SCREEN ON
Chapter complete
Next File Loading
Jumping to Chapter 9
Interface
Typography Scale
100%
Environment
File // 08
Episode 8
రుక్మిణి సంగతి పక్కన పెడితే, మన శ్యామ్‌లో చాలా మార్పులు చూశాం.
వేరే జనం అందరి దేవుళ్లకి మొక్కుతుంటే వాళ్లని చూసి నవ్విన శ్యామ్, రుక్మిణితో ఏకంగా దర్శనం కూడా చేసుకున్నాడు.
దేవుడి మీద నమ్మకం లేని మన శ్యామ్, స్వయంగా తన నోటి నుండి:
> "దేవుడా..."
అని అన్నాడు.
అవి అతనిలో మార్పులు కావు...
అది అతనికి తెలియకుండానే రుక్మిణి మీద పెంచుకున్న ప్రేమ!!!!
---
శ్యామ్, ప్రేమ్‌లు వెనక్కి తిరిగి ఇంటికి వెళ్తుండగా...
ప్రేమ్:
> "రే... ముందు మాట వేరే వాళ్లే ఎందుకు రాయాలి? నువ్వే రాసి వేరే వాళ్ల పేరు పెట్టొచ్చు కదా!"
అని సలహా ఇస్తాడు.
అప్పుడు శ్యామ్:
> "నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు...
నేను తనతోనే ఎందుకు రాయిస్తానో తెలుసా?
ఆ వంకతో తనతో పరిచయం పెంచుకోవచ్చు...
అయినా ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తే తెలుస్తుంది..."
అని అంటాడు.
అప్పుడు ప్రేమ్:
> "అమ్మనీ... ఏంట్రా నీ పథకం?
ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను చూసి 'రాయను' అని అంటే?"
అని అడిగాడు.
అప్పుడు శ్యామ్:
> "నేను వెళ్లి మాట్లాడతా అని ఎవరు అన్నారు?"
అని అంటాడు.
అప్పుడు ప్రేమ్:
> "అంటే ఏంటి... నువ్వు మాట్లాడకుండానే తను వచ్చి నీతో మాట్లాడుతుందా?
ఇంత పిచ్చోడిలా ఉన్నావ్ ఏంట్రా!"
అని నవ్వుతాడు ప్రేమ్.
అప్పుడు శ్యామ్ కూడా నవ్వి:
> "నువ్వే మాట్లాడాలి రేపు...
ఒప్పించాలి తనని."
అని అంటాడు.
ఆ మాట వినగానే ప్రేమ్:
> "ఏటి... నేనా?
రే నా వల్ల కాదు రా బాబు... నీకొద్దండం!"
అని అన్నాడు.
---
తర్వాతి రోజు...
రుక్మిణి తన కళాశాలకి బయలుదేరింది వాళ్ల కారులో.
తను వెనక కూర్చుంది.
శ్యామ్ గురించే ఆలోచిస్తుంది.
తనతో దర్శనం చేసుకోవడం, తన వెనకే రావడం, తనతో మాట్లాడాలి అని ప్రయత్నించడం...
అవి అన్నీ రుక్మిణికి చాలా కొత్తగా అనిపించాయి.
> "అసలు అతను అంతలా వచ్చేసేలా ఏం చేసివుంటాను అంటావ్...
చూడు రుక్మిణి... అతను ఎందుకు వెంట వస్తున్నాడో ఏమో...
కొంచెం కూడా నీకు అతని పై soft corner ఉంది అని అతనికి తెలియనివ్వకూడదు.
ఆడపిల్లవి కదా... strong గా ఉండు..."
అని తనలో తనే ఏదో ఏదో మాట్లాడేసుకుంటుంది.
అయినా అమ్మాయిల మనసు ఎప్పుడూ నిలకడగా ఉంటుంది చెప్పండి!
మన రుక్మిణి పరిస్థితి కూడా అంతే.
ఎంతోసేపు వాళ్ల పక్కనుండి వెళ్లిన ప్రతి బస్‌లో శ్యామ్ ఏమన్నా ఉన్నాడో ఏమో అని చూస్తుంది.
కానీ ఇక్కడ రుక్మిణికి తెలియకుండానే తను శ్యామ్ గురించి ఆలోచిస్తుంది.
---
రుక్మిణి వాళ్ల కళాశాల వచ్చింది.
తను కార్ దిగింది...
ఎదురుగా చూస్తే అక్కడే ఉన్నాడు శ్యామ్.
శ్యామ్ రుక్మిణి కోసం అక్కడే ఎదురు చూస్తున్నాడు.
> "అమ్మ బాబోయ్... ఏంటి ఈ అబ్బాయి ఏకంగా మా కాలేజీకి వచ్చేశాడు?"
అని వెనక్కి తిరిగింది రుక్మిణి కంగారుగా.
ఎక్కడ మన రైటర్ గారు తనని చూసేస్తారేమో అని.
శ్యామ్‌తో పాటు ప్రేమ్ కూడా ఉన్నాడు.
రుక్మిణి చూస్తే ఇలా చేస్తుంది...
అసలు వాళ్లు ఇద్దరూ మాట్లాడుకుంటారా?
Audio Stream
0 / 0 sentences
System Standby