Loading File
Initializing...
Chapter 4
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
సమయం రాత్రి పదకొండు దాటి పది నిమిషాలవుతోంది.
దేహమంతా గాయాలతో నడుచుకుంటూ ఇంటికొచ్చిన సుశాంత్‌ని చూడగానే వాళ్ల అక్క పల్లవికి ప్రాణం పోయినంత పనైంది. వాడి వెనుకే నడుచుకుంటూ రామ్ కూడా లోపలికి వచ్చాడు.
"ఏమైందిరా? ఏంటి ఆ దెబ్బలు?" కంగారుగా అడిగింది పల్లవి.
సుశాంత్ నోటి వెంట మాట రాలేదు. "ప్రజ్ఞ..." అంటూ అక్క చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
తమ్ముడి బాధ చూడలేక, "పోనీ నన్ను వెళ్లి అడగమంటావా రా?" అంది పల్లవి ఆవేదనగా.
"ఇక అడిగేదేముందక్కా... అక్కడ పెళ్లి అయిపోయింది. వాడికి కాస్త బ్యాండేజ్ వేస్తే రెస్ట్ తీసుకుంటాడు," అంటూ అడ్డుపడ్డాడు రామ్.
"నువ్వు కూడా రారా లోపలికి. నీకు కూడా దెబ్బలు తగిలాయేంటి? అక్కడ ఏమైనా గొడవ చేశారా?" అంటూ ఇద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్లింది పల్లవి.
"లేదక్కా, వచ్చేటప్పుడు బైక్ స్కిడ్ అయ్యింది," అంటూ మాట దాటేశాడు రామ్.
"రేయ్, ఇద్దరూ మెల్లగా మాట్లాడండి. నాన్నగారు లేచారంటే మళ్లీ గొడవవుతుంది," అని హెచ్చరించింది పల్లవి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి సుశాంత్ గాయాలకు ఆయింట్‌మెంట్ రాస్తూ... "ఒరేయ్ తమ్ముడూ, ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోరా. నీకు అంతకంటే మంచి అమ్మాయి వస్తుందిలే. నువ్వు నా బంగారంవి కదూ... అయినా నీలాంటి వాడికి ఆ అమ్మాయి తగదులే," అంటూ ఓదార్చింది.
సుశాంత్ ఏమీ మాట్లాడలేదు, శూన్యంలోకి చూస్తున్నాడు. పల్లవి కాటన్‌తో తుడుస్తుండగా రామ్ కల్పించుకుని, "అక్కా, నేనింకా చూసుకుంటాలే. కాస్త వాటర్ ఇస్తావా? క్వార్టర్‌లో మిక్స్ చేయాలి. రెండు పెగ్‌లు పడితే కానీ వీడు నిద్రపోడు," అన్నాడు.
పల్లవి వాడి వంక సీరియస్‌గా చూసి, "చాల్లే ఊరుకో! మేడ మీదకి వెళ్లి తాగండి... నాన్న చూస్తే ముందు నన్ను తిడతారు," అంది విసుగ్గా.
"మీ తమ్ముడినైతే ఇంట్లోంచి గెంటేస్తాడనుకో! ఆ వాటరేదో ఇవ్వు, అలాగే ఓ ఇరవై రూపాయలుంటే ఇవ్వు, చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా," అని రామ్ అనగానే, "చీ! దరిద్రుల్లారా..." అంటూ పల్లవి విసుక్కుంటూ లోపలికి వెళ్లిపోయింది.
"నువ్వేం ఫీల్ అవ్వకు మామా, ఇలాంటివి మనకు మామూలే," అన్నాడు రామ్ నవ్వుతూ. కానీ గుండెకోతతో ఉన్న సుశాంత్ ఆ జోక్‌ను తీసుకోలేకపోయాడు. రామ్ వంక తీక్షణంగా చూశాడు. "సరేలే రా... నువ్వు టెర్రస్ పైకి పో, నేను చిప్స్ ప్యాకెట్ తీసుకుని వస్తా," అంటూ సుశాంత్‌ను పైకి పంపేశాడు రామ్.
కాసేపటికి రామ్ చిప్స్ ప్యాకెట్‌తో పైకొచ్చాడు. ఇద్దరూ మందు గ్లాసులు పట్టుకుని కూర్చున్నారు. సుశాంత్‌లో దాగున్న బాధ కట్టలు తెంచుకుంది.
"అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేనప్పుడు, నన్నెందుకు రా లవ్ చేసింది? తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్స్... అన్నీ నాతోనే షేర్ చేసుకునేది కదా మామా! ఎందుకిలా చేసింది రా?" అంటూ తల పట్టుకున్నాడు సుశాంత్.
అది విన్న రామ్, "ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ రా. నువ్వు కాస్త ఫోకస్ చేస్తే ఒక్క నెలలో తనని మర్చిపోతావ్," అని ప్రాక్టికల్‌గా సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ సుశాంత్ మనసంతా ప్రజ్ఞ ఆలోచనలే. ఆకాశంలో ఒంటరిగా ఉన్న చందమామ వంక చూస్తూ... "అసలు నా లైఫ్‌లోకి ఎలా వచ్చింది రా తను..." అంటూ భారంగా నిట్టూర్చాడు.
(ఇక్కడ నుంచి సుశాంత్ లవ్ స్టోరీ ప్రారంభం...)
OKA DIARY
By Storytravel
Published: February 26, 2026 at 3:24 PM
Your input calibrates the database for others.
Ready to play...