SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Active
Chapter // 26

Final Episode

Ajay
Drama , love , Comedy
1 Min Read
Pub: Mar 12, 2026

కొన్ని నెలల తర్వాత...

కాలం అనేది విచిత్రమైనది.

మనకు జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు...

"ఇక దీని నుంచి బయటపడలేను" అనిపిస్తుంది.

"ఇక నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది" అనిపిస్తుంది.

కానీ...

కాలం మాత్రం ఆగదు.

మన కోసం ఆగదు.

మన బాధ కోసం ఆగదు.

మన ప్రేమ కోసం కూడా ఆగదు.

అది తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది.

అలా...

కొన్ని నెలలు గడిచిపోయాయి.

జనార్దన్...ఇప్పుడు జనార్దన్ జీవితం పూర్తిగా మారిపోయింది.

కాశీ...

కేదార్‌నాథ్...

ఆ ఒంటరి ప్రయాణం...

ఆత్మపరిశీలన...

ఆ సాధువు చెప్పిన మాటలు...

అన్నీ అతని జీవితాన్ని లోపల నుంచి మార్చేశాయి.

ఇప్పుడు అతను గతంలోని జనార్దన్ కాదు.

ఒకప్పుడు...

ఇతరులు ఏమనుకుంటారో అని ఎక్కువ ఆలోచించేవాడు.

ఒక చిన్న బాధని నెలల తరబడి మోసేవాడు.

ప్రతి జ్ఞాపకాన్ని గుండెల్లో పెట్టుకుని తననే తాను శిక్షించుకునేవాడు....కానీ ఇప్పుడు...

అతనికి ఒక విషయం అర్థమైంది.

జీవితం ఎవరి కోసం ఆగదు.

అందుకే...

తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా పట్టుకున్నాడు.

అతను ఇప్పుడు ఒక సినిమా షూటింగ్‌లో కెమెరా విభాగంలో పనిచేస్తున్నాడు.

ఎప్పుడో ఒకప్పుడు...

కెమెరా పట్టుకుని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసిన ఆ కుర్రాడు...

ఈరోజు పెద్ద సినిమా సెట్లో నిలబడ్డాడు.

ఆ సినిమా కోసం కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు.

సెట్ మొత్తం బిజీగా ఉంది.

లైట్లు...

కెమెరాలు...

అసిస్టెంట్లు...

డైరెక్టర్...

ఆర్టిస్టులు...

అందరూ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు.

జనార్దన్ మాత్రం...

తన కెమెరా ఫ్రేమ్‌లలో పూర్తిగా మునిగిపోయాడు.

ఈ అవకాశాన్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

తన పనిని అంత ప్రేమతో చేస్తున్నాడు...

అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకునే స్థాయికి చేరుకున్నాడు.

ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా...

అక్కడికి ప్రత్యేకంగా ఒక అతిథి వచ్చారు.

Natural star nani

షూటింగ్ ఎలా జరుగుతుందో చూడటానికి వచ్చారు.

సెట్‌లో ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోయారు.

జనార్దన్ జీవితంలో అది ఒక ప్రత్యేకమైన రోజు.

ఎందుకంటే...

ఇంతవరకు సినిమా హీరోలను కేవలం తెర మీద మాత్రమే చూసాడు.

కానీ ఇప్పుడు...

తన ఎదుట నిజంగా నిలబడి ఉన్నారు.

నాని గారు సెట్‌లో అందరితో మాట్లాడుతున్నారు.

అందరినీ పలకరిస్తున్నారు.

అలా జనార్దన్ దగ్గరకు కూడా వచ్చారు.

చిరునవ్వుతో చేయి చాచారు.

జనార్దన్ గుండె వేగంగా కొట్టుకుంది.

చేతులు కలిపాడు.

"హలో సర్!"

అన్నాడు.

ఆనందంలో కొంచెం తడబడిపోయి...

"మై సెల్ఫ్ నాని సర్!"

అని చెప్పేశాడు జనార్దన్ .

కొన్ని క్షణాలు నాని గారు ఆశ్చర్యంగా చూశారు.

తర్వాత నవ్వేశారు.

"అది నా నిక్‌నేమ్ నాని."

అన్నారు.

జనార్దన్ కూడా నవ్వుతూ...

