ఆకాశం నిండుగా దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. గాలి కూడా గట్టిగా వీస్తుంది.
రుక్మిణి:
> "నేను వెళ్తాను బాబాయ్... మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్లండి."
అని వాళ్ల డ్రైవర్‌కి చెప్పి, వాళ్ల కాలేజీ గేట్ వెనకనుండి శ్యామ్‌ని గమనిస్తుంది దాక్కుని.
తన కోసం ఎదురుచూస్తున్న శ్యామ్‌ని చూసి రుక్మిణికి ఏదో తెలియని ఆనందం.
---
మరోపక్క ప్రేమ్:
> "రే... అసలు ఈ రోజుల్లో చదువుకునే అమ్మాయి అంటే కచ్చితంగా బాగా డబ్బు ఉన్న వాళ్లు అయి ఉంటారు!!
అలాంటి అమ్మాయి నీకోసం ఎందుకు ముందుమాట రాస్తుంది!
ఇక్కడ ఆ అమ్మాయి కోసం ఎదురు చూసి మన టైమ్ వేస్ట్!"
అని అన్నాడు ప్రేమ్.
అప్పుడు మన శ్యామ్:
> "అవి అన్నీ నాకు అనవసరం!
నువ్వు తనకి నా బుక్ ఇచ్చి ముందుమాట రాసి హెల్ప్ చేయమని చెప్పు.
ఆ తర్వాత నేను ఆ బుక్ తను తిరిగి ఇచ్చేటప్పుడు మాట్లాడతా...
అప్పుడు అనుకో ఒక కారణం ఉంటుంది కాబట్టి తనకి కూడా ఒక క్లారిటీ వస్తుంది."
అని అంటాడు శ్యామ్.
---
ప్రేమ్:
> "సరే...
నువ్వు వెళ్లి రాయమంటే తను 'రాయను' అంటే నీ మొఖం మాడిపోతుంది అనే కదా నువ్వు తెలివిగా నన్ను పంపిస్తున్నావ్?
నాకు తెలుసు రా నువ్వు ఎంత దొంగన కొడుకువో...
ఏది ఏమైనా నువ్వు జాగ్రత్తగా ఉంటావ్."
అని అంటాడు ప్రేమ్.
శ్యామ్ ఒక నవ్వు నవ్వుతాడు.
---
అవి అన్నీ దూరం నుండి వింటుంది మన రుక్మిణి, చాటుగా ఉండి.
> "అమ్మ దొంగా... ఎంత పన్నాగం పన్నావ్...
చెప్పుతా ఉండు నీ సంగతి."
అని నిర్ణయించుకుంది రుక్మిణి.
ప్రేమ్‌కి అసలు కనిపించకూడదు అని నిర్ణయించుకుంది.
---
కానీ రుక్మిణి ఆటలు ఎంతోసేపు సాగలేదు.
అకస్మాత్తుగా గట్టిగా వర్షం పడటం మొదలైంది.
రుక్మిణి గబగబా దాక్కున్న చోటు నుండి పక్కనే ఉన్న వాళ్ల కాలేజీ క్యాంటీన్ దగ్గరకి పరుగులు తీసింది.
పాపం... తడిచిపోయింది తను.
---
క్యాంటీన్ దగ్గరకి వెళ్లిన రుక్మిణిని చూసేశాడు శ్యామ్.
శ్యామ్ అలా రుక్మిణి దగ్గరకి వెళ్తుంటే, అప్పుడే మొదటిసారి రుక్మిణి తన కళ్లద్దాలు తీసేసింది.
మొట్టమొదటి సారి రుక్మిణిని తన కళ్లజోడు లేకుండా చూసిన శ్యామ్...
తన అందానికి ముగ్ధుడై అలానే దూరంగా నిలబడిపోయాడు.
రుక్మిణి అసలైన రూపం తన కళ్లద్దాల వెనుక దాగి ఉంది అని అర్థమైంది మన రైటర్ గారికి.
---
రుక్మిణి తన స్పెక్ట్స్ (కళ్లద్దాలు) తీసి చిన్న క్లాత్‌తో clean చేసుకుంటుండగా, వెనకనుండి రుక్మిణి వాళ్ల స్నేహితులు వచ్చి రుక్మిణిని వర్షంలోకి లాగేశారు.
అక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు.
పైగా శ్యామ్‌ని ప్రేమ్ కొంచెం పక్కకి లాక్కెళ్లాడు.
పొరపాటున కాలేజ్ వాళ్లు ఎవరైనా చూస్తే చితక్కొడతారు అని.
---
అలా పక్కకి వెళ్తున్నా సరే, శ్యామ్ దృష్టి మాత్రం రుక్మిణి వైపే ఉండిపోయింది.
అప్పుడు రుక్మిణిని తన స్నేహితురాళ్లు అయిన లీల, శోభనలు వర్షంలోకి తీసుకెళ్లారు.
అప్పటి దాకా ఎవరికి తెలియని రుక్మిణిని చూసాడు మన శ్యామ్.
తొలిసారి రుక్మిణి classical dance వేయడం చూసాడు.
శ్యామ్ మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి.
రుక్మిణి అంత సంతోషంగా, ఫ్రీగా ఉండడం ఎప్పుడూ చూడలేదు మన శ్యామ్.
తను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి తన నాట్యంలో నిమగ్నం అయిపోయింది మన రుక్మిణి.
అసలే తనకి క్లాసికల్ డ్యాన్స్ అంటే ప్రాణం.
