SCREEN ON

Loading File

Chapter 2

Chapter 1
Chapter 2
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 1

Bhavana: The Destiny of Vikram

Chapter 2
Chapter 1
Chapter 2

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 2

Jump Now

Directory

01

Episode -1

Active
02

Episode -2

Locked
03

Epsiode -3

Locked
04

Epsiode -4

Locked
05

Epsiode -5

Locked
06

Episode -6

Locked
07

Episode -7

Locked
08

Episode -8

Locked
09

Episode -9

Locked
10

Episode -10

Locked
11

Episode -11

Locked
12

Episode -12

Locked
13

Episode -13

Locked
14

Episode -14

Locked
15

Episode -15

Locked
Chapter // 01

Episode -1

Moonuuu@16
Fantasy,Rom-com
1 Min Read
Pub: Jul 2, 2026

కథ ప్రారంభం

ఈ కథ విక్రమ్ 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని పాఠశాలలో ప్రారంభమవుతుంది.

విక్రమ్ చాలా అమాయకమైన అబ్బాయి. స్కూల్‌లో అతనికి పెద్దగా స్నేహితులు ఉండరు. అందరితో స్నేహం చేయాలని అతనికి చాలా కోరిక ఉంటుంది.

ఒక రోజు స్కూల్‌లో అతను ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమెతో స్నేహం చేయాలని అనుకుంటాడు. ధైర్యం చేసి ఆమె వైపు వెళ్లి మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. నిరాశతో విక్రమ్ తన తరగతికి వెళ్లిపోతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాడు.

విక్రమ్ తండ్రి ఒక బ్యాంకులో ఉద్యోగి. అతని తల్లి గృహిణి.

ఆ తరువాత ప్రతి రోజు ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాడు. కానీ ఆమె మళ్లీ ఎప్పుడూ కనిపించదు. చివరికి తన దృష్టిని పూర్తిగా చదువుపైనే కేంద్రీకరిస్తాడు.

విక్రమ్ పదో తరగతిలో 85% మార్కులతో ఉత్తీర్ణుడవుతాడు. తర్వాత ఇంటర్ చదవాలని నిర్ణయించుకుని ఒక కళాశాలలో చేరడానికి వెళ్తాడు. అక్కడ ఆశ్చర్యకరంగా అదే అమ్మాయిని మరోసారి చూస్తాడు.

కొన్ని నిమిషాల తర్వాత ఆమె మళ్లీ కనిపించదు. విక్రమ్ మొత్తం కళాశాలలో ఆమె కోసం వెతుకుతాడు. అతను ఎప్పుడూ విధిని (Destiny) నమ్మే వ్యక్తి.

ఇంటర్‌లో అతనికి మంచి స్నేహితులు దొరుకుతారు. వారి పేర్లు మణి, అజయ్, వినయ్. వారితో కలిసి కళాశాలలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతాడు.

ఒక రోజు ఆ అమ్మాయి గురించి తన మనసులోని భావాలను తన స్నేహితులతో పంచుకుంటాడు.

అదే సమయంలో సంజనా అనే అమ్మాయిని పరిచయం అవుతాడు. ఆమె విక్రమ్‌కు ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది.

విక్రమ్ తన కష్టాలు, సంతోషాలు అన్నింటినీ సంజనాతో పంచుకుంటాడు. ఇంటర్ మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఎంతో ఆనందపడతాడు.

కానీ రెండో సంవత్సరానికి వచ్చేసరికి అతని అదృష్టం పూర్తిగా మారిపోతుంది. చాలామంది అతన్ని పట్టించుకోవడం మానేస్తారు. అందరూ దూరమవుతున్న సమయంలో సంజనా మాత్రమే అతని పక్కన నిలబడుతుంది.

ల్యాబ్ ప్రాక్టికల్స్ సమయంలో విక్రమ్ అందరి టార్గెట్‌గా మారిపోతాడు.

మొదటి ప్రయత్నంలో విక్రమ్ 2A మరియు కెమిస్ట్రీ పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత సంజనా కూడా అతనికి దూరమవుతుంది. చివరకు విక్రమ్ పూర్తిగా ఒంటరివాడైపోతాడు.

రెండో ప్రయత్నంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి అన్ని సబ్జెక్టులను క్లియర్ చేస్తాడు.

ఆ తర్వాత ఇంజినీరింగ్ ప్రవేశం కోసం ఈఏపీసెట్ (EAPCET) పరీక్షకు దరఖాస్తు చేస్తాడు. కోచింగ్ సెంటర్‌కు వెళ్లినప్పుడు ప్రణీత్, రామ్, తేజ అనే కొత్త స్నేహితులను కలుస్తాడు.

వారి స్నేహం విక్రమ్ జీవితంలో కొత్త మార్పును తీసుకొస్తుంది. తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకుని, మరింత కష్టపడి కోచింగ్ పూర్తి చేసి మంచి ర్యాంక్ సాధించేందుకు ప్రయత్నిస్తాడు.

చివరకు ఈఏపీసెట్ పరీక్షలో 13,000 ర్యాంక్ సాధిస్తాడు.

తన స్వంత ఊరిని వదిలి, కాలేజ్ జీవితంలోని నిజాలను తెలుసుకోవడానికి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని విక్రమ్ నిర్ణయించుకుంటాడు.

Chapter Illustration
✧ ✧ ✧

Bhavana: The Destiny of Vikram

By Moonuuu@16

Published: July 2, 2026 at 10:22 AM

© 2026 Moonuuu@16. All rights reserved. Do not copy, distribute, or steal.

Intrigued?

Establish a free connection to access the rest of the archive, store memory files, and join the network.

Initiate Connection

Already registered? Log in

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...