Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
చెన్నై...
రాత్రి 8:45 గంటలు...
నగరంలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ స్టేడియం వెలుగులతో కళకళలాడుతోంది.
వేలాది ఫ్లడ్‌లైట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.
స్టేజ్ చుట్టూ లక్షలాది మంది అభిమానులు గుమికూడారు.
ప్రతి మూలలో ఒకటే పేరు మారుమ్రోగుతోంది...
"అమర్..! అమర్..! అమర్..!"
ఆ అరుపులతో మొత్తం స్టేడియం
కంపిస్తోంది.
మొబైల్ ఫ్లాష్‌లైట్లు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.
ప్రతి ఒక్కరి కళ్లల్లో ఒకటే ఎదురుచూపు...
అమర్ ఎప్పుడు వస్తాడు?
స్టేజ్ ముందు నిలబడి ఉన్న మీడియా రిపోర్టర్ కెమెరా వైపు తిరిగి నవ్వింది.
"లేడీస్ అండ్ జెంటిల్మెన్... కొన్ని నెలల క్రితం వరకూ ఇతను ఒక సాధారణ ఆర్టిస్ట్ మాత్రమే. కానీ ఈరోజు..."
ఆమె కాసేపు స్టేజ్ వైపు చూసింది.
"ఈరోజు అతను మ్యూజిక్ వరల్డ్‌లో ఒక సూపర్ రాక్‌స్టార్!"
చుట్టూ ఉన్న అభిమానులు మళ్లీ అరవడం ప్రారంభించారు.
"అయితే అమర్ కేవలం రాక్‌స్టార్ మాత్రమే కాదు..."
రిపోర్టర్ చిరునవ్వుతో కొనసాగించింది.
"అతను ఒక అద్భుతమైన డాన్సర్... ఒక పెయింటర్... ఒక నటుడు... ఒక రచయిత...
ఏ రంగం తీసుకున్నా తన ముద్ర వేసిన మల్టీ-టాలెంటెడ్ వ్యక్తి."
ఆమె కాసేపు సిగ్గుపడుతూ నవ్వింది.
"అంతేకాదు..."
"హీ ఈజ్ హ్యాండ్సమ్ టూ..."
అని చెప్పి కెమెరా వైపు చూసి నవ్వింది.
వెంటనే అభిమానుల కేకలు మరింత పెరిగిపోయాయి.
అదే సమయంలో...
స్టేజ్ వెనుక ఉన్న వీఐపీ రూమ్‌లో...
అమర్ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు.
బయట లక్షల మంది అతని కోసం
ఎదురుచూస్తున్నారు.
కానీ...
అతని కళ్లలో మాత్రం వింత నిశ్శబ్దం.
అతని ముఖంలో ఎలాంటి ఉత్సాహం లేదు.
అప్పుడు తలుపు బలంగా తెరుచుకుంది.
లోపలికి కాన్సర్ట్ మేనేజర్ రామ్ వచ్చాడు.
"గౌతమ్!"
అని గట్టిగా పిలిచాడు.
"ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ! కమ్ ఆన్!"
అమర్ నెమ్మదిగా తలెత్తి చూశాడు.
అతని కళ్లలో తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది.
కొన్ని క్షణాలు రామ్ వైపు చూస్తూ...
చల్లగా అన్నాడు.
"ఈ కాన్సర్ట్ జరగదు."
రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
"వాట్?" అని ఆశ్చర్యపోయాడు రామ్
అమర్ కుర్చీలో వెనక్కి వాలి...
"నా మైండ్‌సెట్ బాగోలేదు..."
అని నిదానంగా చెప్పాడు.
ఆ మాట విన్న రామ్ కోపంతో ఊగిపోయాడు.
"రేయ్!"
అని అరుస్తూ అతని దగ్గరకు వచ్చాడు.
"నువ్వు ఈ కాన్సర్ట్ చేస్తే వచ్చే డబ్బులు నీకో...నాకో రావు!"
"అన్నీ అనాథాశ్రమాలకు వెళ్తాయి!"
"అది కూడా మర్చిపోయావా?"
అమర్ మౌనంగా చూస్తూ ఉన్నాడు.
రామ్ కోపం ఇంకా పెరిగింది.
"ఈరోజు నువ్వు కాన్సర్ట్ క్యాన్సిల్ చేస్తే..."
"సోషల్ మీడియాలో ఏమంటారో
తెలుసా?"
"'త్వరగా సక్సెస్ వచ్చింది... తల పొగరు పట్టింది...' అంటారు."
"నీకు పీఆర్ టీమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావా ??"
"లక్షల మంది బయట నీ కోసం ఎదురుచూస్తున్నారు!"
"వాళ్ల ఆశలు ఏంటి?"
"వాళ్ల భావాలు ఏంటి?"
"ఒక్కసారి ఆలోచించావా?"
అమర్ మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
రామ్ చెప్పిన మాటలు వింటున్నాడు...
కానీ...
అతని మనసు మాత్రం ఎక్కడో ఉంది.
చివరికి...
ఏమీ మాట్లాడకుండా లేచాడు.
నెమ్మదిగా స్టేజ్ వైపు నడిచాడు.
అమర్ స్టేజ్ మీద అడుగుపెట్టిన క్షణం...
మొత్తం స్టేడియం పేలిపోయినట్టైంది.
"అమర్...!"
"అమర్...!"
"అమర్...!"
అని అభిమానుల అరుపులు ఆకాశాన్ని చీల్చాయి.
వేలాది మంది నిలబడి చప్పట్లు కొడుతున్నారు.
కొంతమంది ఆనందంతో ఏడుస్తున్నారు.
మరికొందరు అతని పేరు ఉన్న బ్యానర్లు ఊపుతున్నారు.
ఆ ప్రేమ...