"నాది కూడా నిక్‌నేమే సర్."

అన్నాడు.

"అలానా?...మరి అసలు పేరు ఏంటి?"

అని అడిగారు నని

జనార్దన్ చిరునవ్వుతో...

"జనార్దన్ సర్."అన్నాడు.

---

నాని గారు తల ఊపారు.

"చాలా బాగుంది బెస్ట్ ఆఫ్ లక్ జనార్దన్."

అని చెప్పి భుజం తట్టి ముందుకు వెళ్లిపోయారు.

---

ఆ క్షణం...

జనార్దన్ జీవితంలో ఒక చిన్న సంఘటన మాత్రమే కావచ్చు.

---

కానీ...

అతనికి మాత్రం...

తాను సరైన దారిలో నడుస్తున్నాననే నమ్మకాన్ని ఇచ్చింది.

---

జయ...

మరోవైపు...

జయ జీవితంలో కూడా మార్పులు వచ్చాయి.

మొదట్లో చాలా కష్టంగా అనిపించింది.

జనార్దన్ జ్ఞాపకాలు...

ప్రసాద్ జ్ఞాపకాలు...

గతం...

అన్నీ వెంటాడాయి.

కానీ..కాలం నెమ్మదిగా తన పని చేసింది.

గాయం పూర్తిగా మానిపోకపోయినా...

దాని నొప్పి తగ్గిపోయింది.

ఇప్పుడు జయ తన కెరీర్ మీద దృష్టి పెట్టింది.

ఎంతో కష్టపడి చదివి...

ఒక మంచి ఆసుపత్రిలో రేడియాలజిస్ట్‌గా ఉద్యోగం సంపాదించింది.

ప్రతిరోజూ కొత్త రోగులను చూస్తోంది.

కొత్త బాధ్యతలు స్వీకరిస్తోంది.

కొత్త జీవితాన్ని నిర్మించుకుంటోంది.

గతాన్ని మర్చిపోయింది కాదు.

కానీ...

దానితో జీవించడం నేర్చుకుంది.

అదే అసలు ఎదుగుదల.

ముగింపు కాదు... ఒక సందేశం...జయ, జనార్దన్ కథ మనకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తుంది...

జీవితంలో మనందరికీ బాధలు వస్తాయి.

కొన్ని ప్రేమలు నెరవేరవు....కొన్ని స్నేహాలు మధ్యలోనే ఆగిపోతాయి.

కొన్ని కలలు మన చేతుల మధ్య నుంచి జారిపోతాయి.

కానీ...

అవి జీవితాంతం మనల్ని నిర్వచించాల్సిన అవసరం లేదు.

చాలాసార్లు...

బాధ కంటే బాధ జ్ఞాపకాన్నే మనం ఎక్కువగా పట్టుకుని తిరుగుతుంటాం.

గాయం కంటే...

గాయం గుర్తునే ప్రతిరోజూ మళ్లీ తెరుస్తుంటాం.

కానీ ప్రతి ఉదయం కొత్తదే.

సూర్యుడు నిన్నటి చీకటిని మోసుకుని రాడు.

నది నిన్నటి నీటిని నిల్వ చేసుకోదు.

అలాగే...

మనిషి కూడా తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించగలడు.

ఈ కథ చివరికి మనకు నేర్పేది ఒక్కటే....మనిషికి జీవించడానికి ఒకటే జీవితం ఉంటుంది.

ఆ జీవితాన్ని మంచి అనుభూతులతో నింపాలి.

చెడు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.

---

కానీ వాటినే గుండెల్లో పెట్టుకుని జీవితాంతం బాధపడకూడదు.

ఎందుకంటే...

జీవితం అనేది జరిగిన వాటి గురించి కాదు...ఇంకా జరగబోయే వాటి గురించి.

జనార్దన్ తన దారిలో ముందుకు సాగిపోయాడు.

జయ తన దారిలో ముందుకు నడిచింది.

వాళ్లు కలిసి నడవకపోయినా...

ఒకరికి ఒకరు జీవితంలో ఒక అందమైన అధ్యాయంగా మిగిలిపోయారు.

అంతే.

ఇట్లు,

మీ రచయిత – AJ

Jaya Janardana

By Ajay

Published: June 12, 2026 at 5:26 AM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...