SCREEN ON

Loading File

Chapter 14

Chapter 13
Chapter 14
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 13

OKA DIARY

Chapter 14
Chapter 13
Chapter 14

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 14

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

Active
14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

Chapter // 13

EPISODE 13

లోకేషన్: రామ్, సుశాంత్ గది (తరువాత పరిణామం)

కిరణ్ కి ఇంకా మెలకువ రాలేదు. రామ్ నీళ్లను గ్లాసులోకి తీసుకుని, సూటిగా కిరణ్ మొహం మీదకు కొట్టాడు.

నీటి దెబ్బకి ఉలిక్కిపడి, ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు కిరణ్. తన చేతులను కట్టేసి ఉండడాన్ని చూసి భయంతో పక్కనే ఉన్న సుశాంత్‌ని చూశాడు. క్షణంలో ఆ భయం కోపంగా మారింది. "రేయ్! నన్నే కట్టేస్తారా? మా డాడీకి ఒక్క ఫోన్ చేస్తే, మీ అంతు చూస్తారురా!" అని గట్టిగా అరిచాడు.

పక్కనే ఉన్న రామ్ చిన్నగా నవ్వుతూ, "ఏంటి నాన్న అరుస్తున్నావ్? నీ దగ్గర ఫోన్ ఉంటే కదా నువ్వు వాళ్ళకి చేసేది," అంటూ కిరణ్ చేతిలో ఉండాల్సిన సెల్‌ఫోన్‌ని తన చేతిలోకి తిప్పుకుంటూ వెటకారంగా అన్నాడు.

కిరణ్ చూపులకి అప్పటికే అక్కడ నిలబడ్డ ప్రజ్ఞ తగిలింది. "ప్రజ్ఞా! ఏంటి వీళ్లతో కలిసి డ్రామా ఆడుతున్నావా? నీ పని కూడా చెప్తా, మీ నాన్నకి," అని హెచ్చరించాడు కిరణ్.

కిరణ్ మాటలకి చిరాకుగా చూస్తూ, "ఆరో క్లాస్ పిల్లాడిలా అమ్మ, నాన్న అంటావ్ ఏంటిరా? నీ అబ్బా," అంటూ మీదకు వెళ్లాడు సుశాంత్.

"రేయ్... అది నా పిల్ల రా!" అంటూ రెచ్చిపోయాడు కిరణ్.

ఆ మాట వినగానే ప్రజ్ఞకి విపరీతమైన కోపం వచ్చింది. కిరణ్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచింది. "ఒకవేళ మా వాళ్ళకి చెప్పి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటే, ఫస్ట్ డేనే నిన్ను లేపేస్తా! నిన్ను లేపేసి, ఆ వీక్ మూమెంట్ లోనే సుశాంత్ ని చూపించి, మళ్ళీ పెళ్లి చేసుకుంటా!" అని కరాఖండిగా చెప్పింది.

కిరణ్ కొంచెం తగ్గుతూ, "చిన్నప్పటి లవ్ ఏ! ప్లీజ్ ప్రజ్ఞా," అంటూ బతిమాలే ప్రయత్నం చేశాడు.

"అబ్బా... నిన్ను! ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే, పాలలో విషం పెట్టి లేపేస్తా. ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్ లో వేస్తా!" తీవ్రంగా బెదిరించింది ప్రజ్ఞ.

రామ్ నవ్వుకుంటూ పక్కకి తప్పుకుని, "రేయ్ సుశాంత్... ఎందుకైనా మంచిది. ప్రజ్ఞతో కాస్త జాగ్రత్త రా!" అని సుశాంత్ కి సలహా ఇచ్చాడు.

