Loading File
Initializing...
Chapter 14
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
ఉదయం 6:00 గంటలు.
హాస్టల్‌లో కొత్త రోజు మొదలవుతోంది.
కానీ...
మిగతా ప్రపంచానికి ఉదయం 6 గంటలు అంటే రోజు ప్రారంభం అయితే,
ఈ హాస్టల్‌లో మాత్రం అది రెండు రకాల మనుషుల మధ్య యుద్ధ సమయం.
ఒకవైపు చదివేవాళ్లు.
మరోవైపు చదివేవాళ్లను చూసి చిరాకు పడేవాళ్లు.
ఆ ఉదయం...
రామకోటి...
అతని ముందు పుస్తకం తెరిచి ఉంది.
పక్కనే కిరణ్ కూడా కూర్చుని చదువుతున్నాడు.
ఉదయం తండ్రితో మాట్లాడిన తర్వాత రామకోటి మనసు కొంచెం మారింది.
పుస్తకం తెరిచాడు.
చదవడానికి ప్రయత్నిస్తున్నాడు.
కిరణ్ కూడా ఏదో సబ్జెక్ట్‌లో మునిగిపోయి ఉన్నాడు.
ఇద్దరూ ఆశ్చర్యకరంగా నిశ్శబ్దంగా చదువుతున్నారు.
అప్పుడే...
మంచం మీద దుప్పటి కింద నుంచి అర్వింద్ నెమ్మదిగా కళ్లు తెరిచాడు.
ఇంకా నిద్ర మత్తులోనే పక్కకు తిరిగి చూశాడు.
అక్కడ...
కిరణ్, రామకోటి ఇద్దరూ పుస్తకాలు తెరిచి చదువుతున్నారు.
అర్వింద్ మెదడు కొన్ని క్షణాలు ఆ దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది.
తర్వాత అతని మనసులో ఒకే ఆలోచన వచ్చింది.
"అబ్బా..."
"స్నానం కూడా చేయకుండా చదివేస్తున్నారే యదవలు!"
అని అనుకున్నాడు.
ఇలాంటి దృశ్యాన్ని ఒక్కడే చూసి బాధపడటం ఎందుకు?
అనిపించింది.
వెంటనే పక్కనే పడుకున్న పవన్‌ని లేపాడు.
పవన్ నిద్రలో నుంచే విసుగ్గా,
"ఏంట్రా..."
అంటూ కళ్లు తెరిచాడు.
అర్వింద్ ఏమి మాట్లాడకుండా...
కిరణ్, రామకోటి వైపు చూపించాడు.
పవన్ కూడా అటు చూసాడు.
రెండు సెకన్లు నిశ్శబ్దం.
తర్వాత అతని ముఖంలో ఒక చిలిపి నవ్వు వచ్చింది.
"ఏయ్ రా కిరణూ!"
అని గట్టిగా పిలిచాడు.
కిరణ్ పుస్తకం నుంచి తల ఎత్తి చూశాడు.
"రాత్రి గంటల తరబడి చాటింగ్..."
"ఉదయం కోటిగాడితో కలిసి స్టడీయింగ్..."
కొద్దిసేపు ఆగి...
"బాగుందిరా!"
"కానివ్వండి..."
"కానివ్వండి..."
"అలా సాగిపోతుంది మీకు!"
అన్నాడు.
అది విన్న కిరణ్ ముఖం వెంటనే మారిపోయింది.
పుస్తకం మూసి పవన్ వైపు చాలా సీరియస్‌గా చూశాడు.
ఆ చూపులో ఒకే సందేశం ఉంది.
"నోరు మూసుకుని పో."
అప్పుడే...
సూర్య అక్కడికి వచ్చాడు.
పవన్ మాటల్లో ఏదో వింత ఉందని గమనించాడు.
"ఏం సాగిపోతుంది?"
అని అమాయకంగా అడిగాడు.
పవన్ వెంటనే కిరణ్ వైపు చూపించి అన్నాడు.
"ఎల్లి..."
"ఆ కిరణ్ గాడి.......నీ అడుగు."
సూర్య :- "ఎందుకులే..."
"మీరు కానివ్వండి..."
అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు.
అసలు హడావిడి అప్పుడే మొదలైంది.
కారిడార్‌లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించాయి.
"ఓయ్!"
"పట్టుకో!"
"పోసేయ్!"
అని గోల.
అందరూ బయటికి చూసారు.
అక్కడ...
అజయ్, మణికంఠ.
ఇద్దరి చేతుల్లో బకెట్లు.
బకెట్లలో నీళ్లు.
ముఖాల్లో దుష్ట నవ్వులు.
వాళ్లకు కనిపించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు టార్గెట్.
ఎలాంటి జాలి లేదు.
ఎలాంటి కరుణ లేదు.
ముందుగా నిద్రలో ఉన్న వినయ్ మీద బకెట్ మొత్తం కుమ్మరించారు.
"అమ్మోఓఓఓ!"
అని అరుస్తూ వినయ్ మంచం మీద నుంచి దూకాడు.
తర్వాత...
చదువుతున్న రామకోటి, కిరణ్‌ల మీద.
ఆ తర్వాత...
పవన్, అర్వింద్‌ల మీద.
కొన్ని సెకన్లలో రూమ్ మొత్తం తడిసిపోయింది.
