Loading File
Initializing...
Chapter 16
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి.
నిన్నటి వరకు హాస్టల్ మొత్తం ఫ్రీ ఫైర్, క్రికెట్, చికెన్, రూమ్ మీటింగ్స్, వార్డెన్ క్లాసులతో నిండిపోయి ఉండేది.
కానీ ఇప్పుడు...
సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి.
హాస్టల్‌లో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది.
ఎప్పుడూ గోల చేసే వాళ్లు కూడా అప్పుడప్పుడు పుస్తకాలు తెరిచి కూర్చుంటున్నారు.
చదవని వాళ్లు చదివినట్లు నటిస్తున్నారు.
చదివేవాళ్లు ఇంకా ఎక్కువగా చదువుతున్నారు.
కానీ...
అందరూ మారిపోయారని అనుకుంటే పొరపాటే.
ఒక రూమ్‌లో...
సాయి, ప్రమోద్ , రుద్ర, అనిల్ , బాలు, దినేష్, తరుణ్, కాళిదాస్ అందరూ కూర్చుని ఉన్నారు.
చూడటానికి చాలా సీరియస్ స్టడీ సెషన్‌లా అనిపిస్తోంది.
కానీ నిజానికి...
వాళ్లందరూ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు.
అందులో ముఖ్యంగా కాళిదాస్ పరిస్థితి మరీ దారుణం.
"రా రా రా!"
"రివైవ్ ఇవ్వు!"
"వస్తున్నాడు!"
"చచ్చిపోతున్నా!"
అని గట్టిగా అరుస్తున్నాడు.
అతను ఇప్పటికే నాక్‌డౌన్ అయ్యాడు
నేల మీద పాకుతున్నాడు.
కానీ అతని టీమ్ మాత్రం తమ ప్రాణాలు కాపాడుకోవడంలో బిజీగా ఉంది.
"నన్ను కాపాడరా యదవల్లారా!"
అని కాళిదాస్ అరుస్తుండగా...
మిగతావాళ్లు నవ్వుకుంటున్నారు.
అదే సమయంలో...
మరో మూలలో పూర్తిగా భిన్నమైన సీన్ జరుగుతోంది.
రామకోటి నెమ్మదిగా వర్ధన్ దగ్గరకు వెళ్లాడు.
వర్ధన్ పుస్తకం ముందు పెట్టుకుని ప్రశాంతంగా చదువుతున్నాడు.
రామకోటి కుర్చీ లాగి అతని పక్కన కూర్చున్నాడు.
కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు.
తర్వాత నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
"రే..."
"నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు."
వర్ధన్ తలెత్తి చూశాడు.
"ఏమైంది?"
రామకోటి లోపల దాచుకున్న భయం మొత్తం బయటకు వచ్చేసింది.
"నాకు చదవడం రావడం లేదు రా."
"ఈసారి ఎలాగైనా అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి."
అతని గొంతు కాస్త బరువైంది.
"ఆ రోజు మా నాన్న ఫోన్‌లో మాట్లాడిన తర్వాత..."
"నాకు చాలా భయమేసింది."
"అతను ఎప్పుడూ లేనట్టుగా మాట్లాడాడు."
"నాకు ఏమని సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు."
కొద్దిసేపు ఆగి...
"నిజం చెప్పాలంటే..."
"నాకు ఒక్కోసారి సబ్జెక్టుల పేర్లు కూడా గుర్తుండవు." అని అన్నాడు రామకోటి
వర్ధన్ అతని మాటలు ప్రశాంతంగా విన్నాడు.
తర్వాత నవ్వుతూ అతని భుజం మీద చెయ్యి వేశాడు.
"అంత భయపడకు రా."
"మనకి ఇంకా టైమ్ ఉంది."
"నేను ఉన్నాను."
"ఎక్కడ అర్థం కాకపోతే అడుగు."
"ఎంతవరకు చేతనైతే అంతవరకు హెల్ప్ చేస్తా."
అన్నాడు.
ఆ మాటలు విన్న తర్వాత రామకోటి ముఖంలో కొంచెం ధైర్యం కనిపించింది.
అదే సమయంలో...
బయట వరండాలో మరో ప్రపంచం నడుస్తోంది.
అజయ్, కిరణ్ ఇద్దరూ క్రికెట్ ఆడుతున్నారు.
Mrf బ్యాట్.
టెన్నిస్ బాల్.
వాళ్లకు పరీక్షల కంటే కవర్ డ్రైవ్ ముఖ్యం.
అజయ్ ఒక్క షాట్ కొట్టాడు.
బంతి నేరుగా గోడకు తగిలింది.
"రామకోటి!"
అని గట్టిగా పిలిచాడు అజయ్.
"రా!"
"ఒక్క మ్యాచ్ ఆడేద్దాం!"
రామకోటి అటు చూసాడు.
అతని ముఖంలో ఒక్కసారిగా కోపం వచ్చింది.
నేరుగా వాళ్ల దగ్గరకు వెళ్లాడు.
అజయ్, కిరణ్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
రామకోటి ఒక్కసారిగా అన్నాడు.
"మీ ఇద్దరికీ ఏంట్రా!"
"ఎలా అయినా పాస్ అయిపోతారు."
"ఒక్కసారి కూడా పుస్తకం పట్టుకుని చదవడం నేను చూడలేదు."
"నాతోనే తిరుగుతారు."
"నాతోనే ఉంటారు."
"కానీ చివరికి పాస్ అయ్యేది మీరు."
"ఫెయిల్ అయ్యేది నేనే."
అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
కిరణ్ ముఖం వెంటనే దిగులుగా మారింది.
"ఏంట్రా అజయ్?"
