SCREEN ON

Loading File

Chapter 7

Chapter 6
Chapter 7
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 6

The Unexpected Exit

Chapter 7
Chapter 6
Chapter 7

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 7

Jump Now

Directory

01

Epsiode -1

02

Epsiode -2

03

Epsiode -3

04

Epsiode -4

05

Epsiode -5

06

Episode -6

Active
07

Episode -7

08

Episode -8

09

Episode -9

10

Episode -10

11

Episode -11

12

Episode -12

13

Episode -13

14

Episode -14

15

Episode -15

16

Episode -16

17

Episode -17

18

Episode -18

19

Episode -19

20

Episode -20

21

Episode -21

22

Episode -22

23

Episode -23

24

Episode -24

25

Episode -25

26

Episode -26

27

Episode -27

28

Episode -28

29

Episode -29

30

Episode -30

31

Episode -31

32

Episode -32

33

Episode -33

34

Episode -34

Chapter // 06

Episode -6

రోజు 85 – సాధారణ రోజు… కానీ ప్రత్యేకమైనది

అది ఒక సోమవారం.

ఎప్పటిలాగే పవన్ సమయానికి కాలేజ్‌కి చేరుకున్నాడు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్, భుజంపై బ్యాగ్.

CSE బ్లాక్ మెట్లు దగ్గర సందీప్ కనిపించాడు.

సందీప్ చిరునవ్వుతో అడిగాడు,

“బ్రో… ఫస్ట్ అవర్ బంక్ కొట్టేద్దామా?”

పవన్ నవ్వుతూ,

“నేనే అసైన్‌మెంట్ రాసాను. అందుకే కాదు,” అన్నాడు.

అంతలో సాయి లక్ష్మి కూడా చేతిలో బుక్‌తో అక్కడికి వచ్చింది.

ముగ్గురూ కలిసి అదే కారిడార్ లో నడిచారు.

అదే క్లాస్.

అదే సీట్లు.

కానీ…

ప్రతి రోజు కొత్తగా అనిపించేది.

కొన్ని సార్లు సాధారణ రోజులు కూడా

కాలేజ్ జీవితాన్ని మర్చిపోలేని జ్ఞాపకాలుగా మార్చేస్తాయి.

రోజు 86 నుంచి 90 – టెక్ ఫెస్ట్ గుసగుసలు

కాలేజ్ మొత్తం ఒక వార్తతో ఉత్సాహంగా మారింది.

“Adarsha Vignana 2K25 – టెక్ ఫెస్ట్.”

ప్రతి నోటిస్ బోర్డ్ మీద పోస్టర్లు.

కోడింగ్ కాంటెస్ట్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్, రోబోటిక్స్ రేస్, గేమింగ్ టోర్నమెంట్స్…

స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంతో నిండిపోయారు.

సందీప్ ఉత్సాహంగా అన్నాడు,

“బ్రో… మనం ఏదో ఒకటి చేయాలి. నేను ఫ్రీ ఫుడ్ కోసం మాత్రమే రాలేదు!”

పవన్ నిశ్శబ్దంగా ఉన్నాడు… కానీ అతని మెదడులో ఐడియాలు పరుగులు తీస్తున్నాయి.

ఆ సమయంలో సాయి లక్ష్మి ఆశ్చర్యంగా చెప్పింది.

“మనమే ఒక ప్రాజెక్ట్ తయారు చేద్దాం… నిజమైనది. వేరేగా ఉండాలి.”

ముగ్గురూ కలిసి మినీ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

కౌంట్‌డౌన్ మొదలైంది.

రోజు 91 నుంచి 95 – కోడ్, కాఫీ, చిన్న తగాదాలు

లైబ్రరీలో మీటింగ్స్.

ల్యాబ్‌లో లేట్ నైట్స్.

మధ్యరాత్రి వీడియో కాల్స్‌లో బ్రెయిన్‌స్టార్మింగ్.

వాళ్ల ప్రాజెక్ట్:

Face Recognition తో Smart Attendance System.

పనులు ఇలా పంచుకున్నారు:

పవన్ – కోడ్ మొత్తం

సాయి లక్ష్మి – UI డిజైన్

సందీప్ – ఎనర్జీ, జోకులు… మరియు స్నాక్స్

కొన్ని తగాదాలు కూడా జరిగాయి.

ఒక రోజు సాయి, సందీప్ కలర్ థీమ్ మీద చిన్న గొడవ పెట్టుకున్నారు.

