SCREEN ON

Loading File

Chapter 10

Chapter 9
Chapter 10
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 9

OKA DIARY

Chapter 10
Chapter 9
Chapter 10

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 10

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

Active
10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

Chapter // 09

EPISODE 9

నాన్న అన్న మాటలు సుశాంత్ చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పదేపదే అవే తలచుకుంటూ కుమిలిపోతున్నాడు. పక్కనే ఉన్న రామ్ వాడి భుజం తట్టి ఓదార్చే ప్రయత్నం చేశాడు.

"రేయ్... జరిగిందేదో జరిగిపోయింది. విను... ఈ ప్రపంచంలో ఏ కొడుకు కూడా తన తండ్రికి థ్యాంక్స్ గానీ, సారీ గానీ కరెక్ట్ గా చెప్పలేడురా. మొన్న మా నాన్న నాకు వెయ్యి రూపాయలు ఇస్తే, ఏంచేశాను? దర్జాగా బీర్ కొనుక్కుని తాగాను. ఇప్పుడు వెళ్లి, 'నాన్నా... నువ్విచ్చిన డబ్బులతో బీర్ తాగాను, థ్యాంక్స్' అని చెబితే వీపు సాఫీ చేస్తాడు. అంతేగా?" పరిస్థితిని తేలిక చేయాలని అన్నాడు రామ్.

కానీ సుశాంత్ కి అది ఏమాత్రం నచ్చలేదు. "సింక్ లేకుండా మాట్లాడకు రామ్! అది మా అమ్మ డైరీ... అందుకే నాన్న అంతలా ఫీల్ అయ్యారు. ఛా!" అసహ్యించుకున్నాడు తనను తాను.

సరిగ్గా అప్పుడే మెట్లు ఎక్కుతూ వచ్చాడు జై. "రేయ్... ఏంటి పైన మీరిద్దరూ ఇంకా చేస్తున్నారు? ఒక వెడ్డింగ్ కాంట్రాక్ట్ వచ్చింది, త్వరగా రెడీ అయి రండి," అని అరిచి వెళ్ళిపోయాడు.

కాసేపటికి సుశాంత్ తన స్నేహితులతో కలిసి సంగీతం వాయించడానికి ఆ పెళ్ళిమండపానికి చేరుకున్నాడు. అలవాటు ప్రకారం కీబోర్డ్ వెనుక స్థానం దక్కించుకున్నాడు. కానీ అప్పటివరకు ఆ టీమ్ కి మెయిన్ సింగర్ గా ఉన్న వైష్ణవి ఆరోజు రాలేదు.

"రేయ్ సుశాంత్! ఇరుక్కున్నాంరా. ఈ కాంట్రాక్ట్ గోవిందా... వైషు ఈరోజు రానని చెబుతోంది," కంగారుగా వచ్చాడు విష్ణు.

"ఫోన్ చేద్దామన్నా కలవట్లేదు రా," అంటూ విసుక్కుంది ప్రియ.

సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వచ్చింది ప్రజ్ఞ. అప్పటికే ఆమె మీదే కోపంతో ఉన్న సుశాంత్ కి, ఆమెను చూడగానే విపరీతమైన చిరాకు ముంచుకొచ్చింది.

"రేయ్ సాయి! పదరా పోదాం... ఎలాగూ ఈ కాంట్రాక్ట్ పోయినట్లేగా," అన్నాడు కీబోర్డ్ మీదనుండి చేతులు తీస్తూ.

"అదేంట్రా అలా అంటావ్ మావా?" ఆశ్చర్యపోయాడు సాయి.

వాడి ఆశ్చర్యానికి రామ్ సమాధానం ఇచ్చాడు. "అది కాదురా, ఈ పెళ్లి ప్రజ్ఞ వాళ్ళ పెదనాన్న రెండో కూతురిది."

"దీన్నే సింపుల్ గా ప్రజ్ఞ వాళ్ళ కజిన్ పెళ్లి అని చెప్పొచ్చు కదా!" సవరించింది ప్రియ.

వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా, బ్యాగ్ తగిలించుకుని బయల్దేరాడు సుశాంత్. వెంటనే సాయి వాడి చెయ్యి పట్టుకుని ఆపాడు. "రేయ్ మావా... రేపు ఈఎమ్ఐ కట్టకపోతే నా బైక్ లాక్కెళ్ళిపోతారురా బాబూ. ప్లీజ్ రా... నువ్వే ఏదో ఒక పాట పాడి ఈసారికి మేనేజ్ చెయ్ రా... ప్లీజ్," బతిమాలాడు.

