Loading File
Initializing...
Chapter 8
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
రాత్రి భోజనాలు ముగిశాయి.
హాస్టల్ మొత్తం నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారుకుంటోంది.
ఇది అధికారికంగా "స్టడీ అవర్స్" సమయం.
కనీసం వార్డెన్ ప్రకారం అయితే అదే.
కానీ హాస్టల్ విద్యార్థుల ప్రకారం...
స్టడీ అవర్స్ అంటే ఎవరు చదువుతున్నట్టు నటిస్తున్నారో, ఎవరు నిజంగా చదువుతున్నారో, ఎవరు గేమ్ ఆడుతున్నారో తెలుసుకునే సమయం!
ఆ రాత్రి...
మూడో రూమ్‌లో కొందరు మహానుభావులు పుస్తకాలు తెరిచి కూర్చున్నారు.
వర్ధన్, కిరణ్, ప్రమోద్, అనిల్, నాని, గుండన్న.
రూమ్‌లో ట్యూబ్‌లైట్ వెలుగు.
ఫ్యాన్లు తిరుగుతున్న శబ్దం.
పుస్తకాల పేజీలు తిరిగే చప్పుడు.
చూడటానికి నిజంగానే చదువు వాతావరణంలా ఉంది.
కిరణ్ ఒక టాపిక్ చదువుతుండగా ఒక్కసారిగా డౌట్ వచ్చింది.
వెంటనే పక్కనే కూర్చున్న ప్రమోద్ వైపు తిరిగాడు.
"... ఈ టాపిక్ ఒకసారి ఎక్స్‌ప్లైన్ చేయి."
అన్నాడు ప్రమోద్ నీ చూసి
ప్రమోద్ కూడా పుస్తకం దగ్గరకు జరిపి,
"చూడు... ఇది ఇలా ఉంటుంది..."
అంటూ చాలా ఓపికగా వివరించడం ప్రారంభించాడు.
మరోవైపు...
అనిల్, నాని ఇద్దరూ కూడా పుస్తకాలు తెరిచే ఉన్నారు.
దూరం నుండి చూస్తే వాళ్లు కూడా చాలా కష్టపడి చదువుతున్నట్టు అనిపిస్తుంది.
కానీ...
పుస్తకాల కింద దాగి ఉన్న ఫోన్ స్క్రీన్లలో మాత్రం
Free Fire మ్యాచ్ నడుస్తోంది.
"రైట్ నుంచి వస్తున్నాడు!"
"కవర్ ఇవ్వు!"
"రివైవ్ చెయ్యి రా!"
అంటూ వాళ్లిద్దరూ నోరు కదపకుండా కళ్లతోనే మాట్లాడుకుంటున్నారు.
వర్ధన్ సంగతి వేరు.
వాడు మాత్రం నిజంగానే చదువుతున్నాడు.
పుస్తకంలో తల దూర్చి ప్రపంచంతో సంబంధం లేకుండా కూర్చున్నాడు.
ఎవరైనా పక్కన బాంబు పేల్చినా కూడా పైకి చూడకపోవచ్చు.
గుండన్న మాత్రం...
మొదట ఒక గంట చదివాడు.
తర్వాత ఇంకో అరగంట ప్రయత్నించాడు.
చివరికి...
"ఇక చాలురా నయన..."
అని పుస్తకం మీదే వాలి నిద్రపోయాడు.
అప్పుడే...
రూమ్ తలుపు దగ్గర రెండు నీడలు కనిపించాయి.
వాళ్లు...
అర్వింద్, పవన్.
ఇద్దరూ చేతుల్లో పుస్తకాలు పట్టుకుని లోపలికి వచ్చారు.
చాలా అమాయకంగా.
చాలా చదువుబోతుల్లా.
వాళ్లు వచ్చి కిరణ్, ప్రమోద్ దగ్గర కూర్చున్నారు.
పుస్తకాలు తెరిచారు.
చదువుతున్నట్టు నటించడం మొదలుపెట్టారు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
ఈ హాస్టల్ చాలా విచిత్రంగా ఉంటుంది.
ఇందులో వీళ్ల బ్యాచ్ మొత్తం మూడు పెద్ద రూముల్లో ఉంటుంది.
ప్రతి రూమ్‌లో మళ్లీ రెండు గదులు.
అంటే ఒక మెయిన్ రూమ్, ఒక సబ్ రూమ్.
మొదటి రూమ్
ఈ రూమ్‌కు అనధికార నాయకుడు...
విజయ్.
అక్కడ ఉండేవాళ్లు:
విజయ్, శరత్, మహేష్, సమీర్, శ్రీనాథ్, మోహన్, తరిష్, తరుణ్, అభిరామ్, కాళీదాస్, దినేష్...
రెండో రూమ్
ఇది జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతం.
బాబూరావు, పవన్, భగవాన్, బాలు, చిన్ని, అర్వింద్, దత్త వినయ్, మణికంఠ, సందీప్ (నాట్ అవుట్), సువార్తరాజు, రామకోటి, సూర్య (మమ్మీ), భర్గవ్ (ప్యాకెట్స్), విజయ్ బెహరా, మోహన్ (2), వేణు, అజయ్ (నేనే ) , సురేంద్ర, వెంకటేష్ (ది డిప్లొమా)...
అబ్బో!
లెక్కపెట్టేలోపే ఇంకో ఇద్దరు వచ్చి చేరేంత మంది ఉండేవారు.
మూడో రూమ్
వర్ధన్, సాయి, ప్రమోద్, కిరణ్, అనిల్, నాని, గుండన్న, రుద్ర ప్రసాద్, రుద్ర మహారాణా, అశోక్ కుమార్ , ఆర్. సందీప్...
ఇంత పెద్ద బ్యాచ్ అయినా...
