SCREEN ON

Loading File

Chapter 2

Chapter 1
Chapter 2
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 1

SPACE Z

Chapter 2
Chapter 1
Chapter 2

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 2

Jump Now

Directory

01

Episode 1

Active
File // 01

Episode 1

నగరానికి దూరంగా, కొండల మధ్య విస్తరించి ఉన్న స్పేస్-Z రీసెర్చ్ సెంటర్ మాత్రం ఇంకా వెలుగులతో మెరిసిపోతోంది.
ఆ భవనంలోని అతి ఎత్తైన అబ్జర్వేషన్ డెక్‌పై ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు.

అతని పేరు ఆదిత్య.
వయసు ముప్పై రెండు.
వృత్తి — ఆస్ట్రానమికల్ సైంటిస్ట్.
గత పది సంవత్సరాలుగా అతని జీవితం నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, విశ్వం చుట్టూనే తిరుగుతోంది.

ఇతరులు ఆకాశాన్ని చూస్తే అందాన్ని చూస్తారు.
ఆదిత్య చూస్తే ప్రశ్నలను చూస్తాడు.
"మనమే విశ్వంలో ఒక్కరమా...?"
అది అతన్ని చిన్నప్పటి నుంచీ వెంటాడుతున్న ప్రశ్న.

ఆ రాత్రి కూడా అతను భారీ టెలిస్కోప్ ద్వారా దూరంగా మెరుస్తున్న నక్షత్రాలను గమనిస్తున్నాడు.
అప్పుడే వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించింది.

అతను తిరిగి చూశాడు.
అక్కడ ముగ్గురు సెక్యూరిటీ అధికారులు నిలబడి ఉన్నారు.
వారి వెనుక నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది అమృత.

స్పేస్-Z సంస్థ డైరెక్టర్.

ఆమె ముఖంలో ఎప్పుడూ కనిపించే ఆత్మవిశ్వాసం ఆ రాత్రి కనిపించలేదు.
ఆమె చేతిలో ఒక ఫైల్ ఉంది.
"ఆదిత్య..."
ఆమె స్వరం చాలా నెమ్మదిగా ఉంది.

"ఏమైంది మేడమ్?" అని అతను చిరునవ్వుతో అడిగాడు.

అమృత కొద్దిసేపు మాట్లాడలేదు.
తర్వాత ఆ ఫైల్ అతని చేతిలో పెట్టింది.
ఆదిత్య తెరిచి చూశాడు.
మొదటి పేజీ మీద పెద్ద అక్షరాల్లో రాసి ఉంది.

TERMINATION NOTICE

అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి.
ఒకసారి...
రెండుసార్లు...చదివాడు.
"ఇది జోక్ ఏదైనా?" అని అడిగాడు ఆదిత్య

అమృత సమాధానం చెప్పలేదు.
"నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా?" అని అడిగాడు ఆదిత్య

"అవును." అంది అమృత

ఆదిత్య :- "ఎందుకు?"

అమృత :- "ఆ విషయం చెప్పలేను."

ఆదిత్య :- "చెప్పలేరా... లేక చెప్పకూడదా?"

అమృత కళ్లలో ఒక విచిత్రమైన బాధ మెరిసింది.
అమృత :- "ఇది నా నిర్ణయం కాదు ఆదిత్య."
"అయితే ఎవరిది?"
మళ్లీ నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దమే అతనికి సమాధానం చెప్పింది.

స్పేస్-Z లో తనకంటే పై స్థాయిలో ఇంకెవరో ఉన్నారు.
ఆతనికి తెలియని ఎవరో.

అమృత :- "ఇప్పటి నుంచి నీ యాక్సెస్ రద్దు చేయబడింది."
ఆదిత్య :- "పది సంవత్సరాలు పనిచేసిన మనిషిని ఇలా బయటకు పంపిస్తారా?"

అమృత తల వంచుకుంది.
"క్షమించు."
ఆ ఒక్క మాటలో ఆమె అసహాయత స్పష్టంగా కనిపించింది.
సెక్యూరిటీ అధికారులు అతనిని బయటకు తీసుకెళ్లారు.
" అవసరం లేదు , నేనే వెళ్ళిపోతాను !" అని అన్నాడు ఆదిత్య
---

భవనం బయటకు వచ్చిన తర్వాత ఆదిత్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు.

