SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 8

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

Active
08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

File // 07

EPISODE 7

స్నేహితులు ఎక్కించిన మోటివేషన్ డోస్‌తో సుశాంత్ నరనరాల్లో ధైర్యం ఉప్పొంగింది. ఇక రేపు ప్రజ్ఞకు ప్రపోజ్ చేయాల్సిందే అని బలంగా ఫిక్స్ అయిపోయాడు.

మరుసటి రోజు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, ఎంతో శ్రద్ధగా ఒక లవ్ లెటర్ రాశాడు. నేరుగా దేవుడి గదిలోకి వెళ్లిపోయాడు. నుదురు నిండా విభూతి పెట్టుకుని, కళ్లు మూసుకుని "ఓం నమః శివాయ... ఓం నమః శివాయ..." అంటూ పెద్దపెద్దగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు.

ఆ అరుపులకు పల్లవి ఉలిక్కిపడి నిద్రలేచింది. దేవుడి గదిలో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ పూజ చేస్తున్న తమ్ముడిని చూసి ఆమెకు భయంతో గుండె ఆగినంత పనైంది. వాడికేదో దెయ్యం పట్టిందని కంగారుగా వెళ్లి నాన్న జయరామ్‌ను నిద్రలేపింది.

నిద్రమత్తులో లేచి వచ్చిన జయరామ్.. తలనిండా విభూతితో వింతగా ప్రవర్తిస్తున్న సుశాంత్‌ను చూసి, వాడెవడో క్షుద్రపూజలు చేస్తున్న దెయ్యం అనుకుని గట్టిగా భయపడ్డాడు. వెంటనే మూలన ఉన్న చీపురుకట్ట తీసుకుని, సైలెంట్‌గా వెళ్లి వెనకనుంచి దబదబా బాదడం మొదలుపెట్టాడు.

"నాన్నా... ఆగు, కొట్టకు... నేనే!" అంటూ సుశాంత్ నొప్పితో అరిచాడు.

"అదేదో దేవుడికి పూజ చేస్తోందంటే, కచ్చితంగా ఇది మంచి దెయ్యమే అయి ఉంటుందేమో నాన్నా," అంది పల్లవి అమాయకంగా.

"అబ్బా! దెయ్యం వదిలినట్టుంది నాన్నా... అది తమ్ముడి వాయిస్సే," అని మళ్లీ అంది పల్లవి. అప్పుడు చీపురు ఆపిన జయరామ్, "ఒరేయ్! నీకేమైనా గాలి సోకిందారా?" అని అడిగాడు.

"అలాంటిదేం లేదు నాన్నా..." అని నొప్పులు భరిస్తూనే, శివలింగం ముందు పెట్టిన ఆ లవ్ లెటర్ తీసుకుని పరుగున బయటకొచ్చేశాడు.

నేరుగా వెళ్లి నిద్రమొహంతో ఉన్న రామ్‌ను లాక్కొచ్చి స్కూల్ దగ్గర నిలబెట్టాడు. ఒక చేతిలో గులాబీ పువ్వు, మరో చేతిలో దేవుడి ముందు పెట్టిన లవ్ లెటర్ పట్టుకుని, టెన్షన్‌తో అటూ ఇటూ పులిలా తిరుగుతున్నాడు సుశాంత్.

"ఎందుకురా కంగారుపడ్డ జంతువులా అలా తిరుగుతావు? వస్తుందిలే ఆగు," అని ఆవలిస్తూ అన్నాడు రామ్.

చుట్టుపక్కల స్కూల్ పిల్లలంతా వాళ్లనే వింతగా చూస్తున్నారు. ఇంతలో ఓ నాలుగో తరగతి పిల్లాడు అక్కడికి వచ్చి పైనుంచి కిందదాకా చూసి, "ఎవరు మీరంతా? చూస్తుంటే పిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్‌లా ఉన్నారు?" అని రామ్ వంక చూసి అన్నాడు.

రామ్‌కి ఎక్కడలేని చిర్రెత్తుకొచ్చింది. చేయి పైకెత్తి, "లాగిపెట్టి కొట్టానంటే పలకబలపాలు కక్కేస్తావ్! దొబ్బేయ్ లోపలికి!" అని అదిలించేసరికి ఆ పిల్లాడు లోపలికి పారిపోయాడు.

