Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
సమయం తెల్లవారుజామున 4:00 గంటలు...
ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉంది.
నగరమంతా నిశ్శబ్దపు దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా కనిపిస్తోంది.
అక్కడక్కడా వీధి దీపాలు మాత్రమే మసక వెలుతురును చిమ్ముతున్నాయి.
చెన్నై నగరంలోని ఆ భారీ ఇంటి టెర్రస్‌పై...
అమర్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు.
తన చేతులను ఛాతీ ముందు ముడుచుకుని...
తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడు.
అనంతంగా విస్తరించి ఉన్న నల్లని ఆకాశం...
అందులో మెరుస్తున్న వేలాది నక్షత్రాలు...
ఆ ప్రశాంతత...
ఆ నిశ్శబ్దం...
అతని మనసులో అలజడి రేపుతున్న ఆలోచనలకు మాత్రమే సాక్షిగా నిలిచాయి.
కొన్నిసార్లు...
మనిషికి ఒంటరితనం చాలా అవసరం.
ప్రపంచం మొత్తం మన చుట్టూ ఉన్నా...
మనల్ని మనం వినడానికి, మన గుండె చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి...
ఒంటరితనం అవసరం.
ఎందుకంటే...
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు బయట దొరకవు.
అవి మన మనసులోనే దాగి ఉంటాయి.
ఇప్పుడు అమర్ చేస్తున్నదీ అదే.
తన గుండెలో ఎన్నాళ్లుగానో దాచుకున్న బాధతో...
ఎవరికీ చెప్పలేని జ్ఞాపకాలతో...
తనలో తానే పోరాడుతున్నాడు.
ఇంతవరకు మీకు ఒక సందేహం రాలేదా?
అమర్‌ని...
అతని తల్లి అయిన కుమారి గారు...
అలాగే రామ్...
ఎందుకు "గౌతమ్" అని పిలుస్తున్నారు?
అమర్ పేరు గౌతమ్ అయితే...
అందరూ అమర్ అని ఎందుకు పిలుస్తున్నారు?
లేదా...
గౌతమ్ పేరు అమర్‌గా ఎలా మారింది?
ఆ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి..
కానీ ఇప్పుడే కాదు.
ఆ రహస్యం కథలోనే నెమ్మదిగా బయటపడుతుంది.
ప్రస్తుతం...
మన అమర్ మాత్రం తన గతం గురించి...
తన జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క జ్ఞాపకం గురించి...
లోతుగా ఆలోచిస్తున్నాడు.
అప్పుడే...
వెనుక నుంచి మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది.
అమర్ వెనక్కి తిరిగి చూడలేదు.
ఆ అడుగులు ఎవరివో అతనికి తెలుసు.
కొన్ని క్షణాల్లో...
అతని పక్కనే వచ్చి నిలబడ్డారు కుమారి గారు.
తన కొడుకును చూసి ఆమె కళ్ళలో బాధ మెరిసింది.
ఎందుకంటే...
ప్రపంచం చూసేది ఒక సూపర్ స్టార్‌ని.
కానీ...
ఆమె చూసేది మాత్రం తన గుండె
ముక్కను.
ఆమెకు తెలుసు...
అతను నవ్వుతున్నాడంటే సంతోషంగా ఉన్నాడని కాదు.
అతను మౌనంగా ఉన్నాడంటే ప్రశాంతంగా ఉన్నాడని కాదు.
అతని హృదయంలో ఎంత తుఫాను నడుస్తోందో...
ఆ తల్లికి బాగా తెలుసు.
"నాన్నా..."
అని మృదువుగా పిలిచింది.
అమర్ కాసేపు ఆమె వైపు చూసాడు.
"నాన్న నిన్ను పడుకోమని చెబుతున్నారు."
"ఈ కాన్సర్ట్లు... ఈ పనులు... ఈ పరుగులు..."
ఆమె కాసేపు ఆగింది.
"ఈ మధ్య నువ్వు ఇంటికి రావడమే మానేశావు."
అంది.
అమర్ ఏమీ మాట్లాడలేదు.
తన తల్లి ముఖం వైపు చూస్తూ...
చిన్నగా నవ్వాడు.
కానీ...
ఆ నవ్వులో ఆనందం లేదు.
అది కేవలం బాధను దాచే ప్రయత్నం మాత్రమే.
అది గమనించిన కుమారి గారు మళ్లీ మాట్లాడారు.
"అలసిపోయిన వాళ్ళు ఎవరైనా ఇంటికి రాగానే పడుకుంటారు."
"కానీ నా కొడుకు మాత్రం..."
"ఏవేవో ఆలోచిస్తూ..."
"నిద్రను కూడా మర్చిపోతున్నాడు."
అని బాధగా అన్నారు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది.
గాలి మెల్లగా వీచింది.
ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూనే ఉన్నాయి.
అమర్ మళ్లీ ఆకాశం వైపు చూశాడు.
అతని కళ్లలో చెప్పలేని బాధ స్పష్టంగా కనిపిస్తోంది.
అతను నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు.
"అమ్మా..."
"ఈ ఆకాశం ఎంత అందంగా ఉన్నా..."
అని ఆకాశం వైపు చూపిస్తూ అన్నాడు.