"సడన్‌గా ఇలా ఎందుకు అన్నాడు?"
అని నిజంగానే బాధపడ్డాడు.
అజయ్ మాత్రం బ్యాట్ తిప్పుకుంటూ అన్నాడు.
"పాపం..."
"టెన్షన్‌లో ఉంటాడు లే."
"వదిలేయ్."
"బౌలింగ్ చేయ్."
అన్నాడు అజయ్.
కిరణ్ ఇంకా ఆలోచిస్తూనే ఉండగా...
అజయ్ మాత్రం మరో షాట్ కొట్టాడు.
ఇలా...
పరీక్షల వాతావరణం అధికారికంగా మొదలైంది.
కొన్ని రోజుల తర్వాత...
ఎగ్జామ్ డే.
మొదటి రూమ్‌లో అందరూ ఉదయం నుంచే టెన్షన్‌లో ఉన్నారు.
విజయ్ చదువుతున్నాడు.
దినేష్ చదువుతున్నాడు.
శరత్ పుస్తకాలు తిరగేస్తున్నాడు.
ఆ సమయంలో...
ఒక సీనియర్ అన్నయ్య రూమ్‌లోకి వచ్చాడు.
"ఎగ్జామ్స్ కి రెడీనా?"
అని అడిగాడు.
అందరూ టెన్షన్ నవ్వులు నవ్వారు.
అన్నయ్య అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
కానీ...
ఒక బెడ్ మీద మాత్రం ఒక వింత దృశ్యం కనిపించింది.
ఒకడు పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.
గురక కూడా పెడుతున్నాడు.
సీనియర్ ఆశ్చర్యపోయాడు.
"ఎవడ్రా ఈడు?"
"ఎగ్జామ్ రోజు కూడా ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడా?"
అని అడిగాడు.
శరత్ ఒక్కసారిగా కంగారుపడ్డాడు.
"వద్దు అన్నయ్య."
"వాడిని లేపకు."
అన్నాడు.
కానీ సీనియర్ వినలేదు.
"అంతేముంది?"
అని దుప్పటి లాగేశాడు.
అంతే.
అక్కడ కనిపించిన దృశ్యం చూసి...
సీనియర్ ఒక్క అడుగు వెనక్కి దూకాడు.
బెడ్ మీద...
సమీర్.
పూర్తిగా కాలేజ్ యూనిఫాం వేసుకున్నాడు.
హాల్ టికెట్ జేబులో ఉంది.
నుదుటి నిండా బొట్లు.
తల మీద అక్షింతలు.
చూడటానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న విద్యార్థిలా కాదు.
యుద్ధానికి బయలుదేరే యోధుడిలా ఉన్నాడు.
లేదంటే...
ఏదో ఆధ్యాత్మిక దీక్షలో ఉన్న అఘోరిలా కనిపిస్తున్నాడు.
సీనియర్ భయపడి...
అని వెనక్కి పడిపోయాడు.
శరత్ తల పట్టుకున్నాడు.
"చెప్తే వినలేదుగా!"
"ఇప్పుడు ఈ దున్నపోతు గాడిని తిరిగి రూమ్‌కి ఎలా తీసుకెళ్తామో! పెద్ద మనిషి లా వచ్చేశాడు అందరికీ అల్ థి బెస్ట్ చెప్పడానికి "
అని విసుక్కున్నాడు.
ఇంతలో సమీర్ అమాయకంగా లేచాడు.
"ఏమైంది?"
అని అడిగాడు.
పక్కన ఉన్న విజయ్ నవ్వు ఆపుకుంటూ అన్నాడు.
> "గ్రహాలు బ్యాండ్ కారే తో ఖుద క్య కరేగా ..." అని హిందీ లో అన్నాడు.
సమీర్ అయోమయంగా చూశాడు.
"అంటే?" అని సమీర్ అడిగాడు
విజయ్ భుజాలు ఎగరేశాడు.
"ఏమో."
"ఎవడికి తెలుసు!"
అన్నాడు.
ఇదిలా ఉంటే...
రామకోటి మాత్రం ఎగ్జామ్ హాల్‌కి వెళ్లాడు.
చేతిలో పెన్.
మనసులో భయం.
వర్ధన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ పరీక్ష రాయడానికి బయలుదేరాడు.
కానీ...
మరోవైపు...
సూర్య.
అలారం మోగింది.
ఆపేశాడు.
మళ్లీ నిద్రపోయాడు.
మళ్లీ లేచేసరికి...
ఎగ్జామ్ టైమ్ దాదాపు అయిపోయింది.
కొన్ని క్షణాలు ఆలోచించాడు.
"ఇప్పుడు వెళ్లినా ఉపయోగం లేదు."
అని నిర్ణయం తీసుకున్నాడు.
పుస్తకం తీసుకోలేదు.
హాల్ టికెట్ తీసుకోలేదు.
ఫోన్ తీసుకున్నాడు.
PUBG ఓపెన్ చేశాడు.
"ఎగ్జామ్ పోతే పోయింది..."
"కానీ ఈ మ్యాచ్ మాత్రం గెలవాలి."
అని అనుకుని ఆట మొదలుపెట్టాడు.
అలా...
ఒకే హాస్టల్‌లో...
ఒకడు భవిష్యత్తు కోసం భయపడుతూ పరీక్ష రాయడానికి వెళ్తుంటే...
మరోవాడు పరీక్ష మిస్ చేసి చికెన్ తిన్నంత కూల్‌గా PUBG ఆడుతున్నాడు.
అదే ఆ బ్యాచ్ ప్రత్యేకత.
Hostel memories
By Writer_aj
Published: June 25, 2026 at 7:16 AM
Your input calibrates the database for others.
Ready to play...