SCREEN ON

Loading File

Chapter 2

Chapter 1
Chapter 2
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 1

Romantic cyclone

Chapter 2
Chapter 1
Chapter 2

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 2

Jump Now

Directory

01

Episode 1

Active
Chapter // 01

Episode 1

గతం :-

"మనోహర్... నీకు తెలుసా? మీ నాన్న మొదట్లో బూట్లు పాలిష్ చేసేవాడు." అని అంది మనోహర్ వాళ్ళ నాన్నమ్మ

చిన్నప్పటి నుండి ఈ మాటను వందల సార్లు విన్నాడు మనోహర్.

వారి ఇంటి మేడ మీద రాత్రి పడుకునే ముందు,నాన్నమ్మ తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ కథ చెప్పేది.

"మీ నాన్న రోడ్డుమీద కూర్చుని బూట్లు పాలిష్ చేసేవాడు రా. వర్షం పడినా, ఎండ మండినా పని ఆపేవాడు కాదు. ఆ కష్టం వల్లే మీ నాన్న నిన్ను చదివిస్తున్నారు. మీ నాన్న కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఢిల్లీ లో చదువుకుంటునవ్ అంటే ఆ చెమట ఫలితం."

అమ్మమ్మ కళ్లలో గర్వం కనిపించేది.

కానీ చిన్న మనోహర్ మాత్రం ఆ కథ వింటూ...

"అమ్మమ్మా... ఇదే కథ నిన్న కూడా చెప్పావు కదా!"

అనేవాడు.

"అందుకే మళ్లీ చెప్తున్నా. ఎక్కడికి వెళ్లినా ఈ ఇల్లు మర్చిపోవద్దు."

అమ్మమ్మ నవ్వేది.

కానీ విధికి తన ప్లాన్ వేరే ఉంది.

ఇప్పుడున్న మనోహర్...

లండన్‌లోని ప్రముఖ ఆర్కిటెక్ట్.

ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు.

లండన్ నగర మధ్యలో ఉన్న ఒక పెద్ద ఆర్కిటెక్చర్ కంపెనీలో సీనియర్ డిజైనర్.

అతని కల?

తన అమ్మానాన్నలను కూడా లండన్ తీసుకెళ్లడం.

కానీ ఒక సమస్య.

ఆ సమస్య పేరు...

"రాఘవయ్య"

అంటే మనోహర్ తండ్రి.

"నేను ఈ ఇల్లు వదిలి ఎక్కడికీ రాను."

అనేది ఆయన ఫైనల్ డెసిషన్.

మనోహర్ :- "నాన్నా! అక్కడ మంచి హెల్త్ కేర్ ఉంటుంది."

రాఘవయ్య:- "వద్దు."

మనోహర్ :- "మంచి సౌకర్యాలు ఉంటాయి."

రాఘవయ్య:-"వద్దు."

మనోహర్ :-"నేను దగ్గరగా ఉంటాను."

రాఘవయ్య:-"అయినా వద్దు."

మనోహర్ :-"ఎందుకు నాన్న?"

అంటే...

రాఘవయ్య తన ఇంటి గోడలను చూస్తూ చెప్పేవాడు.

"ఈ ఇంటి ప్రతి ఇటుకలో నా చెమట ఉంది రా. నేను పేదోడిగా మొదలుపెట్టాను. ఇప్పుడు నా కొడుకు లండన్‌లో ఉన్నాడు. ఈ ఇల్లు వదిలి వెళ్తే నా జీవితమే వదిలేసినట్టు ఉంటుంది."

అప్పుడు మనోహర్ నోరు మూసుకునేవాడు.

---

ప్రస్తుతం

ఆ రోజు ఉదయం.

లండన్.

మనోహర్ తన ఆఫీస్‌కు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

అప్పుడే ఫోన్ మోగింది.

స్క్రీన్ మీద...

AMMA CALLING...

మనోహర్ ముఖం మాడిపోయింది.

"అయ్యో... ఇవాళ్టి సంబంధం వచ్చేసిందన్నమాట."

అని ఫోన్ ఎత్తాడు.

మనోహర్ :-"చెప్పమ్మా."

జయంతి:- "రేయ్ ! చాలా మంచి సంబంధం వచ్చింది."

మనోహర్ తల పట్టుకున్నాడు.

మనోహర్ :-"మళ్లీ మొదలెట్టావా అమ్మా?"

జయంతి:-"ఈసారి నిజంగా మంచి అమ్మాయి."

మనోహర్ :-"గత వారం కూడా అదే అన్నావ్."

జయంతి:-"అది వేరే. ఇది వేరే."

మనోహర్ :-"అమ్మా! కనీసం నేను ఆ అమ్మాయిని చూడాలి కదా?"

అని అడిగాడు.

అవతల జయంతి నవ్వింది.

జయంతి:-"నీ సంగతే నాకు తెలియదా? నువ్వు చూసిన ప్రతి సంబంధం చెడగొట్టడమే కదా."

మనోహర్ :-"అమ్మా..."

జయంతి:-"ఎన్ని సంవత్సరాలు ఇలా తిరుగుతావు? నిజం చెప్పు. అక్కడ ఏదైనా తెల్ల పిల్లను పట్టుకుని తిరుగుతున్నావా?"

