SCREEN ON

Loading File

Chapter 2

Chapter 1
Chapter 2
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 1

The epic

Chapter 2
Chapter 1
Chapter 2

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 2

Jump Now

Directory

01

అయోధ్యకాండ

Active
Chapter // 01

అయోధ్యకాండ

ముందు మాట :-

నేను ఈ కథని ఒక శ్రీరాముని అభిమానించే వ్యతిగా రాసిన కథ గా భావించి తప్పులు ఏం అన్న ఉంటే పెద్ద మనసుతో మీరు నన్ను క్షమిస్తారు అని భావిస్తూ , ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి ధర్మం గా ఉంటూ ఒక మనిషి అతని జీవితం ఎలా గడపాలో తెలియజేయడానికి నాకు శ్రీ రాముడి కథ కన్న గొప్ప వైభవం ఉన్న కథ కానరాలేదు ! 🙏🏻 ఈ కథ లో మంచి విషయాలు తెలుసుకుని మీ జీవన విధానం లో పాటించాలి అని నా చిన్న ప్రయత్నం !

కథ :-

అయోధ్యకాండ

దశరథుని రెండోవ భార్య అయిన కైకేయి ఆమె అంతఃపురం లో ఉంది , ఆమె అంతఃపురం యెుక్క మెడ వరండా నుండి శ్రీ రాముని పట్టాభిషేకం యొక్క ఆఆర్పట్టు ఎంతో ఘనం గా జరగడం చూస్తుంది , రాజ్య ప్రజలు శ్రీ రాముడికి జై జై లు కొడుతున్నారు , తెల్లవారితే రాముడు చక్రవర్తి అవుతాడు ....

అని కైకేయి ఆమె మనసులో అనుకుంది సంతోషం గా , అప్పుడే ఆమె గది లోకి మందర అనే దాసి వచ్చింది ...

మందర :-"చిన్న రాణి వారికి ప్రణామములు !" అని కైకేయి నీ గౌరవంగా పిలిచింది ,

కైకేయి నీ అందరూ చిన్న రాణి అని పిలుస్తారు ...

ఏమిటో చెప్పమనటు కైకేయి తల ఊపింది ....

మందర :- " మీ సంతోషానికి కారణం ఏమిటి చిన్న రాణి !"

అని అడిగింది , ఆ మాట వినగానే కైకేయి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది , కానీ మందర కైకేయి నీ మాట్లాడనివ్వకుండ మధ్యలోనే అడ్డుకుని ఇలా అంది మాలి

మందర :- " ఆ రాముడి చక్రవర్తి అయితే ఆ కౌసల్య కి అధికారం వస్తుంది , ఎలాగో రాజ్య ప్రజలు అందరూ కౌసల్య నీ తమ మహా రాణి గా చూస్తున్నారు , మహా రాణి అనే హోదా ఆమెకే ! మహారాజు గారి మొదటి భార్య గా గావురవం కూడా ఆమెకే ! ఇంకా ఆ రాముడు పట్టాభిషిక్తుడైతే మీకు ఉన్న విలువ కూడా ఉండనివ్వరు " అని కైకేయి మనసు పాడు చేద్దాం అని ప్రయత్నించింది !

కైకేయి కోపం తో :- " నన్ను ఎమరిచే ప్రయత్నం చేయకు ! రాముడికి అతని సోదరులు అంటే ఎంతో ప్రేమ అభిమానం " అని అంది,

అప్పుడు మందర :- " అవును అమ్మ ...కానీ రాజ్యం చేతికి వచ్చాక కూడా అల ఎవరు ఉంటారు ! భరతుడిని తప్పించాలి అని అనుకుంటే ! రాజు ముందు చేసే పని ఏంటి అంటే , చక్రవర్తి అనే పిలుపు కోసం అడ్డుగా మారతారు అని అనిపిస్తే భరతుడిని తప్పించాడు అని నమ్మకం ఏంటి ? హామీ ఏంటి ? " అని గుచ్చి గుచ్చి చెప్పింది , మెల్లమెల్లగా కైకేయి కి రాముడి మీద ఉన్న ప్రేమ , మందర మాటలవాళ్ళ తగ్గుతూ వచ్చింది , భయం ఏర్పడింది , భరతుడిని ఏం చేస్తారో అని ....

అది గమనించిన మందర ఇదే సరైన సమయం అని

:- " అమ్మ పూర్వం యుద్ధం లో మహా రాజు గారితో ఫల్గుణి వీర సాహసం చేసి పొందిన ఆ రెండు వరాలు ఉన్నాయి గా అవి ఉప్పయోగించి రాముడిని చక్రవర్తి గా తప్పించండి !' అని సలహా ఇచ్చింది ....

