SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 9

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

Active
09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

File // 08

EPISODE 8

నాని, తేజలు జయ చెప్పిన పెళ్లి మండపానికి చేరుకున్నారు. అక్కడ జయ వాళ్ల పెద్దనాన్న నానిని చూసి, “బాబు, మీకు సెటప్ కోసం వెనక… ఆ వెనక ఏర్పాటు చేశాం,” అని దారి చూపించాడు.
సరేనని తేజ, నానిలు అటుగా నడిచారు.

నాని కళ్లు ఎవరికోసమో ఆత్రంగా వెతుకుతున్నాయి. అది గమనించిన తేజ, “బాబు, అంత ఆత్రం ఎందుకురా? జస్ట్ ఒక మెసేజ్ పెడితే ఆ అమ్మాయే వచ్చేస్తుంది కదా!” అన్నాడు.

దానికి నాని, “రేయ్, తను నిజంగా కేవలం ఒక క్లయింట్‌గా మాత్రమే, పోయిన షూట్‌లో మన వర్క్ నచ్చి మెసేజ్ చేసి ఉంటే?” అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు.

తేజ నవ్వుతూ, “అవును మరి! మన ఫ్లెక్సీలో నీ ఫోన్ నెంబర్ అంత క్లియర్‌గా ఉంటే... దానికి చేయకుండా, నీ పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీకే ఎందుకు మెసేజ్ చేయాలి?” అని లాజిక్ లాగాడు.

“అది కూడా కరెక్టే… కానీ ఆ అమ్మాయి…” అని నాని అంటుండగానే అతని ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది.

వెంటనే కంగారుగా ఫోన్ ఓపెన్ చేసి చూశాడు. అది జయ మెసేజ్!
“మీ హెయిర్ స్టైల్ అచ్చం ధోనీ (Mahi) లాగానే ఉంది,” అని పెట్టింది.

నాని వెంటనే, “థాంక్స్… కానీ మీరెక్కడున్నారు?” అని రిప్లై ఇచ్చాడు.

అవతలి నుంచి జయ, “నాతో నీకేం పని? వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో,” అని మెసేజ్ చేసింది.

అది పక్కనుంచి చదివిన తేజ పగలబడి నవ్వుతూ, “ఛీ… పరువు మొత్తం పోయింది కదరా! ఒరేయ్ నీకు ముందే చెప్పా కదరా!” అంటూ ఎగతాళి చేశాడు.

సరిగ్గా ఆ సమయంలో... పైనుంచి కూరగాయల తుక్కు మొత్తం వచ్చి తేజ మీద పడింది. పాపం తేజ బట్టలన్నీ పాడైపోయాయి.

నాని ఉలిక్కిపడి పైకి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ తేజ పరిస్థితి చూసి నానికి కూడా నవ్వొచ్చేసింది.

తేజకు ఒకేసారి కోపం, అలక రెండూ ముంచుకొచ్చాయి. “నేను వెళ్ళిపోతారా బాబు! వీళ్ళు నన్ను చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. నీ షూట్ ఏదో నువ్వే చేసుకో. నేను మా ఇంటికి వెళ్ళిపోతా, బై,” అని అలిగాడు.

నాని వెంటనే తేజను పట్టుకుని, “రేయ్ రేయ్, ఆగరా! నీ మీద ఆ తుక్కు వేసింది జయనే అయి ఉంటుంది. తనే అలా చేసిందంటే… అదేరా మన పాజిటివ్ సైన్!” అన్నాడు ఉత్సాహంగా.

సరిగ్గా అదే సమయంలో, కాస్త దూరంలో ఆకుపచ్చ రంగు (Green colour) సాంప్రదాయక దుస్తుల్లో ఉన్న ఒక అమ్మాయి, చాటుగా వీళ్ల మాటలు వింటోంది. ఆమె చూడటానికి చాలా అందంగా, పద్ధతిగా ఉంది. నాని మాటలు వినగానే ఆమె కళ్లు ఆశ్చర్యంతో విప్పార్లాయి.

“అయ్యయ్యో! వీడెలా కనిపెట్టేశాడు!” అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది. (తనే జయ!). తన కాళ్లకున్న పట్టీల చప్పుడు వినపడకుండా కాస్త దూరం మెల్లిగా నడిచి, ఆ తర్వాత పరుగుతీసింది.

తేజ మాత్రం నాని వంక చాలా సీరియస్ గా చూసి, తన బట్టల మీద పడ్డ తుక్కును దులుపుకుంటూ... “బంగాళదుంప, కొత్తిమీర, ఉల్లిపాయ… నా కడుపు నిండిపోయింది బంగారం! ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కరువు కథ,” అని సెటైర్ వేశాడు.

సరిగ్గా అప్పుడే వాళ్ల దగ్గరికి ఒక చిన్న పాప (ఆరోజు షూట్‌లో నానికి వాటర్ ఇచ్చిన పాపే) వచ్చి, “అన్నయ్యా, వాష్‌రూమ్ ఆ వైపు ఉంది,” అని దారి చూపించింది.