పవన్ కోపంతో లేచాడు.
అప్పుడే అజయ్ పరుగెత్తుకుంటూ వెళ్తూ అన్నాడు.
"నువ్వు నిజంగా మగాడివైతే..."
"పక్క రూమ్‌లో మహేష్ గాడి మీద పోయ్!"
అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.
అంతే.
అక్కడ పక్కనే దాకునీ ఉన్న మహేష్ ఇలా అనుకున్నాడు "అనుకున్న ఈ అజయ్ గాడు లాస్ట్ కి నన్నే టార్గెట్ చేస్తాడు అని " అని అక్కడ నుండి ఇంకో చోటుకి పారిపోయాడు ....
ఇప్పుడు ఇది వ్యక్తిగత గొడవ కాదు.
పూర్తి స్థాయి యుద్ధం.
ఎవరి చేతికి బకెట్ దొరికితే వాళ్లు నీళ్లు నింపుతున్నారు.
ఎవరు కనిపించినా పోస్తున్నారు.
కారిడార్ మొత్తం అరుపులు.
నవ్వులు.
పరుగులు.
కొంతమంది నీళ్లు తప్పించుకోవడానికి పరుగెడుతున్నారు.
మరికొందరు బకెట్లతో వెంటపడుతున్నారు.
ఇక రుద్ర ప్రసాద్ పరిస్థితి అయితే దారుణం.
పట్టుకున్నారు.
నేరుగా వాటర్ ట్యాంక్ దగ్గరకు తీసుకెళ్లారు.
ఒక్కసారి కాదు.
రెండుసార్లు కాదు.
ఆరు సార్లు.
ఆరు సార్లు ట్యాంక్‌లో ముంచి బయటికి తీశారు.
ప్రతి సారి బయటికి వచ్చినప్పుడు,
"ఇక చాలురా!"
అని అరిచాడు పాపం రుద్ర
కానీ ఎవరూ వినలేదు.
మరోవైపు...
వర్ధన్ ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు.
అతనికి ఈ యుద్ధంతో సంబంధం లేదు.
కానీ...
ఈ యుద్ధానికి సంబంధం ఉండాల్సిన అవసరం కూడా లేదు.
అజయ్, మణికంఠల కంట పడితే చాలు.
పట్టుకుని పక్కనే ఉన్న కాలువలో పడేశారు.
ఈసారి పవన్ , చిన్ని బాబూరావు లు కూడా సాయం చేశారు , ప్రమోద్ వాళ్ళ అందరికీ చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నించాడు
వర్ధన్ బయటికి వచ్చేసరికి...
అతనికే అర్థం కాలేదు.
"నేను ఏమి చేశాను?"
అని.
ఇక బాబూరావు...
మొదట పరిస్థితి అర్థం చేసుకుని మెట్ల మీద నుంచి పారిపోయాడు.
అందరూ అయిపోయిందనుకున్నారు.
కానీ...
కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.
నేరుగా సువార్తరాజు దగ్గరకు వెళ్లాడు.
ఏమీ మాట్లాడకుండా...
చ్ర్రాక్!
అని అతని షర్ట్ చింపేశాడు.
సువార్తరాజు షాక్.
"నన్నెందుకురా?!"
అని అడిగాడు.
కానీ అప్పటికే బాబూరావు మళ్లీ పారిపోయాడు.
ఇలా...
మొత్తం హాస్టల్ యుద్ధభూమిలా మారిపోయింది.
కానీ...
ఈ మహానుభావులకు తెలియని ఒక విషయం ఉంది.
వాళ్లు చేసిన ప్రతి పనిని...
ప్రతి అరుపుని...
ప్రతి బకెట్ నీళ్లని...
వాళ్ల సీనియర్లు పై నుంచి నిలబడి వీడియో తీస్తున్నారు.
ఒక్క వీడియో కాదు.
చాలా వీడియోలు.
మరికొన్ని ఫోటోలు కూడా.
వాళ్లు సరిగా బట్టలు కూడా వేసుకోలేదు.
ఎవరు టవల్‌లో ఉన్నారు.
ఎవరు బర్ముడాలో ఉన్నారు.
ఎవరు అర్ధనిద్రలో పరుగెడుతున్నారు.
అన్నీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
మరి అక్కడితో ఆగలేదు.
ఆ వీడియోలు...
నేరుగా వార్డెన్ దగ్గరకు వెళ్లాయి.
అంతేకాదు...
కాలేజ్ గ్రూప్‌లో కూడా షేర్ అయ్యాయి.
ఇప్పుడు...
మొత్తం కాలేజ్ వాళ్ల హాస్టల్ వీరుల ఉదయం జలయజ్ఞాన్ని చూస్తోంది.
ఆ విషయం మాత్రం...
ఇంకా అజయ్, రామకోటి, పవన్, అర్వింద్, మణికంఠలకి తెలియదు.
వాళ్లు ఇంకా నీళ్లు పోసుకుంటూ నవ్వుకుంటున్నారు.
కానీ...
కొన్ని గంటల్లో...
వార్డెన్ ఆఫీస్ ముందు నిలబడబోతున్నామని మాత్రం ఎవరికీ తెలియదు.
Hostel memories
By Writer_aj
Published: June 24, 2026 at 11:45 AM
Your input calibrates the database for others.
Ready to play...