Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
ఒక జీవితం — అధ్యాయం 1: చరిష్మా అభిమాన ప్రపంచం
సాయంత్రపు మృదువైన వెలుగులు కిటికీ తెరల మధ్య నుంచి చొరబడి గదిని అలంకరిస్తున్నాయి. గదిలోని గోడలన్నీ ఒకే వ్యక్తి ఫోటోలతో నిండిపోయాయి. చిన్న పోస్టర్లు, పెద్ద పోస్టర్లు, కచేరీల ఫోటోలు, మ్యాగజైన్ కటౌట్లు—ఎటు చూసినా ఒకే ముఖం.
అది దేశమంతా అభిమానించే యువ రాక్‌స్టార్ అమర్.
ఆ గదికి యజమాని చరిష్మా. అమర్ అంటే ఆమెకు సాధారణ అభిమానం కాదు... అది ఒక పిచ్చి ప్రేమ లాంటి అభిమానం. అతని పాటలు, అతని స్టైల్, అతని నవ్వు, అతని హెయిర్‌స్టైల్—అన్నీ ఆమెకు ప్రాణం.
ఆ రోజు కూడా చరిష్మా తన మంచంపై బోర్లా పడుకుని టీవీ చూస్తోంది.
టీవీలో ఒక భారీ సంగీత కచేరీ ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.
వేలాది మంది ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియం.
వేదికపై రంగురంగుల లైట్లు మెరుస్తున్నాయి. పొగలు, ఫైర్ ఎఫెక్ట్స్, గర్జించే సంగీతం—అన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని ఒక మాయా ప్రపంచంలా మార్చేశాయి.
ఆ వేదిక మధ్యలో నల్లటి లెదర్ జాకెట్ వేసుకుని, చేతిలో మైక్ పట్టుకుని నిలబడి ఉన్నాడు అమర్.
అతను ఒక వేగవంతమైన రాక్ సాంగ్ పాడుతున్నాడు.
"ఆఆఆఆమర్...! అమర్...! అమర్...!"
అంటూ పదివేల మందికి పైగా ప్రేక్షకులు అరుస్తున్నారు.
వారి కేకలతో స్టేడియం మొత్తం కంపిస్తున్నట్లు అనిపిస్తోంది.
చరిష్మా కళ్లలో ఆనందం మెరుస్తోంది.
"అబ్బా... ఎంత బాగున్నాడు!" అని మెల్లగా అనుకుంది.
కొన్ని క్షణాల్లోనే ఆమె ఊహల్లోకి జారుకుంది.
తాను కూడా అదే స్టేజ్ మీద ఉన్నట్టు ఊహించుకుంది.
అమర్ తన చేతిని పట్టుకుని పాట పాడుతున్నాడు.
ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్నారు.
స్టేడియం మొత్తం వారిని చూసి చప్పట్లు కొడుతోంది.
అమర్ చిరునవ్వుతో తన వైపు చూస్తూ,
"చరిష్మా... ఈ పాట నీ కోసమే..."
అని చెబుతున్నట్టు ఆమెకు అనిపించింది.
ఆ ఊహల్లో మునిగి తేలుతున్న సమయంలో ఒక్కసారిగా గది తలుపు గట్టిగా తెరుచుకుంది.
"చరిష్మా!"
అనే గంభీరమైన స్వరం వినిపించింది.
ఒక్కసారిగా ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది ఆమె.
లోపలికి వచ్చిందేమిటంటే ఆమె అన్నయ్య రామం.
గదిని ఒకసారి పై నుంచి కింద వరకు చూసాడు.
బెడ్ మీద బట్టలు.
టేబుల్ మీద పుస్తకాలు.
కుర్చీ మీద బ్యాగ్.
నేలపై కొన్ని కాగితాలు.
అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి.
రామం నుదుటిపై ముడతలు పడ్డాయి.
"ఏంటి చరిష్మా! నీ గది ఇంత చెత్తగా ఉంది? టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా?" అని గట్టిగా అడిగాడు.
కానీ చరిష్మా అతని మాటలలో సగం కూడా వినలేదు.
ఇంకా టీవీలో అమర్‌నే చూస్తోంది.
"అన్నయ్యా..."
అంది మైమరచిపోయిన చూపులతో.
"అమర్ హెయిర్‌స్టైల్ ఎంత బాగుందో చూశావా? పాట పాడుతున్నప్పుడు ఒక స్వాగ్ ఉంటుంది కదా! అబ్బా... సూపర్‌గా ఉంటాడు!"
అంది కలల్లో తేలిపోతూ.
రామం ముఖం పట్టుకుని నవ్వుకున్నాడు.
"అయ్యో దేవుడా! నేను గది గురించి మాట్లాడుతున్నాను... నువ్వు అమర్ గురించి మాట్లాడుతున్నావు!"