అప్పుడు సుశాంత్ నెమ్మదిగా కిరణ్ దగ్గరికి వెళ్లి, "చూడు బ్రో... నువ్వు ప్రజ్ఞాని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నావ్, కానీ ప్రజ్ఞ మనసులో నువ్వు లేవు. పోనీ తను సింగిల్ గా ఉంటే, నువ్వు ట్రై చేసినా తప్పు లేదు. కానీ, తను నన్ను ప్రేమిస్తోంది. నన్ను మాత్రమే! అలాగే నేను కూడా తనని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేను. ఏ అమ్మాయి అయినా, 'నువ్వంటే ఇష్టం లేదు' అని చెప్పిన తర్వాత కూడా, 'లవ్, లవ్' అంటూ వెనక పడడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు?" అని వివరిస్తూ కిరణ్ కట్లను విప్పడం మొదలుపెట్టాడు.

సుశాంత్ మాటలకి కిరణ్ ఆలోచనలో పడ్డాడు. విప్పగానే పైకి లేచి, "ప్రజ్ఞా హ్యాపీగా ఉంటే చాలు బ్రో. నువ్వు ఎలాంటి వాడివో అని టెస్ట్ చేద్దాం అని అనుకున్నా... కానీ మీ వాడు అప్పటికే కొట్టి ఇక్కడ కట్టేసాడు," అని కొంచెం నవ్వుతూ చెప్పాడు.

"అయ్యో, సారీ బ్రో!" అన్నాడు రామ్, కొంచెం సిగ్గుపడుతూ.

ప్రజ్ఞ కూడా కిరణ్‌కి సారీ చెప్పింది. అప్పుడు కిరణ్ ప్రజ్ఞ చేయిని తీసి సుశాంత్ చేతిలో పెడుతూ, "ఇంకా మీ పెళ్లిని ఎవరూ ఆపలేరు. నేను ఇప్పుడే మా నాన్నతో మాట్లాడి ప్రజ్ఞతో నా పెళ్లి క్యాన్సిల్ చేయిస్తా," అని చెప్పాడు. వెంటనే కిరణ్ తన ఫోన్ తీసుకుని వాళ్ల నాన్నతో మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేయించాడు.

అది విన్న ప్రజ్ఞ సంతోషంగా సుశాంత్ వైపు చూసి సిగ్గుపడింది.

ఈ సంతోషాన్ని మధ్యలో కట్ చేస్తూ, రామ్ అన్నాడు "అవును ప్రజ్ఞా... నిన్ను ఒకటి అడగాలి."

"హా, అడగండి," అంది ప్రజ్ఞ నవ్వుతూ.

"ఆరోజు వర్షం పడకముందే పిడుగు పడుతుందని నీకు ముందే ఎలా తెలిసిందో చెప్పవా!" అన్నాడు రామ్ ఆసక్తిగా.

ప్రజ్ఞ నవ్వుతూ "మా పెళ్లి తర్వాత చెప్తా లే!" అని తప్పించుకుంది.

(( తర్వాతి రోజు ఉదయం ))

లోకేషన్: సుశాంత్ ఇల్లు

పల్లవి, తన తమ్ముడు సుశాంత్ కి వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్ చూసి పట్టలేని ఆనందంతో ఆ లెటర్ పట్టుకుని వాడి గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. సుశాంత్ ఇంకా పడుకుని ఉండడం చూసి, "మొత్తానికి సాధించావు రా తమ్ముడూ! శభాష్!" అని గట్టిగా అరుస్తూ వాడ్ని లేపింది.

నిద్రలేచిన సుశాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్క చేతిలో ఉన్న పేపర్ ని తీసుకుని ఎమోషనల్ అయ్యాడు. కానీ, వెంటనే ఆ లెటర్ ని ముక్కలు ముక్కలుగా చింపేసాడు.

అది చూసిన పల్లవి షాక్ తో నోరెళ్లబెట్టింది. "జాబ్ వస్తే ప్రజ్ఞతో పెళ్ళవుతుంది అని సంతోషపడాల్సింది పోయి... ఇప్పుడు ఈ పిచ్చి పని ఏంట్రా?" అంటూ తమ్ముడి చెంప మీద గట్టిగా లాగి కొట్టింది.

((సుశాంత్ అలా ఎందుకు చేశాడు?))

(( ఇంటర్వెల్ ))

OKA DIARY

By Storytravel

Published: March 3, 2026 at 12:52 PM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...