SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

Active
26

Final Episode

Chapter // 25

EPISODE 25

Ajay
Drama , love , Comedy
1 Min Read
Pub: Mar 12, 2026

జీవితంలో కొన్ని విడిపోవడాలు ఉంటాయి.

వాటికి కారణం ద్వేషం కాదు...

అపార్థం కాదు...మోసం కూడా కాదు....కానీ విధి.

ఇద్దరూ ఒకరినొకరు బాధపెట్టాలని అనుకోరు.

ఇద్దరూ ఒకరికి ఒకరు మంచి జరగాలని మాత్రమే కోరుకుంటారు....అయినా...

వారి దారులు విడిపోతాయి.

అలాంటి ఒక మలుపు దగ్గర ఇప్పుడు నిలబడి ఉన్నారు...జనార్దన్ మరియు జయ.

జయ...ఆ సాయంత్రం కూడా తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది.

కిటికీ బయట వర్షం పడుతోంది...గదిలో వెలుగు ఉన్నా...

ఆమె మనసులో మాత్రం చీకటి అలుముకుంది.

మంచం మీద కూర్చుని చేతిలో ఫోన్ పట్టుకుంది.

ఆ ఫోన్‌లో ఇప్పటికీ జనార్దన్‌తో జరిగిన పాత చాట్స్ ఉన్నాయి....వాళ్లు పంపుకున్న ఫోటోలు ఉన్నాయి.

నవ్వులు ఉన్నాయి....

కానీ...

ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం మాత్రం లేదు.

ఆమె కళ్లలో మళ్లీ నీళ్లు తిరిగాయి.

తన మనసులో చాలా రోజులుగా దాచుకున్న ప్రశ్నను మరోసారి అడిగుకుంది.

"నేను ఎక్కడ తప్పు చేశాను...?"

ఆ ప్రశ్నకు సమాధానం ఆమెకే దొరకడం లేదు.

గతం>>

జనార్దన్ మొదటిసారి వెంకట్ గురించి చెప్పిన రోజు...

అప్పుడే జయ గుండెల్లో ఒక అనుమానం మొదలైంది.

"వెంకట్...?"

ఆ పేరు తనకు కొత్తది కాదు.

కొన్ని ప్రశ్నలు...

కొన్ని జ్ఞాపకాలు...

కొన్ని పోలికలు...

అన్నీ కలిపి చివరికి ఒక నిజం ఆమె ముందు నిలబెట్టాయి.

జనార్దన్, తాను ఒకప్పుడు ప్రేమించిన ప్రసాద్‌కి స్నేహితుడు.

ఆ నిజం తెలుసుకున్న రోజు...

ఆమె మనసు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది.

ఎందుకంటే...

ఇప్పటికే జనార్దన్ ఆమె జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోయాడు.

అతను కేవలం స్నేహితుడు కాదు...తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి.

తన బాధను విన్న వ్యక్తి.

తన నవ్వును తిరిగి తీసుకొచ్చిన వ్యక్తి.

తన ఒంటరితనాన్ని పంచుకున్న వ్యక్తి.

ప్రసాద్ మరణించిన తర్వాత...

తన జీవితంలో మళ్లీ వెలుగు తీసుకొచ్చిన వ్యక్తి.

అతనే జనార్దన్.

కానీ...ఇప్పుడు ఆ విషయం బయటకు చెబితే?

స్నేహితులు ఏమనుకుంటారు?

సమాజం ఏమనుకుంటుంది?

"ఒకరిని ప్రేమించి... ఇప్పుడు అతని స్నేహితుడిని ప్రేమిస్తోందా?" అని అనరా?

అది నిజం కాకపోయినా...చూసే వాళ్లకు అలా కనిపించదా?

తెలియక చేసిన తప్పు...

బయటివాళ్ల కళ్లలో తప్పుగానే కనిపించదా?