అయితే ఆ రెండు వరాల కథ ఏంటి ?

కథ :-

పూర్వం దశరథ మహా రాజు దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన గోరాయుధం లో పల్గున్నాడు , దశరథుని తోడుగా వీరవనిత అయినా కైకేయి కూడా ఉంది ! అయితే ఆ గోర యుద్ధం లో దశరథుడు చాలా దారుణం గా గాయపడ్డాడు , అదే సమయం లో అతని రథం మీద పట్టు కోల్పోయాడు , సరిగా అదే సమయం లో రథ చక్రం కూడా రథం తో పట్టు కోల్పోయింది ! అప్పుడు కైకేయి ఆమె స్థితప్రజ్ఞత చాటింది ! పట్టు కోల్పోయిన రాధని , రథ చక్రని అదుపు లో పెట్టీ దశరథ మహారాజు నీ కాపాడింది ! యుద్ధం ముగిశాక దశరథుడు కైకేయి ధైర్య సాహసాలను మెచ్చుకుని ఆమెకి రెండు వరాలు ఇచ్చాడు , అయితే అప్పుడు కైకేయి ఇలా అంది " స్వామి ముల్లోకాలను జేయించగలిగే భర్తగా మీరు ఉండగా నాకు ఇంకా ఈ వరాలు ఎందుకు !" అని అంది , అప్పుడు దశరథుడు:- " కైకేయి నువ్వు చేసింది ఏమి చిన్న సాహసం కాదు ! పర్లేదు కోరుకో ! ఆ చంద్ర మండలాన్ని సైతం తీసుకొస్త!" అని పలికాడు , అప్పుడు కైకేయి ఎంతో పతి భక్తి తో ఇలా అంది:-" మహారాజా !వరాలు కోరెంత అవసరం లేదు , ఎప్పుడైనా అవసరం అయ్యినప్పుడు కొరతను !" అని పలికింది !!

.............

ప్రస్తుతం :-

ఈ లోపున రాముడి పట్టాభిషేకానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ పూర్తిచేసిన దశరథ మహారాజు కైకేయిని చూడగోరి ఆమె సౌధానికి తిరిగి వచ్చాడు. చిన్నరాణి కోసం ఆశతో వచ్చిన దశరథ మహారాజుకు తాను ఆమె గదిలో అడుగుపెట్టగానే ఆమె కనిపించకపోయేసరికి ఆశ్చర్యపడ్డాడు. దగ్గరలోనే వుండి వుంటుందని ఆమెను పేరుపెట్టి పిలిచాడు.కాని బదులులేకపోవటంతో ఆయనకు అనుమానం కలిగింది - ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ ఆమె చెప్పకుండా తన గృహాన్ని వీడి వెళ్ళలేదు. చివరకు ఒక దాసిని అడుగగా కైకేయి కోపగృహంలోకి వెళ్ళినట్లు దశరథ మహారాజుకు తెలియవచ్చింది. ఆందోళిత హృదయంతో ఆయన హడావిడిగా అక్కడకు వెళ్ళాడు.

గదిలోకి ప్రవేశించిన మహారాజు అక్కడ కైకేయి కటిక నేలపై పడి ఉండటం చూచి దిగ్భ్రాంతికి లోనైనాడు. ఆమె ఆభరణాలు, దండలు చుట్టూ పడిఉన్నాయి. ఆమె దివినుండి భువిపై వడిన అప్సరసలా వుంది. అందమైన తరుణియైన కైకేయి మహారాజు మనస్సులో ప్రాణాధికమైన ప్రియురాలు. అందువల్ల ఆమెను అలాంటి స్థితిలో చూసి ఆయన తీవ్రమైన వేదనకు, ఆందోళనకు లోనైనాడు.

మోకాళ్ళమీద నిలిచి మహారాజు ప్రేమమీర ఆమె ముఖాన్ని నిమురుతూ “నా ప్రియమైన కైకేయీ! నీకు వచ్చిన బాధ ఏమిటి? నీ విషాదానికి కారణమేమిటి? ఎందుకు అలా విచారం గా ఉన్నావు " అని అడిగాడు మహారాజు.

కానీ ఆ మాటలు విన్న కాకేయి మాత్రం ఏమి మాట్లాడలేదు , కాసేపు మౌనం అలముకుంది !