ఆ మాటలకు ఆగిపోయాడు సుశాంత్. గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకున్నాడు. "కరెక్టే... బాడీలో స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. దీనమ్మ... మొత్తం ఇక్కడే పోవాలి! డార్లింగ్... ఆ మైక్ ఇలా అందుకో," అంటూ ప్రియ చేతిలో ఉన్న మైక్ తీసుకున్నాడు.

స్టేజ్ మీద నిలబడి పాడటం మొదలుపెట్టాడు సుశాంత్. తన జీవితంలో జరుగుతున్న సమస్యలన్నింటినీ ఆ పాటలో రంగరించి, అదే సమయంలో వాటిని ఎంతో ఫన్నీగా చెబుతూ అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఆ పాట వింటున్న ప్రజ్ఞ... రెప్పవేయడం కూడా మర్చిపోయి సుశాంత్ నే చూస్తూ ఉండిపోయింది. స్టేజ్ మీద వాడు పాడుతున్న తీరు అక్కడున్న వాళ్ళందరినీ కట్టిపడేసింది.

పాట పూర్తవగానే ప్రాంగణం అంతా చప్పట్లతో మార్మోగింది. అదే సమయంలో ఓ పెద్దాయన సుశాంత్ దగ్గరికి వచ్చాడు. "నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది బేటా! వీలున్నప్పుడు ఈ నెంబర్ కి కాల్ చెయ్... లేదా ఈ అడ్రస్ కి రా. నేను నీకు మంచి ఛాన్స్ ఇస్తాను," అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళాడు.

ఇదంతా దూరం నుంచి చూసిన ప్రజ్ఞ, నెమ్మదిగా సుశాంత్ దగ్గరికి వచ్చింది. "సారీ అండీ... మీరు రోజూ నా వెనకాలే పడుతుంటే, పనిపాట లేకుండా గాలికి తిరిగే బ్యాచ్ అనుకున్నాను. రియల్లీ సారీ," అంటూ క్షమాపణ అడిగింది.

"ఇట్స్ ఓకే," అంటూ పొడిపొడిగా సమాధానమిచ్చి ముందుకు కదిలాడు సుశాంత్.

"పదండి... అలా భోజనం చేస్తూ మాట్లాడుకుందాం," అంటూ వాడిని భోజనాల దగ్గరికి తీసుకెళ్ళింది ప్రజ్ఞ.

అది చూసిన జై, "రేయ్... మన సుశాంత్ గాడికి పిల్ల సెట్ అయిపోయింది మావా!" అని పకపకా నవ్వాడు.

"అది సరే కానీ, ఇక మనం లైఫ్ లాంగ్ డోరేమాన్ చూసుకోవడమేలేరా," అంటూ నిట్టూర్చాడు విష్ణు.

మరోవైపు భోజనాల దగ్గర... "మీరంత మంచి సింగర్ అని నాకు నిజంగా తెలియదండీ... ఐ యామ్ రియల్లీ..." అంటూ ఏదో చెప్పబోయింది ప్రజ్ఞ.

"పర్లేదు... ఐ కెన్ అండర్స్టాండ్," మాట మధ్యలోనే ఆపేశాడు సుశాంత్.

"ఏం అనుకోకపోతే... రేపు నేను గుడికి వెళ్తున్నాను. తోడు వస్తారా?" అడిగింది కాస్త మొహమాటపడుతూనే.

ఆ మాట ఊహించని సుశాంత్ కి ఒక్కసారిగా తింటున్న చేపముల్లు గొంతులో గుచ్చుకుంది. విపరీతంగా దగ్గు రావడం మొదలైంది. వెంటనే ప్రజ్ఞ తన చేత్తో ఓ అన్నం ముద్ద కలిపి వాడి నోట్లో పెట్టింది. "ఏం కాదు... ఏం కాదు," అంటూ సుశాంత్ తల మీద మెల్లగా తట్టింది.

ఆ క్షణం ఇద్దరి చూపులు కలిశాయి. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఆ నిశ్శబ్దంలోనే మాట్లాడుకున్నారు. ఆ మాయలో ఉండగానే కిందనుంచి రామ్ అరుపు వినిపించింది.

"రేయ్ సుశాంత్! మీ నాన్న ఫోన్ చేస్తున్నాడురా... ఎక్కడున్నావ్?"

ఆ పిలుపుతో ఉలిక్కిపడి లోకంలోకి వచ్చాడు సుశాంత్. "సరే, నేను వెళ్ళాలి," అంటూ కంగారుగా లేచాడు.

"అయ్యో... సరే! రేపు తప్పకుండా శివాలయానికి రండి," అంటూ వెళ్తున్న సుశాంత్ వైపే చూస్తూండిపోయింది ప్రజ్ఞ.

OKA DIARY

By Storytravel

Published: March 3, 2026 at 12:44 PM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...