SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

Active
16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

Chapter // 15

EPISODE 15

Storytravel
Love-drama
1 Min Read
Pub: Feb 26, 2026

రామ్‌ సుశాంత్‌ను ఒక టిఫిన్ షాప్‌కి తీసుకువెళ్తాడు.

"రేయ్... ఏం తింటావు?" అని రామ్ అడుగుతాడు, కానీ సుశాంత్ మౌనంగానే ఉంటాడు.

"సర్లే నేనే తీసుకొస్తా ఆగు... అన్నా! రెండు పరోటాలు," అని రామ్ చెబుతాడు.

సుశాంత్ మనసంతా వాళ్ళ నాన్న కొట్టిన ఆలోచనలే మెదులుతున్నాయి. చిన్నప్పుడు నాన్న ఇష్టమైన రసగుల్లా స్వీట్స్ తీసుకురావడం, సైకిల్ నేర్పించడం, స్కూల్‌కి డ్రాప్ చేయడం, బైక్ నేర్పించడం... అన్నీ పదే పదే గుర్తొస్తున్నాయి. ఆఖరికి ఆ చెంపదెబ్బ తలపుకు వచ్చి కళ్ల నుండి కన్నీళ్లు రాలుతాయి.

రామ్ పరోటాలు పక్కన పెట్టి, సుశాంత్ కన్నీళ్లు తుడుస్తాడు.

"రేయ్... అసలు ఆఫర్ లెటర్ ఎందుకు చింపేశావు రా? నువ్వు చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది. ఇంకెందుకు ఏడుస్తున్నావు?" అని రామ్ అడుగుతాడు.

"అమ్మ కోసం రా," అంటూ రామ్‌ను పట్టుకుని కన్నీరు పెట్టుకుంటాడు సుశాంత్.

"ఊరుకో రా... నువ్వేమీ చిన్నపిల్లాడివి కాదు... ఊరుకో. ఇదిగో ఈ పరోటా టేస్ట్ చూడు ఎంత బాగుందో!" అని రామ్, సుశాంత్‌కి తినిపిస్తాడు. అప్పుడు సుశాంత్ కళ్ళు తుడుచుకుని, "నేను తింటాలే ఇటు ఇవ్వు," అని ప్లేట్ తీసుకుంటాడు. అలా ఇద్దరూ తిన్న తర్వాత రామ్ డబ్బులు కట్టి సుశాంత్‌ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు.

మరోవైపు ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో, సుశాంత్‌తో దిగిన ఫోటోస్ చూస్తూ ఎంతో బాధ పడుతూ ఉంటుంది. ఈలోగా ప్రజ్ఞ వాళ్ళ అన్నయ్య శ్రీధర్ అక్కడికి వచ్చి, "ఎవడు వాడు... ఉదయం పట్టుకుని ఏడుస్తున్నావు?" అని గట్టిగా అరుస్తాడు.

"సుశాంత్‌ని ఏం చేశావు అన్నయ్య!" అని భయంగా అడుగుతుంది ప్రజ్ఞ.

"ఏంటి... ఇంతకీ ఎవడా వాడు... ఆ?" అని మళ్లీ గద్దిస్తాడు శ్రీధర్.

"ఏం చేశావు వాడిని..." అని మళ్లీ అదే ప్రశ్న వేస్తుంది ప్రజ్ఞ.

"వాడిని ఏం చేస్తే నీకేంటి? అయినా ఇలా బరితెగిస్తావనుకోలేదు... ఛీ..." అంటూ ప్రజ్ఞను కొడతాడు శ్రీధర్. అన్నయ్య కొట్టినా సరే ప్రజ్ఞ మాత్రం, "అన్నయ్య ప్లీజ్... ఏం చేశావో చెప్పు," అని బ్రతిమాలుతుంది.

"నేనేమన్నా మర్డర్ చేసేవాడిలా కనిపిస్తున్నానా?" అని అరుస్తాడు శ్రీధర్.

అంతే, ప్రజ్ఞకు కోపం వచ్చి శ్రీధర్‌ను గట్టిగా చెంప దెబ్బ కొడుతుంది. "చెప్పు!" అని అరుస్తుంది.

"జస్ట్ నా ఫ్రెండ్స్‌తో కలిసి వార్నింగ్ ఇచ్చా, అంతే," అని అంటాడు శ్రీధర్.

వెంటనే ప్రజ్ఞ తన స్కూటీ స్టార్ట్ చేసి సుశాంత్ ఇంటికి బయలుదేరుతుంది. ప్రజ్ఞ వాళ్ళ నాన్న, సంజీవరావు కారులో వస్తూ ఉండగా ప్రజ్ఞ బయటకి వెళ్లడం చూస్తాడు. కానీ, వాళ్ల నాన్న ఏదో పని మీద వెళ్తోందని అనుకుని పట్టించుకోడు. సంజీవరావు, ప్రజ్ఞ వాళ్ళ అమ్మ పార్వతితో కలిసి ఇంట్లోకి వెళతాడు. అక్కడ చెంప పట్టుకుని ఉన్న శ్రీధర్‌ను చూసి, "ఏంటి... ఏం జరిగింది నాన్న?" అని పార్వతి అడుగుతుంది. అప్పుడు శ్రీధర్ జరిగినదంతా చెప్తాడు. సుశాంత్ ఒక లో-క్లాస్ వాడని, మన కాస్ట్ కాదని, లైఫ్‌లో సెటిల్ కాలేదని, రోడ్డు మీద పాటలు పాడుకునేవాడని కించపరుస్తూ చెప్తాడు శ్రీధర్.

దాంతో ఆవేశం వచ్చిన సంజీవరావు, "చెల్లి ఎక్కడికి వెళ్ళింది?" అని శ్రీధర్‌ను అడుగుతాడు.

"తెలీదు నాన్న... కానీ వాడి దగ్గరికే వెళ్తుంది కచ్చితంగా," అని అంటాడు శ్రీధర్.

"పద... మన ఇంటి పరువుని జుట్టు పట్టుకుని అయినా తీసుకొద్దాం," అని సంజీవరావు అంటాడు.

మరోవైపు ప్రజ్ఞ, సుశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ సుశాంత్ వాళ్ళ అక్క బయటకి వచ్చి, "నువ్వేనా ప్రజ్ఞ అంటే? తమ్ముడు ఇంట్లో లేడు... నాన్న పంపించేశారు," అని ఏడుస్తుంది.

ప్రజ్ఞకి ఏం చెప్పాలో తెలీక, "నేను రామ్‌కి ఫోన్ చేస్తా ఆగు," అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది.

రామ్‌కి కాల్ చేస్తే, రామ్ లిఫ్ట్ చేస్తాడు.

"రామ్... సుశాంత్ అక్కడ ఉన్నాడా?" అని అడుగుతుంది ప్రజ్ఞ.

"చూడు... వాడు వాళ్ళ అమ్మ కోసం జాబ్ మానేశాడు, నిన్ను వదిలించుకోవడానికి కాదు. మళ్లీ నాకు ఫోన్ చేయకు... వాడిని బ్రతకనివ్వు," అని సీరియస్‌గా ఫోన్ కట్ చేస్తాడు రామ్.

OKA DIARY

By Storytravel

Published: March 3, 2026 at 12:57 PM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...