SCREEN ON

Loading File

Chapter 12

Chapter 11
Chapter 12
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 11

OKA DIARY

Chapter 12
Chapter 11
Chapter 12

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 12

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

Active
12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

Chapter // 11

EPISODE 11

ఉదయం నాలుగున్నర అవుతోంది. ఇల్లుంకా నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తుండగానే సుశాంత్ మేల్కొన్నాడు. బద్దకాన్ని వదిలించుకుని సీరియస్‌గా తన ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. 'హౌ టు ఫేస్ యాన్ ఇంటర్వ్యూ...' (How to face an interview) అని వీడియోలు చూస్తూ కళ్ళప్పగించాడు.

సరిగ్గా అప్పుడే నిద్రలేచి వచ్చిన జయరాం, తన కొడుకు ఫోన్లో చూస్తున్నదాన్ని వెనకనుంచి గమనించాడు. 'తన కొడుకు మొదటిసారి తన జీవితానికి పనికొచ్చే పని ఏదో చేయబోతున్నాడు' అన్న తలంపు ఆ తండ్రి మనసులో ఎనలేని సంతోషాన్ని, మురిపాన్ని నింపింది. వాడి ఏకాగ్రతను భంగం చేయడం ఇష్టం లేక, చిన్నగా నవ్వుకుంటూ అక్కణ్ణుంచి మౌనంగా వెనక్కి వెళ్ళిపోయాడు.

ఉదయం ఎనిమిది గంటల సమయం.

సుశాంత్ తన గది నుంచి బయటకొచ్చాడు. నీట్‌గా ఇన్‌షర్ట్ చేసి, ఫార్మల్ డ్రెస్‌లో ఆఫీస్‌కి వెళ్లే ఎంప్లాయ్ లాగా టక్ చేసుకున్నాడు. ఎప్పుడూ లేనిది అలా టిప్-టాప్‌గా తయారైన తమ్ముణ్ణి చూసి పల్లవి ఆశ్చర్యపోయింది.

"ఏంటి సార్ గారు... బాగా టిప్-టాప్ గా రెడీ అయ్యారు? ఏంటి విషయం?" అని కొంటెగా అడిగింది.

"ఏం లేదక్కా... ఒక కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను," సింపుల్ గా చెప్పాడు సుశాంత్.

"ఏంట్రా... మొన్నటి వరకు 'మ్యూజిక్ ఈజ్ మై బ్లడ్' అన్నావ్? ఇప్పుడు మళ్ళీ జాబ్ ఏంటి కొత్తగా?" అనుమానంగా అడిగింది పల్లవి.

"అప్పుడే కదా ప్రజ్ఞాతో పెళ్ళయ్యేది..." నోరు జారాడు సుశాంత్.

అది వినగానే పల్లవికి విషయం అర్థమైపోయింది. "ఏంట్రా... లవ్వా? అమ్మాయెవరు?"

తన నోటి దూలకు తనను తానే తిట్టుకుంటూ, "ఛీ... ఛీ... అమ్మాయా? అలాంటిదేమీ లేదు," కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

"రేయ్... చెప్తావా లేదా నాన్నకు చెప్పమంటావా?" బెదిరించింది పల్లవి.

ఏం చెప్పాలో తెలియక సుశాంత్ నిజం కక్కేశాడు. "అక్కా... తన పేరు ప్రజ్ఞ. చాలా మంచి అమ్మాయి, నాకు చాలా ఇష్టం. చూడటానికి బాగానే ఉంటుంది, పద్ధతిగానూ ఉంటుంది. తను స్కూల్ టీచర్..." గబగబా చెప్పేశాడు వణుకుతున్న గొంతుతో.

పల్లవి నిట్టూరుస్తూ, "హ్మ్... సరిపోయింది! నాన్నేమో 'నా కొడుకు మ్యూజిక్ ఫీల్డ్ లో అనుకున్నది సాధించాలి' అని పొద్దున్నే గుడికెళ్ళి పూజ కూడా చేశాడు పాపం. తీరా చూస్తే నువ్వు ఇంటర్వ్యూ అంటున్నావ్. సరేలే," అంది కాస్త బాధగా.

అది విన్న సుశాంత్ మనసు చివుక్కుమంది. "సర్లే... నాకు లేటవుతుంది," అని చెప్పి వేగంగా ఇంటినుంచి బయటకొచ్చాడు. తండ్రి ఇష్టాన్ని కాదని, ఒక అమ్మాయి కోసం తన గమ్యాన్ని మార్చుకోవడానికి వెళ్తున్న తమ్ముణ్ణి చూస్తూ మౌనంగా ఉండిపోయింది పల్లవి.

ఇంటి బయట బైక్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతుండగా ఎదురుగా వచ్చాడు జయరాం. చేతిలో ప్రసాదం ఉంది.

"రేయ్ నాన్నా... సుశాంత్! ఇదిగో ఈ ప్రసాదం తీసుకో," అని కొడుకు నోట్లో ప్రసాదం పెట్టాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న కవర్ లోంచి అప్పుడే కొన్నట్లున్న కొత్త బూట్లు తీసి ఇచ్చాడు. "రేయ్ సుశాంత్... నువ్వు నీ ఫీల్డ్ లో ఏది చేసినా సక్సెస్ అవ్వాలని శివుడికి నీ పేరు మీద అభిషేకం చేయించి వచ్చానురా," అని ప్రేమగా అన్నాడు జయరాం.

