Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
సమయం ఉదయం 5:49. > బయట జోరున వర్షం కురుస్తోంది. ఆకాశాన్ని దట్టమైన కారు మేఘాలు కమ్మేశాయి. ఊరికి దూరంగా, పాడుబడిన ఒక పెద్ద ఇల్లు... ఆ ఇంట్లోంచి గుండెలను పిండేసే చావు కేకలు వినిపిస్తున్నాయి. ఆ భయంకరమైన అరుపులకు అక్కడున్న కాకులన్నీ బెదిరిపోయి ఎగిరిపోయాయి.
అదొక చీకటి గది. మరీ గాఢమైన చీకటి కాదు కానీ, లోపలికి చాలా మసక వెలుతురు మాత్రమే పడుతోంది. లోపల ఓ ఇరవై ఆరేళ్ల యువకుడు... వెలుతురు లేకపోవడం వల్ల అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను నోటితో కొరికి పట్టుకుని, తన రక్తపు చేతులను కడుక్కుంటున్నాడు. అతని వెనక వైపు, చొక్కా మీద ఎవరో పదునైన గోళ్లతో రక్కిన రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అతని వెనుక ఉన్న మరో గదిలో ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వాళ్ల ఒళ్లంతా తీవ్రమైన గాయాలు. అయితే, వారిలో ఒకరిలో ఇంకా ప్రాణాలున్నాయి. మెల్లగా స్పృహలోకి వచ్చిన అతడు, దయనీయంగా తల తిప్పి చేతులు కడుక్కుంటున్న యువకుడిని చూశాడు. ఎదురుగా బయటకు వెళ్లడానికి వీలుగా గుమ్మం తలుపు తెరిచే ఉంది. కానీ, ఒళ్లంతా ఉన్న గాయాల వల్ల లేవలేని పరిస్థితి. భరించలేని నొప్పితో, సగం తెగిన తన కాలును ఈడ్చుకుంటూ నేల మీద ప్రాకుతూ గుమ్మం వైపు కదిలాడు.
గుమ్మం దగ్గరకు చేరుకోగానే ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ హంతకుడు అక్కడ కనిపించలేదు. ప్రాణాలు దక్కాయనుకుంటూ ఊపిరి పీల్చుకుని, బయటకు వెళ్లడానికి తలను గుమ్మం దాటించాడు. కానీ... ఉన్నట్లుండి పైనుంచి వచ్చిన ఓ గొడ్డలి అతని తలకాయను నిర్దాక్షిణ్యంగా నరికేసింది. ఆ క్షణంలోనే అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చిమ్మిన రక్తం గుమ్మానికి అంటుకుంది. ఆ కిల్లర్ తన గొడ్డలిని బలంగా లాగి, భుజంపై పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ మృగంలా గర్జించాడు. సరిగ్గా అదే సమయానికి పక్కనే ఉన్న చెట్టు మీద పిడుగు పడి మంటలు చెలరేగాయి.
సమయం ఉదయం 6:51.
బుచ్చిబాబు అనే కూలీ తన పాత గొడ్డలి పట్టుకుని, రాత్రి క్రైమ్ జరిగిన ఆ ఇంటి ముందు నుంచే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే ఆ ఇంటి గుమ్మం ముందు పడి ఉన్న మరో గొడ్డలి అతని కంట పడింది. అది తన పాత గొడ్డలి కంటే చాలా బాగుండటంతో, చేతిలో ఉన్నదాన్ని పక్కన పడేశాడు. "ఒరేయ్ బుచ్చిబాబు, ఇవాళ నక్క తోక తొక్కినట్టున్నావురా.. పదా!" అని తనలో తానే మురిసిపోతూ ఆ ఇంటి వాకిట్లోకి అడుగుపెట్టాడు.
కానీ... లోపల తెగి పడి ఉన్న తలను చూడగానే అతని వెన్నులో వణుకు పుట్టింది. క్షణాల్లోనే భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
THE CRIME RATE
By Ajay
Published: February 25, 2026 at 4:57 PM
Your input calibrates the database for others.
Ready to play...