే మా ఆయా చూపిస్తుందిలే," అని కటువుగా అంది.

సుశాంత్ ఆమె వైపు కోపంగా ఓ లుక్ ఇచ్చి, "మేడమ్ అలా కాదు... జస్ట్ ఒక్కసారి..." అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే స్కూల్ బెల్ మోగింది.

"ప్రజ్ఞా! నీకు క్లాస్‌కి టైమ్ అవుతున్నట్టుంది," అంది ఆ పక్కనున్న టీచర్.

"సారీ అండీ, నాకు క్లాస్‌కి టైమ్ అయ్యింది," అని చెప్పి ప్రజ్ఞ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలో పక్కనుంచి ఆయా వచ్చి, "బాబుగారూ, రండి నేను చూపిస్తా," అనగానే, "ఏం వద్దులేమ్మా..." అని నీళ్లు నములుతూ బయటకొచ్చేశాడు సుశాంత్. 'దొంగ మొకంది... మంచి ఛాన్స్ మిస్ అయ్యేలా చేసింది,' అని ఆ సీనియర్ టీచర్‌ను మనసులోనే తిట్టుకుంటూ, ప్రజ్ఞతో మాట్లాడలేకపోయినందుకు తీవ్రంగా నిరాశ చెందాడు.

బయట వెయిట్ చేస్తున్న రామ్ దగ్గరకు వెళ్లగానే, "ఏరా? ఏంటి గుడ్ న్యూస్?" అని ఉత్సాహంగా అడిగాడు వాడు.

"ఏం లేదురా... పక్కనే ఓ సైతాన్ లాంటి మనిషి కూర్చుని ఉంది. ఆవిడ ఉన్నంతవరకూ ఆ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్లలేం. కాకపోతే, ఆ అమ్మాయి పేరు 'ప్రజ్ఞ' అని తెలిసింది," అని కాస్త గర్వంగా చెప్పాడు సుశాంత్.

"పేరు తెలుసుకోవడానికే వారం పడితే... ఇక ప్రపోజ్ చేయడానికి ఏడాది పట్టేలా ఉంది. ముందు బండెక్కు, మందుకొట్టడానికి లేటవుతోంది," అంటూ బైక్ స్టార్ట్ చేశాడు రామ్.

రాత్రి వేళ - మందు సిట్టింగ్ (జై, విష్ణు, రామ్, సుశాంత్)

"ఇదిరా మ్యాటర్... వీడు ఫాలో అవుతాడు కానీ మాట్లాడడు. మాట్లాడే ఛాన్స్ వచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు," అని జై, విష్ణులకు ఉదయం జరిగిన ముచ్చటంతా పూసగుచ్చినట్టు చెప్పాడు రామ్.

"ఏరా? ఆ అమ్మాయి అంత బాగుంటుందా ఏంటి?" అని ఆసక్తిగా అడిగాడు జై. దానికి సుశాంత్ సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వాడు.

"అబ్బబ్బా... సిగ్గు చూడు! అది నీకు సూట్ అవ్వలేదులే కానీ, అసలు విషయం చెప్పు," అని ఎగతాళి చేశాడు విష్ణు.

"రేయ్! రేపే వెళ్లి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేయ్," అని ఎంకరేజ్ చేశాడు జై.

"అలా కాదురా... నాకు అసలే అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం," అని బెరుకుగా అన్నాడు సుశాంత్.

"రేయ్... భయపడేవాడు ప్రతిరోజూ భయపడతాడు. భయం వదిలి ముందుకడుగేసేవాడు చరిత్రలో నిలిచిపోతాడు," అని సినిమా డైలాగ్ పేల్చాడు జై.

"అవును మామా! మ్యాటర్ ఎటోకటు తేలిపోవాలి. ఇలా నడిసంద్రంలో నావలాగా మధ్యలో ఉండకూడదు," అని వంత పాడాడు విష్ణు.

స్నేహితుల మాటలతో సుశాంత్‌లో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వాళ్ళ మోటివేషన్‌తో ఫుల్లుగా ఇన్‌స్పైర్ అయిన వాడు, రేపు ఎలాగైనా సరే ప్రజ్ఞకు ప్రపోజ్ చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు.
Prev Next

Ready to play...