SCREEN ON

Loading File

Chapter 2

Chapter 1
Chapter 2
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 1

VRINDA

Chapter 2
Chapter 1
Chapter 2

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 2

Jump Now

Directory

01

Episode 1

Active
Chapter // 01

Episode 1

సాయంత్రం వేళ. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతోంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు చల్లని గాలికి నెమ్మదిగా ఊగుతున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో భీమ్ తన కారును నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తున్నాడు.

కారులో పాత తెలుగు పాటలు వినిపిస్తున్నాయి. అతను ఆ పాటలలో మునిగిపోయి, రోజంతా ఉన్న టెన్షన్‌ను మర్చిపోయి, ఎంతో హాయిగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ క్షణంలో ప్రపంచంలో ఎలాంటి సమస్యలు లేనట్టే అనిపించింది అతనికి.

కానీ...

విధి మాత్రం అతనికోసం మరో కథ రాసి పెట్టింది.

కొన్ని నిమిషాల తర్వాత, అతను వెళ్తున్న రోడ్డుపై పెద్దగా ఒక బోర్డు కనిపించింది.

"DEAD END"

భీమ్ కనుబొమ్మలు ముడుచుకున్నాడు.

"ఇక్కడికి ఎలా వచ్చాను?" అని అనుకుంటూ కారును నెమ్మదిగా ఆపాడు.

కారు పూర్తిగా ఆగిన క్షణంలో...

అతని మెడ వెనుక చల్లటి ఇనుప స్పర్శ తగిలింది.

అది కత్తి.

భీమ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది.

అతని శరీరం మొత్తం చెమటలతో తడిసిపోయింది.

కారులో వెనుక సీటు నుండి ఒక వ్యక్తి ముందుకు వంగి, పదునైన కత్తిని భీమ్ గొంతుకి ఆనించాడు.

భీమ్ ఆశ్చర్యంతో కళ్లు పెద్దవిగా చేసుకున్నాడు.

ఇంతసేపు ఈ వ్యక్తి కారులో ఎలా దాక్కున్నాడు?

తనకు ఎందుకు తెలియలేదు?

ఏమి అర్థం కాలేదు.

ఆ వ్యక్తి గంభీరమైన స్వరంతో అన్నాడు.

"కారు దిగు... చిన్న పని. ఎక్కువ టైమ్ తీసుకోను."

ఆ స్వరంలో ఎలాంటి కోపం లేదు.

అదే మరింత భయంకరంగా అనిపించింది.

భీమ్ వణుకుతున్న చేతులతో డోర్ తెరిచి నెమ్మదిగా కిందకి దిగాడు.

కారు బయటికి వచ్చి నిలబడగానే, ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చాడు.

సుమారు ఆరు అడుగుల ఎత్తు.

బలమైన శరీరం.

చల్లని చూపులు.

అతని ముఖం మీద ఎలాంటి భావం కనిపించలేదు.

అతను సిగరెట్ వెలిగించి ఒక పొగ వదిలాడు.

తర్వాత భీమ్ వైపు చూస్తూ అన్నాడు.

"నా పేరు డేవిడ్..."

కొద్దిసేపు ఆగి...

"హ్యారీ అన్నయ్యని."

ఆ మాట వినగానే భీమ్ గుండె మరోసారి ఆగినట్టయింది.

అతను వెంటనే చేతులు జోడించాడు.

"సార్... మీరు ఎవరో నాకు తెలియదు సార్... దయచేసి నన్ను వదిలేయండి..."

అని వేడుకున్నాడు.

అప్పుడే...

అక్కడికి మరో పది మంది వచ్చారు.

వాళ్లందరి చేతుల్లో అత్యాధునిక తుపాకులు ఉన్నాయి.

కొంతమంది వద్ద అస్సాల్ట్ రైఫిల్స్.

మరికొందరి వద్ద సైలెన్సర్ పిస్టల్స్.

వాళ్లను చూస్తే సైనికుల్లా కనిపిస్తున్నారు.

భీమ్ కాళ్లు వణకడం మొదలైంది.

తన చుట్టూ మరణం నిలబడి ఉన్నట్టుగా అనిపించింది.

డేవిడ్ చేతిని పైకెత్తి వాళ్లని ఆపాడు.

"రిలాక్స్ గైస్... నేను హ్యాండిల్ చేస్తాను."

అని చెప్పి మళ్లీ భీమ్ వైపు తిరిగాడు.

"మిస్టర్ భీమ్..."

"గత శనివారం మా తమ్ముడిని ఎవరో కొట్టారు."

"షాపింగ్ మాల్ దగ్గర."

"నీ భార్యని ఏడిపించాడని కొట్టారట."

డేవిడ్ చిరునవ్వు నవ్వాడు.

కానీ ఆ నవ్వులో ఆనందం లేదు.

ప్రమాదం మాత్రమే ఉంది.

"అయినా... నీ భార్య మీద వాడికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు?"

అని అడిగాడు.

ఆ మాట వినగానే భీమ్ కళ్లలో కోపం మెరిసింది.

అది డేవిడ్ గమనించాడు.

తర్వాతి క్షణంలోనే...

పక్కనున్న వ్యక్తి చేతిలో ఉన్న గన్‌ను లాక్కున్నాడు.

అందరూ ఏం జరుగుతుందో గ్రహించేలోపే...

గన్ వెనుక భాగంతో భీమ్ ముక్కుపై బలంగా కొట్టాడు.