పవన్ మధ్యలో వచ్చి నవ్వుతూ అన్నాడు.

“ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వొచ్చు… కానీ ఫ్రెండ్షిప్ కాదు.”

ఆ మాటతో అందరూ మళ్లీ నవ్వుకున్నారు.

రోజు 96 – RTC బస్ దగ్గర క్షణం

మళ్లీ ఒకసారి పవన్ తన RTC బస్ మిస్ చేశాడు.

సాయి లక్ష్మి అతనితో పాటు తదుపరి బస్ కోసం వేచి ఉండాలని చెప్పింది.

ఇద్దరూ వేప చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు.

సాయి మెల్లగా చెప్పింది.

“తెలుసా… మీ ఇద్దరితో ఉంటే కాలేజ్ వేరేలా అనిపిస్తుంది.”

పవన్ తల ఊపాడు.

“నాకూ అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ఇంత ప్రశాంతం దొరుకుతుందని అనుకోలేదు.”

ఆ క్షణానికి మాటలు అవసరం లేదు.

రోజు 97 నుంచి 99 – తుఫాన్ ముందు పరుగులు

కాలేజ్ మొత్తం ఒక గందరగోళం.

బ్యానర్లు.

వాలంటీర్లు.

స్టూడెంట్స్ పరుగులు.

వాళ్ల ప్రాజెక్ట్ దాదాపు పూర్తయ్యింది.

రోజు 99 రాత్రి 9 వరకు ల్యాబ్‌లోనే పని చేశారు.

ప్రొజెక్టర్ మీద ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు… అది పర్ఫెక్ట్‌గా పనిచేసింది.

సందీప్ కేక వేసాడు.

“మనమే లెజెండ్స్!”

సాయి చిరునవ్వు.

పవన్ మాత్రం చివరిసారి కోడ్ సేవ్ చేశాడు.

రోజు 100 – పెద్ద రోజు

ఆ రోజు ఆదర్శ్ కాలేజ్ హాల్స్ సందర్శకులతో నిండిపోయాయి.

వారి స్టాల్ సింపుల్ కానీ ప్రొఫెషనల్ గా కనిపించింది.

ఒక జడ్జ్ చూసి అన్నాడు.

“టీమ్‌వర్క్ చాలా బాగుంది. మీలో మంచి బ్యాలెన్స్ కనిపిస్తోంది.”

సాయంత్రం ఫలితాలు ప్రకటించారు.

వాళ్లకు సెకండ్ ప్రైజ్ వచ్చింది.

ఫస్ట్ కాదు… కానీ అది mattered కాదు.

చీర్స్, ఫోటోలు, నవ్వులు…

ఆ క్షణం వాళ్లకు అమూల్యంగా మారింది.

సాయంత్రం మళ్లీ అదే వేప చెట్టు కింద ముగ్గురూ కూర్చున్నారు.

సందీప్ అన్నాడు.

“ఇది కేవలం మొదటే కదా?”

పవన్ తల ఊపాడు.

“ఖచ్చితంగా.”

సాయి తన డైరీ తెరిచి ఏదో రాసింది.

ఎవరూ అడగలేదు.

ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు

మనసులోనే ఉండాలి.

రోజు 101 – కొత్త పరిచయం

టెక్ ఫెస్ట్ హడావిడి తగ్గిపోయింది.

మళ్లీ క్లాస్‌లు, అసైన్‌మెంట్స్.

అంతలో…

ఆమె క్లాస్‌లోకి నడుచుకుంటూ వచ్చింది.

దీపిక.

మరో కాలేజ్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన కొత్త స్టూడెంట్.

నిశ్శబ్దంగా, ఆత్మవిశ్వాసంతో.

ప్రొఫెసర్‌ని అడిగింది.

“సర్… నేను ఇక్కడ కూర్చోవచ్చా?”

ఆమె పవన్ ముందు వరుసలో కూర్చుంది.

అక్కడే ఒక చిన్న మార్పు మొదలైంది.

రోజు 102 – CR గా పవన్

టెక్ ఫెస్ట్ తర్వాత ఫ్యాకల్టీ కొత్త క్లాస్ రిప్రజెంటేటివ్ ని ఎంపిక చేసింది.

అందరికీ ఆశ్చర్యంగా…

పవన్ ఎంపికయ్యాడు.

HOD అన్నాడు.

“నీవు ప్రశాంతంగా ఉంటావు. అందరూ నిన్ను గౌరవిస్తారు.”