వాళ్ల మధ్య "మా రూమ్ – మీ రూమ్" అనే తేడా ఉండేది కాదు.
ఎవడు ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు.
ఒక రూమ్‌లో నిద్ర.
ఇంకో రూమ్‌లో భోజనం.
మరో రూమ్‌లో చదువు.
అందులో ముఖ్యంగా...
అజయ్.
వాడి సంగతి ప్రత్యేకం.
వాడు ఏ రూమ్‌లో ఉంటాడో వాడికే తెలియదు.
అందరితో తిరుగుతాడు.
అందరితో ఉంటాడు.
ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ అజయ్ ఉంటాడు.
సరే...
మళ్లీ కథలోకి వెళ్దాం.
ఒకవైపు వీళ్లంతా చదువుతున్నట్టు కనిపిస్తున్నారు.
కానీ...
పక్కనే ఉన్న రెండో గదిలో మాత్రం మరో ప్రపంచం నడుస్తోంది.
ఆ గది మొత్తం చీకటిగా ఉంది.
లైట్ ఆఫ్.
ఫ్యాన్ తిరుగుతోంది.
ఆ చీకట్లో మాత్రం...
పది, పన్నెండు ఫోన్ స్క్రీన్లు మెరుస్తున్నాయి.
ఎవరికి వాళ్లు బెడ్ల మీద కూర్చుని
Free Fire ఆడుతున్నారు.
"కొట్టు రా!"
"వెనకున్నాడు!"
"హెడ్‌షాట్!"
"రివైవ్ చెయ్యి!"
అంటూ గది మొత్తం మారుమోగిపోతోంది.
అంతలో...
ఒక్కసారిగా
టక్!
అని స్విచ్ శబ్దం వినిపించింది.
గది మొత్తం వెలుగుతో నిండిపోయింది.
అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఎవరి చేతిలో ఫోన్ ఉందో వాళ్లు వెంటనే దాచేశారు.
ఎవరు పడుకుని ఉన్నారో వాళ్లు వెంటనే కూర్చున్నారు.
ఎవరు అరుస్తున్నారో వాళ్లు ఒక్కసారిగా నోరు మూసుకున్నారు.
లైట్ వేసింది...
బాబూరావు.
బాబూరావు అందరినీ ఒకసారి గట్టిగా చూశాడు.
తర్వాత అన్నాడు.
"రేయ్... ఎందుకురా అరుస్తున్నారు?"
అంతే.
గదిలో పూర్తి నిశ్శబ్దం.
బాబూరావు ఇంకా కోపంగా చూస్తూ అన్నాడు.
"మళ్లీ నాయిస్ వచ్చిందో..."
కొద్దిసేపు ఆగాడు.
అందరి వైపు వేళ్లు చూపిస్తూ,
"చచ్చారే..."
అన్నాడు.
అంతే.
ఆ మాట వినగానే అందరి గుండెల్లో చిన్న భయం పుట్టింది.
బాబూరావు బయటికి వెళ్లిపోయాడు.
అతడు వెళ్లగానే...
అందరూ తమ ఫోన్ సౌండ్లు తగ్గించారు.
ఎవరూ మాట్లాడలేదు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
అప్పుడే...
రామకోటి మంచం మీద నుంచి నెమ్మదిగా దిగాడు.
చాలా జాగ్రత్తగా తలుపు దగ్గరకు వెళ్లాడు.
తల బయట పెట్టి బాబూరావు వెళ్లిపోయాడో లేదో చూసాడు.
తర్వాత...
నెమ్మదిగా తలుపు మూసాడు.
వెనక్కి తిరిగాడు.
అందరూ అతని వైపు చూస్తున్నారు.
రామకోటి ఒక్కసారిగా గట్టిగా అరిచాడు.
> "లైట్స్ ఆఫ్!"
అంతే.
గది మొత్తం ఒక్కసారిగా పేలిపోయింది.
"ఓఓఓఓఓయ్!"
"స్టార్ట్ చెయ్యరా!"
"మ్యాచ్ పెట్టు!"
"రూమ్ కోడ్ పంపు!"
అందరూ మళ్లీ గోల మొదలుపెట్టేశారు.
ఆ గదిలో ఉన్నవాళ్లు:
విజయ్, దినేష్, రామకోటి, బాలు, సాయి, సందీప్, కాళీదాస్, తరుణ్, మోహన్, తరిష్...అబ్బో ఆ చీకట్లో చాలా మందే ఉన్నారు
ఇక మరోవైపు...
చదువుతున్న రూమ్‌లో...
కిరణ్ ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది.
స్క్రీన్ వైపు చూసిన కిరణ్ ముఖంలో చిన్న నవ్వు కనిపించింది.
ఎవరూ గమనించకుండా నెమ్మదిగా ఫోన్ తీసుకుని లేచాడు.
బయటికి వెళ్లడం ప్రారంభించాడు.
కానీ...
అది ఒకరి కంటపడింది.
అర్వింద్.
అర్వింద్ కళ్లలో ఒక్కసారిగా అనుమానం మెరిసింది.
వెంటనే పక్కన ఉన్న పవన్‌కి సైగ చేశాడు.
"చూడు... చూడు..."
అన్నట్టు.
పవన్ అర్వింద్ వైపు చూసాడు.
మళ్లీ కిరణ్ వైపు చూశాడు.
మళ్లీ అర్వింద్ వైపు చూశాడు.
కానీ...
అర్వింద్ ఏం చెప్పాలనుకుంటున్నాడో పవన్‌కి అస్సలు అర్థం కాలేదు.
అర్వింద్ మాత్రం మనసులో నవ్వుకున్నాడు....
Hostel memories
By Writer_aj
Published: June 23, 2026 at 11:07 AM
Your input calibrates the database for others.
Ready to play...