Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
ఉదయం అయింది.
హాస్టల్ మొత్తం ఒక్కసారిగా మేల్కొన్నట్టుంది.
ఎక్కడ చూసినా హడావిడి.
ఎవరో బ్రష్ చేస్తూ పరుగులు పెడుతున్నారు.
ఎవరో టవల్ భుజాన వేసుకుని బాత్రూమ్ కోసం తిరుగుతున్నారు.
ఎవరో బకెట్ పట్టుకుని యుద్ధానికి వెళ్తున్న సైనికుడిలా కనిపిస్తున్నారు.
కానీ...
హాస్టల్‌లో ఉదయం సమయంలో అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉందంటే...
అది బాత్రూమ్.
ఆ రోజు కూడా పరిస్థితి అలానే ఉంది.
అన్ని వాష్‌రూమ్స్ ముందు పెద్ద పెద్ద లైన్లు.
ఎక్కడ చూసినా ఎదురు చూస్తున్న విద్యార్థులే.
ఆ గుంపులో మన తరుణ్ కూడా ఉన్నాడు.
చేతిలో బకెట్.
ముఖంలో ఆశ.
కళ్లలో బాధ.
ఎందుకంటే...
అతడు చాలాసేపటి నుంచి ఒక వాష్‌రూమ్ ముందు నిలబడి ఉన్నాడు.
"ఇంకో రెండు నిమిషాల్లో వస్తాడులే..."
అని మొదట అనుకున్నాడు.
ఐదు నిమిషాలు గడిచాయి.
పది నిమిషాలు గడిచాయి.
పదిహేను నిమిషాలు గడిచాయి.
కానీ...
లోపల ఉన్న మహానుభావుడు మాత్రం బయటికి రావడం లేదు.
ఇంతలో పక్కనే ఉన్న వాష్‌రూమ్స్ నుంచి ఒకరి తర్వాత ఒకరు బయటికి వస్తున్నారు.
కానీ వాళ్లు బయటికి వచ్చిన వెంటనే...
వాళ్ల కోసం ముందే రిజర్వేషన్ చేసుకున్న వాళ్లు లోపలికి దూకేస్తున్నారు.
అక్కడ కూడా ఛాన్స్ లేదు.
ఇక్కడ కూడా ఛాన్స్ లేదు.
మధ్యలో తరుణ్‌కు ఒక ఆలోచన వచ్చింది.
"సరే... నేనూ ఇంకో లైన్‌లో నిలబడిపోదామా?"
అని.
కానీ వెంటనే తన లాజిక్ పని చేసింది.
"లేదు లేదు..."
"ఈ వాష్‌రూమ్‌లో ఉన్నోడు చాలాసేపటి నుంచి ఉన్నాడు."
"నా లెక్క ప్రకారం వీడే ముందు బయటికి వస్తాడు."
అని మళ్లీ అదే తలుపు దగ్గర నిలబడ్డాడు.
పాపం...
తరుణ్‌కి తెలియదు.
లోపల ఉన్న వ్యక్తి సాధారణ మనిషి కాదని.
ఇంకో పది నిమిషాలు గడిచాయి.
తరుణ్ ఓపిక పూర్తిగా నశించింది.
"అసలు లోపల ఏమి చేస్తున్నాడు?"
"స్నానం చేస్తున్నాడా?"
"బట్టలు ఉతుకుతున్నాడా?"
"లేక ఇల్లు కట్టుకుంటున్నాడా?"
అని తనలో తానే విసుక్కుంటున్నాడు.
అంతలో పక్క వాష్‌రూమ్ నుంచి కాళీదాస్ బయటికి వచ్చాడు.
వెంటనే తరుణ్ అతడిని ఆపేశాడు.
"మావా!"
"నువ్వు ముందే వచ్చావ్ కదా."
"ఈ వాష్‌రూమ్‌లో ఎవడు ఉన్నాడో తెలుసా?"
అని అడిగాడు.
కాళీదాస్ ఒక్కసారి ఆ తలుపు వైపు చూశాడు.