ఈ ఆలోచనలన్నీ జయని లోపల నుంచి నెమ్మదిగా విరగగొట్టాయి....మరోవైపు...

తను జనార్దన్‌కి మాట కూడా ఇచ్చింది.

"కృష్ణాష్టమికి తప్పకుండా కలుద్దాం."అని.

ఆ రోజు కోసం ఎంత ఎదురు చూసింది...ఎన్ని నెలలు.

ఎన్ని కలలు.

ఎన్ని ఊహలు.

మొదటిసారి అతన్ని చూసే రోజు అని అనుకుంది.

కానీ...

ఆ రోజు...

వారి కొత్త జీవితానికి ఆరంభం కాలేదు.

వారి దూరానికి ప్రారంభమైంది...మొదటి కలయిక...

చివరి కలయికగా మారిపోయింది.

ప్రసాద్ జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకుని...

వాటిని గౌరవిస్తూ...జనార్దన్‌తో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంది జయ.

కానీ...ఆ అవకాశం కూడా విధి ఇవ్వలేదు.

ఆ రాత్రి.....తన గదిలో తాను ఎంత ఏడ్చిందో...

తనకు మాత్రమే తెలుసు.....సమాజానికి కాదు.

జనార్దన్‌కి కాదు.

ఎవరికీ కాదు.

వర్తమానం>>

ఆలోచనల మధ్య మళ్లీ జయ కళ్లలో కన్నీళ్లు జారాయి.

"ఎక్కడ తప్పు చేశాను...?"

అని మళ్లీ మళ్లీ అడుగుతోంది.

ఆమెకు గుర్తొచ్చాయి..

జనార్దన్‌తో జరిగిన మొదటి సంభాషణ.

అతను చెప్పిన జోకులు.

రాత్రి వేళల్లో చేసిన పొడవాటి కాల్స్.

అతని వెర్రి మాటలు.

అతని ఫోటోగ్రఫీ.

అతని కలలు...అతని అమాయకత్వం.

అన్నీ.

నిజానికి...

ఆమె జీవితంలో అత్యంత కఠినమైన సమయంలో...ఆమె పక్కన నిలబడింది జనార్దన్‌నే...ఏడ్చినప్పుడు నవ్వించాడు...నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాట్లాడించాడు.

ఒంటరిగా ఉన్నప్పుడు తోడయ్యాడు.

వాళ్లు ఎన్నో విషయాలు పంచుకున్నారు.

అనుభవాలు...

భయాలు...

కుటుంబం...

బాధలు...

కలలు...అబ్బో...ఎన్నో.

అది ఒక అందమైన స్నేహం....మెల్లగా ప్రేమగా మారే స్నేహం.

కానీ...ప్రేమగా మారేలోపే...

విరిగిపోయింది.

-----

మరో వైపు...

హిమాలయాల ఒడిలో గడిపిన రోజుల తర్వాత...

జనార్దన్ కేదార్‌నాథ్ యాత్ర పూర్తిచేశాడు.

ఆ ప్రయాణం అతనిలో చాలా మార్పులు తీసుకొచ్చింది.

కాశీ అతనికి జీవితాన్ని అర్థం చేయించింది...కేదార్‌నాథ్ అతనికి నిశ్శబ్దాన్ని నేర్పించింది.

ఇప్పుడు...

చాలా రోజుల తర్వాత...అతను తన ఇంటికి ఫోన్ చేశాడు.

ఫోన్ అవతల.....అమ్మమ్మ స్వరం వినిపించింది.

అసలు మనసు విరిగిన వాళ్ళ అందరూ ఇంట్లో కూర్చుని బాధ పడకుండా ఇలా దూర ప్రయాణాలు చేస్తే వాళ్ళ మనసు కుదుట పడుతుంది అలాగే జీవితం లో ప్రేమ ఉంటుంది కానీ జీవితం మొత్తం ప్రేమే కాదు ! అని అర్థం అవుతుంది , ప్రేమ మన జీవితాలలో ఒక భాగం మాత్రమే ,

ఇంటికి ఫోన్ చేయగానే వాళ్ళ అమ్మమ్మ

"జనార్దన్...!" అని అంది

అంతే.

