Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
బయట భయానకంగా వర్షం కురుస్తోంది. పెద్దపెద్ద ఉరుములు, కళ్ళు చెదిరే మెరుపులతో ఆకాశం దద్దరిల్లుతోంది. లోపల మాత్రం వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. రెండేళ్ల సుశాంత్ తన తల్లి జానకి ఒడిలో వెచ్చగా నిద్రపోతున్నాడు. ఆమె తనకు ఎంతో ఇష్టమైన ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారి పాటను మృదువుగా వింటూ, బిడ్డను లాలిస్తూ తన డైరీలో ఏదో రాసుకుంటోంది.
ఆమె వెనుక గోడను అలంకరించిన ఎన్నో ఛాయాచిత్రాల్లో... సుశాంత్, తను, తన భర్త కలిసి ఐస్‌క్రీమ్ తింటున్న ఒక అందమైన జ్ఞాపకం కూడా ఉంది.
అంతలో అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం. ఇంట్లో ఒంటరిగా ఉండటం వల్ల కాస్త భయపడుతూనే తలుపు దగ్గరకు వెళ్ళింది జానకి. 'ఈ అర్ధరాత్రి వేళ ఎవరు వచ్చి ఉంటారు?' అని కంగారు పడుతూ తలుపు తీసిన ఆమెకు, ఎదురుగా నిలబడ్డ తన భర్త జై రామ్‌ను చూడగానే ఎంతో ఉపశమనం కలిగింది.
"ఇంట్లోనే ఉన్నారు కదండీ... ఇంతలోనే బయటకు ఎప్పుడు వెళ్ళారు?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"పిల్లల కోసం ఐస్‌క్రీమ్ తీసుకురావడానికి వెళ్లాను జానకి" అని అతను బదులిచ్చాడు.
"మరి నాకోసం తేలేదా? నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు" అంటూ చిరుకోపంగా అలిగింది జానకి.
పాపం, ఆయనకు ఏం చెప్పాలో పాలుపోలేదు. "ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకండి, నేను అలిగాను" అంటూ మూతి తిప్పుకుంది.
ఆమెను బుజ్జగించడానికి వేరే దారి లేక, "సరే జానకి, నిన్ను బయటకు తీసుకువెళ్లనా?" అని అడిగాడు జై రామ్.
"మరి పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా ఎలా వదిలివెళ్తాం?" అని ఆమె సందేహించింది.
"పడుకున్నారు కదా జానకి, మనం ఇలా వెళ్లి అలా వెంటనే వచ్చేద్దాం" అని నచ్చజెప్పి ఆమెను కారులో బయటకు తీసుకువెళ్లాడు.
ఇద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆ కుండపోత వర్షానికి కారు వైపర్ కాస్తా విరిగిపోయింది. వర్షం ఉధృతికి ఎదురుగా ఉన్న రోడ్డు ఏమాత్రం కనిపించడం లేదు. ఊహించని విధంగా ఎదురుగా ఒక పెద్ద లారీ దూసుకువచ్చింది. దాన్ని ఎలాగోలా తప్పించబోయిన జై రామ్, పక్కనే ఆగి ఉన్న మరో కారును బలంగా ఢీకొట్టాడు. ఆ ప్రమాదం అత్యంత దారుణంగా జరిగింది.
కారు డోరు ఊడిపోవడంతో జానకి బయట రోడ్డు మీద రక్తపు మడుగులో పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక పక్క ఎడతెగని వర్షం... ఆకాశాన్ని చీల్చే పెద్ద మెరుపు...
"ఏవండీ.... సుశాంత్ !!!" అని ప్రాణసమానమైన భర్తను, బిడ్డను తలచుకుంటూనే ఆమె తుదిశ్వాస విడిచింది. అప్పటికే స్మృహ కోల్పోయాడు జైరామ్ వర్షం సాక్షిగా జానకి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి...
OKA DIARY
By Storytravel
Published: February 26, 2026 at 2:28 PM
Your input calibrates the database for others.
Ready to play...