తర్వాత ఒక చిరునవ్వు నవ్వాడు.
"మన హాస్టల్ మొత్తానికి..."
అని మొదలుపెట్టి...
"ది గ్రేట్ ఫిల్మ్ లవర్ ఒక్కడే."
"ఆ ఒక్కడే అందులో ఉన్నాడు."
అన్నాడు.
అంతే.
అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
తరుణ్ అక్కడే నిలబడి పోయాడు.
"ఫిల్మ్ లవర్?"
"అంటే?"
అని ఆలోచించడం మొదలుపెట్టాడు.
కానీ ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
సమయం గడుస్తూనే ఉంది.
ఇప్పుడు తరుణ్ కోపం పీక్‌కి చేరుకుంది.
చివరికి...
"ఇంక చాల్లే!"
అని అనుకున్నాడు.
గట్టిగా తలుపు కొట్టాడు.
లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇంకోసారి కొట్టాడు.
మళ్లీ నిశ్శబ్దం.
ఇప్పుడు తరుణ్‌కి నిజంగానే చిరాకు వచ్చింది.
ఒక్కసారిగా వెనక్కి వెళ్లి...
ధమ్!
అని తలుపుకి తన్ను ఇచ్చాడు.
అంతే.
తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.
లోపల నుంచి బయటికి వచ్చిన వ్యక్తిని చూసి...
తరుణ్ షాక్ అయ్యాడు.
అతడు...
సందీప్.
ఒక చేతిలో ఫోన్.
చెవుల్లో ఇయర్‌బడ్స్.
ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.
అతడు బాత్రూమ్ నుంచి కాదు...
సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చినట్టున్నాడు.
తరుణ్ ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూశాడు.
స్క్రీన్ మీద ఇంకా సినిమా రన్ అవుతోంది.
అది కూడా...
Animal సినిమా క్లైమాక్స్.
అప్పుడే తరుణ్‌కి కాళీదాస్ చెప్పిన మాట గుర్తొచ్చింది.
"ది గ్రేట్ ఫిల్మ్ లవర్..."
అంటే ఇదేనా!
అంతసేపు బాత్రూమ్‌లో కూర్చుని సినిమా చూస్తున్నాడా?!
తరుణ్ రక్తం మరిగిపోయింది.
"ఎంట్రా నువ్వు లోపల చేస్తున్నది?!"
అని గట్టిగా అరిచాడు.
సందీప్ మాత్రం ఏమీ మాట్లాడలేదు.
చెవిలోని ఇయర్‌బడ్ తీసి...
ఫోన్‌లో పాజ్ బటన్ నొక్కి...
తరుణ్ వైపు చూసి...
చిన్నగా నవ్వాడు.
అదే.
ఆ నవ్వు చూసిన తరుణ్‌కి మరింత కోపం వచ్చింది.
"ఇన్ని నిమిషాలు బయట నిలబడి ఉన్నాను!"
"నువ్వేమో లోపల సినిమా చూస్తున్నావా?!"
అని మండిపడ్డాడు.
సందీప్ మాత్రం ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.
అంతే.
తరుణ్ సహనం పూర్తిగా పోయింది.
సందీప్‌ను పక్కకు జరిపి...
"తప్పుకో మావా!"
అని చెప్పి బాత్రూమ్‌లోకి దూసుకెళ్లాడు.
సందీప్ మాత్రం బయట నిలబడి...
మళ్లీ ఫోన్ అన్‌లాక్ చేశాడు.
సినిమా ఇంకా అదే సీన్‌లో ఉంది.
"క్లైమాక్స్ మధ్యలో డిస్టర్బ్ చేశాడు..."
అని బాధగా అనుకున్నాడు.
మరోవైపు...
బాత్రూమ్ లోపలికి వెళ్లిన తరుణ్ మాత్రం...
ఇంకా కోపంతోనే ఉన్నాడు.
Hostel memories
By Writer_aj
Published: June 23, 2026 at 12:29 PM
Your input calibrates the database for others.
Ready to play...