SCREEN ON

Loading File

Chapter 13

Chapter 12
Chapter 13
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 12

OKA DIARY

Chapter 13
Chapter 12
Chapter 13

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 13

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

Active
13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

Chapter // 12

EPISODE 12

ఉదయం: కంపెనీ ఇంటర్వ్యూ రూమ్

"సో... మిస్టర్ సుశాంత్... యు ఆర్ హైర్డ్!" ఇంటర్వ్యూవర్ పెదవులపై చిరునవ్వు కనిపించింది. "రేపు ఉదయానికల్లా రిపోర్టింగ్ లెటర్ మీ టేబుల్ మీద ఉంటుంది. రేపు రావడం మర్చిపోకండి," అని స్పష్టం చేశాడు.

ఆ మాటలు వినగానే సుశాంత్ కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. మనసులో ఎగిరి గంతేశాడు.

"థాంక్యూ సార్... థాంక్యూ సో మచ్!" అంటూ కంగారుగా, సంతోషంగా బయటకు వచ్చేశాడు.

బయట అడుగుపెట్టగానే ఈ సంతోషాన్ని ముందుగా ప్రజ్ఞతో పంచుకోవాలని జేబులోంచి ఫోన్ తీశాడు. ఆనందంతో చేతులు వణుకుతున్నాయి. కాల్ చేయగానే ప్రజ్ఞ లిఫ్ట్ చేసి, "హలో..." అంది.

"హేయ్! గుడ్ న్యూస్... ఫస్ట్ అటెంప్ట్ లోనే సెలెక్ట్ అయిపోయాను! ఇంక పెళ్ళికి రెడీ అయిపో," ఎంతో ఎగ్జైట్మెంట్ తో చెప్పాడు సుశాంత్.

కానీ అవతల ప్రజ్ఞ గొంతులో సంతోషం లేదు, ఏదో చెప్పలేని బాధ ధ్వనించింది. "అవును... పెళ్ళికి రెడీ అవ్వాలి. కానీ నీతో కాదు!" అంది భారంగా.

సుశాంత్ కి ఆమె అన్న మాటలు సరిగ్గా అర్థం కాలేదు. "ఏంటో నువ్వు... పాజిటివ్ గా అన్నా, నాకు నెగిటివ్ గా వినిపిస్తోంది. సర్లే, మీ ఇంటికి సంబంధం మాట్లాడటానికి ఎప్పుడు రమ్మంటావ్?" పట్టలేని ఆనందంతో అడిగాడు.

"అది కాదురా... నీకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో మా చుట్టాల అబ్బాయితో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. అది కూడా నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్లిన వెంటనే... తిరిగి ఇంటికి వచ్చే లోపే అంతా జరిగిపోయింది," అంటూ ఫోన్లోనే వెక్కివెక్కి ఏడ్చింది.

సుశాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. "ఏంటి! నువ్వేం కంగారు పడకు... నేను మీ ఇంట్లో మాట్లాడతానులే," అని ధైర్యం చెప్పాడు.

"మా ఫ్యామిలీని ఒప్పించడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అంతే సంగతులు," ఏడుస్తూనే అంది ప్రజ్ఞ.

"ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు. నేను ఉన్నానుగా! ఏదో ఒకటి చేసి ఆ సంబంధం చెడగొడతానులే," నమ్మకంగా అన్నాడు సుశాంత్.

"ఎలా?" ఎగ్జైట్ అవుతూ అడిగింది ప్రజ్ఞ.

"ఇప్పుడేమైంది నీ ఏడుపుకి? సంబంధం చెడగొడతాను అనగానే యాక్టింగ్ ఆపేశావా?" అంటూ హాస్యంగా అన్నాడు టెన్షన్ తగ్గించడానికి.

"పో... నేను మా బావనే చేసుకుంటా అయితే! నిన్ను వదిలేస్తా," కాస్త వెటకారంగా అంది ప్రజ్ఞ.