"చంద్రుడు లేకపోతే దీనికి పరిపూర్ణత ఉండదు కదా..."
అతని స్వరం మెల్లగా విరిగిపోయింది.
"ఆకాశం వైపు చూడడానికి కూడా ఒక కారణం ఉండదు."
అన్నాడు.
ఆ మాటలు వినగానే కుమారి గారు కళ్ళు మూసుకున్నారు.
ఎందుకంటే...
అమర్ ఆకాశం గురించి మాట్లాడటం లేదు.
చంద్రుడు గురించి కూడా కాదు.
తన జీవితంలో ఒకప్పుడు వెలుగులా మెరిసిన...
ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మిగిలిపోయిన...
ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాడు.
ఆమె లేని జీవితాన్ని...
చంద్రుడు లేని ఆకాశంతో పోలుస్తున్నాడు.
కుమారి గారు నెమ్మదిగా అతని వైపు తిరిగారు.
తన కొడుకును చూస్తూ చిరునవ్వు నవ్వారు.
"ఏదీ శాశ్వతం కాదు నాన్నా..."
"చీకటి అయినా... వెలుగు అయినా..."
"ఏదీ ఎప్పటికీ ఒకేలా ఉండదు."
ఆమె ఆకాశం వైపు చూసింది.
"ఈరోజు అమావాస్య కాబట్టి చంద్రుడు
కనిపించడం లేదు."
"కానీ..."
"రేపు మళ్లీ చూడు."
"అదే చంద్రుడు..."
"ఈ చీకటిని చీల్చుకుంటూ..."
"మళ్లీ కొత్తగా వస్తాడు."
ఆమె స్వరంలో ఒక తల్లి నమ్మకం ఉంది.
ఒక ధైర్యం ఉంది.
"జీవితం కూడా అంతే నాన్నా."
"ఎంత చీకటి వచ్చినా..."
"వెలుగును వెతుక్కోవాలి."
"ఎంత బాధ ఉన్నా..."
"ఆశను వదలకూడదు."
"ఆ చంద్రుడిలా..."
"మళ్లీ వెలుగుగా మారడానికి పోరాడాలి."
అంది.
ఆ క్షణంలో...
ఆ నల్లని ఆకాశం అమర్ అయితే...
అందులో కనిపించని చంద్రుడు...
అతని హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ఆ అమ్మాయే కావచ్చు.
ఆమె లేని జీవితమే అతని చీకటి.
ఆమె జ్ఞాపకాలే అతని వెలుగు.
అమర్ నెమ్మదిగా తన తల్లి వైపు చూశాడు.
ఆ చూపులో ఆశ్చర్యం లేదు.
ఎందుకంటే...
తన మనసులో ఉన్న ప్రతి బాధ...
ప్రతి గాయం...
ప్రతి కన్నీటి వెనుక కారణం...
తన తల్లికి తెలుసని అతనికి ఎప్పుడో అర్థమైంది.
ఎప్పటిలాగే...
తన బాధను దాచాలని ప్రయత్నించాడు.
కళ్లలోకి వచ్చిన నీటిని వెనక్కి నెట్టాడు.
పెదవులపై ఒక చిన్న నవ్వు తీసుకొచ్చాడు.
కానీ...
ఈసారి అది సాధ్యం కాలేదు.
కుమారి గారు మెల్లగా ముందుకు వచ్చి...
అతని చేతులను పట్టుకున్నారు.
ఆ తల్లి స్పర్శ...
చిన్నప్పుడు పడిపోయినప్పుడు ఓదార్చిన అదే స్పర్శ.
భయపడినప్పుడు ధైర్యం చెప్పిన అదే స్పర్శ.
అంతే...
ఇన్నాళ్లుగా గుండెల్లో బంధించిన బాధ ఒక్కసారిగా ఉప్పొంగింది.
అమర్ కళ్లలో దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా జారిపోయాయి.
తన తల్లిని గట్టిగా హత్తుకున్నాడు.
"అమ్మా..."
అనే ఒక్క మాట మాత్రమే బయటకు వచ్చింది.
మిగతా మాటలన్నీ కన్నీళ్లలో కలిసిపోయాయి.
ఒక రాక్‌స్టార్...
లక్షల మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి...
వేల మందిని తన పాటలతో ఏడిపించే వ్యక్తి...
ఆ క్షణంలో మాత్రం...
తన తల్లి ఒడిలో ఏడుస్తున్న చిన్న పిల్లవాడిగా మారిపోయాడు.
కుమారి గారు అతని తలపై చేయి వేసి నిమిరారు.
ఏమీ మాట్లాడలేదు.
ఎందుకంటే...
కొన్ని బాధలకు మాటలు అవసరం ఉండవు.
కొన్ని కన్నీళ్లకు కారణాలు అడగాల్సిన అవసరం ఉండదు.
ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి...
చీకటి ఇంకా అలాగే ఉంది...
కానీ...
అమర్ గుండెలో దాచుకున్న బాధ మాత్రం...
ఆ రాత్రి మొదటిసారిగా కన్నీటి రూపంలో బయటపడింది....
ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి ?
OKA JEEVITHAM
By Writer_aj
Published: June 29, 2026 at 7:52 AM
Your input calibrates the database for others.
Ready to play...