SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

Active
24

FINAL EPISODE

Chapter // 23

EPISODE 23

Storytravel
Love-drama
1 Min Read
Pub: Feb 26, 2026

సుశాంత్ తన అక్క పెళ్లికి వచ్చిన బంధువులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సందడిగా గడుపుతున్నాడు. బావగారి తరఫు బంధువులు కావడంతో అన్నీ కొత్త పరిచయాలే. మరోవైపు పల్లవిని పెళ్లికూతురిని ముస్తాబు చేస్తున్నారు.

అంతలో పల్లవి, సుశాంత్‌ను తన దగ్గరకు రమ్మని కబురు పంపుతుంది.

"ఏంటక్కా పిలిచావు? త్వరగా చెప్పు... అక్కడ భోజనాల ఏర్పాట్లు చూసుకోవాలి, టెంట్ వాళ్లకి చెప్పాలి, ఐస్ తేవాలి... అబ్బో చాలా పనులున్నాయి," అని కంగారుగా అంటాడు సుశాంత్.

వాడి హడావుడి చూసిన పల్లవి, "అప్పుడే ఎంత పెద్దోడివి అయిపోయావురా... ఏమీ లేదులే, మామూలుగానే పిలిచాను," అని మురిసిపోతూ నవ్వుతుంది.

"నువ్వు నన్ను అమ్మలా చూస్తున్నావు కదక్కా, అందుకే నీకలా అనిపిస్తోంది," అని చిరునవ్వు చిందించి తన పనుల్లోకి వెళ్లిపోతాడు సుశాంత్.

అలా పెళ్లి పనులన్నీ చూసుకుంటుండగా... పెళ్లి పీటల మీద పల్లవి, మహేష్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. పెళ్లికూతురిగా నవ్వుతున్న పల్లవిని చూసి జైరామ్ పొంగిపోతుంటాడు.

"అక్క పెళ్లి ఇలాగే కదా నాన్నా జరగాలనుకున్నావు!" అని సుశాంత్ అనగానే, జైరామ్ ఆనందబాష్పాలు రాలుస్తూ కళ్లు తుడుచుకుంటాడు.

ఆ సందడి వాతావరణం మధ్యలో సుశాంత్‌కి ఒక్కసారిగా ప్రజ్ఞ గుర్తుకొస్తుంది. ఆ పెళ్లి వాతావరణం అతన్ని ప్రజ్ఞ గురించి ఆలోచించేలా చేస్తుంది.

'అసలు ప్రేమంటే ఏంటి? ప్రతిక్షణం ప్రజ్ఞను గుర్తుతెచ్చుకుని బాధపడటమా? కాదు కదా! మనం ప్రేమించిన వాళ్లు ఎక్కడున్నా సరే బాగుండాలని కోరుకోవడమే కదా నిస్వార్థమైన ప్రేమ. ప్రజ్ఞ హ్యాపీ... సో, నేను కూడా హ్యాపీగానే ఉండాలి. కానీ, ప్రాణంగా ప్రేమించాను కదా, ఈ చిన్న బాధ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందిలే...' అని మనసులో అనుకుని, బయటకు మాత్రం ఓ చిరునవ్వు నవ్వుతాడు.

"ప్రేమంటే భౌతికమైనది కాదు, అది శాశ్వతమైనది... (Love is not material, Love is eternal)" అని తనలో తనే గొణుక్కుంటాడు.

సరిగ్గా అదే సమయానికి, వెనుక నుండి ఎవరో సుశాంత్‌ను ఆప్యాయంగా హత్తుకుంటారు. ఆ స్పర్శ ఎవరిదో కాదు... ప్రజ్ఞది! ఆమె సుశాంత్‌ను చాలా గట్టిగా వాటేసుకుంటుంది. వెనక్కి తిరిగి చూడకపోయినా ఆ స్పర్శను బట్టి ఆమె ప్రజ్ఞ అని ఇట్టే పసిగట్టేస్తాడు.

"ప్రజ్ఞ..." అంటాడు గద్గద స్వరంతో.

"ఆ రోజు నన్ను వదిలేసి వెళ్తున్నప్పుడు, కనీసం ఒక్కసారైనా వెనక్కి తిరిగి ఎందుకు చూడలేదు రా?" అంటుంది ప్రజ్ఞ ఏడుస్తూ.

సుశాంత్ వెనక్కి తిరగబోతుంటే, "వద్దు, అలానే ఉండు..." అంటూ అతన్ని తన గుండెలకు హత్తుకునే ఆపుతుంది ప్రజ్ఞ.

"నీకు పెళ్లి అయిపోయింది ప్రజ్ఞ... దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపో. అందరూ చూస్తున్నారు," అంటాడు సుశాంత్ కంగారుగా.

అన్నట్టుగానే అక్కడున్న వాళ్లంతా షాక్‌లో సుశాంత్, ప్రజ్ఞలవైపే చూస్తుంటారు. పీటల మీద ఉన్న పల్లవి కూడా మహేష్‌కు ఏదో చెబుతూ వీళ్లవైపే ఆశ్చర్యంగా చూస్తుంది.

"వదులు ప్రజ్ఞ," అని సుశాంత్ అనగానే...

"నా పెళ్లిని ఆ రోజే ఆపేశాను కదరా," అని ఎంతో అమాయకంగా సుశాంత్‌ను పట్టుకునే అంటుంది.

ఆ మాట వినగానే, సుశాంత్‌కు వరల్డ్ కప్ గెలిచినంత ఆనందం కలుగుతుంది. ఒక్కసారిగా ఆమె వైపు తిరుగుతాడు. అతడి ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోతుంది.

"నవ్వకు... ముందు చెప్పు, ఆ రోజు నన్ను ఎందుకు తిరిగి చూడలేదు?" అని ప్రజ్ఞ మళ్లీ అడుగుతుంది.

దానికి సుశాంత్, "మరి ఆ రోజు గోదావరి ఒడ్డున నన్ను వదిలేసి వెళ్తున్నప్పుడు... నువ్వెందుకు వెనక్కి తిరిగి చూడలేదు?" అని ఎదురు ప్రశ్న వేస్తాడు.

"సర్లే... చెల్లుకి చెల్లు," అంటూ నవ్వుతుంది ప్రజ్ఞ. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంగా నవ్వుకుంటారు.

ఇదంతా చూస్తున్న పురోహితుడు మైక్‌లో... "బాబు! కాస్త మీరు ఓపిక పడితే... ముందు మీ అక్క పెళ్లి కానీయండి. తర్వాత మీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఇంత కంగారైతే ఎలాగయ్యా బాబూ?" అని వెటకారంగా అంటాడు. ఆ మాటలకు మండపంలో ఉన్న అందరూ గొల్లుమంటారు. పెళ్లి పీటల మీద నుంచి మహేష్, పల్లవి ఆనందంగా ఈలలు వేస్తారు. ఆ శబ్దానికి పంతులుగారు చెవులు మూసుకుంటారు.

అయితే... వాళ్లకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న ప్రజ్ఞ వాళ్ల నాన్న, అన్నయ్య మాత్రం కోపంతో రగిలిపోతూ సీరియస్‌గా సుశాంత్, ప్రజ్ఞల వైపే చూస్తుంటారు. (ప్రజ్ఞ సుశాంత్ ముందుకు...)

OKA DIARY

By Storytravel

Published: March 4, 2026 at 9:48 AM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...