అన్నాడు.
తర్వాత కొద్దిగా సీరియస్‌గా,
"ఇలా గదిలో కూర్చొని పగటి కలలు కనడం కంటే బయట మన గార్డెన్‌లో కాసేపు తిరిగి రావచ్చు కదా? పద... వెల్దాం."
అన్నాడు.
చరిష్మా ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి అతని దగ్గరకు వచ్చింది.
అతని భుజాన్ని పట్టుకుని బుజ్జగించే స్వరంతో,
"అన్నయ్యా... నా కోసం ఒక్కసారి అమర్ గారి ఆటోగ్రాఫ్ ఇప్పిస్తావా ప్లీజ్!"
అంది.
రామం నవ్వేశాడు.
"అది నా వల్ల కాదు తల్లీ. వాడు దేశంలోనే పెద్ద రాక్‌స్టార్. మనలాంటి వాళ్లకి ఎలా అందుతాడు?"
అన్నాడు.
చరిష్మా మొహం వెంటనే చిన్నబోయింది.
అప్పుడే గది బయట నిలబడి వారి సంభాషణ మొత్తం రహస్యంగా వింటున్న ఒక వ్యక్తి చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టాడు.
అతనే వారి తండ్రి.
ఆయన లోపలికి వచ్చి,
"ఎందుకు అవ్వదు?"
అన్నారు.
ఇద్దరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు.
"చాలా సులభం."
అని చెప్పి కుర్చీలో కూర్చున్నారు.
"నేను అమర్ వాళ్ల నాన్నతో కలిసి చదువుకున్నాను."
అన్నారు.
ఆ మాట విన్న వెంటనే చరిష్మా కళ్లలో మెరుపులు మెరిశాయి.
"నిజంగా నాన్నా?"
అని ఆశ్చర్యంగా అడిగింది.
"అవును."
అన్నారు ఆయన.
"వాడు నన్ను గుర్తు పడతాడో లేదో అని నేనే ఇన్నాళ్లు మాట్లాడలేదు. మన కంపెనీ ఓపెనింగ్ సెరిమనీకి పిలిచినా రాలేదు. అందుకే కొంచెం కోపం కూడా ఉంది."
అన్నారు.
తర్వాత చరిష్మా వైపు చూసి చిరునవ్వు నవ్వారు.
"కానీ... నా కూతురు కోసం మాత్రం మాట్లాడతాను."
అన్నారు.
ఆ మాట వినగానే చరిష్మా ఆనందంతో ఎగిరి గంతేసింది.
"థ్యాంక్యూ నాన్నా!"
అంటూ ఆయనను గట్టిగా హత్తుకుంది.
తండ్రి ప్రేమగా ఆమె తల నిమిరాడు.
అప్పుడే పక్కన నిలబడి ఉన్న రామం ఒక సందేహంతో అడిగాడు.
"కానీ నాన్నగారు..."
"ఏంట్రా?"
"అమర్‌కి మీకు తండ్రి-కొడుకులంత వయసు తేడా ఉంటుంది కదా! మరి మీరు ఇద్దరూ ఎలా కలిసి చదువుకున్నారు?"
అని అమాయకంగా అడిగాడు.
ఒక్క క్షణం గది మొత్తం నిశ్శబ్దంగా మారింది.
తర్వాత వారి తండ్రి తల మీద చెయ్యి వేసుకుని,
"ఓరేయ్ ధద్దమ్మా!"
అన్నారు.
"నేను కలిసి చదువుకుంది అమర్‌తో కాదు... అమర్ వాళ్ల నాన్నతో!"
అని గట్టిగా చెప్పారు.
రామం నోరు తెరిచి నిలబడ్డాడు.
"ఓహ్..."
అన్నాడు బుర్ర గోక్కుంటూ.
అది చూసి చరిష్మా పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది.
"ధద్దమ్మా...!"
అని అన్నయ్యను ఆట పట్టించింది.
తండ్రి కూడా నవ్వారు.
కొద్దిసేపట్లో గది అంతా నవ్వులతో నిండిపోయింది.
కానీ ఆ నవ్వుల మధ్య చరిష్మా మనసులో మాత్రం ఒక్క ఆలోచనే తిరుగుతోంది...
"నిజంగానే అమర్‌ను కలుస్తానా?"
ఆమెకు తెలియదు...
ఆ చిన్న కోరికే త్వరలో ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతోందని.
(కొనసాగుతుంది...)
OKA JEEVITHAM
By Writer_aj
Published: June 13, 2026 at 10:53 AM
Establish a free connection to access the rest of the archive, store memory files, and join the network.
Initiate ConnectionAlready registered? Log in
Your input calibrates the database for others.
Ready to play...