Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
ఆఫీస్‌లో ఉదయం ఎప్పటిలాగే బిజీగా ఉంది.
ఎవరో మీటింగ్స్‌కి పరుగులు తీస్తున్నారు.
ఎవరో ల్యాప్‌టాప్ ముందు కూర్చొని చివరి నిమిషంలో రిపోర్ట్స్ పూర్తి చేస్తున్నారు.
మరికొందరు కాఫీ కప్పులతో తమ డెస్క్‌ల దగ్గరే చిన్న చిన్న చర్చలు చేస్తున్నారు.
ఆ గందరగోళం మధ్య...
అతను మాత్రం తన కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తున్నట్టుగా నటిస్తూ, ఎదురుగా ఉన్న ఒకడెస్క్ వైపు చూస్తున్నాడు.
ఆమె.
అతని ఆఫీస్‌లోనే పనిచేసే అమ్మాయి.
ఎప్పుడో ఒకరోజు మొదలైన చిన్న పరిచయం...
ఎప్పుడు క్రష్‌గా మారిందోఅతనికే తెలియదు.
ఆమెకి మాత్రం తెలుసు.
అతనికి తన మీద క్రష్ ఉందని.
అది అతని ప్రవర్తనలోనే కనిపించేది.
ఆమె ఆఫీస్‌లోకి వస్తే తెలియకుండానే అతని చూపు ఆమె వైపు వెళ్లడం...
ఆమె తన డెస్క్ దగ్గర ఎవరికైనా మాట్లాడుతుంటే, పని చేస్తున్నట్టు నటిస్తూ వినడం...
ఆమె ఏదైనా అడిగితే అవసరానికి మించిన ఆనందం ముఖంలో కనిపించడం...
ఇవన్నీ ఆమె గమనించింది.
అయినా ఆమె ఎప్పుడూ అతన్ని ఇబ్బంది పెట్టలేదు.
కేవలం...
ఆమె ఫ్రెండ్స్ మాత్రం వదిలేవారు కాదు.
"అదిగో... నీ ఫేవరెట్ వచ్చాడు!"
ఆమె ఫ్రెండ్ నవ్వుతూ అతని వైపు చూపించింది.
ఆమె మాత్రం ల్యాప్‌టాప్ నుంచి కళ్ళు తీయకుండా,
"ఎవరైనా పని చేసుకుంటే బాగుంటుంది."
అంది చాలా కూల్‌గా.
"అబ్బా... ఎంత కూల్‌గా యాక్ట్ చేస్తున్నావే!"
"నేను ఏం యాక్ట్ చేస్తున్నాను?"
"నీ మీద క్రష్ ఉన్న అబ్బాయి ఎదురుగా కూర్చుంటే కూడా ఏమీ పట్టనట్టు ఉంటున్నావు."
ఆమె చిరునవ్వు నవ్వింది.
"అతనికి క్రష్ ఉంది. నాకు లేదు."
"అంటే పూర్తిగా ఛాన్స్ లేదా?"
ఆమె ఒక్క క్షణం అతని వైపు చూసింది.
అతను అదే సమయంలో తన ల్యాప్‌టాప్‌లో ఏదో టైప్ చేస్తున్నాడు.
ఆమె మళ్లీ తన ఫ్రెండ్ వైపు చూసి,
"తెలియదు."
అని చెప్పింది.
ఆ రెండు మాటల్లోనే ఆమెకి కూడా తన మనసు గురించి పూర్తిగా క్లారిటీ లేదేమో అన్నట్టు ఉంది.
---
అప్పుడే మేనేజర్ కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు.
"Guys, everyone please join the meeting room."
అందరూ ఒక్కొక్కరుగా లేచి వెళ్లారు.
మీటింగ్ మొదలైంది.
మేనేజర్ స్క్రీన్‌పై ఒక ప్రెజెంటేషన్ ఓపెన్ చేశాడు.
"మన కంపెనీకి Australia client project confirm అయింది."
రూమ్‌లో ఉన్నవాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు.
"ఈ project కి సంబంధించిన official meeting కోసం మన team నుంచి ఇద్దరు Australia
వెళ్లాలి."
అతను స్క్రీన్ మార్చాడు.
"ఈ project technical coordination ని handle చేయడానికి..."
కొద్దిసేపు ఆగి,
"మీరు."
అని హీరో వైపు చూశాడు.
హీరో ఒక్కసారిగా straight అయ్యాడు.
"Sir?"
"Yes. You."
అతని ముఖంలో చిన్న smile.
"Okay, sir."
మేనేజర్ వెంటనే రెండో పేరు చెప్పాడు.
"మరియు... మీరు."
హీరోయిన్ వైపు చూశాడు.
ఆమె కూడా తల ఊపింది.
"Sure, sir."
హీరో మనసులో మాత్రం ఒక్క మాట.
Australia... ఆమెతోనా?
అది project గురించి వచ్చిన excitement కాదు.
ఆమెతో కలిసి ప్రయాణించాల్సి వస్తుందన్న ఆలోచన.
మీటింగ్ ముగిసిన తర్వాత అందరూ బయటకు వచ్చారు.
అతని ఫ్రెండ్ దగ్గరకు వచ్చి,
"రా బాబూ..."
అని భుజం మీద చెయ్యి వేశాడు.
"ఏంటి?"
"Australia project కంటే నీకు ఇంకో project చాలా interestingగా అనిపిస్తున్నట్టుంది."
హీరో నవ్వుతూ,
"ఏం మాట్లాడుతున్నావ్ రా?"
