Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
ఆ ఊరి చివరన...
చెట్ల మధ్యలో, మట్టి గోడలతో కట్టిన ఓ చిన్న ఇల్లు.
వర్షం వస్తే పైకప్పు కారుతుంది.
ఎండ వస్తే గోడలన్నీ వేడెక్కిపోతాయి.
కానీ...
ఆ ఇంట్లో మాత్రం ఒక తల్లి ప్రేమకు కొదవలేదు.
ఆమె పేరు కుమారి.
ఆమెకు ఉన్న ప్రపంచం ఒక్కటే.
ఆమె తొమ్మిదేళ్ల కొడుకు...
నాని బాబు.
తెల్లవారుజామున ఐదు గంటలు.
ఊరంతా ఇంకా నిద్రలోనే ఉంది.
కానీ కుమారి మాత్రం అప్పటికే లేచిపోయింది.
చిన్న కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని మంట వెలిగిస్తోంది.
పొగతో కళ్ళు మండుతున్నా...
ఆమె ముఖంలో మాత్రం చిన్న చిరునవ్వు.
పక్కనే ఉన్న చిన్న గిన్నెలో కొద్దిగా బియ్యం.
అంతే.
ఆ రోజు ఇంట్లో ఉన్న ఆహారం అదే.
కుమారి ఆ బియ్యంతో పల్చటి గంజి తయారు చేస్తోంది.
అప్పుడే...
పక్కనే ఉన్న పాత చాప మీద నుంచి ఓ చిన్న గొంతు వినిపించింది.
"అమ్మా..." అని నాని బాబు అన్నాడు...
కుమారి వెనక్కి తిరిగి చూసింది.
చాప మీద నుంచి కళ్ళు రుద్దుకుంటూ నాని బాబు లేచాడు.
జుట్టంతా చెదిరిపోయి ఉంది.
కళ్ళలో ఇంకా నిద్ర.
"లేచావా నానీ?"
నాని బాబు ఆవలిస్తూ...
"అమ్మా... ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు?" అని అడిగాడు..
కుమారి నవ్వింది.
"నువ్వు స్కూలుకి వెళ్లాలి కదా బాబు."
నాని బాబు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.
"అయ్యో... ఇవాళ స్కూలా?"అని అన్నాడు నాని
"అవును."అని అంది వల్ల అమ్మ
"ఇంకొంచెం సేపు పడుకుంటా అమ్మా..."
అంటూ మళ్ళీ చాప మీద పడుకోబోయాడు.
కుమారి నవ్వుతూ అతని దగ్గరికి వచ్చింది.
"ముందు లేచి మొహం కడుక్కో. నీకు గంజి చేశాను."
నాని బాబు వెంటనే లేచాడు.
"గంజా?"
అతను గిన్నెలోకి చూశాడు.
అందులో ఉన్న పల్చటి గంజిని చూసి...
అతని ముఖంలోని చిరునవ్వు కొంచెం తగ్గింది.
నాని:- "అమ్మా..."
కుమారి:- "ఏంటి బాబు?"
నాని:- "మళ్ళీ గంజేనా?"
కుమారి కాసేపు మౌనంగా ఉంది.
తర్వాత నవ్వుతూ...
"నీకు ఇష్టమే కదా?"
నాని బాబు తల ఊపాడు.
"ఇష్టం..."
కానీ అతని కళ్ళు మాత్రం నిజం చెప్పాయి.
అతనికి గంజి ఇష్టం కాదు.
అమ్మ వేరే ఏమీ పెట్టలేకపోవడం అతనికి బాధ.
కుమారి గిన్నె అతని చేతిలో పెట్టింది.
"నువ్వు తిను బాబు."
నాని బాబు గిన్నెను తీసుకోలేదు.
నాని:- "మరి నువ్వు?"
కుమారి :- "నేను తిన్నాను."
నాని బాబు వెంటనే ఆమె వైపు చూశాడు.
"ఎప్పుడు?"
