Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
రుక్మిణిని చూసిన శ్యామ్‌కి ఆరోజు సరిగా నిద్ర పట్టలేదు. ప్రతి క్షణం తన ఆలోచనలతో నిండిపోయింది శ్యామ్ మనసు.
> "తన పేరు ఏం అయ్యుంటుంది అంటావ్... ఏం చేస్తుందో, అసలు ఎక్కడ ఉంటుందో..."
అని శ్యామ్ అతనిలో అతనే ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటున్నాడు.
అసలు శ్యామ్ మనసుకి కుదురు ఉండటం లేదు. ఇంకా చేసేదేం లేక నిద్ర లేచి, అతని డైరీ తెరిచాడు.
ఆ రోజు తేదీ వేసాడు:
23-8-1970
డైరీ:
> "తనని ఈరోజే మొదటి సారి చూసా... కానీ ఎందుకో నాకు తను ముందే తెలుసు ఏమో అనే భావన కలిగింది. తను ఎవరో, ఏంటో, అసలు ఏం తెలీదు నాకు...
అసలు ఏం అని వర్ణించాలో కూడా తెలియట్లేదు...
ఆమె కురులు సముద్రపు అలలు వలె, తన కన్నులు వికసించిన కమలాలు వలె ఎంతో అందంగా ఉన్నాయి. కానీ ఆమె కళ్ల అద్దాలు ఆ అందాన్ని కప్పిపుచ్చే తెరలా అడ్డుగా ఉంటాయి.
అయినా సరే, తన అందం ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఆకర్షణీయమైన చిరునవ్వు ఆమెలోని సానుకూల శక్తిని, దైవిక ఉనికిని వర్ణిస్తాయి.
Her presence brought me Diwali sparks... She is a heavenly goddess."
ఏం రాస్తున్నాడో పూర్తి క్లారిటీతో రాస్తూ మైమరచిపోయాడు మన శ్యామ్. చివరికి ఆంగ్లం కూడా వచ్చేసింది మన రైటర్ గారికి.
ఆ అమ్మాయితో అంతలా ప్రేమలో మునిగిపోయాడు.
నిజానికి నిజమైన ప్రేమలో మనం ప్రేమించే వాళ్ల పూర్తి ఉనికినే ప్రేమిస్తాం. ఎందుకో, ఏంటో కూడా అర్థం కాదు... కానీ ప్రేమించేస్తాం. అప్పుడు అదే స్వచ్ఛమైన ప్రేమ అవుతుంది.
అదే అనుభూతిని చెందుతున్నాడు మన రైటర్ శ్యామ్.
అంత రాసినా కూడా ఇంకా ఏదో అసంతృప్తి మిగిలిపోయింది మన రైటర్ గారికి.
పడుకునే ముందు, అలా దీర్ఘంగా ఆలోచిస్తూ రుక్మిణితో కలిగిన ఆ eye contact ని తలుచుకుని తనలో తనే మురిసిపోతున్నాడు శ్యామ్...
ఇది ఇలా ఉండగా...
---
మరోవైపు మన రుక్మిణి వాళ్ల ఇంట్లో...
తర్వాతి రోజు ఉదయం...
రుక్మిణి వాళ్ల నాన్న హరిచంద్ర:
> "ఏంటి అమ్మా, నీ వయసు ఏంటి? నువ్వు చేస్తున్న పనులు ఏంటి! అవసరమా ఇవన్నీ!"
అని నిలదీశాడు వాళ్ల అమ్మని.
వేరే గదిలో ఉన్న రుక్మిణికి ఆ మాటలు వినిపించి ఒక చెవి వాళ్ల మాటలపై పడింది.
వాళ్ల నాన్నమ్మ ఇలా అంది:
> "నేనా? నేనేం చేశాను!"
అని అమాయకంగా అంది.
అప్పుడు హరిచంద్ర:
> "నువ్వు వినాయక మండపానికి వెళ్తే వెళ్లావ్, బానే ఉంది. మనకి ఏం తక్కువ అని బస్‌లో వెళ్లావ్ నువ్వు? మన రంగయ్య చూసి చెప్తున్నాడు! నరుగూరు ఏం అనుకుంటారు నా గురించి"
అని అన్నాడు.
అప్పుడు లోపల నుండి ఆ మాటలు విన్న రుక్మిణి:
> "హమ్మయ్య... నా గురించి ఏం చెప్పలేదు అన్నమాట..."
అని సంతోషంగా బయటకి వచ్చి:
> "అవును నాన్నా, ఈ మధ్య ఈ పెద్దమనిషికి బాగా చేదస్తం ఎక్కువ అయ్యిపోయింది. నేను అప్పటికి చెప్పా — నాన్నమ్మా, నాన్నమ్మా, నీ ఆరోగ్యం బాగోలేదు, ఎందుకే ఒంటరిగా వెళ్లడం అని...
కానీ నా మాట వినలేదు నాన్న!"
అని రుక్మిణి వాళ్ల నాన్నమ్మని ఆటపట్టిస్తూ అంది.
అప్పుడు వాళ్ల నాన్నమ్మ:
> "నోరు మూయ్... నువ్వే కదే రమ్మన్నావ్! నమనాన నేను ఉంటే, వినాయకుడు, ప్రసాదం, దైవభక్తి ఉండాలి అని ఏవేవో చెప్పి తీసుకెళ్లావ్ కదా!"
అని కోపంగా నిజం చెప్పేసింది.
అప్పుడు రుక్మిణికి ఏం చెప్పాలో అర్థం కాక:
> "రామచంద్రప్రభూ... కదిపితే కందిరీగ అయ్యిపోతావ్ ఏంటి నువ్వు!"
అని కసురుకుంది.
పక్కనుండి నిజం తెలిసిన వాళ్ల నాన్న:
> "చూడు అమ్మా..." (రుక్మిణిని దగ్గరకి తీసుకుంటూ)
"నువ్వు వెళ్లాలి అనుకుంటే మన వీరభద్రం బాబాయ్ ఉన్నాడు కదా. వాళ్లకి ఊరికనే జీతం ఇస్తున్నానా నేను?
నా కూతురు అంటే కారులోనే వెళ్లాలి!
నువ్వేంటి ఆ బస్‌లో అవస్థలు పడతానంటావ్?
నన్ను అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్లాలి అన్నా చిటికెలో ఏర్పాట్లు చేస్తా."
అని రుక్మిణిని దగ్గరకి తీసుకున్నాడు.
అంతే...
పక్కనుండి సుమతి...
MOUNA KAVYAM
By Ajay.
Published: May 14, 2026 at 7:28 AM
మరుసటి రోజు ఉదయం రుక్మిణి వాళ్ల నాన్న హరిచంద్ర కోపంగా ఎవరిని నిలదీశాడు?
Your input calibrates the database for others.
Ready to play...