SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

Active
16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 15

EPISODE 15

Ajay
Drama , love , Comedy
1 Min Read
Pub: Mar 12, 2026

నాని, జయ ఇద్దరూ క్యాలెండర్‌లో రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రావడానికి పాపం వాళ్లు ఇంకా పది రోజులు వెయిట్ చేయాలి. ఈలోపు జయ రోజుకో ముచ్చట చెప్పడానికి నానికి కాల్ చేసేది.

ఒకరోజు వాళ్ల కాలేజీలో జరిగిన సంఘటన గురించి, వాళ్ల ప్రిన్సిపాల్ మాట్లాడే విధానం బాలేదన్న విషయం... ఇంకోసారి తాను పెంచుకునే కుక్క గురించి, దానికి 'జ్యూస్' (Juice) అని పేరు తను జ్యూస్ తాగుతున్నప్పుడు ఎలా పెట్టిందో లాంటి ఎన్నో కబుర్లు చెప్పేది.

ఒకరోజు వాట్సాప్‌లో ఒక హార్ట్ బొమ్మ గీసి, “నానీ, ఇది నీ హార్ట్. చూశావా! దానికి ఏదో బాణం (Arrow) గుచ్చుకున్నట్టుంది ఏంటి!” అని ఆటపట్టిస్తూ మెసేజ్ పెట్టింది.

దానికి నాని నవ్వుతూ, “ఏమో, నీకే తెలియాలి… నా హార్ట్ నీ దగ్గరే కదా ఉంది,” అని ఫ్లర్ట్ చేశాడు.

అలా ఆ పది రోజులు వాళ్లిద్దరూ క్షణాలు లెక్కపెడుతూ కృష్ణాష్టమి కోసం ఎదురుచూశారు. నాని ముందుగానే తేజకి ఫోన్ చేసి, బతిమలాడి ఆరోజు తనతో పాటే గుడికి వచ్చేలా ప్లాన్ సెట్ చేశాడు.

కలుసుకోవడానికి ముందు రోజు రాత్రి నానికి అస్సలు నిద్ర పట్టలేదు. జయ ధ్యాసలోనే ఉండిపోయాడు. పాపం వాళ్ల ఇంటికి రాక రాక వచ్చిన తేజను కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు.

“రేయ్, రేపు తను వస్తే ఏం మాట్లాడాలిరా? తను అసలు ఎలా ఉంటుంది? ఒకవేళ నన్ను చూశాక నేను తనకు నచ్చకపోతే?” అంటూ పదే పదే పిచ్చి ప్రశ్నలు అడిగాడు.

దానికి తేజ విసిగిపోయి, “నీకు దండం రా బాబూ! ఇన్ని రోజులు నీ ఆత్రం ఆపుకున్నావు కదా, ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా? మీరిద్దరూ లవ్ చేసుకుని, నాతో ఫస్ట్ నైట్ జరుపుతున్నావేంట్రా! నోరు మూసుకుని పడుకో,” అని చిరాకు పడ్డాడు.

“సరేలే సారీ… పడుకో,” అని నాని కామ్‌గా ఉండిపోయాడు.

నిజానికి శ్రీకృష్ణుడు కూడా రుక్మిణిని చూడటానికి వెళ్లే ముందు నిద్రపోలేదంటారు. ఆయన రుక్మిణిని మొదటిసారి గుడి దగ్గరే చూశాడు. ఇప్పుడు ఈ జనార్ధన్ కూడా అదే చేయబోతున్నాడు.

రాత్రంతా కళ్లు మూసుకుని అలాగే గడిపేశాక, ఉదయాన్నే తేజని నిద్రలేపి ఇద్దరూ రెడీ అయ్యి బయలుదేరారు. మధ్యలో తేజకి ఆకలి వేసిందని ఒక టిఫిన్ సెంటర్ దగ్గర బైక్ ఆపారు. తేజ ఇడ్లీలు లాగించేస్తున్నాడు, కానీ నాని మాత్రం ఏమీ తినలేదు.

“ఏంట్రా, నాకు పెట్టించి నువ్వేం తినట్లేదు?” అని అడిగాడు తేజ నోట్లో పెట్టుకుంటూ.

“తను నాకోసం స్పెషల్‌గా తాటి గారెలు (Taati Garelu) తెస్తానని చెప్పింది రా! అవి తినకపోతే పాపం ఫీల్ అవుతుంది… ఫస్ట్ టైమ్ తన చేతి వంటనే తింటా,” అన్నాడు నాని.