కుమారి ఒక్క క్షణం ఆగిపోయింది.
"అది... నువ్వు నిద్రపోతున్నప్పుడు."
నాని బాబు ఆమెను చూస్తూనే ఉన్నాడు.
అతనికి అర్థమైంది.
అమ్మ అబద్ధం చెబుతోంది.
అతను గిన్నెలోని గంజిని రెండు భాగాలుగా చేశాడు.
ఒక భాగం తన ముందు పెట్టి...
మరో భాగాన్ని అమ్మ ముందు పెట్టాడు.
నాని:- "ఇదిగో."
అమ్మ:- "నాకు వద్దు బాబు."
నాని:- "ఎందుకు?"
అమ్మ:- "నాకు ఆకలి లేదు."
నాని బాబు చిన్నగా కోపంగా ముఖం పెట్టాడు.
"నాకు కూడా ఆకలి లేదు."
కుమారి నవ్వింది.
"నువ్వు తింటేనే నేను తింటా."
కుమారి కొడుకు ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది.
తర్వాత అతని తల నిమిరింది.
అమ్మ :-"సరే రా... ఇద్దరం కలిసి తిందాం."
ఆ గంజి ఇద్దరికీ సరిపోదు.
కానీ...
ఆ చిన్న ఇంట్లో ఆ రోజు కూడా ఆకలి కంటే ప్రేమే ఎక్కువగా ఉంది.
నాని బాబు వయసు తొమ్మిది సంవత్సరాలు.
అతని ప్రపంచం చాలా చిన్నది.
స్కూలు...
స్నేహితులు...
ఆటలు...
చిన్న చిన్న కోరికలు...
మరియు...
అమ్మ.
అతనికి పెద్ద పెద్ద కలల గురించి ఏమీ తెలియదు.
డబ్బు విలువ కూడా పూర్తిగా తెలియదు.
కానీ ఒక విషయం మాత్రం బాగా తెలుసు.
తన అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండదు.
ఇంట్లో అన్నం తక్కువగా ఉన్నప్పుడు అమ్మ తినదు.
కొత్త బట్టలు కొనాల్సి వచ్చినప్పుడు అమ్మ తన కోసం ఏమీ
కొనదు.
తనకు స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు అమ్మ ఎవరో ఒకరి
దగ్గర డబ్బు అడుగుతుంది.
అది నాని బాబుకు నచ్చదు.
అందుకే అతని చిన్న మనసులో ఒక కోరిక పుట్టింది.
నాని:- "నేను పెద్దయ్యాక చాలా డబ్బులు సంపాదించాలి."
అమ్మ :- ఎందుకో?
అతనికి తెలుసు.
అమ్మ కోసం.
ఆ రోజు నాని బాబు స్కూలుకి బయలుదేరాడు.
భుజానికి పాత బ్యాగ్.
కాళ్ళకు అరిగిపోయిన చెప్పులు.
చేతిలో ఒక చిన్న స్టీల్ బాక్స్.
స్కూల్ దారిలో నడుస్తూ ఉండగా...
ఒక పెద్ద కారు అతని పక్కనుంచి వెళ్లింది.
కారు లోపల అతని వయసున్న ఓ పిల్లాడు కూర్చుని
ఉన్నాడు.
అతని చేతిలో ఖరీదైన టాబ్లెట్.
పక్కనే అతని తల్లి.
కారు నాని బాబును దాటి వెళ్ళిపోయింది.
నాని బాబు మాత్రం ఆ కార్ వైపు చూస్తూ నిలబడిపోయాడు.
అతని స్నేహితుడు రాము వెనక నుంచి వచ్చి అడిగాడు.
"ఏరా నానీ?"
నాని బాబు కారు వైపు చూస్తూ...
"రాము..."
"ఏంటి?"
"వాళ్ళకి అంత పెద్ద కారు ఉంది కదా."
"అవును."
"మనం కూడా కొనుక్కుందామా?"
రాము నవ్వాడు.
"మనం? మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది రా?"