ఆ ఒక్క పిలుపులోనే ఎంత ప్రేమ ఉందో అతనికి అర్థమైంది.

ఆమె గొంతు వణికింది.

"ఎక్కడున్నావురా?...బాగున్నావా? ,తింటున్నావా?, ఏమైనా ఇబ్బంది ఉందా?"...ఒక్కసారిగా ఎన్నో ప్రశ్నలు.

ఎన్నో భావోద్వేగాలు.

ఆ మాటలు విన్న జనార్దన్ కళ్ళు తడిశాయి.

ఇంతకాలం...

తాను తన బాధల గురించి మాత్రమే ఆలోచించాడు.

కానీ..తన కోసం బాధపడే వాళ్లు కూడా ఉన్నారని మరిచిపోయాడు...తన కోసం ఎదురు చూసే అమ్మమ్మ ఉంది.

తన గురించి ఆరా తీసే కుటుంబం ఉంది.

తనని ప్రేమించే మనుషులు ఉన్నారు....ఆ క్షణంలో...

జనార్దన్ మనసులో ఒక నిర్ణయం పుట్టింది.

---

"ఇంటికి వెళ్లాలి."

తిరుగు ప్రయాణం

మళ్లీ ఒకసారి ప్రయాణం మొదలైంది.

ఈసారి..పారిపోవడానికి కాదు...తిరిగి చేరుకోవడానికి.

రైలు కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తున్నాడు.

పొలాలు వెనక్కి పరుగెడుతున్నాయి....చెట్లు దూరమవుతున్నాయి....సూర్యాస్తమయం ఆకాశాన్ని నారింజ రంగుతో నింపుతోంది.....జనార్దన్ నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వాడు.....తన మనసులో ఒక మాట వినిపించింది.

"ఏం జరిగినా... మన మంచికే."

కొద్దిసేపు ఆలోచించాడు....జయ గుర్తొచ్చింది.

గోదావరి గుర్తొచ్చింది.

ఆ మొదటి కలయిక గుర్తొచ్చింది.

తర్వాత నెమ్మదిగా తనలో తాను అనుకున్నాడు.

"కొన్ని పరిచయాలు...పరిచయాల వరకే అందంగా ఉంటాయి, అవి జీవితాంతం మనతో ఉండకపోయినా...మనల్ని మార్చి వెళ్లిపోతాయి, మరోసారి కిటికీ బయట చూశాడు.

"జీవితంలో ఏం జరిగినా...జీవితం మాత్రం ఆగదు కదా."

అది నిజం.

ప్రేమ వెళ్లిపోవచ్చు.

మనుషులు దూరమవచ్చు.

కలలు మారిపోవచ్చు.

కానీ...

జీవితం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది.

అలా...

తనను తాను వెతుక్కుంటూ వెళ్లిన జనార్దన్...

కొంచెం ప్రశాంతతతో...

కొంచెం పరిపక్వతతో...

కొంచెం కొత్త మనిషిగా...

తిరిగి తన ఇంటి దారి పట్టాడు.

కానీ...

విధి ఇంకా తన కథను ముగించలేదు.

హైదరాబాద్‌లో ఉన్న ఆ ఉత్తరం...

తేజ దాచుకున్న ఆ శుభవార్త...

మరియు జయ గుండెల్లో ఇంకా చెప్పని మాటలు...

ఇవన్నీ ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి.

ముఖ్యం గా నేచురల్ స్టార్ మన జనార్దన్ కోసం ఎదురు చూస్తున్నాడు...

Jaya Janardana

By Ajay

Published: June 12, 2026 at 5:26 AM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...