చివర్లో దూరంగా చూస్తున్న శ్యామ్‌ని చూసి సిగ్గుతో తల తిప్పుకుని ఆగిపోయింది.
సిగ్గుతో మళ్లీ తిరిగి క్యాంటీన్‌లోకి వెళ్లిపోయింది.
---
శ్యామ్ పక్కకి తిరిగి చూస్తే అక్కడ ప్రేమ్ లేడు.
> "ఈడు ఎడి?"
అని రుక్మిణి వైపు చూస్తే, ప్రేమ్ అక్కడ రుక్మిణితో మాట్లాడేస్తున్నాడు.
> "నియబ్బా రే... నా కొంప ముంచావ్ కదరా!!"
అని అనుకున్నాడు శ్యామ్.
---
అక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలియక కొంచెం ముందుకి వెళ్లి, ఏం తెలియనట్టు చెట్టు చాటునుండి వింటున్నాడు.
ప్రేమ్:
> "అలా ఏం లేదు అండి...
ఈ పుస్తకం మా స్నేహితుడు శ్యామ్ రాశాడు...
కానీ ఇది పబ్లిష్ అవ్వాలి అంటే మీలాంటి తెలివైన వాళ్లు మంచి మనసుతో ముందుమాట రాస్తే, వాడు లైఫ్ సెట్ అవుతుంది."
అని అన్నాడు ప్రేమ్.
అప్పుడు రుక్మిణి కొంచెం కోపం నటిస్తూ:
> "ఎవరు మీరు... నేను ఎందుకు రాయాలి?
అయినా రాసినవాడు కదా వచ్చి అడగాలి...
నువ్వు ఎవరు? అతని తోకవా?
ఇక్కడ ఉన్నాడా మీ రచయిత?"
అని దబాయించింది ప్రేమ్‌ని.
---
> "నేను అదే చెప్పా అక్క... వాడు వింటే గా...
ఆ ముందుమాట ఏదో రాసేస్తే వాడు నన్ను వదిలేస్తాడు...
నేను హ్యాపీ... వాడు హ్యాపీ."
అని వినయంగా అడిగాడు ప్రేమ్.
---
> "మీరు ఇద్దరు హ్యాపీ అయితే నాకేం లాభం?"
అని అడిగింది రుక్మిణి.
> "ఇది ఏంట్రా బాబు... వాడికంటే పిచ్చిదిలా ఉంది..."
అని మనసులో అనుకుని,
> "అదిగో ఆ చెట్టు చాటున ఉన్నాడే వాడే శ్యామ్...
The great upcoming writer."
అని శ్యామ్‌ని చూపించేశాడు.
శ్యామ్ అని పేరు వినగానే రుక్మిణీ తన మనసులో "శ్యామ్...బాగుంది పేరు .." అని అనుకుంది ...
---
అప్పుడు శ్యామ్ భయంతో మొఖం తిప్పుకుని:
> "అమ్మదీనమ్మ... పెట్టావ్ కదరా ఫిట్టింగ్..."
అని దూరం నుండి ఒక చిరునవ్వు నవ్వి రుక్మిణికి చేయి ఊపాడు సిగ్గుతో.
ఇంకా రుక్మిణి కూడా చూసి చిన్నగా నవ్వేసరికి, మన శ్యామ్‌కి తన దగ్గరకి వెళ్లక తప్పలేదు.
---
అది ఏంటో, రుక్మిణి దగ్గరకి వెళ్లిన శ్యామ్ చేయి వణుకుతుంది...
ప్రేమ్:
> "రుక్మిణి గారు... రాసేయండి..."
అని అన్నాడు.
అప్పుడు శ్యామ్:
> "ఆ పుస్తకం చదివితే మీకు ఒక అవగాహన వస్తుంది...
దాన్ని బట్టి ముందుమాట రాయొచ్చు."
అని చాలా నెమ్మదిగా చెప్పాడు.
---
రుక్మిణి కూడా కొంచెం సిగ్గుతో ఆ పుస్తకం తీసుకుని:
> "సరే..."
అని చెప్పి గబగబా అక్కడి నుండి పరుగులు తీసింది.
అసలే అక్కడ తన స్నేహితులు కూడా లేరు పాపం.
---
అలా ముందుకి వెళ్లిన రుక్మిణి ఒకసారిగా వెనక్కి తిరిగి:
> "నాకు టైమ్ కావాలి...
నేనే రాసి ఇస్తా."
అని శ్యామ్‌కి సిగ్గుతో bye చెప్పి వెళ్లిపోయింది.
అప్పుడు శ్యామ్ కూడా ఎంతో ఆనందంతో సరే అని తల ఊపాడు.
---
రుక్మిణితో మాట్లాడిన ఆనందంలో శ్యామ్ ఆ వర్షంలో గెంతులు వేసాడు...
గట్టిగా అరిచాడు...
అది పక్కనుండి చూసి ప్రేమ్:
> "మాస్టారు... కొంచెం ఎక్కువ అయింది...
పద వెళ్దాం..."
అని దీమగా అన్నాడు.
అప్పుడు శ్యామ్:
> "నాకు అంత మంచి అమ్మాయి సెట్ అయ్యింది అని కుళ్లు రా నీకు...
కొంచెం సంతోషంగా ఉంటే ఓర్చుకోలేడు ఎదవ!"
అని అక్కడి నుండి నడుచుకుని వెళ్లిపోతాడు.
---
> "ఏంటి... ఒకసారి మాట్లాడినందుకే సెట్ అయ్యిపోయిందా?"
అని తల పట్టుకున్నాడు ప్రేమ్, శ్యామ్ మాటలకి.