ధడ్!

భీమ్ నేలపై పడిపోయాడు.

అతని ముక్కు పగిలి రక్తం కారడం మొదలైంది.

డేవిడ్ ఒక్కసారిగా గర్జించాడు.

"నీ యబ్బా!"

"మా తమ్ముడిని కొట్టింది ఎవరో చెప్పమంటే చెప్పలేవా?"

"నేను నీ ఆస్తులు అడిగానా?"

"చెప్తావా? లేక నీ భార్యని... నీ బాబుని చంపేయమంటావా?"

అని అరిచాడు.

అని చెప్పి తన ఫోన్ తీసి ఒక వీడియో చూపించాడు.

భీమ్ వణుకుతున్న చేతులతో ఫోన్ వైపు చూశాడు.

ఆ వీడియో చూసిన క్షణంలో అతని ప్రాణం పోయినట్టయింది.

అది లైవ్ వీడియో.

అతని ఇంటి బయట.

అక్కడ అతని తండ్రి ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నారు.

కానీ...

కొద్దిదూరంలో ఒక భవనం పైభాగంలో.

ఒక స్నైపర్.

అతని తండ్రి తలపై గురి పెట్టి ఉన్నాడు.

భీమ్ ఊపిరి ఆగిపోయింది.

ఇప్పుడు అబద్ధం చెప్పే పరిస్థితి లేదు.

డేవిడ్ మళ్లీ అడిగాడు.

"ఎవడ్రా వాడు?"

భీమ్ భయంతో వణికిపోయాడు.

చివరకు నోరు విప్పాడు.

"వాడు... నా తమ్ముడే..."

డేవిడ్ కనుబొమ్మలు ఎత్తాడు.

భీమ్ కొనసాగించాడు.

"కానీ సొంత తమ్ముడు కాదు..."

"అతని అసలు పేరు ప్రబాస్."

"అతను ఒకప్పుడు బతికి ఉన్న ఇన్‌స్పెక్టర్ భర్గవ్ రామ్ కొడుకు అని మాత్రమే తెలుసు."

"ఆ విషయం నాకు... మా అమ్మానాన్నలకు మాత్రమే తెలుసు."

ఆ మాట వినగానే డేవిడ్ ముఖం మారిపోయింది.

అతను వెంటనే భీమ్ జుట్టు పట్టుకుని పైకి లాగాడు.

"ఇప్పుడు ఎక్కడున్నాడు?"

అని గర్జించాడు.

భీమ్ ఏడుస్తూ అన్నాడు.

"నాకు తెలియదు సార్..."

"నిజంగా తెలియదు..."

అని డేవిడ్ కాళ్లు పట్టుకున్నాడు.

కొన్ని క్షణాలు డేవిడ్ అతని వైపు గట్టిగా చూశాడు.

తర్వాత ఒక్కసారిగా వదిలేశాడు.

"సరే..."

"ఇప్పటికి నిన్ను... నీ కుటుంబాన్ని వదిలేస్తున్నాను."

అని అన్నాడు.

భీమ్ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు.

కంగారుగా కారులో ఎక్కి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు.

---

భీమ్ వెళ్లిపోయిన తర్వాత...

డేవిడ్ తన ఫోన్ తీసుకున్నాడు.

ఒక నంబర్‌కు కాల్ చేశాడు.

అవతల కాల్ లిఫ్ట్ అయ్యింది.

అది అతని తండ్రి.

దేశంలోనే అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్త.

అండర్‌వర్ల్డ్‌లో కూడా పేరున్న వ్యక్తి.

పైథాన్.

డేవిడ్ అన్నాడు.

"డాడ్..."

"హీ ఈజ్ బ్లడీ ఆర్ఫన్."

"ఎవరో ఇన్‌స్పెక్టర్ భర్గవ్ రామ్ కొడుకు అంట."

ఆ మాట విన్న క్షణంలో...

పైథాన్ ముఖం పాలిపోయింది.

అతని చేతిలో ఉన్న ఫోన్ జారి నేలపై పడిపోయింది.

గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.

డేవిడ్ అవతల నుండి,

"డాడ్...? డాడ్...?"

అని పిలుస్తున్నాడు.

కానీ పైథాన్ స్పందించలేదు.

కాల్ కట్ అయిపోయింది.

అతను నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు.

అతని కళ్లలో కనిపించింది భయం.

అది సాధారణ భయం కాదు.

ఏళ్ల క్రితం పాతిపెట్టాననుకున్న ఒక పీడకల మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కలిగే భయం.

---

ఇప్పుడు ప్రశ్నలు ఎన్నో...

అసలు ఈ ప్రబాస్ ఎవరు?

ఇన్‌స్పెక్టర్ భర్గవ్ రామ్ ఎవరు?

దేశాన్ని వణికించేంత శక్తి ఉన్న పైథాన్ పేరు వినగానే అందరూ భయపడతారు...

అలాంటి పైథాన్ మాత్రం భర్గవ్ రామ్ పేరు వినగానే ఎందుకు వణికిపోయాడు?

భర్గవ్ రామ్ గతంలో పైథాన్‌కు ఏమి చేశాడు?

ప్రబాస్ నిజంగా అనాథేనా... లేక ఒక భారీ రహస్యానికి వారసుడా?

ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు...

ఎదురు చూడాలి !

VRINDA

By Writer_aj

Published: June 18, 2026 at 6:40 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...