"అంత పని చేయకు తల్లి! ముందు ఆ పెళ్ళికొడుకు నెంబర్ ఇవ్వు... నేను మాట్లాడతాను."

"లేదు... నేను కూడా వస్తాను. ముగ్గురం కలిసి మాట్లాడుకుని డిసైడ్ అవ్వడం మంచిది," అంది ప్రజ్ఞ. "ఐతే నువ్వే వాడిని ఎలాగోలా గుడికి తీసుకురా," అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుశాంత్.

సాయంత్రం: గుడి దగ్గర

ప్రజ్ఞ వాళ్ల బావ పేరు కిరణ్. ప్రజ్ఞను తీసుకుని తన ఆడి (Audi) కారులో గుడికి వచ్చాడు.

దూరం నుంచి ఆ కారుని చూసిన రామ్, "వామ్మో... ఏంట్రా ఆ కారు అలా ఉంది?" ఆశ్చర్యంగా అన్నాడు. తర్వాత సుశాంత్ వైపు తిరిగి, "అలాంటి వాడిని కాదని, నీలాంటి బేవార్స్ గాడిని ఎలా లవ్ చేసిందంటావు?" అన్నాడు సెటైరికల్ గా.

రామ్ వైపు కోపంగా చూశాడు సుశాంత్. ఇంతలో కిరణ్ సుశాంత్ దగ్గరికి వచ్చాడు.

"హాయ్ బ్రో... ప్రజ్ఞ నాతో మొత్తం చెప్పింది," చాలా కూల్ గా అన్నాడు కిరణ్.

"హమ్మయ్య... ఓ టెన్షన్ పోయింది," ఊపిరి పీల్చుకున్నాడు సుశాంత్.

"అబ్బే... అలా కాదు బ్రో. మీ విషయం మొత్తం తెలిసిన తర్వాత కూడా, నాకు ప్రజ్ఞే కావాలి. తను నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం," అని బాంబ్ పేల్చాడు కిరణ్. ఆ మాటకు ప్రజ్ఞ కూడా షాక్ అయింది.

"రేయ్... ఏంట్రా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్?" అంటూ కోపంతో ఊగిపోయిన సుశాంత్, కిరణ్ కాలర్ పట్టుకున్నాడు.

కిరణ్ చాలా నిర్లక్ష్యంగా సుశాంత్ చేతిని విదిలించాడు. "నానా అముల్ బేబీ... ఆల్ రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఏంచేసినా పీకేది ఏమీ లేదు," అంటూ జేబులోంచి ఓ సిగరెట్ తీసి స్టైల్ గా వెలిగించాడు. "పక్కకి తప్పుకో తమ్ముడూ," అంటూ పొగ వదులుతూ ముందుకు కదిలాడు కిరణ్.

సరిగ్గా అదే సమయానికి... ఎక్కడినుంచి వచ్చాడో ఏమో రామ్, మెరుపు వేగంతో కిరణ్ తల మీద ఓ కొబ్బరికాయతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి కిరణ్ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయాడు.

సుశాంత్ కి మైండ్ బ్లాంక్ అయింది. "రేయ్... నీ అబ్బా! ఎందుకు కొట్టావురా వాడిని?" అని అరిచాడు.

"అలా కాదు మావా... వీడిని మన రూమ్ కి తీసుకువెళ్లి, మన స్టైల్ లో ఇద్దాం. రేపు మార్నింగ్ కల్లా సెట్ అయిపోతాడు," చాలా క్యాజువల్ గా అన్నాడు రామ్.

"రామచంద్రా ప్రభూ..." అంటూ తలపట్టుకున్నాడు సుశాంత్.

ఇక చేసేది లేక, స్పృహ తప్పిన కిరణ్ ని ముగ్గురూ కలిసి కిడ్నాప్ చేశారు.

OKA DIARY

By Storytravel

Published: March 3, 2026 at 12:50 PM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...