నానికి నవ్వొస్తున్నా బలవంతంగా ఆపుకున్నాడు.
తేజ ఆ పాప వైపు చూసి నమస్కారం పెడుతూ, “థాంక్స్ రాజమాతా! ఒరేయ్ నానీ, నీకు ఉందిరా… నేను వచ్చాక చెప్తా,” అని వార్నింగ్ ఇస్తూ వాష్‌రూమ్ వైపు వెళ్లాడు.

అలా కొంతసేపటి తర్వాత పెళ్లి షూట్ ప్రారంభమైంది.

నాని కళ్లు అక్కడున్న అమ్మాయిలందరినీ జల్లెడ పడుతున్నాయి. వాళ్లలో జయ ఎవరో అతనికి అర్థం కావట్లేదు.
“రేయ్ తేజా! నీకో టెస్ట్ రా?” అన్నాడు నాని.
“టెస్టుల్లేవు, వన్డేల్లేవు. ముందు వచ్చిన పని కానివ్వు,” అని విసుక్కున్నాడు తేజ.
“నీయబ్బ, అది కాదురా. వీళ్లలో జయ ఎవరో కనుక్కోవడం ఎలా?” అని అడిగాడు నాని.

అప్పుడు తేజ, “ఒరేయ్! వాళ్ల పెద్దనాన్నని చూశావుగా ఎంత కండలు తిరిగి ఉన్నాడో! మనం చేసే పని ఏమాత్రం తేడా కొట్టినా నీది, నాది ఇద్దరివీ పోతాయి,” అన్నాడు.
“ఏంటి పోయేవి?” అని అమాయకంగా అడిగాడు నాని.
“ప్రాణాలు!” అని భయపెట్టాడు తేజ.

అప్పుడే అక్కడికి వచ్చిన ఆ చిన్న పాపను చూసి నాని, జేబులోంచి ఒక చాక్లెట్ తీసి “ఇలా రా…” అని పిలిచాడు.
‘అమ్మో! వీడేదో పెద్ద ప్లాన్‌లోనే ఉన్నాడు,’ అని మనసులో అనుకున్నాడు తేజ.

ఆ పాప పరుగెత్తుకుంటూ వచ్చి, “ఏంటి అన్నయ్యా?” అని అడిగింది.
నాని కిందకి వంగి, “ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. చూడు బంగారం, ఇంతకీ ఇక్కడ జయ అంటే ఎవరు?” అని మెల్లగా ఆరా తీశాడు.

విడ్డూరం ఏంటంటే... ఆ పాప అమాయకంగా, “నేనే జయ!” అని చెప్పి ఆ చాక్లెట్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది.

అది విన్న నానికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం అనాలో అర్థం కాలేదు.
వెనక నుంచి తేజ నవ్వుతూ, “నేను ముందే అనుకున్నాను ఇలాగే జరుగుతుందని. మూసుకుని వచ్చిన పని చూసుకుని పోదాం పదా,” అని ఎగతాళి చేశాడు.

నాని ఎంతో నిరాశగా, యాంత్రికంగా ఫోటోలు తీస్తున్నాడు.

సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. తను రాగానే చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం ఏదో పాజిటివిటీతో నిండిపోయినట్లు అనిపించింది నానికి. అలాంటి ఒక స్వచ్ఛమైన భావన కలగడం నాని జీవితంలో అదే మొదటిసారి.

ఆ అమ్మాయిని చూడగానే నాని కళ్లు మెరిశాయి. “రేయ్ తేజా, నా గట్ ఫీలింగ్ (Gut feeling) తో చెప్తున్నా… తనేరా జయ… పక్కా ఫిక్స్!” అన్నాడు కాన్ఫిడెంట్‌గా.

‘వీడేంటి ఇంత సీరియస్‌గా అంటున్నాడు!’ అని ఆశ్చర్యపోయాడు తేజ.
అంతలో ఆ అమ్మాయి పక్కనుంచి ఎవరో వచ్చి, “అమ్మా... అను! ఇలా రా, ఫోటో దిగుదాం,” అని పిలిచారు.

అది విన్న తేజ నాని భుజం తట్టి, “రేయ్, నువ్వు ఇన్ని రోజులు ఏ అమ్మాయితోనూ సరిగ్గా మాట్లాడక, సడన్‌గా ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేసేసరికి ఇలా అయిపోతున్నావ్! కొంచెం ఆగి ఆలోచించు. తనకి నిజంగా నీ మీద ఇంట్రెస్ట్ ఉంటే తనే నీ దగ్గరికి వస్తుంది. ముందు పని మీద ధ్యాస పెట్టు,” అని బుద్ధిగా చెప్పాడు.

నాని నిట్టూరుస్తూ, “సరేలే,” అన్నాడు.

పాపం, వాళ్లకి తెలియని అసలు విషయం ఏంటంటే — ఆ 'అను' అనే అమ్మాయే మన 'జయ' అని!
Prev Next

Ready to play...