నాని బాబు ఏమీ అనలేదు.
కాసేపు ఆలోచించాడు.
తర్వాత చాలా అమాయకంగా అన్నాడు.
"నేను పెద్దయ్యాక చాలా డబ్బులు సంపాదిస్తా."
"ఎందుకు?"
నాని బాబు చిరునవ్వు నవ్వాడు.
"మా అమ్మకి పెద్ద ఇల్లు కడతా."
రాము ఆశ్చర్యంగా చూశాడు.
"మరి నీకు?"
నాని బాబు భుజాలు ఎగరేశాడు.
"నాకు ఏమీ వద్దు."
"ఎందుకు?"
"అమ్మ నవ్వితే చాలు."
మధ్యాహ్నం స్కూల్ అయిపోయింది.
నాని బాబు ఇంటికి వెళ్లకుండా...
ఊరి చివర ఉన్న చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్లాడు.
అక్కడ అతని అమ్మ పని చేస్తోంది.
కుమారి గ్లాసులు కడుగుతూ ఉంది.
నాని బాబు ఆమెను చూసి వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
"అమ్మా!"
కుమారి వెనక్కి తిరిగి చూసింది.
"స్కూల్ అయిపోయిందా?"
నాని:- "అయిపోయింది."
"భోజనం చేశావా?"
"చేశాను."
కుమారి అతని ముఖం చూసింది.
"నిజం చెప్పు."
నాని బాబు నవ్వాడు.
"లేదు."
కుమారి నిట్టూర్చింది.
"రా..."
తన దగ్గర ఉన్న చిన్న ప్యాకెట్ తెరిచింది.
అందులో రెండు ఇడ్లీలు.
"ఇవిగో."
నాని బాబు ఆశ్చర్యపోయాడు.
"నువ్వు తిన్నావా?"
కుమారి నవ్వింది.
"నేను తిన్నాను."నాని బాబు వెంటనే అడిగాడు.
"నిజంగానా?"
"నిజంగానే."
ఈసారి మాత్రం కుమారి అబద్ధం చెప్పడం నాని బాబుకి తెలియలేదు.
అతను ఇడ్లీ తినడం మొదలుపెట్టాడు.
కుమారి అతన్ని చూస్తూ చిరునవ్వు నవ్వింది.
సాయంత్రం.
ఇంటికి వచ్చిన తర్వాత...
నాని బాబు తన స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టాడు.
తర్వాత చిన్న ఇనుప డబ్బా తీసుకొచ్చాడు.
అందులో అతను దాచుకున్న కొన్ని నాణేలు ఉన్నాయి.
ఒక రూపాయి...
రెండు రూపాయలు...
ఐదు రూపాయలు...
అతని మొత్తం పొదుపు.
అతను వాటన్నింటినీ నేల మీద పెట్టి లెక్కపెట్టాడు
ఒకటి..."
"రెండు..."
"మూడు..."
"నాలుగు..."
"ఐదు..."
కుమారి అతన్ని చూసి నవ్వింది.
"ఏం చేస్తున్నావురా?"
నాని బాబు వెంటనే డబ్బులు దాచేశాడు.
"ఏం లేదు!"
"చూపించు."
"చూపించను."
"ఎందుకు?"
నాని బాబు చిన్నగా నవ్వాడు.
"సీక్రెట్."
కుమారి అతని చెంపను నొక్కింది.
"సరే... నీ సీక్రెట్ నీ దగ్గరే ఉంచుకో."
నాని బాబు తనలో తాను అనుకున్నాడు.
"ఇంకా చాలా డబ్బులు దాచాలి."
"పెద్దయ్యాక..."
"అమ్మకి పెద్ద ఇల్లు కడతా."
ఆ రాత్రి...
కుమారి నాని బాబును తన పక్కన పడుకోబెట్టుకుంది.
బయట వర్షం మొదలైంది.
పైకప్పు నుంచి నీళ్లు చుక్కలుగా ఇంట్లోకి పడుతున్నాయి.
