Loading File
Initializing...
Chapter 3
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
సుశాంత్ స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి ఒక గుండె పగిలే వార్త చెప్తారు. రామ్ కంగారుగా, "రేయ్ సుశాంత్...! ప్రజ్ఞకు పెళ్లి జరుగుతోందిరా! నేను అక్కడి నుంచే వస్తున్నా... నువ్వు త్వరగా వస్తే పెళ్లి ఆపొచ్చు!" అంటాడు.
అది విన్న వెంటనే సుశాంత్ ఏమాలోచించకుండా రామ్ బైక్ తీసుకుని వేగంగా డ్రైవ్ చేయడం మొదలుపెడతాడు. రామ్ వెనుక కూర్చుని, "రేయ్ ఫాస్ట్ గా వెళ్లు, వాళ్లు అప్పటికే పీటల మీద కూర్చున్నారు!" అని తొందరపెడతాడు. విష్ణు, జై కూడా వేరే బైక్ మీద వాళ్ల వెనకే వస్తుంటారు. మరోవైపు ప్రజ్ఞ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంటుంది.
అతి వేగంగా వెళ్లి సడన్ బ్రేక్ వేయడం వల్ల రామ్, సుశాంత్‌లు బైక్ పైనుంచి కింద పడతారు. కానీ సుశాంత్ ఆ దెబ్బలను ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే పైకి లేచి, రామ్‌ను కూడా లేపి, పెళ్లి మండపం వైపు పరుగులు తీస్తాడు. ఈలోగా రామ్ బైక్ తీసి సుశాంత్ దగ్గరకు వెళ్లి ఎక్కించుకుంటాడు. అలా నలుగురు స్నేహితులూ మండపం దగ్గరకు చేరుకుంటారు.
బైక్ పైనుంచి పడటం వల్ల సుశాంత్ నుదుటి మీద చిన్న గాయమై రక్తం కారుతూ ఉంటుంది. చేయి కూడా గీసుకుపోతుంది. రామ్‌కి కూడా చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ, అక్కడ ప్రజ్ఞను చూసిన సుశాంత్ నోట మాట రాక అలానే నిలబడిపోతాడు.
రామ్ ముందుకు వచ్చి "రండిరా, వెళ్లి పెళ్లి ఆపేద్దాం!" అని మిగతా స్నేహితులను పిలుస్తాడు. కానీ సుశాంత్ వాళ్లను ఆపుతాడు.
సుశాంత్ అంత ఆత్రంగా, దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా వచ్చి కూడా పెళ్లి ఎందుకు ఆపొద్దంటున్నాడో స్నేహితులకు అర్థం కాలేదు.
అప్పుడు విష్ణు, "రేయ్ సుశాంత్, ఆ అమ్మాయిని నువ్వు ప్రాణంగా ప్రేమించావు కదరా! అలా ఎలా వదిలేస్తావురా?" అని అడుగుతాడు. అయినా సుశాంత్ ఏమీ మాట్లాడడు.
"రేయ్, నువ్వు తను లేకుండా హ్యాపీగా ఉండగలవా? నిజం చెప్పు!" అని రామ్ నిలదీస్తాడు.
అప్పుడు సుశాంత్ మండపం వైపు చూపిస్తూ, "చూడరా... ఎంత బాగుందో! ఎంత హ్యాపీగా పీటల మీద కూర్చుందో... తను హ్యాపీగా ఉంటే నాకింకేం కావాలిరా? ఈ పెళ్లి జరగాలి... పదండి వెనక్కి వెళ్లిపోదాం" అని ఎంతో బరువెక్కిన హృదయంతో, కళ్లలో నీళ్లు తిరుగుతున్నా దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంటాడు.
అది చూసి కోపం వచ్చిన జై, "రేయ్, ప్రజ్ఞ నిన్ను వాడుకుని వదిలించుకుందిరా! నీ అంత అమాయకుడు ఇంకెక్కడా ఉండడు, ఛీ ఛీ!" అని అసహ్యించుకుంటాడు.
అప్పుడు సుశాంత్ కళ్లు తుడుచుకుంటూ, "రేయ్ రామ్, బైక్ తీసుకురా... ఇంటికి వెళ్లాలి" అంటాడు.
"వీడికి బుర్ర దొబ్బింది," అంటాడు జై విసుగ్గా.
"లేదురా... ఆ అమ్మాయిని చూడు, చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటోంది. ఒకవేళ ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే తనే సుశాంత్‌కి కాల్ చేసి చెప్పి ఉండేది కదా!" అని విష్ణు అంటాడు.
దానికి జై, "అది నిజమేరా... ఈ అమ్మాయి మీద నాకు ముందు నుంచే డౌట్ ఉండేది. నేను ఎంత చెప్పినా వినకుండా వీడు లవ్ చేశాడు," అంటూ అందరూ అక్కడి నుంచి వెనుదిరుగుతారు.
అసలు వాళ్ల లవ్ స్టోరీ ఏంటి??.
OKA DIARY
By Storytravel
Published: February 26, 2026 at 2:29 PM
Your input calibrates the database for others.
Ready to play...