కొద్దిసేపు మౌనంగా వున్న మీదట కైకేయి "ఎవరూ నన్ను అవమానించటంగాని, నా పట్ల అగౌరవం చూపటంగాని చేయలేదు. నాథా! నా మనసులోని దేమిటో నీకు చెబుతాను. అయితే నేను కోరినదానిని నిస్సంశయంగా నెరవేరుస్తానని నీవు ముందుగా నాకు హామీనివ్వాలి" అని పలికింది.

దశరథ మహారాజు కైకేయి తలను తన ఒడిలోకి తీసుకొని చెదిరిన ఆమె శిరోజాలను మృదువుగా సవరిస్తూ “రాముణ్ణి తప్ప మరెవ్వరిని నేను అధికంగా ప్రేమించనని నీకు తెలుసు. నీవు ఆదేశించినది ఏదైనాసరే నెరవేరుస్తానని నేను నా రాముని మీదా ఒట్టువేసి చెబుతున్నాను. నీకు కావలసినదేమిటో చెప్పటానికి సంకోచించకు. దానిని నేను తప్పకుండా నెరవేరుస్తానని నేను ఒట్టువేసి చెబుతున్నాను, సంకోచించకు. నిన్ను బాధిస్తున్నదేమిటో ఇక నాకు చెప్పు" అన్నాడు.

తన భర్త ముమ్మారు చేసిన వాగ్దానం విన్నమీదట ఇక అతను పూర్తిగా తన అధీనంలోకి వచ్చాడని కైకేయికి దృఢవిశ్వాసం కుదిరింది. తన కుమారునిపట్ల గల పక్షపాత బుద్ధినుండి ఉత్పన్నమైన ప్రభలమైన(మండుతున్న) వాంఛ తనను ప్రేరేపించగా రాణి భయంకరమైన ఈ క్రింది పలుకులు పలికింది: “ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, కవలలైన అశ్వినీ దేవతలు ఇందుకు సాక్షులగుదురుగాక! సూర్యచంద్రులు, అహోరాత్రాలు, చతుర్దిశలు కూడా సాక్షులగునుగాక! గంధర్వులు, రాక్షసులు, పితృదేవతలు, భూతపిశాచాలు, తక్కిన జీవరాశులన్నీ కూడా ఇప్పుడు సాక్షులగునుగాక! ధర్మాచరణశీలుడు, సత్యవ్రతుడు అయిన నా ధీమంతుడైన నాథుడు నా కోరికను నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు.

“ప్రియనాథా! మునుపు దేవాసుర సంగ్రామంలో నీవు తీవ్రంగా గాయపడి మృతునిగా భావించి వదిలివేయబడిన విషయం జ్ఞప్తికి తెచ్చుకో. నేను నీకు ఎలా పరిచర్యలు చేసి నీ ప్రాణాలు నిలిపానో జ్ఞప్తికి తెచ్చుకో. ఆ కారణంగా నాకు రెండువరాల నిస్తానని వాగ్దానం చేశావు. ఓ రాజశ్రేష్ఠుడా! ఆ రెండు వరాలు ఈ రోజున నీవు నాకు తప్పనిసరిగా ప్రసాదించాలి.

లేకుంటే దు:ఖంతో నేను నా ప్రాణాన్ని త్యజిస్తాను. అందువల్ల నేను అర్థించేది ఏమంటే రాముడి పట్టాభిషేకం కోసం నీవు చేసిన ఏర్పాట్లతోనే భరతుణ్ణి రాజసింహాసనానికి వారసుణ్ణిగా ప్రతిష్టించాలి. అది నా మొదటి కోరిక, రెండవది, రాముడు ఈ రోజే దండకారణ్యానికి వెళ్ళి, నారవస్త్రాలను, జింక చర్మాన్ని మాత్రమే ధరిస్తూ వచ్చే పధ్నాలుగు సంవత్సరాలపాటు ప్రవాస జీవనం గడపాలనేది నా కోరిక".

కైకేయి యొక్క శ్రీముఖాన్ని విన్నంతనే దశరథ మహారాజు దిగ్భ్రాంతితో చేష్టలు దక్కి నిలుచుండిపోయాడు. వేదనతో జ్వలిస్తూ "నాకేమవుతోంది? నేనేదైనా పూర్వజన్మకు సంబంధించిన దృశ్యాన్ని చూస్తున్నానా? బహుశా నాకు పూర్తిగా మతి చెడినట్లుంది" అని కైకేయి అలాంటి కోరికలు కోరుతుంది అని కలలో కూడా అనుకోలేదు దశరథుడు.

ఇలా అనుకుంటూ మహారాజు వెనువెంటనే దుఃఖంతో వివశుడైనాడు. మూర్చిల్లి నేలపై వాలిపోయాడు.

The epic

By Writer_aj

Published: June 15, 2026 at 7:32 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...