స్పేస్-Z.
తన జీవితంలో సగం సమయం గడిపిన స్థలం.
ఇప్పుడు అది తనకు పరాయి అయిపోయింది.
పార్కింగ్ ఏరియాలో తన నల్లటి కార్ దగ్గరకు వెళ్లాడు.
అది అతని కార్ ఏ...
జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడు.
చాలా నెలల తర్వాత మళ్లీ సిగరెట్ వెలిగించాడు.
మొదటి పొగను నెమ్మదిగా బయటికి వదిలాడు.
చల్లని గాలి ఆ పొగను చీకటిలో కలిపేసింది.

అతని మనసులో మాత్రం ప్రశ్నల తుఫాను నడుస్తోంది.
"ఎందుకు?"
"నేను ఏ తప్పు చేశాను?"
"అమృత ఎందుకు అంత భయపడింది?"
అప్పుడే అతని దృష్టి కంపెనీ ప్రధాన భవనం మీద పడింది.
ఐదో అంతస్తులోని ఒక కిటికీ దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు.
ఆ వ్యక్తి నేరుగా ఆదిత్య వైపే చూస్తున్నాడు.
అంత దూరం నుంచి కూడా అతని కళ్లలో ఏదో విచిత్రం కనిపించింది.

సాధారణ మనిషి కళ్లలా లేవు.
వెలుతురు తగిలిన లోహంలా మెరుస్తున్నాయి.
ఆదిత్య కనురెప్పలు మూసి మళ్లీ చూశాడు.
ఎవరూ లేరు.
ఖాళీ కిటికీ మాత్రమే కనిపించింది.

"బహుశా అలసట అయి ఉంటుంది."
అని అనుకున్నాడు.
కానీ అతని గుండె మాత్రం మరో మాట చెబుతోంది.
ఏదో తప్పు జరుగుతోంది.
చాలా పెద్ద తప్పు.
అప్పుడే అతని ఫోన్ మోగింది.
స్క్రీన్ మీద కనిపించింది.

UNKNOWN NUMBER

ఆదిత్య కాల్ లిఫ్ట్ చేశాడు.
"హలో?"
అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
తర్వాత స్టాటిక్ శబ్దం.
చివరకు ఒక అపరిచిత స్వరం వినిపించింది.
చాలా నెమ్మదిగా...
గుసగుసలాడినట్టు...

"ఆదిత్య..."
అతని శరీరం ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది.
"ఎవరు మీరు?" అని అడిగాడు ఆదిత్య

"నువ్వు వెతుకుతున్న సమాధానాలు ఆకాశంలో లేవు." అని మాలి ఆ స్వరం వినిపించింది
ఆదిత్య :- "ఏమిటి?"

Caller:- "వాళ్లు ఇప్పటికే ఇక్కడ ఉన్నారు."

ఆదిత్య గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

ఆదిత్య :- "ఎవరు?"
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
కాల్ కట్ అయిపోయింది.

ఆదిత్య ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ నిలబడ్డాడు.
చేతిలో సిగరెట్ ఇంకా కాలుతూనే ఉంది.
పైకి చూసాడు.
ఆకాశంలో వేలాది నక్షత్రాలు మెరిసిపోతున్నాయి.
ఇప్పటివరకు అతను వాటి వైపు చూసి సమాధానాలు వెతికాడు.

కానీ ఆ రాత్రి...
మొదటిసారి...

అతని చూపు నక్షత్రాల నుంచి మనుషుల మీదకు మళ్లింది.
ఎందుకంటే...
బహుశా విశ్వం నుంచి వచ్చిన రహస్యం ఆకాశంలో కాదు...
మన మధ్యే దాగి ఉండొచ్చు.

ఆదిత్య కి ఏం అర్థం కాలేదు , కానీ ఇప్పుడు ఆదిత్య కి కనీసం ఉద్యోగం కూడా లేదు , ఆదిత్య చిన్నపాటి నుండి ఇంతే ! ఆతని జీవితం లో ఏం జరిగినా సరే , అతను ఏం కోల్పోయిన సరే ! , అది ఎంత విలువైనది అయ్యిన సరే , పోతే పోనీ , నేను ప్రాణాలతో ఉంటే ఎలాగోలా మాలి సాదిస్త అనే మనోబలం కలిగిన వ్యక్తి ........
ఇప్పుడు అతని జీవితాన్ని మాలి మొదటి నుండి మొదలు పెడతాడ! లేదా !
అసలు ఆ మరుస్తున కళ్ళు ఉన్న ఆ వ్యక్తి ఎవరు ?

SPACE Z

Published: June 18, 2026 at 7:40 AM

Do not copy, distribute, or steal. All rights reserved.

Evaluate File

Your input calibrates the database for others.

Ready to play...