కారిడార్‌లో సందీప్ అరవసాగాడు.

“CR రాజా వచ్చాడు!”

సాయి నవ్వుతూ చెప్పింది.

“గ్రూప్ చాట్స్ చూసి ఏడవకు.”

రోజు 105 నుంచి 110 – చిన్న క్షణాలు

దీపిక అతనికి మెసేజ్ పంపింది.

“CR… నేను ల్యాబ్ మిస్ అయ్యాను. ఏమి సమర్పించాలి?”

పవన్ వివరాలు పంపాడు.

“కోడ్‌లో హెల్ప్ కావాలంటే చెప్పు.”

ఆమె ఒక స్మైలీ పంపింది.

అది వారి మొదటి చాట్.

రోజు 111 – సీనియర్స్ పరీక్ష

ఒక మధ్యాహ్నం ఇద్దరు సీనియర్స్ అతన్ని ఆపారు.

“CR సాబ్… ఒక టాస్క్.”

“లవ్ సాంగ్ పాడు!”

పవన్ చిరునవ్వుతో

“ఓహాలు గుసగుసలాడే…” పాట మొదలుపెట్టాడు.

సీనియర్స్ నవ్వేశారు.

“ఈ వాడు కూల్!”

ఆ రోజు నుంచి సీనియర్స్ కూడా అతన్ని గౌరవంగా చూసారు.

రోజు 112 – హర్షీ ప్రవేశం

కొత్త ట్రాన్స్‌ఫర్ స్టూడెంట్.

హర్షీ.

ఆత్మవిశ్వాసంగా, సరదాగా, ఎప్పుడూ నవ్వుతూ.

త్వరగా సాయి, దీపికలతో ఫ్రెండ్స్ అయింది.

ఇప్పుడు గ్రూప్ ఇలా మారింది:

సాయి లక్ష్మి – ప్రశాంతం

దీపిక – గమనించే స్వభావం

హర్షీ – సరదా, ఎనర్జీ

ఒక రోజు ల్యాబ్‌లో హర్షీ దీపికతో చెప్పింది.

“నీ CR ఫ్రెండ్ క్యూట్ కదా?”

దీపిక స్పందించలేదు.

సాయి మాత్రం చిరునవ్వు నవ్వింది.

రోజు 130 నుంచి 137 – స్పోర్ట్స్ మీట్

కాలేజ్‌లో స్పోర్ట్స్ అనౌన్స్ చేశారు.

క్రికెట్ టీమ్ క్యాప్టెన్ గా పవన్ ఎంపికయ్యాడు.

మ్యాచ్ రోజు అతను మొదటి బంతికే సిక్స్ కొట్టాడు.

హర్షీ కేక వేసింది.

“CR పవర్!”

పవన్ 42 రన్స్ చేశాడు.

చివరి ఓవర్‌లో వాళ్లు మ్యాచ్ గెలిచారు.

అందరూ అతన్ని భుజాలపై ఎత్తుకున్నారు.

రోజు 140 – ఫ్రెషర్స్ పార్టీ

కాలేజ్ ఆడిటోరియం లైట్స్‌తో మెరిసింది.

థీమ్: Neon Nights.

పవన్, సందీప్ ఫార్మల్స్‌లో వచ్చారు.

సాయి లక్ష్మి నేవీ బ్లూ లెహంగా.

దీపిక సిల్వర్ డ్రెస్సు.

హర్షీ మారూన్ డ్రెస్సులో.

సందీప్ నెమ్మదిగా అన్నాడు.

“ఇవాళ మనమంతా సినిమా స్టార్స్ లా ఉన్నాం.”

అందరూ నవ్వారు.

Mr. & Ms. Fresher Contest

అంకర్స్ పేర్లు పిలిచారు.

పవన్ పేరు వచ్చింది.

దీపిక పేరు కూడా వచ్చింది.

సందీప్ ప్రేక్షకుల మధ్య నుంచి అరవసాగాడు.

“బ్రో… నీ టైమ్ వచ్చింది!”

సాయి నవ్వింది.

హర్షీ విజిల్ వేసింది.

స్టేజ్ మీద లైట్స్ వెలిగాయి.

మరి…

ఆ రాత్రి ఇంకా ఎన్నో క్షణాలు

వారి కథను మరో మలుపు వైపు తీసుకెళ్లబోతున్నాయి.

The Unexpected Exit

By Moonuuu@16

Published: May 12, 2026 at 6:47 AM

© 2026 Moonuuu@16. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...