సుశాంత్ బట్టలను సర్ది... తన కొడుకుని ఆఫీషియల్ వేర్ లో చూసి మురిసిపోయాడు.

తండ్రి చేస్తున్నదంతా చూసి సుశాంత్ కి ఒక్కసారిగా గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించింది. తను చేస్తున్నదంతా ఒక అమ్మాయి కోసం... తన తండ్రి ఆశల కోసం కాదన్న నిజం వాడి మనసును కోసేసింది. తన ప్యాషన్ ని చంపుకుని తండ్రి కళ్ళల్లో నీళ్లు చూస్తుండటం వాడికి దిగులుని తెచ్చిపెట్టింది.

ఆ సందిగ్ధంలో ఉండగానే, "రేయ్ నాన్నా ఆగు... ఇలా రా," అన్న జయరాం, లోపలికి తిరిగి "పల్లవీ! ఇలా రమ్మ... తమ్ముడికి ఎదురువెళ్ళు. వాడికి అంతా మంచే జరగాలి," అని పిలిచాడు.

ఆ మాటలు విన్న సుశాంత్ కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. పల్లవి నవ్వుతూ ఎదురుగా వస్తుంటే... చిన్నప్పటినుంచి వాళ్ళ నాన్న తనని కంటికి రెప్పలా ఎలా చూసుకున్నాడో, తన ఆశలకు ఎలా రెక్కలిచ్చాడో వాడి కళ్ళముందు మెదిలింది.

ఆ ఎమోషనల్ మూమెంట్ ని బ్రేక్ చేస్తూ... సరిగ్గా అప్పుడే తన స్కూటీ మీద అక్కడికి వచ్చింది ప్రజ్ఞ. సుశాంత్ ని ఆ గెటప్ లో చూడగానే ఆమె కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. "ఏంటి! నేను నిన్న చెప్పిన కంపెనీలోనే ఇంటర్వ్యూకేగా వెళ్తున్నావ్? రా... నేను డ్రాప్ చేస్తాను," అని నవ్వుతూ ఆహ్వానించింది.

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజ్ఞ స్కూటీ వెనక కూర్చున్నాడు సుశాంత్.

ఆమె బండి నడుపుతుండగా సుశాంత్ ముఖం అద్దంలో చూసింది ప్రజ్ఞ. "ఏంటి ముఖం అంత డల్ గా పెట్టావ్? ఏంటి విషయం?" అడిగింది.

సుశాంత్ ఇంట్లో జరిగినదంతా వివరంగా చెప్పాడు.

అది విన్న ప్రజ్ఞ, "మంచిదేగా మాస్టారూ! మీరు జాబ్ తెచ్చుకుని సెటిల్ అయితే, మీ నాన్నగారు కూడా హ్యాపీయేగా," అంది సానుకూలంగా.

"అలా కాదు ప్రజ్ఞ. నేను ఇదంతా కేవలం నీ కోసం చేస్తున్నానని తెలిస్తే ఆయనెంత బాధపడతాడు? నేను మ్యూజిక్ మీద ఇష్టంతో ఉన్నానని ఆయన గత మూడేళ్లుగా నన్ను 'జాబ్ తెచ్చుకో' అని అడగలేదు. ఏ జాబ్ ఆఫర్ వచ్చినా వెళ్లలేదు. ఇప్పుడు కేవలం నీ కోసమే ఇంటర్వ్యూకి వెళ్తుంటే... నాకు 'హాఫ్-హాఫ్' ఫీలింగ్ వస్తోంది," అని బాధగా చెప్పాడు సుశాంత్.

బండి ఆపి వెనక్కి తిరిగింది ప్రజ్ఞ. "అంటే ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవాలంటే జాబ్ తెచ్చుకోమని మా ఇంట్లో వాళ్ళు కండిషన్ పెట్టారనేగా నీ బాధ? నా వల్ల నీ ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నానని ఫీల్ అవుతున్నావా?" సూటిగా అడిగింది.

"అలా కాదు... కానీ వాళ్ళకోసం నేను ఇంతవరకు ఏమీ చేయలేదు కదా!" తలదించుకుంటూ అన్నాడు సుశాంత్.

ఆ కంపెనీ గేటు ముందు స్కూటీ ఆపింది ప్రజ్ఞ. వెనక్కి తిరిగి సుశాంత్ జుట్టును ప్రేమగా సవరిస్తూ... "చూడు సుశాంత్... నువ్వు మరీ డీప్ గా ఆలోచిస్తున్నావు. ఏం కాదు, నువ్వు జాబ్ తెచ్చుకునేది మీ ఫ్యామిలీ కోసమే! అయినా, నీ ఫ్యామిలీ అంటే... నా ఫ్యామిలీ కూడానే కదరా," అని ఆత్మీయంగా చెప్పింది.

ఆ ఒక్క మాటతో సుశాంత్ మనసు తేలికపడింది. పెదాలపై చిన్న చిరునవ్వు వికసించింది. ప్రజ్ఞ వైపు చూసి, "మరి... నేను వెళ్ళనా?" అని అడిగాడు ఎనర్జీగా.

"వెళ్లవయ్యా... వెళ్ళు! ఆల్ ది బెస్ట్!" అని నవ్వుతూ చేయి ఊపింది ప్రజ్ఞ.

తన తండ్రి నమ్మకాన్ని, ప్రజ్ఞ ప్రేమను గెలిపించాలన్న కసితో లోపలికి అడుగుపెట్టాడు సుశాంత్.

OKA DIARY

By Storytravel

Published: March 3, 2026 at 12:49 PM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...