"అదే... నువ్వు ఎవరితో వెళ్తున్నావో తెలుసు కదా?"
అతను ఏమీ మాట్లాడలేదు.
ఫ్రెండ్ నవ్వాడు.
"Enjoy the flight, lover boy."
---
ఆ తర్వాతి కొన్ని రోజులు preparationలో గడిచిపోయాయి.
Documents.
Project files.
Presentation.
Meeting points.
Travel arrangements.
అన్నీ సిద్ధమయ్యాయి.
కానీ హీరో మనసులో మాత్రం ఇంకో preparation నడుస్తోంది.
ఆమెతో ఎలా మాట్లాడాలి?
ఆఫీస్‌లో ఎన్నిసార్లు చూసినా...
ఒక proper conversation మాత్రం జరగలేదు.
Project గురించి మాట్లాడాలి.
అది ఒక మంచి అవకాశం.
కానీ...
మాట మొదలుపెట్టే ధైర్యం?
అది మాత్రం ఇంకా రాలేదు.
---
బోర్డింగ్ డే
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీ.
లగేజీలు.
Announcements.
Security checks.
Departure screens.
అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు.
హీరో తన బ్యాగ్‌తో gate దగ్గర కూర్చున్నాడు.
అతని పక్కన project files.
చేతిలో phone.
కానీ concentration మాత్రం ఎక్కడా లేదు.
అప్పుడే ఆమె వచ్చింది.
Formal outfitలో, ఒక చిన్న travel bagతో.
అతను ఆమెను చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు.
ఆమె అతన్ని చూసి చిన్నగా smile చేసింది.
"Hi."
హీరోకి ఆ ఒక్క మాటే unexpected.
"Hi..."
అని అతను కూడా నవ్వాడు.
కొద్దిసేపు ఇద్దరూ silenceలో ఉన్నారు.
ఆమె తన laptop bag సర్దుకుంటూ,
"Project presentation final version తీసుకొచ్చారా?"
అని అడిగింది.
హీరో ఒక్కసారిగా alert అయ్యాడు.
"Yes... తీసుకొచ్చాను."
అతను తన laptop చూపించాడు.
"Meetingలో first part మీరు explain చేస్తారా? లేక నేను start చేయనా?"
ఆమె ఆలోచించి,
"మీరు start చేస్తే బాగుంటుంది. నేను client requirements part explain చేస్తాను."
"Okay."
మళ్లీ silence.
కానీ ఈసారి...
ఆ silence awkwardగా అనిపించలేదు.
ఆమెనే మళ్లీ మాట్లాడింది.
"Australia first time వెళ్తున్నారా?"
అతను ఆమె వైపు చూశాడు.
"అవును. మీకు?"
"నాకు కూడా."
"ఓహ్..."
అంతే.
మళ్లీ silence.
కానీ కొన్ని seconds తర్వాత ఆమె నవ్వుతూ,
"Flightలో project గురించి మాట్లాడకూడదు అనుకుంటా."
అంది.
హీరో నవ్వాడు.
"అది నిజమే."
"లేకపోతే Australia వెళ్లి కూడా officeలోనే ఉన్నట్టు అనిపిస్తుంది."
"అవును."
ఆమె నవ్వింది.
ఆ చిన్న నవ్వు అతనికి చాలా పెద్ద విషయంలా అనిపించింది.
ఇప్పటివరకు ఆమె తో మాట్లాడాలంటే ఏదో reason కావాలి అనుకునేవాడు.
కానీ ఇప్పుడు...
ఆమెనే conversation కొనసాగిస్తోంది.
అతని మనసులో ఒక చిన్న ప్రశ్న మొదలైంది.
"ఆమె కూడా నాతో మాట్లాడాలని అనుకుంటుందా?"
అతను బయటకు మాత్రం ఏమీ చూపించలేదు.
"By the way..."
ఆమె అతని వైపు చూసింది.
"Project గురించి ఏదైనా doubt ఉంటే flightలో discuss చేద్దాం."
అతను తల ఊపాడు.
"Sure."
అప్పుడే boarding announcement వచ్చింది.
"Passengers travelling to Australia, please proceed towards the boarding gate..."
ఇద్దరూ లేచారు.
అతను తన బ్యాగ్ తీసుకున్నాడు.
ఆమె అతని పక్కనే నడుస్తోంది.
ఇప్పటివరకు...
ఆమె వెనుక నుంచి కనిపించడం మాత్రమే అతనికి అలవాటు.
కానీ ఇప్పుడు...
ఆమె తన పక్కనే నడుస్తోంది.
Gate దగ్గరకు చేరుకున్నప్పుడు ఆమె ఒక్కసారిగా,
"Let's go."
అంది.
అతను ఆమె వైపు చూసి నవ్వాడు.
"Yeah."
ఇద్దరూ కలిసి boarding gate వైపు నడిచారు.
అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన.
"ఇది కేవలం ఒక official trip మాత్రమేనా..."
లేక...
"ఏదో కొత్తదానికి మొదటి అడుగా?"
అతనికి సమాధానం తెలియదు.
కానీ ఒక విషయం మాత్రం మొదటిసారి స్పష్టంగా అనిపించింది.
ఆమెకి తనతో మాట్లాడాలనే ఆసక్తి ఉండొచ్చు.
అది నిజమో...
తన ఊహో...
తెలుసుకోవడానికి వాళ్ల ప్రయాణం ఇప్పుడే మొదలైంది.
The first talk
By evado okadu
Published: September 7, 2026 at 4:48 PM
Your input calibrates the database for others.
Ready to play...