ఆ ఆరాధన...
ఆ అభిమానం...
ఏ స్టార్‌కైనా కలలా అనిపిస్తుంది.
అమర్ మైక్ పట్టుకున్నాడు.
కళ్ళు మూసుకున్నాడు.
కొన్ని క్షణాలు...
పూర్తి నిశ్శబ్దం.
తర్వాత...
సంగీతం మొదలైంది.
అమర్ పాడటం ప్రారంభించాడు.
ఆ పాట...
గుండెను తాకేలా ఉంది.
ఆ స్వరం...
ప్రతి ఒక్కరిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.
అతని గొంతులోని బాధ...
అతని భావాలు..
అతని ఆవేదన...
పాట రూపంలో బయటకు వస్తున్నాయి.
అభిమానులు మైమరచిపోయారు.
వాళ్లు కేవలం పాట వినడం లేదు...
అమర్ ఆత్మను అనుభవిస్తున్నారు.
కానీ...
స్టేజ్ పక్కన నిలబడి ఉన్న రామ్ మాత్రం వేరే విషయం గమనించాడు.
అమర్ పాడుతున్నాడు.
డాన్స్ చేస్తున్నాడు.
ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు.
అన్నీ బాగానే ఉన్నాయి.
అయితే...
అతని కళ్లలో మాత్రం ఒక విచిత్రమైన శూన్యత కనిపిస్తోంది.
ఎక్కడో దూరంగా చూస్తున్నట్టుంది.
ఎవరో గుర్తొచ్చినట్టుంది.
మళ్లీ...
ఆ పాత ఆలోచనలలోకి వెళ్తున్నట్టుంది.
రామ్ గుండెల్లో ఆందోళన మొదలైంది.
వెంటనే రామ్ పక్కకు వెళ్లి ఫోన్ తీసుకున్నాడు.
అమర్ తల్లికి కాల్ చేశాడు.
కొన్ని రింగ్స్ తర్వాత కాల్ లిఫ్ట్ అయింది.
"అమ్మా..."
అన్నాడు రామ్.
"చూస్తుంటే గౌతమ్ మళ్లీ తన గురించే ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది."
"నేను గట్టిగా మాట్లాడకపోతే..."
"ఈరోజు కాన్సర్ట్ కూడా చేయనని చెప్పాడు."
అవతల కొద్దిసేపు నిశ్శబ్దం.
తర్వాత ఆమె స్వరం వినిపించింది.
"సరే..."
"కాన్సర్ట్ అయిపోగానే వెంటనే ఇంటికి తీసుకురా."
"మధ్యలో ఎవరితోనూ మాట్లాడనివ్వకు."
"నేను చూసుకుంటాను."
"సరే అమ్మా." అని
రామ్ కాల్ కట్ చేశాడు.
కొద్దిసేపటికి కాన్సర్ట్ ముగిసింది.
కానీ...
అమర్ మ్యాజిక్ మాత్రం ముగియలేదు.
స్టేజ్ దిగిన వెంటనే మీడియా మొత్తం అతని చుట్టూ చేరిపోయింది.
ఆ మీడియా అమ్మాయి అయితే చాలా ఆతృతగా అందరినీ పక్కకి నెట్టు కుంటు ముందుకి వచ్చేసింది
"అమర్ సర్! ఒక్క కామెంట్!"
"సర్! ఇక్కడ చూడండి!"
"సర్! మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?"
ఫ్లాష్ లైట్లు నిరంతరం మెరుస్తున్నాయి.
బాడీగార్డ్స్ అభిమానులను, మీడియాను కంట్రోల్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కానీ జనాల ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు.
"సర్! ఒక్క ఆటోగ్రాఫ్!"
"అమర్ అన్నా ప్లీజ్!"
"ఒక్క సెల్ఫీ!"
అని వందలాది మంది ముందుకు దూసుకొస్తున్నారు.
ఆ గందరగోళంలో...
రామ్ ఎలాగోలా మార్గం చేసుకుంటూ అమర్‌ను కార్ దగ్గరకు తీసుకెళ్లాడు.
కార్ డోర్ తెరిచాడు.
అమర్ నెమ్మదిగా లోపల కూర్చున్నాడు.
రామ్ డ్రైవర్ వైపు తిరిగి...
"ఇంటికి పో."
అని చెప్పాడు.
కార్ ముందుకు కదిలింది.
వెనుక...
ఇంకా వేలాది మంది అభిమానులు పరుగెత్తుతూ...
అరుస్తూ...
చేతులు ఊపుతూ...
కార్ వెంబడి వస్తున్నారు.
కానీ...
ఆ కార్ లోపల కూర్చున్న అమర్ మాత్రం...
ఆ శబ్దాలన్నిటికీ దూరంగా ఉన్నాడు.
బయట ప్రపంచం అతన్ని దేవుడిలా ఆరాధిస్తోంది.
కానీ...
అతని మనసు మాత్రం ఒకే చోట ఆగిపోయింది.
ఒకే జ్ఞాపకంలో చిక్కుకుంది.
ఒకే ముఖం..
ఒకే నవ్వు...
ఒకే అమ్మాయి...
ఆమె జ్ఞాపకాలే ఇప్పుడు అతని ప్రపంచం.
కిటికీ బయట వెలుగులు వేగంగా వెనక్కి పరుగెడుతుంటే...
అమర్ కళ్ళల్లో మాత్రం గతం మెల్లగా తిరిగి ప్రాణం పోసుకుంటోంది...
ఆమె జ్ఞాపకాల రూపంలో...
ఆమె ఎవరు ? చరిష్మా అమర్ నీ కలవగలద ?
OKA JEEVITHAM
By Writer_aj
Published: June 29, 2026 at 6:30 AM
Your input calibrates the database for others.
Ready to play...