జయ బయలుదేరిందేమో కనుక్కుందామని ఫోన్ చేశాడు నాని. కానీ జయ తన ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి బయటకొచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఒకసారి ఖరీదైన ఫోన్ పోగొట్టడంతో వాళ్ల అమ్మ ఆమెను ఫోన్ బయటకు తీసుకెళ్లనివ్వదు.

నాని కాల్ చేయగానే ఆ చిన్న పాప (రాజమాత) ఫోన్ లిఫ్ట్ చేసి, “అను ఇంట్లో లేదు, ఈ ఫోన్ మాత్రమే ఇంట్లో ఉంది. నువ్వు పదే పదే ఫోన్ చేస్తే మాకందరికీ దెబ్బలు పడతాయి… ముందు ఫోన్ పెట్టేయ్!” అని పెద్దరికంతో కాల్ కట్ చేసింది.

ఆ ముద్దు మాటలు విని మొదట నవ్విన నాని, ఆ తర్వాత సీరియస్‌గా ఆలోచించాడు.

“దాని పేరు జయ కదా, మళ్లీ 'అను' అని ఎందుకు పిలుస్తున్నారు? ఒకే ఇంట్లో ఇద్దరు జయలు ఉంటారా ఏంటి?” అని కన్ఫ్యూజ్ అయ్యాడు.

“ఏంట్రా, ఇంకా రాలేదా ఆ అమ్మాయి? ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి గుడిలో ఎంత రష్ ఉంటుందో నీకు తెలుసు కదా!” అన్నాడు తేజ.

“ఉండురా… వస్తుందిలే. అమ్మాయిలు అంత త్వరగా రెడీ అయిపోతారా ఏంటి?” అన్నాడు నాని.

“సరేగానీ, ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా?” అని అడిగాడు తేజ ఆసక్తిగా.

“ఏమో… నా దగ్గర ముఖం సరిగ్గా కనిపించని ఈ ఒక్క ఫోటోనే ఉంది,” అని ఫోన్‌లో ఆ గ్రీన్ డ్రెస్ ఫోటో చూపించాడు.

సరిగ్గా అప్పుడే ఎదురుగా రోడ్డుకి అవతలి వైపు నుంచి ఒక అమ్మాయి వీళ్ల వైపు చూసి చెయ్యి ఊపింది.

అది చూసిన తేజ వెంటనే, “ఒరేయ్ నానీ, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయేరా బయటకొచ్చింది!” అని అరిచాడు.

“ఛీ… ఫోటోలో నుంచి మనుషులు బయటకి ఎలా వస్తారురా!” అంటూనే తేజ చూపించిన వైపు చూశాడు నాని.

అంతే… అక్కడ రోడ్డు అవతల జయ నిలబడి ఉంది!

నాని ఆమెను చూడగానే ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. చుట్టూ ఉన్న వాహనాల శబ్దాలు, జనాలు ఏవీ అతనికి వినిపించడం లేదు, కనిపించడం లేదు. కేవలం జయ మాత్రమే కనిపిస్తోంది. ఆమె కళ్లలోకి చూస్తూ, ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా, ట్రాఫిక్‌ను కూడా పట్టించుకోకుండా రోడ్డు దాటేశాడు.

జయ నానిని చూసి సిగ్గుతో తల దించుకుంది.

వాళ్ల ఫస్ట్ మీట్... నానికి ఏం మాట్లాడాలో, ఎలా పలకరించాలో అస్సలు అర్థం కాలేదు.

జయ ఏదో చెప్పబోతుండగా, వెనక నుంచి తేజ ట్రాఫిక్‌లో ఆపసోపాలు పడుతూ రోడ్డు దాటి వచ్చి, “ఒరేయ్! నీకేమన్నా పిచ్చా? చూసుకోకుండా ఇలా ఎలా దాటేశావురా?” అని ఆయాసంగా అడిగాడు.

వెంటనే నాని సర్దుకుని, “జయా... వీడు నా ఫ్రెండ్ తేజ,” అని పరిచయం చేశాడు.

జయ నవ్వుతూ, “నాకు తెలుసు,” అంది. (తేజ మీద కూరగాయల తుక్కు పడిన సంఘటన గుర్తొచ్చి!)

Jaya Janardana

By Ajay

Published: March 19, 2026 at 12:50 PM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...