మనోహర్ నవ్వాడు.

మనోహర్ :-"అబ్బా! ఇక్కడ అలాంటిదేమీ లేదు అమ్మా. ఒక అమ్మాయితో మాట్లాడడమే రాదు నాకు. ఇంక లవ్ అంటావా?"

అని చెప్పాడు.

అచ్చం అదే సమయంలో...

వెనుకనుంచి ఒక అమ్మాయి వచ్చి అతని చేతిని పట్టుకుంది.

Jassi :- "Hey Honey! Who is that?"

మనోహర్ గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయ్యింది.

జయంతి:-"ఒరేయ్...!"

అవతల ఫోన్‌లో జయంతి కేక వేసింది.

జయంతి:-"ఏంట్రా? ఆడ గొంతు వినిపించింది! ఎవరు అది?"

మనోహర్ :-"చా చా... మా మేడమ్ అమ్మా."

అన్నాడు మనోహర్.

కానీ ఆ తెల్ల పిల్ల అక్కడే ఆగలేదు.

Jassi :-"Is she Atthaya? That you asked me to call your mom?"

అంది అమాయకంగా.

జయంతికి ఇంగ్లీష్ రాకపోయినా...

ఒక్క మాట మాత్రం స్పష్టంగా వినిపించింది.

"అత్తయ్య."

అంతే.

జయంతి:-"అయ్యో రామా!"

అని అరవడం మొదలుపెట్టింది.

జయంతి:-"నా కొడుకు ఎంత పని చేసేశాడు! శ్రీరామచంద్రుడిలా ఉన్న నా బిడ్డను ఏదో విదేశీ పిల్ల బుట్టలో వేసుకుని తట్టలో మూసేసిందిరా! దేవుడా !! "

మనోహర్ :-"అమ్మా!"

జయంతి:-"అయ్యో! నేను బతికి ఉండగానే కోడలిని తీసుకొచ్చాడా?"

మనోహర్ :-"అమ్మా! అమ్మ నువ్వు బ్రతిఉన్నపుడే కదే పెళ్లి చేసుకునేది పిల్లని కనేది !! నేను "

జయంతి:-"నేను ఇక ఏ ముఖం పెట్టుకుని బంధువుల దగ్గరకు వెళ్లాలి?"

మనోహర్ నుదుటిపై చెమటలు పట్టాయి.

ఒకవైపు అమ్మ.

మరోవైపు జస్సీ.

ఎవరిని కాపాడాలో అర్థం కాలేదు.

ఆ పరిస్థితిలో జస్సి గురించి కుంచం నోరు జారడు

మనోహర్ :-"అబ్బా! ఊరుకో అమ్మా! అది పిచ్చిది. Aunty అన్న మాటను Atthaya అనుకుంటోంది అంతే."

అని గట్టిగా చెప్పాడు.

అదే సమయంలో...

జస్సీ మొహం మారిపోయింది.

ఎందుకంటే ఆమె ఫోన్‌లో ఉన్న AI ట్రాన్స్‌లేటర్ ఒక్కసారిగా మాట్లాడింది.

A.I chatbot:- "He is calling you mad. He says you don't understand their language."

అంది మిషన్ గొంతుతో.

జస్సీ కళ్లు పెద్దవయ్యాయి.

Jassi :-"WHAT?"

మనోహర్ నోరు తెరిచి నిలబడ్డాడు.

మనోహర్ :-"నో... నో... జస్సీ..."

Jassi :-"YOU CALLED ME MAD?"

మనోహర్ :-"Listen..."

Jassi :-"NO!"

అని అరిచింది.

అప్పటి వరకు అతని చేతిని పట్టుకున్న జస్సీ...

చేతిని వదిలేసింది.

Jassi :-"Let's break up."

అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది.

మనోహర్ విగ్రహంలా నిలబడ్డాడు.

ఒకవైపు...

ప్రేమ పోయింది.

మరోవైపు...

ఫోన్‌లో అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంది.

జయంతి:-"రా ఇండియాకి చెప్తా నీ పని ! "

మనోహర్ కళ్లుమూశాడు.

"అమ్మా...దొరక్క దొరక్క మంచి పిల్ల దొరికితె బ్రేకప్ అయ్యేలా చేసావ్ కదే !! "

అన్నాడు.

అవతల రెండు సెకన్లు నిశ్శబ్దం.

ఆ తర్వాత...

జయంతి:-"అంటే ఇంకా మంచి వార్త! వెంటనే టికెట్ బుక్ చేసుకో."

అంది జయంతి ఆనందంగా.

మనోహర్ తలని గోడకు కొట్టుకోవాలనిపించింది.

ఇప్పటికే గర్ల్‌ఫ్రెండ్ పోయింది.

ఇక ఇండియా వెళ్తే...

పెళ్లి చూపులు, సంబంధాలు, అమ్మ డ్రామాలు.

మరి ఈ కష్టాలన్నింటి మధ్య...

తన జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయబోయే ఒక అమ్మాయి అతని కోసం ఎదురుచూస్తోందని మాత్రం మనోహర్‌కి ఇంకా తెలియదు...

Romantic cyclone

By Writer_aj

Published: June 18, 2026 at 4:45 PM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...