సమయం గడుస్తున్న కొద్దీ సుశాంత్‌కి హార్ట్ బీట్ పెరిగిపోతోంది. చేతులు వణుకుతున్నాయి. సడన్‌గా ప్రజ్ఞ రావడం కనిపించింది.

"రేయ్... తను వచ్చేసింది రా! టెన్షన్ వచ్చేస్తోంది, పద ఇంటికి పోదాం," అని భయంతో వణికిపోతూ అన్నాడు సుశాంత్.

"ఒరేయ్! ఇంతసేపు చికెన్ షాప్ ముందు కుక్కలా వెయిట్ చేసి, తీరా ఆమె వచ్చాక వెళ్లిపోదామంటావా? ఆగు," అని వాడిని పట్టుకుని, "ఓయ్ అమ్మాయ్... అదే సారీ! టీచరుగారూ, ఒక్కసారి ఇలా రండి," అని ప్రజ్ఞను పిలిచాడు రామ్.

"నీ ఆత్రం తగలెయ్య... ఆపుకోలేవా?" అని సుశాంత్ గొణుక్కునేలోపే ప్రజ్ఞ వాళ్ల దగ్గరకు వచ్చింది. "ఏంటి మీ గోల?" అని విసుగ్గా అడిగింది.

సుశాంత్ సిగ్గుపడుతూ వణుకుతున్న చేతులతో లవ్ లెటర్ అందించాడు. ప్రజ్ఞ ఆ లెటర్‌ను చూసి కనీసం ఓపెన్ కూడా చేయలేదు. అందరి ముందే దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసి, ఆ కాగితం ముక్కలను సుశాంత్ మొహాన కొట్టింది.

అది వాడి జీవితంలో మొదటి రిజెక్షన్. దిమ్మతిరిగిపోయి ఏం మాట్లాడాలో తెలియక అలా నిలబడిపోయాడు.

"అయిపోయిందిగా మీ నాటకం? ఇది ఇవ్వడానికి ఇన్ని రోజులు తిరిగావా? అబ్బా... టూమచ్ లాగ్! ఇంకెప్పుడూ నా వెంట పడకు," అని అసహ్యించుకుంటూ, ఛీ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రజ్ఞ.

రామ్‌కి చిర్రెత్తుకొచ్చింది. "ఓయ్! ఏంటే ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్? ఇష్టం లేకపోతే లేదని చెప్పి దొబ్బెయ్యొచ్చుగా, ఆ కటింగ్ ఏంటి? మా ఓడు గోల్డ్ తెలుసా!" అని అరుస్తూనే, షాక్‌లో ఉన్న సుశాంత్‌ను లాక్కుని అక్కడినుంచి వెళ్లిపోయాడు.

రిటర్న్ వెళ్ళాక (స్నేహితుల దగ్గర)...

(గత రాత్రి జై చెప్పిన డైలాగ్: "రేయ్... భయపడేవాడు ప్రతిరోజూ భయపడతాడు. భయం వదిలి ముందుకడుగేసేవాడు చరిత్రలో నిలిచిపోతాడు.")

"నాకు ముందే తెలుసురా ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుందని. దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ (సముద్రంలో చాలా చేపలుంటాయి). లైట్ తీసుకో," అని వేదాంతం మాట్లాడాడు జై.

ఆ మాట వినగానే సుశాంత్‌లో అగ్నిపర్వతం బద్దలైంది.

"ఒరేయ్! నా పాటికి నేను ఎక్కడో దూరం నుంచి చూసుకుంటూ ప్రశాంతంగా బతికేస్తుంటే... నిన్న రాత్రి ఆ బొంగులో మోటివేషన్ ఇచ్చి నా లవ్ చెడదొబ్బావు కదరా సన్నాసి!" అంటూ పక్కనే ఉన్న ఖాళీ బాటిల్ తీసుకుని జై తల పగలగొట్టడానికి పరిగెత్తాడు సుశాంత్.

విష్ణు, రామ్ కంగారుగా సుశాంత్‌ను పట్టుకుని ఆపుతుండగా... "సారీ మామ్స్!" అని అరుస్తూ అక్కడినుంచి బతుకుజీవుడా అని పారిపోయాడు జై.
Prev Next

Ready to play...