కుమారి ఒక బకెట్ పెట్టింది.
మరో చోట మరో గిన్నె పెట్టింది.
నాని బాబు అది చూస్తూ...
"అమ్మా..."
"ఏంటి బాబు?"
"మన ఇంటికి కూడా ఒకరోజు పైకప్పు మార్చుకుందామా?"
కుమారి అతని వైపు చూసింది.
"తప్పకుండా."
"ఎప్పుడు?"
కుమారి నవ్వింది.
"నువ్వు పెద్దయ్యాక."
నాని బాబు వెంటనే అన్నాడు.
"అయితే నేను త్వరగా పెద్దవాడిని అవుతా."
కుమారి నవ్వుతూ అతన్ని దగ్గరికి తీసుకుంది.
"ఎందుకురా?"
"నీకు మంచి ఇల్లు కట్టడానికి."
కుమారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
"నాకు మంచి ఇల్లు వద్దు బాబు."
"మరి?"
ఆమె అతని నుదుటిపై ముద్దు పెట్టింది.
"నువ్వు బాగా చదువుకుని మంచి మనిషివి అయితే చాలు."
నాని బాబు అమాయకంగా అడిగాడు.
"అమ్మా... మంచి మనిషి అయితే డబ్బులు వస్తాయా?"
కుమారి నవ్వింది.
"డబ్బులు వస్తాయో రావో తెలియదు."
"అయితే నేను రెండూ అవుతా."
"ఏంటవి?"
"మంచి మనిషిని కూడా..."
"డబ్బున్నవాడిని కూడా."
కుమారి అతన్ని గట్టిగా హత్తుకుంది.
"అలాగే రా..."
ఆ రాత్రి...
నాని బాబు నిద్రపోయాడు.
కానీ కుమారికి మాత్రం నిద్ర రాలేదు.
అతని ముఖాన్ని చూస్తూ...
ఆమె మెల్లగా అతని జుట్టు సవరించింది.
"నువ్వు ఏదో ఒకరోజు చాలా పెద్దవాడివి అవుతావురా..."
ఆమె కళ్ళల్లో కన్నీళ్లు.
"కానీ..."
"నువ్వు పెద్దవాడివి అవ్వకముందే..."
ఆమె గొంతు వణికింది.
"నీ బాల్యం నీ దగ్గర నుంచి పోకూడదు.
మరుసటి రోజు ఉదయం.
నాని బాబు స్కూలుకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
అప్పుడే...
వారి ఇంటి ముందు ఒక నల్లటి కారు ఆగింది.
కుమారి బయటకు వచ్చింది.
కారు నుంచి ఓ అపరిచిత వ్యక్తి దిగాడు.
అతని చేతిలో ఒక కవర్.
"ఇది కుమారి ఇల్లేనా?"
కుమారి అతని వైపు అనుమానంగా చూసింది.
"అవును... ఎవరు మీరు?"
ఆ వ్యక్తి కవర్ ఆమె చేతిలో పెట్టాడు.
"ఇది మీ కొడుకు కోసం."
కుమారి ఆశ్చర్యపోయింది.
"నా కొడుకా?"
"అవును."
"ఎవరు పంపించారు?"
ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు.
కేవలం ఒక్క మాట అన్నాడు.
"దీన్ని జాగ్రత్తగా చదవండి."
అని చెప్పి కారులోకి ఎక్కి వెళ్లిపోయాడు.
కుమారి కవర్ తెరిచింది.
లోపల...
ఒక పాత ఫోటో.
ఆ ఫోటోలో...
కుమారి.
ఆమె పక్కన ఆమె భర్త.
మరియు...
ఒక తల్లి దాచిన గతం ఉంది.
ఒక కొడుకు తెలియని రహస్యం ఉంది.
మరియు...
నాని బాబు జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ప్రమాదం ఉంది.....
nani babu
By nani babu
Published: August 23, 2026 at 5:31 PM
Your input calibrates the database for others.
Ready to play...